
మంగళూరు (కర్ణాటక): హిజాబ్(తలపై ధరించే వస్త్రం)ను ధరించారనే కారణంగా కర్ణాటకలోని ఒక ప్రభుత్వ ప్రీ–యూనివర్సిటీ కాలేజీలో ఆరుగురు ముస్లిం విద్యార్థినులను తరగతి గదిలోకి అనుమతించ లేదు. ఈ ఘటన ఉడుపిలోని గవర్నమెంట్ ఉమన్స్ పీయూ కాలేజీలో జరిగింది. తమను ఉర్దూ, అరబిక్ భాషల్లో మాట్లాడేందుకు కాలేజీ ప్రిన్సిపాల్ అనుమతించట్లేదని, క్లాస్‌లోకి రానివ్వలేదని ఆరోపించారు. కాలేజీ ప్రాంగణంలో హిజాబ్‌ను అనుమతిస్తామని, క్లాస్‌రూమ్‌లో కుదరదని ప్రిన్సిపల్ రుద్ర గౌడ స్పష్టం చేశారు.