ఎంత పొగరు.. మహిళా టీచర్ పై ప్రతాపమా! | boy punished by classmates due to that boy hits teacher | Sakshi
Sakshi News home page

ఎంత పొగరు.. మహిళా టీచర్ పై ప్రతాపమా!

Published Thu, Oct 27 2016 5:22 PM | Last Updated on Fri, Jul 12 2019 3:29 PM

ఎంత పొగరు.. మహిళా టీచర్ పై ప్రతాపమా! - Sakshi

ఎంత పొగరు.. మహిళా టీచర్ పై ప్రతాపమా!

క్లాసు రూమ్ లో విద్యార్థులు ఏదో సమయంలో గొడవ పడటం తరచుగా చూస్తూనే ఉంటాం. క్లాసు రూమ్ లో టీచర్ పై ఓ విద్యార్థి చెయ్యి చేసుకోవడంతో తరగతి గది రణరంగంలా మారిపోయింది. ఇందుకు సంబంధించిన ఆ ఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోను గమనించినట్లయితే.. మనకు మొదట ఇద్దరు విద్యార్థులు గొడవ పడుతుంటారు. ఆ విద్యార్థులను వారించేందుకు వారి క్లాస్ టీచర్ యత్నిస్తారు.

రెడ్ డ్రెస్ లో ఉన్న విద్యార్థి తీవ్ర ఆవేశంలో టీచర్ పై కూడా దాడిచేసి, ఆమె ముఖంపై పంచ్ విసురుతాడు. ఆ వెంటనే టీచర్ కాస్త పక్కకు వెళ్లిపోతారు. టీచర్ కొట్టిన ఆ స్టూడెంట్(రెడ్ టీషర్ట్)ను తరగతి గదిలోనే ఉన్న మరికొందరు విద్యార్థులు టార్గెట్ చేసి చితకబాదుతారు. నీకు ఎంత పొగరు ఉంటే మేడమ్ ను కొడతావ్ అంటూ ఓ స్టూడెంట్ గట్టిగా పంచ్ ఇవ్వడంతో రెడ్ టీషర్ట్ వేసుకున్న స్టూడెంట్ ఒక్కసారిగా కిందపడిపోతాడు. ఆ తర్వాత క్లాసు రూమ్ నుంచి బయటకు గెంటేశారు. ఇది ఎక్కడ, ఏ స్కూళ్లో జరిగిందన్న దానిపై స్పష్టతలేకున్నా.. అమెరికాలో అయి ఉంటుందని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసినవారు రెడ్ టీషర్ట్ స్డూడెంట్ చర్యపై మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement