
పట్టుకున్న గంజాయి, నిందితులతో ఎస్‌ఐ నాగేంద్ర, సిబ్బంది
కొయ్యూరు: మర్రివాడ పంచాయతీ గుడ్లపల్లి వద్ద 120 కిలోల గంజాయిని కొయ్యూరు ఎస్‌ఐ దాసరి నాగేంద్ర పట్టుకున్నారు. పాడేరు నుంచి పెదవలస, కొయ్యూరు మీదుగా కాకినాడ తరలించేందుకు గంజాయిని తీసుకువస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ నాగేంద్ర గుడ్లపల్లి సెంటర్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. దీంతో అటు వైపు నుంచి వస్తున్న కారును తనిఖీ చేయగా 120 కిలోల గంజాయి బయటపడింది. కాకినాడలోని వాకలుపూడికి చెందిన ఉప్పల రమేష్, బి.గంగాధర్, రౌతులపూడి మండలం గిడిజాం గ్రామానికి చెందిన ఎస్.లోవరాజును అరెస్టు చేశారు. గంజాయి తరలింపునకు వినియోగించిన కారును సీజ్ చేసి, వారి వద్ద నుంచి రూ.3వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment