Ganja smuggling
-
విశాఖ సెంట్రల్ ఖైదీలకు గంజాయి సరఫరా
-
‘పుష్ప’ తరహాలో గంజాయి రవాణా.. క్యాబేజీ బుట్టల మాటున దాచి..
సాక్షి, విశాఖపట్నం: ‘పుష్ప’ సినిమా తరహాలో గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన విశాఖ జిల్లా పెందుర్తిలో చోటుచేసుకుంది. బొలెరో వాహనంలో ఇద్దరు వ్యక్తులు క్యాబేజీ బుట్టల మాటున గంజాయి అక్రమంగా తరలించే ప్రయత్నం చేశారు. అయితే బొలెరోలో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు సమచారం అందింది దీంతో పెందుర్తి వద్ద పోలీసులు వాహనంలో తనిఖీలు చేపట్టగా గుట్టు రట్టైంది. క్యాబేజీ బుట్టలు కింద 14 బ్యాగుల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బొలెరో వాహనంలో ఒడిశా నుంచి గంజాయిని క్యాబేజీ బుట్టల లోడుతో తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయితో ఉన్న బొలెరో వాహనాన్ని, ఇద్దరు వ్యక్తులను పెందుర్తి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
620 కిలోల గంజాయి స్వాధీనం
మోతుగూడెం/ముంచంగిపుట్ట: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రెండు మండలాల్లో 620 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోతుగూడెం పంచాయతీ పరిధిలోని గొడ్డలగూడెం జంక్షన్ వద్ద శనివారం వాహనాలు తనిఖీ చేసినట్టు ఎస్ఐ వి.సత్తిబాబు తెలిపారు. ఆ సమయంలో సుకుమామిడి నుంచి వరంగల్‌కు కారులో తరలిస్తున్న 500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ కేసులో మంగంపాడుకు చెందిన బట్టా వెంకటరెడ్డి, మల్కన్‌గిరికి చెందిన జయసింగ్హంతల్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో ముగ్గురు నిందితులు పరారీలోఉన్నట్టు చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏస్పీ సతీష్‌కుమార్‌కు వచ్చిన సమాచారంతో అడిషనల్ ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ఆదేశాల మేరకు సీఐ అప్పలనాయుడు పర్యవేక్షణలో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. 15లక్షలు ఉంటుందన్నారు. నిందితుల నుంచి ఒక మోటార్ బైక్, రెండు సెల్పోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ముంచంగిపుట్టు మండలంలో.. రెండు కార్లలో తరలిస్తున్న 120 కిలోల గంజాయిని బంగారుమెట్ట జంక్షన్ వద్ద పట్టుకుని, ఐదుగురు గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేసినట్టు ముంచంగిపుట్టు ఎస్ఐ ఆర్.సంతోష్ తెలిపారు. మండలంలోని బంగారుమెట్ట పంచాయతీ కేంద్రంలో శుక్రవారం రాత్రి తనిఖీలు నిర్వహించినట్టు చెప్పారు. తనిఖీ చేస్తున్న విషయాన్ని ముందే గ్రహించిన ఆ దారిలో గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లు.. కార్లు,గంజాయి,బైక్‌ను వదిలి పరారయ్యేందుకు ప్రయత్నంచినట్టు తెలిపారు. ఈ విషయాన్ని పసిగట్టి చాకచక్యంగా వ్యవహరించి ఐదుగురిని పట్టుకున్నామని, మరో ముగ్గురు పరారయ్యారయ్యారని ఎస్ఐ చెప్పారు. నిందితుల నుంచి గంజాయి, రెండు కార్లు, బైకును స్వాధీనం చేసుకున్నామని,పట్టుబడిన గంజాయి విలువ రూ.2,40,000 ఉంటుందని తెలిపారు. పట్టుబడినవారిలో ముంచంగిపుట్టు మండల కేంద్రానికి చెందిన జె.సురేష్‌కుమార్, ఇదే మండలం ఏనుగురాయి పంచాయతీ కొండపాడ గ్రామానికి చెందిన కె.గిరిబాబు,పెదబయలు మండలం జమిగూడ గ్రామానికి చెందిన కె.భాస్కరరావు, ఒడిశా రాష్ట్రం కోరాపుట్టు జిల్లా నందపూర్ బ్లాక్ పత్తాలంగి గ్రామానికి చెందిన కె.రామమూర్తి,బుడ్డింగి గ్రామానికి చెందిన బి.కృష్ణ ఉన్నారని, పరారైన ముగ్గురి కోసం గాలిస్తున్నామని ఎస్ఐ చెప్పారు. -
120 కిలోల గంజాయి పట్టివేత
కొయ్యూరు: మర్రివాడ పంచాయతీ గుడ్లపల్లి వద్ద 120 కిలోల గంజాయిని కొయ్యూరు ఎస్ఐ దాసరి నాగేంద్ర పట్టుకున్నారు. పాడేరు నుంచి పెదవలస, కొయ్యూరు మీదుగా కాకినాడ తరలించేందుకు గంజాయిని తీసుకువస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ నాగేంద్ర గుడ్లపల్లి సెంటర్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. దీంతో అటు వైపు నుంచి వస్తున్న కారును తనిఖీ చేయగా 120 కిలోల గంజాయి బయటపడింది. కాకినాడలోని వాకలుపూడికి చెందిన ఉప్పల రమేష్, బి.గంగాధర్, రౌతులపూడి మండలం గిడిజాం గ్రామానికి చెందిన ఎస్.లోవరాజును అరెస్టు చేశారు. గంజాయి తరలింపునకు వినియోగించిన కారును సీజ్ చేసి, వారి వద్ద నుంచి రూ.3వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. -
చూడ్డానికి అచ్చం దోశలా ఉంది కదూ.. కాదండోయ్..మరేంటి?
సాక్షి, సిటీబ్యూరో: గంజాయిని న్యూస్ పేపర్లో దోస మాదిరిగా ప్యాక్ చేసి, ఆర్డర్ ఇచ్చిన వారికి డోర్ డెలివరీ చేస్తున్న మలక్‌పేట వాసి హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్‌కు (హెచ్–న్యూ) చిక్కాడు. ఇతడితో పాటు సహాయకుడిగా ఉన్న సమీప బంధువునీ పట్టుకున్న అధికారులు తదుపరి చర్యల నిమిత్తం కార్ఖానా పోలీసులకు అప్పగించారు. ఇతగాడికీ ఈ సరుకును సరఫరా చేసింది అదిలాబాద్‌కు చెందిన ముఠానే అని వెల్లడైంది. మంగళ్‌హాట్ ప్రాంతానికి చెందిన కిషోర్ సింగ్ కొన్నేళ్లుగా గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. అక్కడ ఇతడిపై నిఘా పెరగడంతో మకాంను మలక్‌పేటకు మార్చాడు. అదిలాబాద్‌కు చెందిన సోనే రావు నుంచి గంజాయి ఖరీదు చేస్తున్నాడు. కేజీ రూ.10 వేలకు కొని, రిటైల్‌గా కేజీ రూ.60 వేలకు అమ్ముతున్నాడు. తన వద్దకు చేరిన గంజాయిని 100 గ్రాములు చొప్పున న్యూస్ పేపర్లో దోస మాదిరిగా ప్యాక్ చేస్తున్నాడు. కస్టమర్ల నుంచి ఆర్డర్ల కోసం ప్రత్యేక ఫోన్, నంబర్ వాడుతున్నాడు. ఈ ఆర్డర్ల ప్రకారం ద్విచక్ర వాహనంపై వెళ్లి డెలివరీ చేసి రావడానికి తన సమీప బంధువు ఇంద్ర కరణ్ సింగ్‌ను నియమించుకున్నాడు. ఈ ద్వయం కొన్నాళ్లుగా ఈ పంథాలో గుట్టుగా దందా చేస్తోంది. చదవండి: రెండో భార్యతో ఉండగా.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని.. వీరి వ్యవహారం ఇలా వెలుగులోకి... హెచ్–న్యూ అధికారులు శనివారం సోనే రావుతో పాటు గంజాయి రవాణా చేసిన ఉల్లాస్, సుకారాం, హరిసింగ్‌లను అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో తాము గంజాయిని బస్సులో తీసుకువస్తున్నామని చెప్పారు. అయితే వాటి సమయాలపై పొంతన లేని సమాధానం చెప్పడంతో హెచ్–న్యూ టీమ్ లోతుగా విచారించింది. దీంతో కారులో తెస్తున్నామని, అయితే ఆ రోజు ఉదయం తమ వాహనానికి మేడ్చెల్ వద్ద యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు. నగరానికి వచ్చిన వెంటనే దాన్ని చాదర్‌ఘాట్‌లో మరమ్మతు చేయడానికి ఇచ్చామన్నారు. అక్కడ నుంచి ఆటోలో కార్ఖానా వద్దకు డెలివరీ చేయడానికి చేరుకున్నామని, ఆ డ్రైవర్‌కు విషయం చెప్పలేదని బయటపెట్టారు. అప్రమత్తమైన అధికారులు ఆటోను గుర్తించి డ్రైవర్‌ను ప్రశ్నించారు. ఆ రోజు తన ఆటో ఎక్కిన వీళ్లు మలక్‌పేటలో ఓ వ్యక్తికి బ్యాగ్ ఇచ్చారని చెప్పాడు. అలా ఆరా తీసిన హెచ్–న్యూ కిషోర్ సింగ్‌ను గుర్తించి పట్టుకున్నారు. ఇతడిచ్చిన సమాచారం ఆధారంగా ఇంద్రకరణ్‌ను పట్టుకున్నారు. వీరిద్దరినీ తదుపరి చర్యల నిమిత్తం కార్ఖానా పోలీసులకు అప్పగించారు. -
వంద కిలోల గంజాయి పట్టివేత
చౌటుప్పల్: నిషేధిత గంజాయిని తరలిస్తున్న ఓ ముఠాలోని ఇద్దరిని యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి వంద కిలోల గంజాయితో పాటు పది లీటర్ల హాష్ స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం చౌటుప్పల్‌లోని ఏసీపీ కా ర్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి వివరాలను వెల్లడించారు. కేరళలోని కుంజితూర్కు చెందిన ఫైజ ల్ కొన్నేళ్లుగా గంజాయి రవాణా వ్యాపారం చేస్తున్నాడు. అందులో భాగంగా కర్ణాటకలోని మంగళూర్ జిల్లాకు చెందిన కారు డ్రైవర్ హస్సైనర్, ముంబై లోని ఓ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న కేరళకు చెందిన అన్సార్, కబీర్, ఉప్పాల గ్రామానికి చెం దిన ఎస్కె.అబ్దుల్లా, మంగళూర్‌కు చెందిన నౌషద్, బెంగళూరుకు చెందిన మూర్తి ముఠాగా ఏర్పడ్డారు. లంబసింగి నుంచి కేరళకు.. ఈ ముఠా సభ్యులు గంజాయితో పాటు ద్వాని ద్వారా తయారయ్యే హాష్ ఆయిల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లంబసింగి ప్రాంతంలో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఆ సరుకును రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల మీదుగా కేరళకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. లంబసింగిలో కొనుగోలు చేసిన గంజాయి, హాష్ ఆయిల్‌ను ఓ కారులో రహస్య ప్రాంతంలో నిల్వ చేస్తారు. పోలీసుల తనిఖీల నుంచి రక్షణ పొందేందుకు ప్రత్యేకంగా పైలెట్‌గా ఇన్నోవా వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీరు తనిఖీలకు సంబంధించిన సమాచారాన్ని గంజాయితో వస్తున్న వాహనంలోని వ్యక్తులకు చేరవేస్తుంటారు. పక్కా సమాచారంతో.. గంజాయి రవాణాకు సంబంధించి రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు పక్కా సమాచారం అందింది. ఆ మేరకు శనివారం సాయంత్రం చౌటుప్పల్ పోలీ సులు రంగంలోకి దిగారు. మండలంలోని రెడ్డిబావి గ్రామం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. సరుకుతో వచ్చిన స్విఫ్ట్ కారును పట్టుకుని, కారు డ్రైవర్ హస్సైనర్, అన్సార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన కారులో ఒక్కక్కటి రెండు కిలోల బరువు కలిగిన 50 గంజాయి ప్యాకెట్లు, దాని ద్వారా ఉత్పత్తి చేసిన 10 లీటర్ల హాష్ ఆయిల్ లభించింది. వీటి తో పాటు రూ.4 లక్షల విలువైన కారు, రూ.50 వేల విలువైన 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వీటి విలువ 46.50 లక్షలుగా పోలీసులు నిర్ణయించారు. అన్నింటినీ సీజ్ చేశారు. -
‘బోల్తా’ కొట్టిన గంజాయి గుట్టు
కామారెడ్డి క్రైం: పోలీసుల కళ్లు కప్పి... గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని తరలిద్దామనుకున్నారు. కానీ అదుపుతప్పిన వాహనం వారిని పట్టుబడేలా చేసింది. ఆదివారం సాయంత్రం కామారెడ్డి పట్టణ శివారులో జరిగిన ఈ ఘటనలో పోలీసులు 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్‌వైపు నుంచి నిజామాబాద్ వైపు ఓ వాహనం వెళ్తోంది. క్యాసంపల్లి శివారులోకి రాగానే అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే వారు వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యారు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే దేవునిపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడకు చేరుకుని చూడగా వాహనంలో గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. రెండు కిలోల గంజాయి ప్యాకెట్లు 15 ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలం కామారెడ్డి పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుందని భావించి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ, రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. -
అమెజాన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల పై నార్కోటిక్ డ్రగ్స్ కేసు
ఇండోర్: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఆన్లైన్లో గంజాయిని విక్రయిస్తుందనే ఆరోపణలతో అమెజాన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల పై మధ్యప్రదేశ్ పోలీసులు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ మేరకు మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో పోలీసులు గతవారం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని సుమారు 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. (చదవండి: 11 ఏళ్ల పాకిస్తాన్ మైనర్ బాలుడి పై అత్యాచారం, హత్య) అంతేకాదు తాము అమెజాన్ ద్వారా నిర్వహిస్తున్న ఆన్లైన్ డ్రగ్ స్మగ్లింగ్ గంజాయి స్మగ్లింగ్‌ను ఛేదించినట్లు పేర్కొన్నారు. దీంతో కాన్ఫెడరేషన్ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఈ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌పై కఠినమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు అమెజాన్ ఇండియా ప్రతినిధి దర్యాప్తు సంస్థలకు పూర్తి సహకారం, మద్దతును ఇస్తానని హామీ కూడా ఇచ్చిన సంగతని ఈ సందర్భంగా పోలీసులు గుర్తుచేశారు. పైగా అమెజాన్ సంస్థ సకాలంలో స్పందించి అందించిన వివరాలు తాము వెలకితీసిన సాక్ష్యాధారాలకు విరుద్ధంగా ఉన్నట్లు కూడా వెల్లడించారు. అంతేకాదు వివిధ చిరునామాలకు బుక్ చేసి డెలివరీ చేసిన 20 నిషేధిత సరుకుల వివరాలు ఇంకా అందాల్సి ఉందని భింద్ ఎస్పీ మనోజ్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ..."ఈ కేసు విచారణకు ఈ-కామర్స్ దిగ్గజం సహకరించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పైగా ఆన్లైన్ వ్యాపారాలకు ఎటువంటి మార్గదర్శకాలు లేవు. అంతేకాదు అమెజాన్‌కు కాల్ చేసినా వారు స్పందించడం లేదన్నారు. దయచేసి మాకు సహకరించండి లేనట్లయితే అమెజాన్ ఎండీ సీఈవోకి విజ్ఞప్తి చేస్తాం లేదా తదుపరి చర్యలు త్వరిత గతిన ప్రారంభిస్తాం" అని హెచ్చరించారు. (చదవండి: హే! ఇది నా హెయిర్ స్టైయిల్... ఎంత క్యూట్‌గా ఉందో ఈ ఏనుగు!!) -
TS: గంజాయిపై జంగ్: కేసీఆర్
రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను నిరోధించేందుకు పోలీస్, ఎక్సైజ్ అధికారులకు ఏం కావాలన్నా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గంజాయి మాఫియాను అణచివేయండి. నేరస్తులు ఎంతటి వారైనా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. గుడుంబా తాగడం వల్ల భర్తలను కోల్పోయి ముక్కు పచ్చలారని గిరిజన యువతులు వితంతువులుగా మారుతుండటం నా హృదయాన్ని కలచివేస్తోంది. అందుకే రాష్ట్రంలో గుడుంబా నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నాం.– సీఎం కేసీఆర్ సుదీర్ఘ పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అభివృద్ధి దిశగా అనేక లక్ష్యాలను పూర్తి చేసుకున్నాం. గంజాయి పీడను త్వరగా తొలగించకపోతే రాష్ట్రం సాధిస్తోన్న ప్రగతి ఫలితాలు నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనే విషయాన్ని తీవ్రంగా పరిగణించాలి. గంజాయి కోసం గ్రూపులుగా ఏర్పడి వాట్సాప్ మెసేజ్‌లు పెట్టుకుని తెప్పించుకుంటున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గంజాయి సాగు చేస్తున్న వారికి రైతుబంధు, రైతు బీమా రద్దు చేయడంతోపాటు, ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో సాగు చేసే వారి పట్టాలను కూడా రద్దు చేసే అంశాన్ని పరిశీలి స్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరిం చారు. రాష్ట్రంలో ఒక్క గంజాయి మొక్క కూడా కని పించకూడదని స్పష్టం చేశారు. గంజాయి విని యోగం పెరుగుతోందని నివేదికలు వస్తున్న నేపథ్యంలో పరిస్థితి అదుపుతప్పక ముందే తీవ్ర యుద్ధం ప్రకటించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. గంజాయిని నిరోధించేందుకు డీజీ స్థాయి పోలీసు అధికారి నేతృత్వంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దాని ఉత్పత్తిని సమూలంగా నిర్మూలించేందుకు అవసరమైన సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిరోధంపై బుధవారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర పోలీస్, ఎక్సైజ్ ఉన్నతాధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. హోం, ఎక్సైజ్ శాఖ మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, హోంశాఖ సలహాదారు అనురాగ్‌శర్మ, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, కార్యదర్శులు స్మితా సభర్వాల్, శేషాద్రి, రాహుల్ బొజ్జా, భూపాల్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌లతో పాటు పోలీసు, ఎక్సైజ్ శాఖల ఉన్నతాధికారులు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. మాదక ద్రవ్యాల లభ్యత పెరగడం శోచనీయం ‘రాష్ట్రంలో తీవ్రవాదాన్ని అరికట్టగలిగాం. ఈ విజయం వెనుక పోలీస్ శాఖ త్యాగాలున్నాయి. వారు చేసిన వీరోచిత పోరాటం ఉంది. దీంతో రాష్ట్ర గౌరవ, ప్రతిష్టలు ఎంతగానో పెరిగాయి. రాష్ట్రం గొప్ప అభివృద్ధిని సాధిస్తున్న సందర్భంలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల లభ్యత పెరగడం శోచనీయం. వ్యవసాయంలో వచ్చిన అభివృద్ధి కారణంగా రాష్ట్రంలో కోటీ 30 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. పంజాబ్ రాష్ట్రాన్ని కూడా మించిపోతున్నాం. మిషన్ భగీరథ ద్వారా అటవీ ప్రాంతాల్లో మారుమూల గ్రామాలకు కూడా పరిశుభ్రమైన నీటిని అందిస్తున్నాం. విద్యుత్ రంగంలో అపూర్వ విజయం సాధించాం. ఉద్యమ ఆకాంక్షలన్నింటినీ నెరవేర్చుకుంటూ ముందడుగులు వేస్తున్నాం. ఈ క్రమంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రపంచంలోని దిగ్గజ సంస్థల్లో 99 శాతం సంస్థలు మన రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసు శాఖ ప్రదర్శించిన ప్రతిభ, నైపుణ్యం కారణంగానే మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి..’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఎంతో ఆవేదనతో ఈ సమావేశం పెట్టా.. ‘ఈ నేపథ్యంలో నేను ఎంతో ఆవేదనతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశా. గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం వల్ల మానసిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉంటుంది. అమాయక యువత తెలిసీ తెలియక దీని బారిన పడుతోంది. మాదకద్రవ్యాల వినియోగాన్ని మాన్పించడం చాలా క్లిష్టమైన, సుదీర్ఘమైన ప్రక్రియ. అందువల్ల వీటి వినియోగంపై పూర్తిస్థాయిలో ఉక్కుపాదం మోపాలి. మత్తు పదార్థాల వినియోగంతో వచ్చే అనర్ధాల గురించి, యువతకు తెలిసేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలి. యువకుల్లో అవగాహన, పరిణతి కలిగించేలా, గొప్ప ప్రభావం చూపించే విధంగా అద్భుతమైన రీతిలో ప్రచార కార్యక్రమాలు కొనసాగాలి. గతంలో ఎయిడ్స్ వ్యాధిపై ఉధృత ప్రచారంతోనే ఆ మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించగలిగాం. పోలీస్, ఎక్సైజ్ శాఖలు సమన్వయంతో పటిష్టమైన వ్యూహం రూపొందించుకొని, గంజాయి, గుడుంబాలను సమూలంగా నిర్మూలించాలి..’అని సీఎం స్పష్టం చేశారు. ఫలితాలు సాధించినవారికి రివార్డులు, పదోన్నతులు ‘రాష్ట్రంలో గంజాయిని నిరోధించేందుకు డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయండి. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, ఫ్లయింగ్ స్క్వాడ్లను పూర్తిస్థాయిలో బలోపేతం చేయండి. విద్యాసంస్థల వద్ద పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలి. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టుల సంఖ్యను పెంచాలి. సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవడంతో పాటు తగినన్ని వాహనాలను సమకూర్చుకోవాలి. ఇంటెలిజెన్స్ విభాగంలో కూడా ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గంజాయి నిర్మూలనలో ఫలితాలు సాధించిన అధికారులకు నగదు రివార్డులు, ప్రత్యేక పదోన్నతులు, ఇతర ప్రోత్సాహకాలను ప్రభుత్వం ఇస్తుంది. దేశంలోని ఏదైనా రాష్ట్రంలో గంజాయిని సమర్థవంతంగా అరికట్టిన అనుభవాలను అధ్యయనం చేయాలి. గంజాయి వాడకందారుల ఆధారంగా సరఫరా చేసేవారిని పట్టుకోవాలి. రాష్ట్రంలో గంజాయి వ్యాపారం చేయలేం అని వాటి వ్యాపారస్తులు భయపడేలాగా కఠిన చర్యలకు ఉపక్రమించాలి. చెక్ పోస్టులను, నిఘా కేంద్రాలను కేవలం హైవేల మీదనే కాకుండా, అవసరమైన అన్నిచోట్లా ఏర్పాటు చేయాలి. సర్పంచ్‌లు సమాచారం ఇవ్వాలి గంజాయి సాగును, రవాణా, వినియోగాన్ని అరికట్టే విషయంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ కీలకంగా వ్యవహరించాలి. చీమ చిటుక్కుమన్నా తెలిసే విధంగా ప్రత్యేకంగా ఆధునిక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. హైదరాబాద్‌కు గంజాయి రాకుండా ఆపే విధంగా పటిష్టమైన వ్యూహం అవలంబించాలి. తమ గ్రామాల్లో గంజాయి సాగు అవుతున్నట్లయితే, ఆయా గ్రామాల సర్పంచ్‌లు సమాచారాన్ని ఎక్సైజ్, పోలీసు శాఖలకు అందించాలి..’అని ముఖ్యమంత్రి సూచించారు. గుడుంబా అమ్మకందారులకు ప్రత్యామ్నాయ ఉపాధి ‘గుడుంబా, గ్యాంబ్లింగ్ కూడా రాష్ట్రంలో మళ్లీ కనిపిస్తున్నాయి. గుడుంబా తయారీ మళ్లీ మొదలవుతున్నట్లు వస్తున్న సమాచారాన్ని బట్టి ఎక్సైజ్ అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. నిషేధం అమలులో ఏవైనా లోపాలు జరుగుతుంటే వెంటనే సరిదిద్దుకోవాలి. గుడుంబా అమ్మకం మీద ఆధారపడి జీవిస్తున్న వారికి ప్రత్యామ్నాయ ఉపాధి, పునరావాసం కల్పించాలి. ఇందుకు అవసరమైన నిధులను కలెక్టర్లకు విడుదల చేస్తాం. గతంలో పేకాట నిషేధం అమలు చేసిన తీరుపై మహిళల ప్రశంసలు లభించాయి. పేకాట పూర్తిస్థాయిలో ఆగిపోవాలి. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే నంబర్‌వన్‌గా పేరు తెచ్చుకున్నాం. రాష్ట్ర ప్రతిష్టను కాపాడే విధంగా ఎక్సైజ్, పోలీసు శాఖలు కలిసికట్టుగా, కట్టుదిట్టంగా పనిచేయాలి. ‘తెలంగాణ పోలీస్ బెస్ట్ పోలీస్’అనే పేరును నిలబెట్టుకోండి. మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దండి..’అని సీఎం ఆదేశించారు. ప్రస్తుత సమావేశంలో అందిన వివరాల ఆధారంగా త్వరలోనే ముఖ్యమైన అధికారులతో మరొక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. అందులో పూర్తిస్థాయి వ్యూహాన్ని ఖరారు చేస్తామని ప్రకటించారు. గంజాయి విచ్చల విడిగా లభించడంపై ఇటీవల ‘సాక్షి’ ప్రచురించిన కథనం ఏఓబీ నుంచి రాష్ట్రానికి గంజాయి ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏఓబీ) ప్రాంతంలో గంజాయి సాగు జరుగుతున్నదని, అక్కడి నుంచి చింతూరు – భద్రాచలం మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించి, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు రవాణా జరుగుతున్నట్లు ఎక్సైజ్, పోలీసు అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. దీన్ని అరికట్టేందుకు ఇతర రాష్ట్రాల పోలీసు, ఎక్సైజ్ శాఖలతో సమన్వయ వ్యవస్థ అవసరముందని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలోకి ఎక్కువశాతం గంజాయి ఇతర రాష్ట్రాల నుంచే వస్తోందని, ఛత్తీస్‌గఢ్‌లో సైతం గంజాయి సాగు, సరఫరా జరుగుతోందని తెలిపారు. గంజాయిని వినియోగిస్తున్న వారిలో వలస కూలీలు, యువకులు ఎక్కువగా ఉన్నారని, ఆటో డ్రైవర్లు, హమాలీలు కూడా ఉన్నట్లు వివరించారు. కాగా మత్తు పదార్థాలతో వచ్చే అనర్థాలపై ప్రభావపూరితమైన షార్ట్ ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీలు, సందేశాత్మక ఆడియో, వీడియో ప్రచార ప్రకటనలను రూపొందించే బాధ్యతను సీఎస్ సోమేశ్ కుమార్‌కు సీఎం అప్పగించారు. విద్యార్థి దశ నుంచే అవగాహన కలిగే విధంగా ప్రత్యేక పాఠాలను రూపొందించి, సిలబస్‌లో చేర్చాలని, అందుకవసరమయ్యే చర్యలు ప్రారంభించాలని ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ను ఆదేశించారు. డ్రగ్స్ దుష్ఫలితాలపై ప్రతిభావంతంగా నిర్మించే సినిమాలకు సబ్సిడీ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తామని సీఎం పేర్కొన్నారు. కాగా గంజాయి వినియోగంలో హాట్ స్పాట్లుగా మారిన సెంటర్లను వెంటనే గుర్తించి, నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి అధికారులకు సూచించారు. -
గంజాయి స్వాధీనానికి వెళ్లి.. కాల్పులు జరిపి..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీ, ఒడిశా సరిహద్దు ప్రాంతాలే కేంద్రంగా సాగుతున్న గంజాయి దందాపై నల్లగొండ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహకారంతో ఏవోబీ(ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు)లో భారీ గంజాయి సాగు ప్రాంతాలను గుర్తించి దాడులు చేశారు. నాలుగు రోజుల పాటు ప్రత్యేక బృందాల దాడిలో 1,500 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నాయి. 20 మంది స్మగ్లర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని తీసుకొస్తున్న క్రమంలో లంబసింగి ఘాట్‌రోడ్డులో పోలీసులపై మరికొందరు స్మగ్లర్లు రాళ్లు, కత్తులు, గొడ్డళ్లలో దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు అప్రమత్తమై గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో పోలీస్ వాహనం ధ్వంసం కాగా, ఇద్దరు స్మగ్లర్ల కాళ్లకు గాయాలైనట్లు తెలిసింది. గంజాయి హబ్‌గా.. హైదరాబాద్‌లోని సింగిరేణి కాలనీలో గంజాయికి బానిసైన వ్యక్తి ఆరేళ్ల బాలికను చిదిమేసిన ఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గంజాయి రవాణాను అరికట్టేందుకు కార్యచరణ కు దిగింది. ఈ క్రమంలో ఇటీవల అరెస్టు చేసిన స్మగ్లర్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నల్లగొండ డీఐజీ, ఎస్పీ ఏవీ రంగనాథ్ సూచనతో 13 బృందాలు ఈ నెల 14 నుంచే రంగంలోకి దిగాయి. ఒక్కో సీఐ నేతృత్వంలో ఆరుగురు పోలీసులతో కూడిన బృందాలు ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహకారంతో లంబసింగి, నర్సీపట్నం, దారంకొండ, అన్నవరం, గంగవరం, సీలేరు, కొండరాయి ప్రాంతాల్లోని గంజాయి క్షేత్రాలపై దాడులకు దిగాయి. ఆదివారం 1,500 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకుని, 20 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విడిపించుకునేందుకు ఆ ముఠాలోని మరికొందరు పోలీసులపై ఎదురుదాడికి దిగారు. లంబసింగి ఘాట్‌రోడ్డులో రోడ్డుకు టిప్పర్‌ను అడ్డుపెట్టి రాళ్లు, కత్తులు, గొడ్డళ్లలో దాడికి పాల్పడ్డారు. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసినట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినట్లు జిల్లా పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో పోలీసులకు ఎటువంటి హానీ జరుగలేదని, ఇద్దరు స్మగ్లర్లకు కాళ్లకు గాయాలైనట్లు పేర్కొన్నాయి. పక్కా వ్యూహంతో.. వారం రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న ఓ కీలక స్మగ్లర్ ఇచ్చిన సమాచారంతో నల్లగొండ పోలీసులు పక్కా వ్యూహం సిద్ధం చేసుకున్నా రు. గంజాయి సరఫరాలో కీలకంగా వ్యవహరిస్తున్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, హైదరా బాద్ ప్రాంతాల్లోని వ్యక్తులనూ అదుపులోకి తీసుకున్నారు. వీరితో గంజాయి సరఫరా చేసే ముఠా సభ్యులకు ఫోన్ చేయించారు. కొనుగోలుదారుల పేరుతో రంగంలోకి దిగి.. గంజాయి కావాలని బేరం కుదుర్చుకున్నారు. అలా ఆప రేషన్ కొనసాగించి 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ దాడులను ఏపీ పోలీసులతో సంయుక్తంగా నిర్వహించామని నల్లగొండ ఎస్పీ చెబుతుండగా, విశాఖ ఎస్పీ మాత్రం నల్లగొండ పోలీసులు వచ్చిన సమాచా రమే తమకు తెలియదని చెప్పడం గమనార్హం. ఆత్మరక్షణ కోసమే కాల్పులు ‘విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని గంజాయి కేంద్రాలపై దాడులకు జిల్లా పోలీసు బృందాలు వెళ్లింది వాస్తవమే. ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహకారంతో గంజాయి సెర్చ్ ఆపరేషన్ చేపట్టాం. అది కొనసాగుతున్న క్రమంలో స్మగ్లర్లు దాడులకు పాల్పడ్డారు. ఆత్మరక్షణ కోసం ప్రత్యేక బృందాలు ఒక రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపాయి. ఘటనలో ఏ ఒక్క పోలీస్‌కు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు’. – నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ 20 మంది వరకు అరెస్టు... ‘విశాఖ లంబసింగి సమీపంలో ఆదివారం సాయంత్రం గంజాయి స్మగ్లర్ల నుంచి ఆత్మరక్షణ కోసమే నల్లగొండ పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. నల్లగొండ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు తీగలాగుతూ గంజాయి స్మగ్లర్ల కోసం ప్రత్యేక బృందాలు విశాఖ వచ్చాయి. ఆదివారం సాయంత్రం దాదాపు 20 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసి తీసుకొస్తుండగా.. దాడి జరిగింది. ఈ ఘటనలో పోలీస్ వాహనం ధ్వంసం అయ్యింది. అయితే, అనుకోకుండా ఇద్దరు గంజాయి స్మగ్లర్లకు గాయాలయ్యాయి. గంజాయి స్మగ్లర్లపై కేసు నమోదు చేశాం’ – విశాఖ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు వెల్లడి -
గుట్టు రట్టు: ఐదుసార్లు కళ్లుగప్పారు.. ఆరోసారికి దొరికిపోయారు
సాక్షి, హైదరాబాద్: తూర్పు తీరంలోని నర్సీపట్నం సమీపంలో ఉన్న నక్కపల్లి క్రాస్ రోడ్స్ నుంచి పశ్చిమాన మహారాష్ట్రలో ఉన్న అహ్మద్‌నగర్‌కు గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న ముఠాకు హైదరాబాద్ ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రూ.30 లక్షల విలువైన 300 కేజీల సరుకు స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరు ఇప్పటికే ఐదుసార్లు గంజాయిని అక్రమ రవాణా చేశారని, ఆరో విడతలో దొరికిపోయారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ శనివారం తెలిపారు. జేసీపీ ఎం.రమేశ్‌రెడ్డి, ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావులతో కలసి ఆయన మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన విలాస్ భావ్‌సాహెబ్ తన వాహనంలో ఏపీకి కూరగాయలు రవాణా చేసేవాడు. అదే ప్రాంతానికి చెందిన ధ్యానేశ్వర్ మోహితే ఇతడికి సహకరించేవాడు. ఈ వ్యాపారంలో ఆశించిన లాభాలు రాకపోవడంతో వీరిద్దరూ కలసి గంజాయి అక్రమ రవాణా చేయాలని నిర్ణయించారు. దీంతో విశాఖ ఏజెన్సీలో ఉన్న కొందరు గంజాయి వ్యాపారులు, రైతులతో పరిచయాలు ఏర్పాటు చేసుకున్నారు. మహారాష్ట్ర నుంచి కూరగాయలకు వినియోగించే ఖాళీ ట్రేలతో బయలుదేరేవాళ్లు. నక్కపల్లి క్రాస్ రోడ్స్ వద్ద గంజాయిని లోడ్ చేసుకుని ఆ ఖాళీ ట్రేల మధ్యలో ఉంచేవాళ్లు. తనిఖీల్లో ఎవరైనా అడిగితే కూరగాయలు అన్లోడ్ చేసి వస్తున్నామని చెప్పేవారు. హైదరాబాద్ మీదుగా అహ్మద్‌నగర్‌కు.. సరుకును తమ వాహనంలో అన్నవరం, రాజమండ్రి, విజయవాడ, సూర్యాపేట, హైదరాబాద్, జహీరాబాద్– హమ్నాబాద్ (కర్ణాటక) మీదుగా వారు అహ్మద్‌నగర్‌కు చేర్చేవాళ్ళు. కేజీ గంజాయిని రూ.1,500 కొనుగోలు చేసి, మహా రాష్ట్రలో కేజీ రూ.10 వేలకు విక్రయించే వారు. పుణే, ముంబై, నాసిక్‌లలో ఉన్న గంజాయి వ్యా పారులకు ఎక్కువగా సరఫరా చేసేవారు. మా ర్గం మధ్యలో ఉన్న మరికొందరు గంజాయి వ్యా పారులతోనూ వీళ్లు ఒప్పందాలు చేసుకున్నారు. ప్రధానంగా జహీరాబాద్‌లోని ఓ దాబా వద్ద ఆగి ఆ ప్రాంతంలో పాటు హైదరాబాద్‌కు చెంది న వ్యాపారులకు కిలోల లెక్కన అమ్మే వాళ్లు. వీరి ద్వారా ఆ సరుకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతా లకు చేరేది. విలాస్, ధ్యానేశ్వర్లు తమ వాహనంలో ఒక్కో దఫా 200 నుంచి 400 కేజీల చొ ప్పున ఐదుసార్లు మహారాష్ట్రకు తరలిం చారు. వీరి దందాపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీకాంత్, బి.అశోక్‌రెడ్డి, జి.శివానందం, మలక్‌పేట ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్‌తో కలసి శనివారం ముసారాంబాగ్ చౌరస్తా వద్ద స్మగ్లింగ్ చేస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. -
అంతర పంటగా గంజాయి!
సాక్షి, సంగారెడ్డి(మెదక్): ఆంధ్ర, ఒడిశా సరిహద్దులకు పరిమితమైన గంజాయి సాగు ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లోనూ విస్తరిస్తోంది. ప్రధానంగా సంగారెడ్డి, కామారెడ్డి, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలో విస్తారంగా సాగవుతోంది. సంగారెడ్డి జిల్లా పరిధిలోని కర్ణాటక సరిహద్దు మారుమూల గ్రామాల్లో గంజాయి క్షేత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా వేల సంఖ్యలో గంజాయిని సాగు చేస్తున్న క్షేత్రాలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. గంజాయిని అంతర పంటగా సాగు చేస్తున్న పొలాలను తరచూ గుర్తిస్తున్న ఎక్సైజ్, పోలీసు శాఖ అధికారులు మొక్కలను ధ్వంసం చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఒకేచోట రూ.ఐదు కోట్ల విలువైన మొక్కలు ► సంగారెడ్డి జిల్లా ఏడాకులపల్లి గ్రామ శివారులో వెంకటేశ్ అనే వ్యక్తికి చెందిన ఐదెకరాల్లో ఇటీవల మూడు వేలకు పైగా గంజాయి మొక్కలు సాగవుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఈ గంజాయి మొక్కల విలువ సుమారు రూ.5 కోట్లు ఉంటుందని అధికారులు ప్రకటించారు. ► కర్ణాటక సరిహద్దు జహీరాబాద్ డివిజన్లోని పలు గ్రామాల్లో 12 గంజాయి క్షేత్రాలను ఎక్సైజ్, పోలీసుశాఖ అధికారులు గుర్తించి, వేల సంఖ్యలో మొక్కలను ధ్వంసం చేశారు. రాయ్‌కోడ్ మండలం ఉలిగెరలో నాలుగు వేల మొక్కలను గుర్తించారు. పత్తి, చెరుకు, అరటి తోటల్లో భారీగా గంజాయి సాగవుతోంది. ► బాన్సువాడ మండలంలోని సోమ్లానాయక్ తం డాలో, గాంధారి మండలం ధన్‌సింగ్‌తండా శివా రులోనూ ఇటీవల గంజాయి సాగవుతున్నట్లు గు ర్తించి మొక్కలను దహనం చేశారు. రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలోనూ గంజాయి క్షేత్రాలపై ఇటీవల అధికారుల దాడులు కొనసాగాయి. జైళ్లలో మగ్గుతున్నది రైతులే.. ముంబైకి చెందిన స్మగ్లింగ్ ముఠాలు తమ ఏజెంట్ల ద్వారా ఇక్కడి అమాయక రైతులను ట్రాప్ చేసి గంజాయిని సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నాయి. కొందరు రైతులు స్థానికేతరుల భూములు కౌలుకు తీసుకొని అందులో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎక్సైజ్ అధికారి అశోక్‌కుమార్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఈ పంట సాగుతో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తుండటంతో కొందరు అమాయక రైతులు దీనివైపు మొగ్గు చూపుతున్నారు. అయితే పట్టుబడితే నెలల తరబడి జైలులో మగ్గుతున్నారు. గంజాయి సాగుచేస్తున్న అమాయక రైతులు ఎన్డీపీఎస్ వంటి కేసులను ఎదుర్కొంటుండగా, ముంబైలో కూర్చుని రూ.కోట్లు గడిస్తున్న దందా సూత్రధారులపై ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఇద్దరు మైనర్లపై కేసు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని మేడిపల్లి గ్రామంలో ఇద్దరు బాలురు తమ వ్యవసాయ క్షేత్రంలో గంజాయి సాగు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం వ్యవసాయ క్షేత్రంలో తనిఖీలు చేసి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు మూడు నెలల క్రితం తమ వ్యవసాయ క్షేత్రంలో గంజాయి విత్తనాలు నాటారని సమాచారం అందిందని మెట్పల్లి సీఐ శ్రీను వివరించారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. చదవండి: Singareni Employees: ఒక్కో కార్మికుడికి రూ.1.15 లక్షలు -
పేరుకు ఊరి సర్పంచ్.. చేసేది గంజాయి సరఫరా
కాగజ్‌నగర్ రూరల్: ఆయనో పంచాయతీకి సర్పంచ్. గ్రామానికి ప్రథమ పౌరుడు కాస్త దారి తప్పాడు. గంజాయి సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని ఈస్గాం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను గురువారం పట్టుకున్నట్లు సీఐ రాజేంద్రప్రసాద్, ఎస్సై సందీప్‌కుమార్ తెలిపారు. చదవండి: యువ రైతు కన్నీటి వ్యథ.. 13 ఎకరాల్లో పంట నీట మునక.. తట్టుకోలేక పట్టుబడ్డ వారిలో చిన్నమాలిని గ్రామ సర్పంచ్ సుర్పం భగవంత్‌రావు, ఈస్గాం గ్రామానికి చెందిన సౌమిత్ర సర్కార్ ఉన్నారు. వారు గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం రావడంతో దాడులు చేశారు. వారిద్దరూ రహస్య ప్రాంతం నుంచి ఈజ్గాం మార్కెట్‌కు గంజాయి తరలిస్తుండగా పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, 300 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ఎమ్మెల్యేగా 18 ఏళ్లు ఉండి ఈటల ఒక్క ఇల్లయినా కట్టిచ్చిండా? -
ఏపీ టూ మహారాష్ట్ర వయా తెలంగాణ: వీళ్ల తెలివి మామూలుగా లేదుగా..
