koyyuru
-
పారదర్శకంగా బాధితులకు పరిహారం అందించాం : సీఎం జగన్
-
వర్షం కోసం గంగాలమ్మ పండగ
కొయ్యూరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): వర్షంతో తడిపి భూములను సస్యశ్యామలం చేయాలని గిరిజనులు ఏటా ఏప్రిల్ చివరి వారం నుంచి జూన్ మొదటి వారం వరకు గంగాలమ్మ తల్లి పండగను నిర్వహిస్తారు. దాదాపుగా 300 ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. నాడు అల్లూరి సీతారామరాజును పట్టుకోవడానికి వచ్చిన ఆంగ్లేయులు కూడా ఈ పండగను చూశారు. పంటలు పండాలంటే నీరు కావాలి. అందుకే గంగమ్మను పూజిస్తే.. తల్లి వర్షాన్ని కురిపించి పంటలను పండిస్తుందని ఇక్కడి గిరిజనుల నమ్మకం. ఇక్కడి భూములు చాలా వరకు వర్షాధారం కావడంతో వర్షం తప్పనిసరి. ఒకప్పుడు నెల రోజుల పాటు పండగ చేస్తే.. ఇప్పుడు వారానికే పరిమితమైంది. గిరిజన గ్రామాల్లో విత్తనాలు చల్లికతో ప్రతీ చోట పండగ ప్రారంభిస్తారు. కొన్ని రకాల పప్పులు, వరి విత్తనాలను గంగాలమ్మ తల్లి పేరు చెప్పి పొలంలో చల్లుతారు. ఆ విత్తనాల్లో కొన్నైనా మహిళల చీరకొంగులో పడే విధంగా చూస్తారు. అలా పడిన విత్తనాలను దాస్తారు. తర్వాత వారు వేసే విత్తనాల్లో వీటిని కలిపివేస్తారు. ఇలా వేస్తే తల్లి ఆశీస్సులతో పంటలు బాగా పండుతాయని భావిస్తారు. గ్రామాన్ని క్షేమంగా చూడాలని చిన్న ఈరేడును తయారు చేసి దానిలో బుట్టను ఉంచుతారు. చిన్న కోడిపిల్లను బలి ఇచ్చి గ్రామంలో రెండు వైపులా పొలిమేర వరకు తీసుకువచ్చి వదిలిపెడతారు. దీనిని జడిగా పిలుస్తారు. వారం రోజులే తల్లి ఊరేగింపు ప్రతి రోజూ సాయంత్రం సమయంలో తల్లిని ఊరేగింపుగా అన్ని గృహాల వద్దకు తీసుకెళ్తారు. కుండపై దీపం పెట్టి గంధం, పాల ఆకుల పూలు పెడతారు. ఇలా ఊరేగించిన తర్వాత అసలు పండగ చేపడతారు. ఈ సందర్బంగా గ్రామాల్లో ఊయలను ఏర్పాటు చేస్తారు. ఇందులో పెద్దల నుంచి పిల్లల వరకు అంతా సంతోషంగా ఊగుతారు. గతంలో తల్లి ఊరేగింపును దాదాపుగా నెల రోజుల పాటు చేసేవారు. ఇప్పుడు వారం రోజులకే పరిమితమైంది. కోలాటం.. గంగాచెల్లు.. తల్లికి మేకలను బలి ఇస్తారు. అనేకచోట్ల మంగళవారం రాత్రి అంతా కోలాటం, గంగా చెల్లు పాటలతో జాగారం చేస్తారు. బుధవారం ఉదయాన్నే మేకలను బలి ఇస్తారు. గతంలో కోలాటం, గంగాచెల్లు ఆటలను రాత్రి నుంచి తెల్లవారే వరకు పాడే వారు. ఇప్పుడు ఆ గంగా చెల్లును చాలా చోట్ల మానేశారు. కొంత సేపు కోలాటం ఆడుతున్నారు. బాసికాలు వసూలు మరోవైపు మేకపోతులను వేసిన తర్వాత నుంచి మహిళలు రోడ్డుకు అడ్డంగా కర్రలు పెట్టి బాసికాల పేరిట డబ్బులు వసూలు చేస్తారు. వాహనచోదకులకు పసుపు నీటిని రాస్తారు. పురుషులు కోలాటం చేస్తూ ఇంటింటికీ తిరిగి డబ్బులు వసూలు చేస్తారు. గతంలోలా కాకపోయినా.. ప్రతి గ్రామంలో ఈ పండగ నిర్వహిస్తున్నారు. తగ్గిన గొర వేషం, వేటలు మేకలను బలి ఇచ్చిన తర్వాత గ్రామంలో పెద్దలు సంప్రదాయ ఆయుధాలతో వేటకు వెళ్తారు. వేటకు వెళ్లే ముందు పూజలు నిర్వహించి పనసకాయకు బాణాలు వేస్తారు. మరికొన్ని చోట్ల అయితే పంది పిల్లకు బాణాలు వేస్తారు. గతంలో అడవి విస్తరించి ఉండడంతో పాటు వేటాడే నిపుణులు ఉండేవారు. దీంతో వేటకు వెళ్తే ఏదో ఒక జంతువును తెచ్చేవారు. ఇప్పుడు వేటలను చాలా వరకు తగ్గించారు. ఇలా వేటకు వెళ్లే ప్రతి రోజూ రాత్రి సమయంలో గొర వేషాన్ని నిర్వహిస్తారు. జంతువు వేషధారణతో ఒకరిని తయారు చేస్తారు. అతన్ని వేటాడుతున్నట్టుగా బాణాలు వేస్తారు. చుట్టూ జనాలు ఉండి ఆటలాడుతారు. ఈ సందర్భంగా అతని తోకకు పేడ లేదా పసుపు నీరు పూస్తారు. ఇంటింటికీ తిరిగి తోకకు రాసిన పేడ లేదా పసుపు నీరును అందరికీ అంటిస్తారు. ఇదంతా సరదా సాగుతుంది. చిన్నతనంలో బాగుండేది మా చిన్నతనంలో పండగ చాలా బాగుండేది. నెల రోజులకు పైగా జరిగేది. ఇప్పుడు పండగ చేసే రోజులు తగ్గిపోయాయి. అప్పటి మాదిరిగా మహిళలు ఇప్పుడు గంగాచెల్లు ఆడేందుకు రావడం లేదు. పండగ సంప్రదాయ ప్రకారం చేస్తున్నారు. – కె.గంగరాజు, రాజేంద్రపాలెం అన్నిచోట్ల నిర్వహణ మన్యంలో వందల ఏళ్ల నుంచి ఈ పండగ కొనసాగుతోంది. నేడు అనేక చోట్ల బాగానే జరుగుతోంది. అయితే పండగ జరిగే రోజుల సంఖ్య తగ్గిపోయింది. వేటలను చాలా వరకు తగ్గించారు. నాడు కోలాటం, గంగా చెల్లు ఆటలు జరిగితే.. నేడు దానికి భిన్నంగా ఆధునిక పద్ధతిలో పండగ నిర్వహిస్తున్నారు. – డి.వి.డి.ప్రసాద్, ధర్మ జాగరణ సమితి గిరిజన పరియోజన ప్రముఖ్ -
120 కిలోల గంజాయి పట్టివేత
కొయ్యూరు: మర్రివాడ పంచాయతీ గుడ్లపల్లి వద్ద 120 కిలోల గంజాయిని కొయ్యూరు ఎస్ఐ దాసరి నాగేంద్ర పట్టుకున్నారు. పాడేరు నుంచి పెదవలస, కొయ్యూరు మీదుగా కాకినాడ తరలించేందుకు గంజాయిని తీసుకువస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ నాగేంద్ర గుడ్లపల్లి సెంటర్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. దీంతో అటు వైపు నుంచి వస్తున్న కారును తనిఖీ చేయగా 120 కిలోల గంజాయి బయటపడింది. కాకినాడలోని వాకలుపూడికి చెందిన ఉప్పల రమేష్, బి.గంగాధర్, రౌతులపూడి మండలం గిడిజాం గ్రామానికి చెందిన ఎస్.లోవరాజును అరెస్టు చేశారు. గంజాయి తరలింపునకు వినియోగించిన కారును సీజ్ చేసి, వారి వద్ద నుంచి రూ.3వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. -
108లో ఇద్దరు గర్భిణులకు ప్రసవం
కొయ్యూరు/దేవరాపల్లి: అత్యవసర వైద్య సేవలందిస్తూ 108 అంబులెన్స్‌లు అపర సంజీవినిలా నిలుస్తున్నాయి. ముఖ్యంగా పురిటి నొప్పులతో బాధపడే గర్భిణులకు మరో జన్మ అందించడమే కాక పండంటి బిడ్డను చేతిలో పెడుతున్నాయి. విశాఖ జిల్లాలో ఆదివారం ఇలాంటి సంఘటనలు రెండు జరిగాయి. కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ ముకుడుపల్లికి చెందిన గిరిజన మహిళ తాంబేలు లక్ష్మికి పురిటి నొప్పులు రావడంతో 108లో రాజేంద్రపాలెం ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆమెను ఇక్కడ నుంచి నర్సీపట్నం ఆస్పత్రికి రిఫర్ చేశారు. 108 సిబ్బంది లక్ష్మిని నర్సీపట్నం తీసుకెళ్తుండగా కృష్ణాదేవిపేట దాటిన తరువాత నొప్పులు అధికమయ్యాయి. దీంతో ఆమెకు వాహనంలోనే ప్రసవం చేశారు. మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం జరిగిన వెంటనే దగ్గరలో ఉన్న గొలుగొండ ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. ఈఎంటీ ఈశ్వరరావు, పైలెట్ కె.వరప్రసాద్‌లను అందరూ అభినందించారు. అలాగే దేవరాపల్లి మండలం మామిడిపల్లికి చెందిన నెక్కెళ్ల రామలక్ష్మి 108 అంబులెన్స్‌లో ప్రసవించింది. ఆమెకు ఆదివారం తెల్లవారుజాము 5 గంటలకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కి ఫోన్ చేశారు. కె.కోటపాడుకు చెందిన 108 సిబ్బంది మామిడిపల్లి కి చేరుకొని కె.కోటపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో 108 ఈఎంటీ కాన్పు చేశారు. రామలక్ష్మికి ఆడబిడ్డ జన్మించింది. ప్రథమ చికిత్స అనంతరం తల్లీబిడ్డను కె.కోటపాడు సీహెచ్‌సీలో చేర్చారు. -
MP Goddeti Madhavi: ఎంపీ అయినా రైతే!
సాక్షి, కొయ్యూరు (విశాఖపట్నం): వరి నూర్పిడి అనంతరం రాశిగా పోసిన ధాన్యాన్ని బస్తాలోకి ఎత్తుతోంది ఎవరో గమనించారా? ఇంకెవరు.. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి. సహజంగానే ఆమె ఎలాంటి అధికార దర్పాన్ని ప్రదర్శించకుండా సాదాసీదాగా ఉంటారు. శరభన్నపాలెంలో శుక్రవారం వారి పొలంలో వరి నూర్పిడి చేశారు. ఆ పనుల్లో ఎంపీతో పాటు, ఆమె భర్త శివప్రసాద్‌లు పాలుపంచుకున్నారు. చదవండి: (ఇలాంటి వాళ్లంతా పేదలకు శత్రువులే: సీఎం జగన్) -
ఏవోబీలో మళ్లీ అలజడి
విశాఖపట్నం: ఏవోబీలో మళ్లీ అలజడి చెలరేగింది. ఏజెన్సీలోని కొయ్యూరు మండలం కన్నవరం గ్రామ శివారులోని అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు దాడి చేశారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఎదురుకాల్పులకు దిగారు. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయి. -
పాఠం చెబుతూనే తనువు చాలించిన గురువు
కొయ్యూరు (విశాఖపట్నం) : దసరా సెలవుల తరువాత గురువారం పాఠశాలల పునఃప్రారంభమైన రోజే బోధన చేస్తూ ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలోనే మరణించారు. దుచ్చరి మల్లయ్య(52) అనే ఉపాధ్యాయుడు విశాఖ జిల్లా కొయ్యూరు మండలం పనసలపాడు ప్రాథమిక పాఠశాలలో మూడేళ్లుగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇదే మండలంలోని తన స్వగ్రామం రాజేంద్రపాలెం పంచాయతీ సూరేంద్రపాలెం నుంచి ఆయన గురువారం పిట్టాచలం వరకు బస్సులో వెళ్లారు. అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలోని పనసలపాడుకు నడిచి వెళ్లారు. తరగతి గదిలో విద్యార్థులకు బోధన చేస్తుండగానే అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. తోటి ఉపాధ్యాయులు వెంటనే రాజేంద్రపాలెం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. -
మావోయిస్టు చలపతిని పట్టిస్తే రూ.20 లక్షలు
కొయ్యూరు: మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివారం రాత్రి కొయ్యూరు పరిసరాల్లో కరపత్రాలు వెలిశాయి. వారి ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి ఇస్తామని మావోయిస్టు నాయకుల ఫొటోలతో వెలిసిన కరపత్రాల్లో పేర్కొన్నారు. ఈస్ట్ డివిజన్ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న రామచంద్రారెడ్డి ప్రతాపరెడ్డి అలియాస్ చలపతి తలపై రూ.20 లక్షలు రివార్డు ప్రకటించారు. ఇటీవల మర్రిపాకలు ఎన్కౌంటర్లో మరణించిన ఆజాద్ అక్క రవి చైతన్య అలియాస్ అరుణ పేరిట రూ.5 లక్షలు రివార్డు ఉంది. వీరు కాకుండా గూడెంకొత్తవీధి మండలం మెట్టగూడకు చెందిన గెమ్మెలి జాంబ్రి తలపై రూ.4 లక్షలు రివార్డును, చింతపల్లి మండలం బలపం పంచాయతీ గిల్లెలబంద గ్రామానికి చెందిన కొర్రా నాగేశ్వరరావుపై రూ.లక్ష రివార్డు ప్రకటించారు. జీకేవీధి మండలం చేమగెడ్డకు చెందిన కరబాల లక్ష్మి అలియాస్ సరితపై రూ.4 లక్షలు, నల్గొండ జిల్లా పియ్యేపల్లి మండలం తిరుమల గ్రామానికి చెందిన కోడా అంజయ్య అలియాస్ నవీన్‌పై రూ.4 లక్షలు రివార్డు ప్రకటించారు. వారి ఫొటోలు, వారి వివరాలను కరపత్రాల్లో ప్రకటించారు. వారి ఆచూకీ తెలిపిన వారికి లేదా పట్టుకుని అప్పగించిన వారికి మావోయిస్టులకు ప్రకటించిన నగదు మొత్తం అందజేస్తామన్నారు. ఎవరికైనా వారి ఆచూకీ తెలిస్తే 9440796002 లేదా 9440796093 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. -
