Class Room
-
తరగతి గదిలో మొబైల్ నిషిద్ధం.. పూజలు, నమాజ్‌కు పర్మిషన్ నో!
భిల్వారా: రాజస్థాన్‌లో కొనసాగుతున్న పాఠశాల విద్యావిధానంలో నూతన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. భిల్వారాలో జరుగుతున్న హరిత్ సంగం జాతర ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర విద్య పంచాయతీరాజ్ మంత్రి మదన్ దిలావర్ కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి ఏ ఉపాధ్యాయుడు కూడా తరగతి గదిలోనికి మొబైల్ ఫోన్ తీసుకెళ్లకూడదని, పాఠశాల సమయంలో ప్రార్థన లేదా నమాజ్ పేరుతో ఏ ఉపాధ్యాయుడు కూడా పాఠశాలను వదిలి వెళ్లకూడదని ఆయన ఆదేశించారు.రాష్ట్రంలో విద్యా రంగాభివృద్ధికి విద్యా శాఖ(Department of Education) జారీ చేసిన ఆదేశాలను అమలయ్యేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని మదన్ దిలావర్ పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలని, తరగతి గదిలో బోధించేటప్పుడు ఏ ఉపాధ్యాయుడు మొబైల్ ఫోన్ తీసుకెళ్లకూడదన్నారు. తరగతి గదిలో ఫోన్ మోగితే, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇబ్బందికరంగా మారుతుందన్నారు. ఫలితంగా చదువులకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.ఇదేవిధంగా పాఠశాల జరుగుతున్న సమయంలో మతపరమైన ప్రార్థనల పేరుతో ఏ ఉపాధ్యాయుడు పాఠశాల నుండి బయటకు వెళ్లకూడదని ఆదేశించారు. ఇటువంటి ఘటనలపై పలుమార్లు ఫిర్యాదులు(Complaints) వచ్చిన దరిమిలా విద్యాశాఖ ఇటువంటి నిర్ణయం తీసుకున్నదన్నారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు.. విద్యార్థులకు 20కి 20 మార్కులు ఇస్తున్నారని, అలా ఇవ్వడం సరైనది కాదన్నారు. బోర్డు పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.ఇది కూడా చదవండి: Delhi Election 2025: ఐదు వ్యాన్లతో ఆప్‌పై కాంగ్రెస్ ప్రచార దాడి -
టీచర్: రామూ.. ‘జై శ్రీరామ్’.. జానకీ.. ‘జై శ్రీ రామ్’..!
సాధారణంగా ఏదైనా పాఠశాలలో ఉపాధ్యాయులు హాజరు వేసేటప్పుడు విద్యార్థులు ‘ఎస్ మేడమ్’ అనో లేదా ‘ఎస్ సార్’ అనో అంటుంటారు. అయితే ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు హాజరువేసేటప్పుడు విద్యార్థులు ‘జై శ్రీరామ్’ అని అంటారు. అంటే ఉపాధ్యాయురాలు రామూ అనే పేరును పిలవగానే ఒక కుర్రాడు లేచి నిలుచుని ‘జై శ్రీరామ్’ అంటాడు. అలాగే జానకీ అని టీచర్ పిలవగానే ఒక విద్యార్థిని లేచి ‘జై శ్రీరామ్’ అని అంటుంది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియోలో హాజరు వేస్తున్న టీచర్ విద్యార్థుల పేర్లను పలికినప్పుడు వారు ‘జైశ్రీరాం’ అని అంటుంటారు. దీనికి టీచర్ ఏమీ అభ్యంతరం చెప్పకుండా విద్యార్థులకు హాజరు వేస్తుంటారు. దీనిని అదే క్లాసులోని ఎవరో విద్యార్థి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. విద్యార్థులు ‘జై శ్రీరామ్’ అంటుండగా ఉపాధ్యాయురాలు హాజరు వేయడాన్ని మనం వీడియోలో చూడవచ్చు. ఉపాధ్యాయురాలు క్లాస్‌లోని బ్లాక్‌బోర్డ్ దగ్గర నిలుచుని విద్యార్థుల పేర్లను ఒక్కొక్కటిగా పిలుస్తుండగా, చాలా మంది పిల్లలు జై శ్రీరామ్ అంటూ కూర్చోగా, మరికొందరు చేతులు జోడించి జై శ్రీరామ్ అని చెబుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో @aaravxelvish ఖతాలో షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ ఎనిమిది వేలకు పైగా వీక్షణలు దక్కాయి. కొన్ని వందల మంది ఈ వీడియోకు లైక్ చెప్పారు. ఈ నెల 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ నేపధ్యలో దేశంలో రాముని పేరిట పలు భక్తిపూర్వక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ఆ స్కూలులో హాజరు సమయంలో ‘జై శ్రీరామ్’ నినాదాన్ని పలుకున్నట్లు సమాచారం. ఇది కూడా చదవండి: రామాలయం బంగారు తలుపు ఇదే.. ఫొటో వైరల్! JAI SHREE RAM ONLY 🔱 School attendance Yes sir , mam ❌ #JaiShreeRam #Hindu #ElvishArmy #RamMandirAyodhya pic.twitter.com/DMocOspPIB — 𝐀𝐀𝐑𝐀𝐕𝕏𝐄𝐋𝐕𝐈𝐒𝐇 (@aaravxelvish) January 8, 2024 -
మేడ్చల్: బాలికను బడిలోనే ఉంచి తాళం వేసుకెళ్లిన సిబ్బంది
సాక్షి, మేడ్చల్: రోజూ బడికి వెళ్లే ఆరేళ్ల కూతురు స్కూల్ అయిపోయిన తరువాత సాయంత్రమైనా ఇంటికి రాకపోతే..ఆ తల్లిదండ్రులకు ఎంత నరకం.. ఎక్కడికెళ్లిందో.. ఏమో..ఎవరెత్తుకెళ్లారోనన్న ఆందోళన..! వెంటనే తెలిసిన వారందరినీ అడుగుతారు.. వారు తెలియదని సమాధానం చెబితే నరకం..!ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాదు.. ఎక్కడని వెతకాలి..పోలీసులకు ఫిర్యాదు చేయాలి.. ఈ టెన్షన్లో ఉన్న అమ్మానాన్నలకు వారి కూతురు పాఠశాలలోనే ఉందని తెలిస్తే వారి ఆనందం వర్ణనాతీతం.. అయితే ఆ బాలికను లోపలే ఉంచి తాళం వేసుకెళ్లారని చెబితే ఇంతకంటే దారుణం మరొకరటి ఉండదేమో. మరి.. ఇలాంటి సంఘటనే బాచుపల్లిలో చోటుచేసుకుంది. పాఠశాల సిబ్బంది బాలికను పాఠశాలలోనే ఉంచి గమనించకుండా తాళం వేసి నిర్లక్ష్యంగా వెళ్లిపోయారు. బాచుపలిలోని ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం, ప్రభావతి దంపతులకు వేదాంజలి(6) అనే కుమార్తె ఉంది. ఆ చిన్నారి స్థానికంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతోంది. ►రోజూ మాదిరిగానే గురువారం పాఠశాలకు వెళ్లిన చిన్నారి సాయంత్రం 4 గంటలకు స్కూల్ ముగిసిన తరువాత ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి చూడగా తాళం వేసి ఉండటంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. ►మరోమారు పాఠశాల వద్ద వెతుకుతుండగా తరగతి గది నుంచి చిన్నారి ఏడుపు వినిపించింది. దీంతో తమ కుమార్తె తరగతి గదిలో ఉందని గ్రహంచిన సుబ్రహ్మణ్యం, ప్రభావతిలు చుట్టు పక్కల వారి సహాయంతో పాఠశాల తరగతి గది తాళం పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా చిన్నారి రోదిస్తూ కనిపించింది. దీంతో తమ కుమార్తెను అక్కున చేర్చుకుని ఇంటికి తీసుకువెళ్లారు. ►పాఠశాల ఆయా తప్పిదం వల్లే తమ చిన్నారి తరగతి గదిలో ఉండి పోయిందని.. పాఠశాల ముగిసిన తరువాత తరగతి గదిలో చిన్నారులు బయటకు వెళ్లారో లేదో చూసుకోకుండా తాళం వేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: Tandur: ఓ పార్టీ నుంచి అడ్వాన్స్ తీసుకుని.. మరో పార్టీలోకి జంప్ -
విద్యార్థుల ఎదుటే టీచర్‌కు తలాక్ చెప్పిన భర్త
బారాబంకీ: తరగతి గదిలో పాఠాలు చెబుతున్న టీచర్‌కు ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో, సదరు ఉపాధ్యాయినితోపాటు విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీలో ఆగస్ట్ 24న ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె భర్తపై కేసు నమోదు చేశారు. బారాబంకీకి చెందిన బాధితురాలికి ఫిరోజాబాద్ జిల్లాకు చెందిన మహ్మద్ షకీల్‌తో 2020లో వివాహమైంది. కొంతకాలం తర్వాత షకీల్ సౌదీ అరేబియా వెళ్లిపోయాడు. అత్తింటి వారు కట్నం తేవాలంటూ వేధించి ఆమెను బలవంతంగా పుట్టింటికి పంపారు. పుట్టింట్లో ఉంటూ ఆమె ఓ ప్రైవేట్ స్కూలులో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 28న సౌదీ అరేబియా నుంచి సొంతూరుకు చేరుకున్న షకీల్.. జూలై 10న బాధితురాలి వద్దకు వచ్చాడు. తనతో రావాలని కోరాడు. వెంటనే రాలేనని చెప్పడంతో ఆరు రోజుల అనంతరం తిరిగి సొంతూరుకు వెళ్లిపోయాడు. ఆగస్ట్ 24న తరగతి గదిలో ఉండగా వచ్చి విద్యార్థుల ఎదుటే తనకు మూడు సార్లు తలాక్ చెప్పారని బాధితురాలు పోలీసులకిచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కొత్వాలీ సిటీ పోలీసులు షకీల్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. 2019లో కేంద్రం ట్రిపుల్ తలాక్ ఆచారం చట్ట విరుద్ధం, రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించిన విషయం తెలిసిందే. -
అడవి బిడ్డలకు అక్షర యజ్ఞం
సాక్షి, అమరావతి: పచ్చని తివాచీ కప్పుకున్నట్టు ఉండే ఎత్తయిన కొండలు.. దట్టమైన చెట్లు.. నడుమ పచ్చిక మైదానంలో కళ్లు చెదిరేలా రంగురంగుల భవంతులు. వాటిలోనే గిరిజన విద్యా కుసుమాలు వికసిస్తున్నాయి. అదే ఏజెన్సీ ప్రాంతంలోని మారేడుమిల్లి గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయం. అత్యంత బలహీన తెగల(పీవీటీజీ)కు చెందిన గిరిజన బాలల కోసం ఉద్దేశించిన ఈ గురుకులం మూడు నుంచి పదవ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం చదువులతో కార్పొరేట్ విద్యాలయాలను తలదన్నుతోంది. దీనిలో ఆధునిక హంగులతో కూడిన క్లాస్ రూమ్ నుంచి భోజనశాల, బాత్రూమ్, ఆర్వో ప్లాంట్, వసతి వరకు ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన నాడు–నేడు ద్వారా 2020లో ప్రభుత్వం సకల సౌకర్యాలు సమకూర్చింది. రాష్ట్రంలో గిరిజన విద్యపై సర్కారు ప్రత్యేక ఫోకస్ పెట్టిందనేందుకు ఇదే గొప్ప నిదర్శనం. ఇదే కాదు.. రాష్ట్రంలోని అడవి బిడ్డల కోసం ప్రభుత్వం పెద్దఎత్తున అక్షర యజ్ఞాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం రూ.వందల కోట్లు ఖర్చు చేస్తోంది. బుట్టాయగూడెం ఈఆర్ఎం స్కూలులోని తరగతి గదులు 2,506 గిరిజన సంక్షేమ విద్యాసంస్థలు రాష్ట్రంలో మొత్తం 2,506 గిరిజన సంక్షేమ విద్యాసంస్థలు పనిచేస్తున్నాయి. అందులో 1,958 గిరిజన పాఠశాలలు, 371 ఆశ్రమ పాఠశాలలు, 18 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు, 159 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు ఉన్నాయి. వాటిలో 1,55,599 మంది విద్యార్థులు చదువుతున్నారు. వాటి పరిధిలోని హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు ఆహారం, సౌందర్య సాధనాలు, ఇతర సౌకర్యాలతో పాటు ఉచిత వసతి తదితర వాటికి ఈ ఏడాది(2023–24) ప్రభుత్వం రూ.920.31 కోట్లు కేటాయించింది. నూరు శాతం గిరిజన జనాభా ఉన్న షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని విద్యాలయాల్లో మొత్తం సీట్లు అన్నీ వారికే కేటాయిస్తోంది. 