కొయ్యూరు (విశాఖపట్నం) : దసరా సెలవుల తరువాత గురువారం పాఠశాలల పునఃప్రారంభమైన రోజే బోధన చేస్తూ ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలోనే మరణించారు. దుచ్చరి మల్లయ్య(52) అనే ఉపాధ్యాయుడు విశాఖ జిల్లా కొయ్యూరు మండలం పనసలపాడు ప్రాథమిక పాఠశాలలో మూడేళ్లుగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
ఇదే మండలంలోని తన స్వగ్రామం రాజేంద్రపాలెం పంచాయతీ సూరేంద్రపాలెం నుంచి ఆయన గురువారం పిట్టాచలం వరకు బస్సులో వెళ్లారు. అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలోని పనసలపాడుకు నడిచి వెళ్లారు. తరగతి గదిలో విద్యార్థులకు బోధన చేస్తుండగానే అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. తోటి ఉపాధ్యాయులు వెంటనే రాజేంద్రపాలెం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.
పాఠం చెబుతూనే తనువు చాలించిన గురువు
Published Thu, Oct 13 2016 8:18 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
Advertisement
Advertisement