కొయ్యూరులో మందు పాతర్లు లభ్యం
కొయ్యూరు: విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలోని చెల్దిగడ్డ వద్ద మావోయిస్టులు అమర్చిన రెండు మందు పాతర్లలను పోలీసులు వెలికి తీశారు. కూంబింగ్‌లో భాగంగా సోమవారం బోదరాల అటవీ ప్రాంతంలో మందుపాతరలను గుర్తించారు. పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేసి ఉంటారని భావిస్తున్నారు. కొయ్యూరు, మంప సీఐ, ఎస్సై లతో పాటు స్పెషల్ పోలీసులను మావోయిస్టులు టార్గెట్ గా చేసుకున్నట్టు సమాచారం. -
విశాఖ జిల్లాలో ఎదురు కాల్పులు
విశాఖ : విశాఖ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కొయ్యూరు మండలం జీడీపాలెంలో దగ్గర అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కూంబింగ్ జరుపుతున్న సమయంలో మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దాంతో పోలీసులు ప్రతిగా ఎదురు కాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్య కొద్దిసేపు కాల్పులు హోరాహోరీగా జరిగినట్లు సమాచారం. కాగా ఎదురు కాల్పుల్లో దళ కమాండర్ కుడుముల రవి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టులు తప్పించుకున్నట్లు సమాచారంతో కూంబింగ్ దళాలు అప్రమత్తం అయ్యాయి. మరోవైపు మావోయిస్టు అగ్రనేత తప్పించుకున్నట్లు వచ్చిన వార్తలను పోలీసు అధికారులు మాత్రం ధ్రువీకరించలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కండక్టర్‌పై చేయి చేసుకున్న టీడీపీ నాయకుడు
కొయ్యూరు పోలీసులకు ఫిర్యాదు కేసు నమోదు {పతిగా కేడిపేట స్టేషన్లో ఫిర్యాదు కొయ్యూరు: విధుల్లో ఉన్న ఆర్టీసీ కం డక్టర్‌పై చేయిచేసుకున్నందుకు మం డల టీడీపీ అధ్యక్షుడు ఎస్కె బ షీర్‌ఖాన్‌పై కొయ్యూరు ఇన్చార్జీ ఎస్ఐ మధుసూధన్ మంగళవారం కేసు నమోదు చేశారు. విధులకు ఆ టం కం కలిగించడంతోపాటు తనపై చే యిచేసుకున్నారని బాధిత కండక్టర్ సీహెచ్ వెంకటేశ్వరరావు పోలీసుల కు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. టీడీపీ నేత ఎస్కె బషీర్‌ఖాన్ తమ్ముడి భార్య (మరదలు) సోమవారం రేవళ్ల బస్సులో కేడిపేట నుంచి కొయ్యూరు వచ్చా రు. బస్సు ఖాళీ లేకపోవడంతో ఆమెను వెనక్కు జరగాలని కండక్టర్ కోరారు. అయితే అక్కడ ఏమి జరిగిందో తెలియక పో యినా ఆమె రాజేంద్రపాలెంలో బ స్సు దిగి ఇంటికి వచ్చాక, కండక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించారని బం ధువులకు తెలి పారు. దీంతో కోప్రోది కుడైన ఖాన్ రేవళ్ల నుంచి తిరిగి వ స్తున్న బస్సును అతని షాపు వద్ద ఆపి కండక్టర్, డ్రైవర్‌ను కిందకు దించారు. అక్కడ తనపై చేయిచేసుకున్నారని కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశా రు. కండక్టర్ యూని యన్ నాయకులతో వచ్చి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా కండక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించారంటూ మ హిళ కేడిపేట పోలీసుస్టేష్‌న్‌లో ఫిర్యా దు చేశారని ఎస్ఐ తెలిపారు.