ఖమ్మం రూరల్: మండల పరిధిలోని కోదాడ క్రాస్ రోడ్డులో పోలీసులు రూ.25 లక్షల విలువైన 1.7 క్వింటాళ్ల గంజాయిని బుధవారం పట్టుకున్నారు. ఖమ్మం రూరల్ సీఐ పి.సత్యనారాయణరెడ్డి, ఎస్సై శంకర్రావు కథనం ప్రకారం.. విశాఖపట్నం జిల్లా చోడవరం గ్రామానికి చెందిన కోళ్లు తరలించే వ్యాన్ డ్రైవర్ బొబ్బిలి సాయి, ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన మరో డ్రైవర్ గుంజి వెంకట్రావు, విశాఖపట్నానికి చెందిన తేలు నాగా వెంకట సత్యనారాయణ, మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన విశాల్ అంకుష్ కలిసి గంజాయి తరలిస్తున్నారు. ఏపీలోని విశాఖ జిల్లా చింతపల్లి గ్రామం నుంచి సత్తుపల్లి, ఖమ్మం మీదుగా మహారాష్ట్రలోని షోలాపూర్‌కు కోళ్లు తరలించే రెండు వ్యాన్లలో తీసుకెళ్తున్నారు. కోదాడ క్రాస్‌రోడ్డు వద్ద వాహన తనిఖీ చేస్తున్న పోలీసులకు కోళ్లు తరలించే వ్యాన్లలో ఉన్న వారిపై అనుమానం వచ్చింది. తనిఖీ చేయగా, వ్యాన్‌పైన మామూలుగానే ఉన్నా కింద ప్రత్యేక అరలు ఏర్పాటుచేసి ప్యాక్ చేసిన గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈమేరకు గంజాయిని స్వాధీనం చేసుకుని, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. -
హష్ ఆయిల్.. 1 ఎంఎల్ @ రూ.600
సాక్షి, హైదరాబాద్: గంజాయి సంబంధిత ఉత్పత్తి అయిన హష్ ఆయిల్‌ను విక్రయిస్తున్న ఇద్దరు యువకులకు మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. వీరి నుంచి 100 మిల్లీ లీటర్ల (ఎంఎల్) హష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు ఆదివారం వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గుడిమల్కాపూర్‌లోని ప్రియ కాలనీకి చెందిన వడ్డల లక్ష్మీ వెంకట నర్సింహాచారి డీజే సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. ఇటీవల కాలంలో తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వీటిని అధిగమించడం కోసం తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గాలను అన్వేషించాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి గుంటూరుకు చెందిన ప్రవీణ్‌తో పరిచయం ఏర్పడింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే హష్ ఆయిల్‌కు గంజాయి కంటే ఎక్కువ డిమాండ్ ఉందంటూ ఇతగాడు చెప్పాడు. తాను సరఫరా చేస్తానని, సిటీలో విక్రయించి సొమ్ము చేసుకుందామని ఆఫర్ ఇచ్చాడు. దీనికి చారి అంగీకరించడంతో ఇటీవల 100 ఎంఎల్ ఆయిల్ తెచ్చి ఇచ్చాడు. దీన్ని ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ సాయంతో 5 ఎంఎల్ చొప్పున చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సుల్లో ప్యాక్ చేస్తున్న చారి హీట్ గన్‌తో సీలు వేస్తున్నాడు. వీటిని తన స్నేహితుడైన ప్రైవేట్ ఉద్యోగి ముల్కాల భాను ప్రకాష్ సాయంతో విక్రయిస్తున్నాడు. ఒక్కో బాక్సును రూ.3 వేలకు (ఒక్కో మిల్లీ లీటర్ రూ.600 చొప్పున) అమ్ముతూ వచ్చిన లాభాలను ముగ్గురూ పంచుకుంటున్నారు. వీరి వ్యవహారంపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ మహ్మద్ అబ్దుల్ జావేద్‌కు సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీనివాసులు, మహ్మద్ షానవాజ్ షఫీ, టి.శ్రీధర్ రంగంలోకి దిగి వల పన్నారు. ఆదివారం చారి, భానులను పట్టుకుని హష్ ఆయిల్, వేయింగ్ మిషన్ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును ఆసిఫ్‌నగర్ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న ప్రవీణ్ కోసం గాలిస్తున్నామని, అతడు చిక్కితే ఈ ఆయిల్ మూలాలపై స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు. -
ఛీ.. ఇదేం పనయ్యా కానిస్టేబుల్!
ఉప్పల్ : క్రికెట్ బెట్టింగ్‌లు, జల్సాలకు అలవాటుపడ్డ ఓ ఆర్మ్డ్ కానిస్టేబుల్ డబ్బుల కోసం గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఎక్సైజ్ పోలీసులకు దొరికిపోయాడు. శనివారం ఉప్పల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం... అనంతపురానికి చెందిన జె.మోహన కృష్ణ (36) అక్కడే ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. జనగాం జిల్లా వాసి సోమయ్య(36), నల్లగొండజిల్లా వాసి బానోతు యాదగిరి(24), బానోతు రా జుతో కలిసి నర్సీపట్నంలో గంజాయిని కిలో రూ. 2 వేలకు కొనుగోలు చేసి నగరంలో రూ.8 వేలుకు విక్రయిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా మోహన కృష్ణ తన కారుకు పోలీస్ అనే స్టిక్కర్ అతికించుకొని దందా సాగిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఉప్పల్ ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ తన బృందంతో శుక్రవారం రాత్రి ఉప్ప ల్ నల్ల చెరువు కట్టమీద మాటువేసి మో హన కృష్ణ కారును పట్టుకున్నారు. కారు లో పొట్లాల రూపంలో ఉన్న 200 కిలోల గంజాయి దొరికింది. ఏఆర్ కానిస్టేబుల్ తో పాటు కారులో ఉన్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి, కారు, 2 సెల్ఫోన్లు.. మొత్తం రూ. 20 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసు కుని ముగ్గురినీ రిమాండ్‌కు తరలించగా, బానోతు రాజు పరారీలో ఉన్నాడు. -
గంజాయి రవాణా చేసే నార్త్ ముఠాకు చెక్
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో కంచరపాలెం పోలీసుల స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వీరివద్ద నుంచి 2 లక్షల రూపాయలు విలువ చేసే 120 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని వీరిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ మీడియాతో మాట్లాడుతూ.. అరెస్టు అయిన వారంతా ఉత్తర భారతదేశానికి చెందిన వారని, ఐదుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి విశాఖ మన్యంలోని పలు ప్రాంతాల నుంచి గంజాయి సేకరిస్తున్నట్లు చెప్పారు. దీన్ని ప్యాకెట్లుగా మార్చి గుట్టుగా రైళ్ల ద్వారా తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణలో ఈ ఐదుగురు నిందితులు డిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరు రైల్యే ఉద్యోగం చేస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. విశాఖ ఎజెన్సీ ప్రాంతాల నుంచి పశ్చిమ బెంగాల్‌కు గంజాయిని రైలులో తరలించే క్రమంలో వీరిని పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ. 30 వేల నగదు, 5 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ శ్రవణ్ తెలిపారు. -
స్మగ్లర్ల రూటే సెపరేటు
-
విశాఖలో గంజాయి ముఠా గుట్టు రట్టు
-
విశాఖలో గంజాయి ముఠా గుట్టు రట్టు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు చేధించారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న నలుగురిని టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. టాస్క్‌ఫోర్స్, విశాఖ నాల్గవ పట్టణ పోలీసులు సాలిగ్రామపురంలో సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో డ్రగ్స్ సరఫరాకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిని మానుకొండ సత్యనారాయణ, మజ్జి అజయ్ కుమార్, కంది రవికుమార్, మనోజ్ స్వరూప్లుగా గుర్తించారు. వారి దగ్గర నుంచి 61 ఎల్ఎస్డీ, 2.5 గ్రాముల ఎండీఎంఏ, 60 గ్రాముల గంజాయి, 9,500 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మానుకొండ సత్యనారాయణ గతంలోనూ విశాఖ రేవ్ పార్టీలో పట్టుబడ్డ ప్రధాన నిందితుడిగా గుర్తించారు. నిందితులపై 21(బి), 27(ఎ), 20(బి) ఎన్డీపీఎస్(నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్) చట్టం కింద కేసు నమోదు చేశారు. (వైరల్ : జడ్జీ కళ్ల ముందే గంజా సిగరెట్ తాగాడు) చదివింది డిగ్రీ.. డబ్బు కోసం అడ్డదారులు గుంటూరు: గుంటూరులో గంజాయి మాఫియా గుట్టురట్టైంది. లిక్విడ్ రూపంలో గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసుల దాడుల్లో 8 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరందరూ డిగ్రీ పూర్తి చేసిన వారే కాగా సులువుగా డబ్బు సంపాదించడం కోసం అడ్డదారుల బాట పట్టారు. వీరి దగ్గర నుంచి 8 కేజీల గంజాయి, 30 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. (‘నాకూ గంజాయి అలవాటు ఉండేది’) -
భద్రాచలం టు బీదర్
సాక్షి, హైదరాబాద్: భద్రాచలం ఏజెన్సీ నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌కు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తోన్న గంజాయిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. శనివారం ఎల్బీనగర్ క్రాస్‌రోడ్ వద్ద ట్రక్కు (టీఎస్ 12సీ 5662), కారు (ఏపీ 29 ఏబీ 7351) లను తనిఖీ చేశారు. దీనిపై రూ.4,100 పెండింగ్ చలానాలు ఉన్నాయి. ట్రక్కులో పైన ఖాళీ ప్లాస్టిక్ కేసులను ఉంచి, ఎవరికీ అనుమానం రాకుండా అడుగున గంజాయి సంచులను జాగ్రత్తగా అమర్చారు. కానీ, తనిఖీల్లో 1,554 కిలోల 751 గంజాయి సంచులు బయటపడ్డాయి. వీటి విలువ రూ.3.10 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ముఠాలోని ఆరుగురు సభ్యులు చాలా చాకచక్యంగా వ్యవహరించారు. పోలీసుల తనిఖీలను ముం దుస్తుగానే గుర్తించి, ట్రక్కులోని సరుకును తప్పించేందుకు కారును పైలట్ వాహనంగా వాడారు. కానీ, విశ్వసనీయ సమాచారం అందుకున్న డీఆర్ఐ అధికారులు రెండు వాహనాలను ఆపారు. సరుకు భద్రాచలం సమీపంలోని మోతుగూడెం నుంచి కర్ణాటకలోని బీదర్‌కు తరలిస్తున్నట్లుగా వెల్లడించారు. ఆరుగురిని అరెస్టు చేసిన అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు
మహబూబ్‌నగర్ క్రైం: విశాఖపట్నం నుంచి శ్రీలంకకు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఒక ముఠాను మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఈనెల 4న భూత్పూర్ మండలం తాటికొండ దగ్గర జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీ ని హైదరాబాద్ నుంచి కర్నూల్ వెళ్తున్న ఇన్నోవా కారు ఢీకొట్టింది. సంఘటన స్థలం పరిశీలించిన పోలీసులకు కారులో గంజాయి దొరికింది. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు ఈ ముఠాను అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రెమా రాజేశ్వరి గురువారం తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. తమిళనాడులోని మధురైకి చెందిన సతీశ్, కల్యాణ్ గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటారు. ఈ ఇద్దరూ తమిళనాడుకు చెందిన శివనేశ్వరన్, అజిత్, సురేందరన్‌లతో కలసి విశాఖపట్నం జిల్లాలో రాము, మూర్తి, రాంరెడ్డి అనే వ్యక్తుల వద్ద కేజీ రూ.6 వేలకు గంజాయి కొనుగోలు చేసి.. ఆ తర్వాత ఆ గంజాయిని హైదరాబాద్‌లో రూ.11వేలు, చెన్నైలో రూ.12 వేలకు విక్రయించేవారు. రామేశ్వరం మీదగా శ్రీలంకకు సముద్రమార్గం ద్వారా ఎగుమతి చేసేవారు. ఈ క్రమంలోనే వీరు గురువారం హైదరాబాద్ సమీపంలో సతీశ్, కల్యాణ్, సురేందరన్ ఉన్నారని పోలీ సులు సమాచారం తెలుసుకొని అరెస్టు చేశారు. వీరిలో సతీశ్, కల్యాణ్, సురేందరన్, అజిత్‌లను రిమాండ్‌కు తరలించారు. శివనేశ్వరన్, రాము, మూర్తి, రాంరెడ్డిలు పరారీలో ఉన్నారు. అరెస్టయినవారి నుంచి రూ.21లక్షల విలువ చేసే 180 కేజీల గంజాయి, రెండు ఇన్నోవా కార్లు సీజ్ చేశారు. గతంలో వీరు రెండు సార్లు గంజాయి కొనుగోలు చేసి రామేశ్వరంకు చెందిన జయచంద్రన్ అనే వ్యక్తి ద్వారా శ్రీలంకకు పంపించి విక్రయించారు. -
తండ్రీకొడుకుల గంజాయి స్మగ్లింగ్
సాక్షి, నెక్కొండ: గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నర్సంపేట ఏసీపీ ఫణీంద్ర కేసు వివరాలను వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనంతారం గ్రామానికి చెందిన కొంగర యేసు, వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండలం హరిశ్చంద్రు తండా గ్రామానికి చెందిన జాటోతు రాజ్‌కుమార్, జాటోతు సీతారాం(పరారీలో ఉన్నాడు).. పశ్చిమ గోదావరి జిల్లా చింతూరులో గంజాయి కొనుగోలు చేసి స్మగ్లింగ్‌కు చేస్తున్నారు. నిందితుల్లో జాటోతు సీతారాం అక్రమ దందాలకు పాల్పడుతుండేవాడు. ఆయన కుమారుడు, ఎంకాం చదివిన రాజ్‌కుమార్ కూడా తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలనే ఆలోచనతో తండ్రి మార్గాన్ని ఎంచుకున్నాడు. వీరిద్దరితోపాటు మరొకరి సాయంతో పశ్చిమగోదావరి జిల్లా నుంచి గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడే వారు. ఈ నెల 9న నెక్కొండకు రైలు మార్గం ద్వారా గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు నిఘా వేయగా రెండు సంచులతో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో రాజ్‌కుమార్, యేసును అదుపులోకి తీసుకోగా పక్కనే ఉన్న సీతారాం ఉడాయించాడు. ఈ మేరకు రూ.12 లక్షల విలువైన శుద్ధి చేసిన 60 కిలోల(30 ప్యాకెట్లు) గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి తీసుకొచి్చన గంజాయిని రైలు మార్గంలో మహరాష్ట్రకు తరలించే క్రమంలో అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా స్మగ్లర్లను అరెస్టు చేయడంలో కీలకంగా వ్యవహరించిన సీఐ తిరుమల్, ఎస్సై నవీన్‌కుమార్, ఏఎస్సై ప్రతాప్‌సింగ్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. -
మాదకద్రవ్యాల అడ్డాగా రాజధాని
సాక్షి, మంగళగిరి(గుంటూరు) : ఈ నెల ఒకటో తేదీన మంగళగిరిలోని టిప్పర్ల బజార్‌లోగల శ్రీ చైతన్య కళాశాలలో కొందరు విద్యార్థులు అల్లరి చేస్తున్నారనే సమాచారంలో పోలీసులు వెళ్లారు. అక్కడ విద్యార్థుల పరిస్థితిని బట్టి మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు అనుమానించిన పోలీసులు వారి రక్త నమూనాలు తీసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. దీనిపై విచారణ చేస్తున్నారు. రాజధానిలోని ప్రైవేటు యూనివర్సిటీలలో విద్యార్థుల ద్వారా మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నట్లు అనుమానిస్తున్నారు. తాడేపల్లి మండలంలోని వడ్డేశ్వరం గ్రామంలోగల ఓ ప్రైవేటు యూనివర్సిటీ మాదక ద్రవ్యాలు సరఫరా కేంద్రంగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంగళగిరి మండలంలోని నీరుకొండలో గల యూనివర్సిటీతోపాటు చినకాకాని మెడికల్ కళాశాల విద్యార్థులు అధికంగా గంజాయి, మత్తు పదార్థాలు తీసుకుంటున్నట్లు సమాచారం. వీరు పట్టణంలోని ప్రైవేటు కళాశాలల విద్యార్థులకూ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమా నిస్తున్నారు. వేడుకల వేళ.. పుట్టిన రోజులకో లేక ఏదైనా ఫంక్షన్లకో విద్యార్థులు సరదాగా ఒక దమ్ము కొడదామని చిన్న వయసులో మత్తు పదార్థాల రుచి చూస్తున్నారు. క్రమేణా ఇది వ్యవసనంగా మారుతోంది. ఒడిశా, విశాఖ ప్రాంతాలకు చెందిన పలువురు గంజాయి సరఫరాదారులు రాజధాని ప్రాంతంలోని విద్యార్థులను లక్ష్యం చేసుకుని వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గంజాయి విచ్చలవిడిగా లభిస్తుండడంతో ప్రస్తుతం ఇంటర్ విద్యార్థులు సైతం దానికి బానిసలుగా మారుతున్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేయడంతోపాటు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థి ఇంటర్లో అశ్రద్ధగా ఉంటే కచ్చితంగా తల్లిదండ్రులు అనుమానించాలని పోలీసులు సూచిస్తున్నారు. మత్తు మహమ్మారిన పడిన విద్యార్థులు యూనివర్సిటీలు, కళాశాలలో ఘర్షణలకు దిగుతున్నారు. పిల్లల నడవడికపై ఎప్పటికప్పుడు యూనివర్సిటీలు, కళాశాలల్లో తల్లితండ్రులు ఆరా తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యూనివర్సిటీల యాజమాన్యాలు విదేశీ విద్యార్థులపై నిఘా ఉంచాలని పోలీసులు చెబుతున్నారు. విద్యార్థులను గమనించాలి విద్యార్థులు తొలుత సరదాగా లేక తోటి స్నేహితుడు ఒత్తిడితోనో మత్తు పదార్థాలకు అలవాటు పడతారు. అనంతరం వారికి తెలియకుండానే బానిసలవుతారు. మద్యంతోపాటు మత్తు పదార్థాల కారణంగా కిడ్నీలు దెబ్బతిని క్యాన్సర్ బారిన పడతారు. ఇంటర్, బీటెక్ మొదటి సంవత్సరం చదివే సమయాలలో ఎక్కువగా స్నేహాలు మారుతుంటాయి. ఇలాంటి సమయంలో జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ అన్నపురెడ్డి శివనాగేంద్రరెడ్డి, నెఫ్రాలజిస్ట్, ఎండీ -
పెద.. కాపు కాసిందెవరు?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : గంజాయి స్మగ్లింగ్‌లో పాడేరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ పెదకాపు శ్రీనివాసరావు పాత్ర రూఢీ కావడం.. ఆయన్ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సస్పెండ్ చేయడం ఆబ్కారీ వర్గాల్లో కలకలం రేపింది. పోలీసుల విచారణలో పెదకాపు ఏయే వాస్తవాలు బయటపెడతారు.. ఎవరి మెడకు చుట్టుకోనుందోనన్న ఆందోళన ఎక్సైజ్ వర్గాల్లో కనిపిస్తోంది. గంజాయి స్మగ్లింగ్‌లో ఎక్సైజ్ పోలీసుల ప్రమేయంపై ఆరోపణలు రావడం.. ఒకరిద్దరు కిందిస్థాయి ఉద్యోగుల పాత్ర ఉందని ఖరారు కావడం అడపాదడపా జరుగుతున్నదే కానీ ఏకంగా సీఐ స్థాయి అధికారి స్వయంగా స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడని, నేరస్తులతో చేతులు కలిపి తానే దగ్గరుండి గంజాయిని సురక్షిత ప్రాంతాలకు పంపేవాడని పోలీసుల దర్యాప్తులో స్పష్టం కావడం బహుశా ఇదే మొదటిసారి. అసలేం జరిగింది..: గత ఏడాది అక్టోబర్‌లో పాడేరు ఘాట్ రోడ్లో ఓ తారు ట్యాంకర్ ద్వారా గంజాయి రవాణా అవుతోందని పోలీసులకు సమాచారం రావడంతో దాడులు చేశారు. ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకుని తనిఖీలు చేయగా, అందులో 1200 కిలోల గంజాయి బయటపడింది. వెంటనే ట్యాంకర్ డ్రైవర్‌తో సహా ముగ్గురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని విచారించగా... ఎక్సైజ్ మొబైల్ పార్టీ సీఐ పెదకాపు శ్రీనివాసరావు ప్రోద్బలంతోనే తాము రవాణా చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఆరా తీసిన పోలీసులకు శ్రీనివాసరావు ఎక్సైజ్ సీఐ ముసుగులో పాల్పడుతున్న దందాలన్నీ బయటపడ్డాయి. అనకాపల్లి ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోకి వచ్చే పాడేరు ఎక్సైజ్ స్టేషన్లో ఇద్దరు సీఐలు ఉంటారు. ఒకరు మొబైల్ పార్టీ సీఐ.. మరొకరు ఎక్సైజ్ స్టేషన్ సీఐ.. కానీ శ్రీనివాసరావు పనిచేసిన హయాంలో ఏడాదిన్నర పాటు ఎక్సైజ్ స్టేషన్ సీఐ లేకపోవడంతో మొత్తం ఈయనే చుట్టేసేవాడు. ఇష్టారాజ్యంగా వ్యవహరించేవాడు. గంజాయి స్మగ్లర్లతో చేతులు కలిపి అక్రమ రవాణాకు సహకరించేవాడు. గంజాయి తరలిస్తున్న వాహనాలకు పెదకాపు ఎస్కార్ట్‌గా వ్యవహరించేవాడనీ, దగ్గరుండి సరిహద్దులు దాటించే వాడన్న ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా ఈయనే గంజాయి రవాణా వాహనాల్లో ఉండటంతో పోలీసులకు సైతం అనుమానమొచ్చేది కాదు.. ఒక్కోసారి ఈయనకు వీలు కాని సందర్భాల్లో తన మనుషులనే ఎస్కార్ట్‌గా పంపించేవాడన్న వాదనలు ఉన్నా యి. ఇక గంజాయి వ్యాపారస్తులకు ముందస్తుగానే సమాచారం ఇచ్చి ఉత్తుత్తి దాడులు చేపట్టి ఒకటి రెండు నామమాత్రపు కేసులు నమోదు చేసేవాడు. ఈయన గతంలో మాడుగుల ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పనిచేసినప్పుడూ లెక్కకు మించిన ఆరోపణలు మూటగట్టుకున్నాడు. తెర వెనుక కాపు కాసిందెవరు? ఎక్సైజ్ అధికారవర్గాల్లో పెదకాపు శ్రీనివాసరావుకు సహకరించింది ఎవరు.. ఆయన తరహాలోనే అక్రమాలకు పాల్పడిందెవరన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అనకాపల్లి కేంద్రంగా పనిచేస్తున్న ఇద్దరు అధికారులకు పెదకాపు వ్యవహారాలు మొత్తం తెలుసని, వాళ్ల అండతోనే ఇతను ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారన్న వాదనలున్నాయి. ఆ ఇద్దరు అధికారుల ప్రోద్బ లంతోనే ప్రస్తుతం అతను అజ్ఞాతంలోకి వెళ్లాడని అంటున్నారు. ఇక ఆ మధ్యన గాజువాకకు బదిలీ అయిన అధికారులతోనూ పెదకాపుకు అవినీతి సం«బంధాలు ఉండేవని తెలుస్తోంది. ఈ అధికారులంతా ఓ ముఠాగా ఏర్పడి జిల్లా దాటకుండా మన్యం స్మగ్లర్లతో కుమ్మక్కై లక్షలు దోచుకుతిన్నారన్న వాదనలు ఉన్నాయి. ఈ ముఠాలోని ఏ అధి కారికైనా వేరే జిల్లా బదలీ అయితే... ఎలాగోలా నిలుపుదల చేయించుకునే వారని అంటున్నారు. ఇటీవల ఓ అసిస్టెంట్ ఎక్సై జ్ సూపరింటెం డెంట్‌కు కాకినాడ బదలీ అయితే ఇదే మాదిరి ఉన్నతాధికారుల వద్ద పావులు కదిపి తిరిగి గాజువాకకు బదిలీ చేయించుకున్నారని తెలుస్తోంది. డ్యూటీ గాజువాకలో అయినా.. నిత్యం ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి రావడం వారికి ఆనవాయితీగా మారిందని అంటున్నారు. పెదకాపు పట్టుబడి పోలీసుల విచారణలో నోరు విప్పితే ఎక్సై జ్ శాఖలోని అవినీతి తిమింగలాలన్నీ బయటకు వస్తాయి. ఎక్సైజ్ ఉన్నతాధికారులకు తెలిసినా.. వాస్తవానికి పెదకాపు శ్రీనివాసరావు వివాదాస్పద వ్యవహారశైలి, అక్రమార్జన, అవినీతి ఆరోపణలపై ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులకు ముందు నుంచి సమాచారముంది. రెండు మూడేళ్లుగా అతనిపై లెక్కకు మించిన ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఉన్నతాధికారులు కనీసంగా కూడా స్పందించకపోవడం అనుమానాలకు తావి స్తోంది. గతేడాది అక్టోబర్‌లో పోలీసుల విచారణలో బయటపడిన తర్వాత కూడా ఎక్సైజ్ ఉన్నతాధికారులు అతని గురించి పట్టించుకోలేదు. ఉన్నతాధికారుల ఉదా సీనతపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఇటీవలే వీఆ ర్కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వా త పెదకాపు శ్రీనివాసరావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కనీసం అతను పరారీలో ఉన్న విషయం కూడా పోలీసులకు సమాచారమివ్వలేదు.