70 శాతం లోపు గిరిజన జనాభా కలిగిన నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని విద్యాసంస్థల్లో ఎస్టీలకు 70 శాతం, ఎస్సీ, బీసీ, ఇతరులకు పది శాతం చొప్పున సీట్లు కేటాయిస్తున్నారు. భోజనాలు చేస్తున్న గిరిజన విద్యార్థులు ఎన్నో పథకాల ద్వారా జగనన్న విద్యా కానుక పథకం ద్వారా 1నుంచి 10వ తరగతి వరకు చదివే గిరిజన విద్యార్థులకు సైతం ప్రభుత్వం కిట్లు అందిస్తోంది. మూడు జతల యూనిఫామ్ క్లాత్, టెక్ట్స్‌బుక్స్, నోట్ బుక్స్ సెట్, ఒక జత షూ, రెండు జతల సాక్స్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, మూడు మాస్‌్కలు అందిస్తున్నారు. గత విద్యా సంవత్సరం(2022–23)లో ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 1,25,901 మంది గిరిజన విద్యార్థులు ప్రయోజనం పొందారు. స్వచ్ఛ కార్యక్రమం కింద కౌమార బాలికలకు రుతుస్రావ సమయంలో అత్యంత భద్రత, పరిశుభ్రతను నిర్థారించడానికి నాణ్యమైన(బ్రాండెడ్) శానిటరీ న్యాప్కిన్లు నెలకు 10 చొప్పున 17,060 మంది బాలికలకు అందజేస్తున్నారు. మరోవైపు గిరిజన పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పిల్లలకు నిజమైన అభ్యాస కేంద్రాలుగా తీర్చిదిద్దుతోంది. నాడు–నేడు మొదటి దశలో ప్రభుత్వం రూ.140 కోట్లుతో 352 పాఠశాలల్లో సమగ్ర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. మారేడుమిల్లి గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలోని మరుగుదొడ్లు ఉన్నత విద్యాలయాలకు శ్రీకారం రూ.153.853 కోట్లతో కురుపాంలో ఇంజనీరింగ్ కళాశాలకు 2020 అక్టోబర్ 2న సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. అకడమిక్ బ్లాక్, హాస్టల్ బ్లాకుల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి ప్రభుత్వం 561.88 ఎకరాలు కేటాయించింది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయం కొండకరకంలో ఏయూ పాత క్యాంపస్‌లో కొనసాగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో రూ.500 కోట్లతో గిరిజన వైద్య కళాశాల మంజూరైంది. వంద వైద్య విద్యా సీట్లు కేటాయించిన ఈ కళాశాల గిరిజనుల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వైద్య సేవలు అందించడంతోపాటు వైద్య పరిశోధనలకు, వైద్య వృత్తిని స్వీకరించేలా గిరిజన యువతను ప్రోత్సహించేందుకు దోహదం చేస్తుంది. ఐఐటీ, ఎన్ఐటీ ప్రవేశాల్లో గిరిజన బిడ్డల సత్తా గురుకులాల్లో చదివే గిరిజన బిడ్డలు ఐఐటీ, ఎన్ఐటీ, మెడిసిన్ సీట్లు సాధించేలా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. గిరిజన పాఠశాలల రూపురేఖలు మారాయి గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యావకాశాలను అందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రధానంగా నాడు–నేడు ద్వారా ప్రభుత్వం చేపడుతున్న పనులతో గిరిజన విద్యాలయాల రూపురేఖలు మారిపోతున్నాయి. గతంలో అరకొర వసతులు, ఎప్పుడు పడిపోతాయో తెలియనట్టు ఉండే భవనాల్లో చదువుకోవాలంటేనే గిరిజన పిల్లలకు ఆసక్తి ఉండేదికాదు. ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నే సౌకర్యాలను గిరిజన విద్యాలయాల్లో చూస్తే గిరిజనుల్లో ఆశ్చర్యంతో కూడిన ఆనందం కలుగుతుంది. – కంగాల వెంకటేశ్వరరావు, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు, ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, నూతిరామన్నపాలెం విద్యతోనే గిరిజనులకు గొప్ప పురోగతి విద్యతోనే పురోగతి అని నమ్మడమే కాకుండా అందుకు అనుగుణంగా గొప్ప సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో గిరిజనులకు కూడా విద్యావకాశాలు మెరుగుపరిచారు. గతంలో ఏజెన్సీ ప్రాంతంలో బడులను చూస్తేనే భయం వేసేది. ఇప్పుడు అన్ని సౌకర్యాలతో గిరిజన బిడ్డలకు విద్యను అందించేలా ప్రభుత్వం నిధులకు కూడా వెనుకాడక ఖర్చు చేస్తోంది. గిరిజన విద్యార్థులకు అవసరమైన విద్యతోపాటు వసతి, ఆహారం, సౌందర్య సాధనాలు(కాస్మోటిక్స్) తదితర అనేక సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది. – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి మాకు ఇంగ్లిష్ చదువులు అందించారు మా గిరిజన పిల్లలకు మామూలు చదువులు అందడమే కష్టంగా ఉండేది. బడుల్లో సౌకర్యాలు లేక, దూరభారమైన ప్రైవేటు కాన్వెంట్లకు వెళ్లి చదువులు కొనలేక మాలాంటి ఎంతో మంది గిరిజన పిల్లలు చదువుకు దూరమయ్యేవారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ మావయ్య..మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ బడులు, గురుకులాల్లో ఇంగ్లిష్ చదువులు అందించారు. మేము బాగా చదువుకోవాలని అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. –ఇన్నా కరుణ జెస్సీ ప్రియ,5వ తరగతి(ఇంగ్లిష్ మీడియం), మారేడుమిల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల -
షాకింగ్.. క్లాస్‌లో తోటి విద్యార్థులతో గొడవ.. రెండో తరగతి బాలుడు మృతి..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ఫిరోజాబాద్ జిల్లా కిషన్‌పుర్ గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థి తోటి విద్యార్థులతో గొడవపడి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. చనిపోయిన బాలుడి పేరు శివం(7). తరగతి గదిలో తోటి విద్యార్థులతో గొడవపడ్డాడు. దీంతో వారంతా ఒక్కసారిగా అతని ఛాతిపై దూకారు. ఫలితంగా అతనికి ఊపిరాడక స్పృహ కోల్పోయాడు. పాఠశాల సిబ్బంది హుటాహుటిన బాలుడ్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. జిల్లా అధికారులు పాఠశాల చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చాక ప్రిన్సిపల్‌తో పాటు ఇతర సిబ్బందిని ప్రశ్నించి చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: సీబీఐ అధికారులమని చెప్పి రైడ్.. రూ.30 లక్షలు దోచుకెళ్లిన గ్యాంగ్.. -
శ్రీకాకుళంలో మంచు లక్ష్మి సందడి.. చూసేందుకు ఎగబడిన జనం
శ్రీకాకుళం: తెలుగు రాష్ట్రాల్లో అన్ని పాఠశాలల్లో విద్యార్థులు ఇంగ్లిష్ నేర్చుకోవాలని సినీ నటి మంచు లక్ష్మి అన్నారు. ఆమె మంగళవారం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఆలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావులు గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అనంతరం మంచు లక్ష్మి మాట్లాడుతూ తన తండ్రి డాక్టర్ మోహన్‌బాబు అరసవల్లి క్షేత్రానికి వెళ్లాలని సూచించారని, అద్భుతంగా స్వామి దర్శనం జరిగిందన్నారు. ఇక తాము ‘టీచ్ ఫర్ ఛేంజ్’ అనే ఎన్జీవో తరఫున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 475 ప్రభు త్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాసులు నిర్వహిస్తున్నామని, తద్వారా విద్యార్థులకు ఇంగ్లిష్‌ను నాణ్యంగా బోధించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ క్రమంలో స్థానిక జిల్లాలో కొరసవాడ ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ క్లాసులను ప్రారంభించేందుకు తాను జిల్లాకు వచ్చినట్టు వివరించారు. అలాగే మరోవైపు నటనను కొనసాగిస్తున్నానని, త్వరలోనే ‘లేచింది మహిళా లోకం’ అనే పూర్తి మహిళల చిత్రం విడుదల కానుందని, అలాగే తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి కుటుంబకథా చిత్రాన్ని కూడా చేయనున్నానని ప్రకటించారు. స్మార్ట్ క్లాస్రూమ్ ప్రారంభం పాతపట్నం: కొరసవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.3 లక్షలతో డిజిటల్ తరగతిని (స్మార్ట్ క్లాస్‌రూం)ను సినీ నటి మంచు లక్ష్మి మంగళవారం ప్రారంభించారు. ఆమె ముందుగా ఓపెన్ టాప్ జీపులో కొరసవాడ చేరుకున్నారు. ఊరివారితో పాటు సమీప గ్రామస్తులు కూడా ఆమెను చూడడానికి పోటెత్తారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ ద్వారా శ్రీకాకుళం జిల్లాలోని 20 పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్‌రూంలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆమెతో పాటు జిల్లా డీఈఓ జి.పగడాలమ్మ, ఎంఈఓలు సీహెచ్ మణికుమార్, కె.రాంబాబు, ప్రధానోపాధ్యాయు డు సింహాచలం, సర్పంచ్ జక్కర ఉమా, ఎంపీటీసీ మడ్డు సుగుణ కుమారి, గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే హిరమండలం మండలంలోని సవరచొర్లంగి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్మార్ట్ క్లాస్‌రూంను కూడా ఆమె ప్రారంభించారు. -
షాకింగ్ ఘటన.. క్లాస్‌రూంలో బాలికపై ఇద్దరు బాలురు అత్యాచారం
ముంబై(మహారాష్ట్ర): తరగతి గదిలో ఒంటరిగా ఉన్న 8వ తరగతి బాలికపై ఇద్దరు సహ విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం ముంబైలోని మాతుంగ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. తోటి వారంతా డ్యాన్స్ క్లాస్ కోసం వేరే గదికి వెళ్లి విద్యార్థిని ఒక్కతే క్లాస్‌రూంలో ఉండటాన్ని అవకాశంగా తీసుకుని వానే అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గ్యాంగ్ రేప్, పోక్సో తదితర చట్టాల కింద కేసులను నమోదు చేశారు. బాలురను అదుపులోకి జువెనైల్ డిటెన్షన్ కేంద్రానికి తరలించారు. చదవండి: గొంతుకోసి.. వేడినూనెతో ముఖం కాల్చేసి.. -
క్లాస్‌రూమ్‌లో విద్యార్థులతో టీచర్ మాస్ డ్యాన్స్.. సోషల్ మీడియాలో సూపర్ ట్విస్ట్!
ఇటీవలి కాలంలో క్లాస్ రూమ్స్‌లో విద్యార్థులతో పాటు టీచర్లు డ్యాన్స్ చేయడం చాలా వీడియోల్లో చూశాము. తాజాగా ఓ మహిళా టీచర్ కూడా క్లాస్ రూమ్‌లో విద్యార్థులతో కలిసి స్టెప్పులు వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆ టీచర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను విధుల నుంచి తొలగించాలని కామెంట్స్ చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ఈ వీడియోలో భోజ్‌పురి సాంగ్ పత్లి కమరియ మోరికు ఏకంగా క్లాస్‌రూంలోనే టీచర్ డ్యాన్స్ చేస్తుండటం కనిపించింది. ఆపై టీచర్‌తో పాటు పిల్లలు కూడా కెమెరా వైపు చూస్తూ ఆనందంలో ఎంతో హ్యాపీగా డ్యాన్స్ చేస్తుంటారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన టీచర్ వారి ఎదుట సినిమా పాటకు ఆడిపాడటం ఏంటని కొందరు ప్రశ్నించారు. గురువులపై ఉన్న గౌరవాన్ని కోల్పోయేలా చేయవద్దని మరో యూజర్ హితవు పలికారు. స్టూడెంట్స్‌తో డ్యాన్స్ వీడియో రికార్డు చేయడం కరెక్ట్ కాదంటూ మరో నెటిజన్ ఫైరయ్యారు. టీచర్‌పై తక్షణమే వేటు వేయాలని కొందరు యూజర్లు డిమాండ్ చేశారు. बचपन में ऐसी Teacher हमें क्यों नहीं मिली 🥲❤️ pic.twitter.com/DCmx6USvD1 — ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) December 2, 2022 -
పాఠాలు బోధించే బడిలోనే ప్రాణాలు విడిచింది..
సాక్షి, హన్మకొండ: పాఠాలు బోధించే బడిలోనే ఓ ఉపాధ్యాయురాలు ప్రాణాలు విడిచింది. రోజూ మాదిరిగానే పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయురాలు అలసటగా ఉందని, ఒళ్లు చెమటలు పట్టేస్తున్నాయని, చేతులు లాగుతున్నాయంటూ రెస్ట్ రూంలోకి వెళ్లింది. అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం ఏమైందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగానే విగతజీవిగా మారిపోయింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందిందని తెలపడటంతో పాఠశాల శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషాద ఘటన మంగళవారం హనుమకొండలోని యాదవనగర్‌లోని సిద్దార్థ హైస్కూల్లో చోటుచేసుకుంది. పాఠశాల ప్రిన్సిపాల్ సంపత్ ఇల్లందుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ బ్రాహ్మణవాడకు చెందిన చెరుకుపెల్లి ఉషశ్రీ (45) సుమారు 12 సంవత్సరాలుగా సిద్దార్థ హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. రెండు రోజులుగా ఆరోగ్యం సహకరించడం లేదంటూనే మంగళవారం విధులకు హాజరైంది. మధ్యాహ్నం 1గంట సమయంలో ఒళ్లు అలసటగా ఉందని, చేతులు లాగుతున్నాయంటూ తరగతిలో నుంచి బయటకు వచ్చింది. అంతలోనే సహచర సిబ్బంది ఏమైందని తెలుసుకునేలోగా స్పృహ కోల్పోయింది. హుటాహుటిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇప్పటి వరకు పాఠాలు బోధించిన టీచర్ ఇకలేరని తెలుసుకున్న విద్యార్థులు రోదనలు మిన్నంటాయి. చదవండి: (Engineering: ఫీజులను పెంచేసిన పలు కాలేజీలు) -
అయ్యో బిడ్డా! ఏమైందిరా?
రణస్థలం (శ్రీకాకుళం): పదమూడేళ్ల కుర్రవాడు. అప్పటివరకు ఉత్సాహంగా ఉన్నవాడు. ఏమైందో ఏమో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. క్షణాల వ్యవధిలో ప్రా ణాలు వదిలేసి తల్లిదండ్రులకు శోకం మిగిల్చాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రంలోని జేఆర్ పురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో బౌరోతు సంతోష్(13) ఏడో తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో బెంచీపై కూర్చుని ఉన్న సంతోష్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థులు టీచర్‌కు చెప్పగా ఆయన స్కూల్ యాజమాన్యానికి సమాచారం అందించారు. వెంటనే స్కూల్ వ్యాన్లోనే మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యులు అతడు చనిపోయినట్లు నిర్ధారించారు. నిమిషాల వ్యవధిలో ఇంత విషాదం చోటుచేసుకోవడంతో ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. దీనిపై బాలుడి తల్లి మణికి సమాచారం అందించగా.. ఆమె ఆస్పత్రికి వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. వీరు జేఆర్‌పురంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నారు. బాలుడి తండ్రి జయరావు అరబిందో పరిశ్రమలో టెక్నికల్ కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఆయనకు కూడా విషయం చెప్పడంతో ఆస్పత్రికి వచ్చి గుండెలవిసేలా రోదించారు. వీరి స్వగ్రామం విజయనగరం జిల్లాలోని తెర్లాం మండలంలోని గొడుగువలస. మృతదేహాన్ని అక్కడకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. జేఆర్ పురం ఎస్ఐ జి.రాజేష్ ఆస్పత్రికి వచ్చి ఆరా తీశారు. అనంతరం ప్రైవేటు స్కూల్‌కు వెళ్లి యాజమాన్యంతో మాట్లాడారు. (చదవండి: భార్య ప్రవర్తనపై అనుమానం.. భర్త ఎంతపని చేశాడంటే?) -
చిన్నారి జుట్టు పట్టుకుని చితకబాదిన టీచర్.. దెబ్బలు తట్టుకోలేక..
పిల్లల విద్యా విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడంతా టెక్నాలజీ చదువులు వచ్చేశాయి. దానికి తోడు కరోనా కారణంగా విద్యార్థులు.. బడులకు నెలల పాటు బడులకు దూరమయ్యారు. కొత్తగా స్కూల్స్ ప్రారంభం కావడంతో విద్యార్థులు చదువులో బాగా వెనకబడ్డారు. దండిస్తే.. పిల్లలు క్రమశిక్షణ తప్పరు, సరిగా చదువుతారనేది ఒకప్పడు ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. అయితే పిల్లల్ని దండించడంలో ఓ టీచర్ దారుణంగా వ్యవహరించింది. ఆమెకు కూడా ఓ తల్లేనన్న విషయం మరచి.. పాపం పసిపాపను చితకబాదింది. ఐదేళ్ల చిన్నారి పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉన్నావ్ జిల్లా అసోహా మండలం ఇస్లామ్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో శిక్షా మిత్ర లేదా పారా టీచర్.. ఓ చిన్నారిని దారుణంగా కొట్టింది. క్లాస్ రూమ్ శబ్ధం చేసిందని, హోం వర్క్ చేయలేదన్న కారణంతో 30 సెకన్లలో 10 చెంప దెబ్బలు కొట్టింది. చిన్నారి జుట్టు పట్టుకుని ఎడా పెడా చెంపలు వాయించింది. ఈ క్రమంలో చిన్నారి బోరున ఏడుస్తున్నా.. ఆమె అదేదీ పట్టించుకోలేదు. ఈ ఘటన ఈనెల 9వ తేదీన చోటుచేసుకోగా.. అదే రోజు సాయంత్రం బాలిక తల్లిదండ్రులు చిన్నారి ముఖంపై దెబ్బలు గుర్తించి.. వెంటనే బడికి వచ్చారు. అనంతరం టీచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసి మరోసారి ఇలా జరిగితే బాగుండని హెచ్చరించారు. ఈ క్రమంలోనే మళ్లీ ఇలాంటి పని చేయనని ఆమెతో లేఖ రాయించారు. అయితే.. ఓ వ్యక్తి ఈ దారుణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ కాగా.. విద్యాశాఖ అధికారులు స్పందించారు. టీచర్‌ను ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడ్ని సస్పెండ్ చేశారు. Accused #teacher (Shiksha Mitra) Sunil Kumari suspended for brutally assaulting a minor girl in govt primary school of Unnao (Islamnagar of Asoha block).#UttarPradesh #Student pic.twitter.com/ptemz5KSkN — Arvind Chauhan अरविंद चौहान (@ArvindcTOI) July 12, 2022 -
క్లాస్‌లో అందరి ముందే లవర్‌ను ముద్దుపెట్టుకున్నాడు.. తరువాత ఏం జరిగిందంటే..
కాలేజీలో ఇద్దరు లవర్స్ రొమాన్స్ చేసుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నలుగురి మధ్య ఉన్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. క్లాస్‌లో ప్రొఫెసర్ ముందే ఏకంగా ముద్దులు పెట్టుకున్నారు. ఈ వీడియోను ఓ ఇన్స్టాగ్రామ్ పేజ్ పోస్టు చేయగా దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. అయితే అందరూ ఎందుకు అంతగా నవ్వుకుంటున్నారో తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడాల్సిందే. అప్పడే ఇందులోని ట్విస్ట్ ఎంటో తెలుస్తుంది. క్లాస్ రూమ్‌లో ప్రొఫెసర్ ఉండగా వెనకాల కూర్చున్న ఓ వ్యక్తి తన పక్కనే ఉన్న యువతితో రొమాన్స్ చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. యువతి భుజంపై చేయి వేసి ఆమె జుట్టును అలా ప్రేమగా కదిలిస్తూ తన చెంపను ముద్దాడుతాడు. దీనిని వెనకాల నుంచి ఓ వ్యక్తి రికార్డ్ చేశాడు. అయితే రికార్డ్ చేస్తున్న వ్యక్తి ఒక్కసారిగా కెమెరాను వెనకాల నుంచి ముందుకు తీసుకొచ్చి వాళ్ల ముఖాన్ని చూపిస్తాడు. దీంతో అసలు ‘గర్ల్‌ఫ్రెండ్’ ఎవరో చూడటమే ఈ వీడియోలోని ట్విస్ట్. View this post on Instagram A post shared by Bhutni_ke (@bhutni_ke_memes) పొడవాటి జుట్టుతో వెనక కూర్చున్న వ్యక్తి అచ్చం అమ్మాయిలాగా కనిపించినప్పటికీ అక్కడుంది అబ్బాయి. ఆ ‘ప్రియుడు’ కేవలం తన స్నేహితుడి జుట్టుతో చిలిపిగా అలా చేశాడు. చివరికి ముగ్గురు స్నేహితులు దగ్గరగా కూర్చుని నవ్వుతూ కనిపించారు. అయితే రొమాన్స్‌గా భావించిన నెటిజన్లు.. చివరికి అది 'బ్రొమాన్స్' అని తేలడంతో పడి పడి నవ్వుకున్నారు. మీరూ ఈ వీడియో చూసి నవ్వకుండా ఉండలేరు చూడండి.. చదవండి: గుడ్ క్యాచ్! ఆకాశం నుంచి పడిపోతున్న రాకెట్‌ని పట్టుకున్న హెలికాప్టర్! -
బడికి పోలేని చిన్నారి కోసం ‘అవతార్’.. వహ్ అద్భుతం
ఇప్పుడు చెప్పుకోబోయేది అవతార్ సినిమా గురించి కాదు. అంతకు మించిన అద్భుతం గురించే!. కళ్ల ఎదురుగా మనిషి లేకున్నా.. ఉన్నట్లుగా భావించడం, పక్కనే ఉన్నట్లు ఫీలవ్వడం, మాట్లాడడం, చర్చించడం.. ఇవన్నీ కుదిరే పనేనా?. టెక్నాలజీ ఎరాలో అందునా అవతార్ లాంటి రోబోలతో అది సాధ్యమవుతోంది. బెర్లిన్(జర్మనీ) మార్జహ్న్-హెలెర్స్డోర్ఫ్లో జోషువా మార్టినన్గెలి అనే చిన్నారి ఉన్నాడు. అతనికి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి ఉంది. ఈ కారణంగా అతని మెడ నుంచి ఓ పైప్ సాయంతో చికిత్స అందిస్తున్నారు పేరెంట్స్. అలాంటప్పుడు స్కూల్‌కి వెళ్లడం వీలుపడదు కదా!. అందుకే జోషువా బదులు.. ఒక అవతార్ రోబోని అతని సీట్లో కూర్చోబెట్టారు. ఏడేళ్ల Joshua Martinangeli బదులు ఈ అవతార్ రోబో పాఠాలు వింటుంది. తోటి విద్యార్థులతో మాట్లాడుతుంది. సరదాగా బదులు ఇస్తుంది. టీచర్ చెప్పే పాఠాలు వింటుంది. అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో పాటు అనుమానాలను నివృత్తి చేసుకుంటుంది కూడా. ఇదేలా సాధ్యం అంటే.. ఇంట్లో స్పెషల్ మానిటర్ ముందు కూర్చుని జోషిని.. అవతార్ రోబోకి ఉన్న మానిటర్‌కు కనెక్ట్ చేస్తారు కాబట్టి. అంతే అవతల ఇంట్లో జోషువా ఏం చేప్తే.. అవతార్ అదే బదులు ఇస్తుంది. దీంతో అచ్చం జోషువా పక్కనే ఉన్నట్లు ఫీలైపోతున్నారు కొందరు స్టూడెంట్స్. జోషువా కుటుంబ ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని.. డిస్ట్రిక్ట్ కౌన్సిల్ వాళ్లు ఈ ఆవిష్కరణను ఆ కుటుంబానికి ఉచితంగా అందించారు. కరోనా టైంలో మొత్తం నాలుగు అవతార్ రోబోలను తయారు చేయగా.. ఇప్పుడు స్కూల్‌కి వెళ్లలేని ఆ చిన్నారి కోసం ఒక రోబోను వాడడం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. -
హిజాబ్ ధరించారని క్లాస్‌లోకి రానివ్వలేదు
మంగళూరు (కర్ణాటక): హిజాబ్(తలపై ధరించే వస్త్రం)ను ధరించారనే కారణంగా కర్ణాటకలోని ఒక ప్రభుత్వ ప్రీ–యూనివర్సిటీ కాలేజీలో ఆరుగురు ముస్లిం విద్యార్థినులను తరగతి గదిలోకి అనుమతించ లేదు. ఈ ఘటన ఉడుపిలోని గవర్నమెంట్ ఉమన్స్ పీయూ కాలేజీలో జరిగింది. తమను ఉర్దూ, అరబిక్ భాషల్లో మాట్లాడేందుకు కాలేజీ ప్రిన్సిపాల్ అనుమతించట్లేదని, క్లాస్‌లోకి రానివ్వలేదని ఆరోపించారు. కాలేజీ ప్రాంగణంలో హిజాబ్‌ను అనుమతిస్తామని, క్లాస్‌రూమ్‌లో కుదరదని ప్రిన్సిపల్ రుద్ర గౌడ స్పష్టం చేశారు. -
వామ్మో.. తరగతి గదిలో ప్రవేశించిన చిరుత..
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘడ్‌లో చిరుతపులి సంచారం కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ఒక తరగతి గదిలో చిరుతపులి ప్రవేశించింది. ఈ క్రమంలో ఉదయాన్నే కళాశాలకు వెళ్లిన విద్యార్థిపై దాడిచేసింది. అతను భయంతో కేకలు వేస్తూ.. బయటకు పరుగులు తీశాడు. దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అలీఘడ్‌లోని చౌదరి నిహాల్ సింగ్ అనే పాఠశాలలో చిరుతపులి ప్రవేశించింది. తరగతి గదిలో బెంచీల చాటున దాక్కుంది. గదిలోకి ప్రవేశించిన..లక్కీరాజ్ సింగ్ అనే బాలుడిపై వెనక నుంచి దాడిచేసి.. గాయపర్చింది. వెంటనే పులి వేరే చోటుకి పారిపోయింది. అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది.. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆ తర్వాత.. బాలుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు క్షేమంగా ఉన్నాడని పాఠశాల ప్రిన్సిపాల్ యోగేశ్ యాదవ్ తెలిపారు. ప్రస్తుతం చిరుత ఒక తరగతి గదిలో దాక్కుందని పాఠశాల సిబ్బంది అటవీ అధికారులకు తెలిపారు. చిరుత పులి కదలికలు పాఠశాలలోని సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఈక్రమంలో.. అటవీ సిబ్బంది చిరుత పులిని బంధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటన గ్రామంలో తెలియడంతో పెద్ద ఎత్తును ప్రజలు పాఠశాల వద్దకు చేరుకున్నారు. -
విద్యార్థిపై టీచర్ కర్కశం.. ఉమ్ము కింద పడిందని...
సాక్షి,శంకర్పల్లి: తరగతిగదిలోకి వచ్చేందుకు అనుమతి అడుగుతుంటే నోట్లో నుంచి ఉమ్ము కింద పడిందని ఆగ్రహించిన ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థిపై కర్కశం ప్రద ర్శించారు. విచక్షణారహితంగా చితకబాదారు. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫత్తేపూర్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సాయిలు, లత దంపతుల కుమారుడు సంజీవ్‌కుమార్ (8) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. చదవండి: అమ్మా.. నేను చనిపోతున్నా’ కూతురు ఫోన్.. అంతలోనే.. తరగతి గదిలోకి వచ్చేందుకు ఉపాధ్యాయురాలు శ్వేతను అనుమతి అడుగుతున్న క్రమంలో అతని నోట్లో నుంచి ఉమ్ము కింద పడింది. దీంతో ఆగ్రహించిన ఆమె కర్రతో చితకబాదారు. చేతులు, కాళ్లు, ముఖంపై కొట్టడంతో చర్మం కమిలిపోయింది. సాయంత్రం ఇంటికి వచి్చన బాలుడి ఒంటిపై ఉన్న దెబ్బలు చూసి చలించిపోయిన తల్లిదండ్రులు సదరు ఉపాధ్యాయురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై టీచర్‌ను నిలదీయగా.. మీ అబ్బాయికి క్రమశిక్షణ లేదు అందుకే కొట్టానని బదులిచ్చారు. కేసు దర్యాప్తులో ఉంది. చదవండి: ఇద్దరూ ఇష్టపడ్డారు.. ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారని.. సస్పెన్షన్ వేటు విద్యార్థి సంజీవ్‌కుమార్‌ను చితకబాదిన ఉపాధ్యాయురాలిని జిల్లా విద్యాధికారి సస్పెండ్ చేసినట్లు మండల విద్యాధికారి అక్బర్ తెలిపారు. విద్యార్థి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపామని తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్వేతపై డీఈవో సుశీందర్‌రావు గురువారం వేటు వేశారు. -
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య:మహబూబ్‌నగర్
-
నవ్వినందుకు చితకబాదాడు
పంజగుట్ట: క్లాస్ రూంలో నవ్వినందుకు ఉపాధ్యాయుడు ఓ విద్యార్థిని చితక బాదాడు. సదరు విద్యార్థి కుటుంబ సభ్యులతో కలిసి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎమ్ఎస్ మక్తాకు చెందిన మహ్మద్ అబ్దుల్ అజీజ్ కుమారుడు అబ్దుల్ రహమాన్ (11) స్థానిక ఇక్రా హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. బుధవారం స్కూల్లో జీషన్ అనే ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని కొట్టాడు. దీనిని చూసిన అబ్దుల్ రహమాన్ నవ్వడంతో ఆగ్రహానికి లోనైన జీషన్ అతడిని తీవ్రంగా కొట్టాడు. బాధితుడు ఈ విషయాన్ని కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా సదరు టీచర్ స్టేషన్‌కు వచ్చి విద్యార్థి కుటుంబ సభ్యులతో రాజీ కుదుర్చుకున్నట్లు సమాచారం. పోలీసులు ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టారు. -
క్లాసులోనూ మాస్క్
ఢిల్లీ, చుట్టు పక్కల ప్రాంతాలన్నీ వాయు కాలుష్యంతో నిండిపోయాయనడానికి చక్కని ఉదాహరణ ఈ చిత్రం. శనివారం గుర్గావ్లోని ఓ పాఠశాలలో క్లాస్ సమయంలో విద్యార్థులు, టీచర్ అందరూ మాస్క్‌లు ధరించారు. -
క్లాస్ రూమ్‌లో ఊడిపడిన సిమెంట్ పెచ్చులు
ముంబై : మహారాష్ట్రలోని ఓ పాఠశాలలో పై కప్పు పెచ్చులు ఊడిపడి ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఉల్హాస్‌నగర్‌లోని జులేలాల్ పాఠశాలలోని పదో తరగతి గదిలో విద్యార్థులు పాఠాలు వింటున్న సమయంలో ఒక్కసారిగా పైకప్పు కూలి వారిపై పడింది. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో గాయపడ్డవారిని జియా(16), ఇషిక(14), దియా(15)గా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని వారు ఆరోపించారు. కాగా, స్కూల్ యాజమాన్యం ఇది కేవలం చిన్న ఘటనేనని.. విద్యార్థులకు చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయని తెలిపింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఆ తరగతి గదిలోని సీసీటీవీలో రికార్డు అయ్యాయి. #WATCH: Three students were injured after a portion of cement plaster collapsed on them while they were attending class in Ulhasnagar's Jhulelal School, Maharashtra yesterday. pic.twitter.com/luXzWD4TAI — ANI (@ANI) June 19, 2019 -
ఏసీ కోసం క్లాస్‌లోకి వచ్చిన పాము..!!
బీజింగ్, చైనా : ఎండల తీవ్రతకు తట్టుకోలేని ఓ పాము క్లాస్ రూంలోకి వచ్చిన సంఘటన నైరుతి చైనాలో చోటు చేసుకుంది. హఠాత్తుగా పాము తరగతి గదిలోకి రావడం గమనించిన విద్యార్థులు హడలిపోయారు. పెద్ద పెట్టున కేకలు పెడుతూ గదిలో నుంచి బయటకు పరుగులు తీశారు. విద్యార్థులు అటూఇటూ పరుగెత్తడంతో గందరగోళం నెలకొంది. ఈ లోగా క్లాస్ టీచర్ పామును ఒంటిచేత్తో పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఎండలకు తట్టుకోలేక చల్లదనం కోసం ఏసీ క్లాస్ రూంలోకి పాము వచ్చివుంటుందని టీచర్ అన్నారు. పాము 3.3 అడుగుల పొడవు ఉంటుందని చెప్పారు. అయితే, అది విషపూరితమైనది కాదని స్పష్టం చేశారు. -
వైరల్ : మార్కులు తక్కువ వేశాడని...
సాక్షి : పాఠాలు చెప్పే మాష్టార్లు విద్యార్థులను దండించటం మాట ఎటున్నా.. ఆ శిక్షల తీవ్రత.. అమలు చేసే విధానాలు పిల్లలపై బాగా ప్రభావం చూపుతున్నాయి. ఇష్టం వచ్చినట్లు కొట్టడం లేదా అందరి ముందు అవమానించటం లాంటివి.. ఒక్కోసారి వారి ప్రాణాలు పోవటానికి కూడా కారణమౌతున్నాయి. అయితే హర్యానాలో జరిగిన ఘటన మాత్రం వేరేలా ఉంది. ఓ స్టూడెంట్ ఏకంగా క్లాస్ రూంలోనే టీచర్‌ను చంపేందుకు యత్నించాడు. ఝజ్జర్ జిల్లా నజఫ్గడ్ రోడ్లో ఉన్న హర్దయాల్ పబ్లిక్ స్కూల్ లో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. క్లాస్ రూంలో పేపర్లు దిద్దుకుంటున్న టీచర్‌పై 12వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థి ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. తన బ్యాగులో అప్పటిదాకా దాచుకున్న ఆయుధంతో ఒక్కసారిగా దాడి చేశాడు. ఊహించని ఆ పరిణామానికి బిత్తరపోయిన ఆ టీచర్ ప్రతిఘటించలేక బయటకు పరిగెత్తాడు. అయినా వదలని ఆ విద్యార్థి వెంటపడి గాయపరచసాగాడు. ఇంతలో మరో టీచర్ వచ్చి బెదిరించటంతో కాస్త వెనక్కి తగ్గిన ఆ విద్యార్థిని ఇతర విద్యార్థుల సాయంతో కట్టడి చేయగలిగారు. పరీక్షలో తక్కువ మార్కులు వేయటంతోపాటు.. అందరి ముందు తిట్టాడన్న కోపంతోనే ఈ స్టూడెంట్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. దీనికిగానూ మరో విద్యార్థి కూడా సహకరించటంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. తలపై తీవ్ర గాయాలు కావటంతో టీచర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన స్కూల్ యాజమాన్యం శనివారం పేరెంట్స్ మీటింగ్ ను ఏర్పాటు చేసింది. -
ఇంటర్ విధ్యార్ధి ఆత్మహత్య
-
క్లాస్‌లో విద్యార్థిపై కాల్పులు..
సాక్షి, హర్యానా: గన్ కల్చర్‌కు మనదేశంలోని విద్యార్థులు కూడా ఆకర్షితులు అవుతున్నారు. హరియాణాలోని సోనిపట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (ఐటీఐ)లో శనివారం ఇటువంటి ఘటనే జరిగింది. సోనిపట్‌లో ఐటిఐలో 17 ఏళ్ల ఒక విద్యార్థి తుపాకితో క్లాస్‌కు హాజరయ్యాడు. ప్రాక్టికల్స్ జరుగుతున్న సమయంలో ఆ విద్యార్థి తుపాకి తీసి.. మరో విద్యార్థిని దగ్గర నుంచి కాల్చాడు. అయితే బాధితుడికి బుల్లెట్ శరీరానికి దగ్గరగా దూసుకువెళ్లడంతో గాయపడ్డాడు. ప్రస్తుతం గాయపడ్డ విద్యార్థి రోహత్క్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌లో.. బాధితుడు ..సహ విద్యార్థులతో మాట్లాడుతున్న సమయంలో.. వెనకవైపు నుంచి వచ్చిన విద్యార్థి తుపాకీ తీసి.. కాల్చిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. కాగా ఆ విద్యార్థి ఎందుకు కాల్పులు జరిపాడన్నది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.