పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి, హాష్ ఆయిల్
చౌటుప్పల్: నిషేధిత గంజాయిని తరలిస్తున్న ఓ ముఠాలోని ఇద్దరిని యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి వంద కిలోల గంజాయితో పాటు పది లీటర్ల హాష్ స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం చౌటుప్పల్‌లోని ఏసీపీ కా ర్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి వివరాలను వెల్లడించారు.
కేరళలోని కుంజితూర్‌కు చెందిన ఫైజ ల్ కొన్నేళ్లుగా గంజాయి రవాణా వ్యాపారం చేస్తున్నాడు. అందులో భాగంగా కర్ణాటకలోని మంగళూర్ జిల్లాకు చెందిన కారు డ్రైవర్ హస్సైనర్, ముంబై లోని ఓ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న కేరళకు చెందిన అన్సార్, కబీర్, ఉప్పాల గ్రామానికి చెం దిన ఎస్‌కె.అబ్దుల్లా, మంగళూర్‌కు చెందిన నౌషద్, బెంగళూరుకు చెందిన మూర్తి ముఠాగా ఏర్పడ్డారు.
లంబసింగి నుంచి కేరళకు..
ఈ ముఠా సభ్యులు గంజాయితో పాటు ద్వాని ద్వారా తయారయ్యే హాష్ ఆయిల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లంబసింగి ప్రాంతంలో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఆ సరుకును రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల మీదుగా కేరళకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. లంబసింగిలో కొనుగోలు చేసిన గంజాయి, హాష్ ఆయిల్‌ను ఓ కారులో రహస్య ప్రాంతంలో నిల్వ చేస్తారు. పోలీసుల తనిఖీల నుంచి రక్షణ పొందేందుకు ప్రత్యేకంగా పైలెట్‌గా ఇన్నోవా వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీరు తనిఖీలకు సంబంధించిన సమాచారాన్ని గంజాయితో వస్తున్న వాహనంలోని వ్యక్తులకు చేరవేస్తుంటారు.
పక్కా సమాచారంతో..
గంజాయి రవాణాకు సంబంధించి రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు పక్కా సమాచారం అందింది. ఆ మేరకు శనివారం సాయంత్రం చౌటుప్పల్ పోలీ సులు రంగంలోకి దిగారు. మండలంలోని రెడ్డిబావి గ్రామం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. సరుకుతో వచ్చిన స్విఫ్ట్ కారును పట్టుకుని, కారు డ్రైవర్ హస్సైనర్, అన్సార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన కారులో ఒక్కక్కటి రెండు కిలోల బరువు కలిగిన 50 గంజాయి ప్యాకెట్లు, దాని ద్వారా ఉత్పత్తి చేసిన 10 లీటర్ల హాష్ ఆయిల్ లభించింది. వీటి తో పాటు రూ.4 లక్షల విలువైన కారు, రూ.50 వేల విలువైన 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వీటి విలువ 46.50 లక్షలుగా పోలీసులు నిర్ణయించారు. అన్నింటినీ సీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment