female teacher
-
చెంప ఛెళ్లుమనిపించిన మహిళా హెచ్ఎం.. అసలు ఏం జరిగిందంటే?
రాజంపేట టౌన్ (అన్నమయ్య జిల్లా): రాజంపేట బాలికోన్నత పాఠశాల హెచ్ఎం లక్ష్మీదేవి ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దాసరి అశోక్ చెంప ఛెళ్లుమనిపించారు. పాఠశాలల విలీనానికి సంబంధించిన జీవో నెంబర్ 117 రద్దు చేయాలన్న డిమాండ్‌తో ఏబీవీపీ నాయకులు మంగళవారం విద్యాసంస్థల బంద్ చేపట్టారు. అశోక్ ఏబీవీపీ నాయకులను వెంటపెట్టుకొని ఉదయం 11 గంటలకు జెడ్పీ బాలికోన్నత పాఠశాలకు వెళ్లి.. విద్యార్థులను ఇళ్లకు పంపించేయాలని హెచ్ఎం లక్ష్మీదేవిని కోరారు. చదవండి: మహిళతో వివాహేతర సంబంధం.. కొన్నాళ్లు గడిచాక.. విద్యార్థులకు భోజనం పెట్టిన తర్వాత మధ్యాహ్నం నుంచి సెలవు ఇస్తానని హెచ్ఎం ఏబీవీపీ నాయకులకు తెలిపారు. అందుకు అశోక్ ససేమిరా అన్నాడు. విద్యార్థులను ఇళ్లకు పంపితే వండిన భోజనం, కోడి గుడ్లు వృథా అవుతాయని, చాలా మంది విద్యార్థినుల తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లి ఉంటారని, పిల్లలు ఇప్పుడు ఇళ్లకు వెళితే మధ్యాహ్నం భోజనంలేక పస్తులుండాల్సి వస్తుందని హెచ్ఎం వివరంగా తెలియజేశారు. అయినప్పటికీ వినిపించుకోని అశోక్ ‘మీకు మెంటలా? చెబుతుంటే అర్థం కావటం లేదా?’ అని పరుష పదజాలంతో గద్దిస్తూ, దురుసుగా ప్రవర్తించటంతో హెచ్ఎం లక్ష్మీదేవి అతని చెంప ఛెళ్లుమనిపించారు. -
ఇద్దరి ప్రాణం తీసిన టీచర్ల బదిలీ.. ఒకరు గుండెపోటుతో, మరొకరు ఉరేసుకుని
మరిపెడ రూరల్/ మోర్తాడ్(బాల్కొండ): జీవో 317 నేపథ్యంలో బదిలీకిగురైన ఇద్దరు మహిళా టీచర్లు తీవ్ర మనస్తాపంతో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఒకరు గుండెపోటు వల్ల మరణిస్తే, మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆదివారం ఒకే రోజు జరిగిన ఈ సంఘటనలు ఉపాధ్యాయవర్గాల్లో ఆందోళన రేకెత్తించాయి. వివరాలిలా ఉన్నాయి.. ములుగు జిల్లా వెంకటాపురం మండలం నల్లకుంట గ్రామానికి చెందిన పుల్యాల శ్రీమతి (మాధవి)(40) మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పూసలతండా ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా ఉద్యోగం చేస్తున్నారు. హన్మకొండలో నివాసముంటూ విధులకు హాజరవుతున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఆమెను ములుగు జిల్లా ఏటురునాగారం మండలం రొయ్యూరు యూపీఎస్ పాఠశాలకు కేటాయించారు. అయితే బదిలీపై వెళ్లడం ఇష్టంలేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన ఆమెకు ఆదివారం హన్మకొండలోని ఇంటి వద్ద గుండెనొప్పిరావడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలున్నారు. వేరే జోన్‌కు బదిలీ చేశారని.. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం పల్లికొండకు చెందిన సరస్వతి (32)కి అదే మండలం బాబాపూర్‌కు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. భర్త గల్ఫ్‌కు వెళ్లగా, సరస్వతి బాబాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)గా పని చేస్తున్నారు. ఉద్యోగుల బదిలీల్లో భాగంగా సరస్వతి రాజన్న సిరిసిల్ల జోన్ పరిధిలోకి బదిలీ అయ్యారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మర్లకుంట తండా పాఠశాలకు ఆమెను ట్రాన్స్ఫర్ చేశారు. అయితే సొంత జిల్లా నుంచి పక్క జిల్లాకు బదిలీ కావడంతో సరస్వతి తీవ్ర మానసిక ఒత్తిడి గురైనట్లు తెలిసింది. పొరుగు జిల్లాలో పని చేయడం ఇష్టం లేక ఆమె.. ఆదివారం ఇంట్లో ఉరేసుకున్నారు. బదిలీ కారణంగా తనకు అన్యాయం జరిగిందనే మనో వేదనతో సరస్వతి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, సహచరులు చెబుతున్నారు. -
ఎంత సీఎం అయినా ఇంత అన్యాయమా!?
సాక్షి, న్యూఢిల్లీ : అది మధ్యయుగాల నాటి రాచరిక ప్రాంగణం. ఎదురుగా ఎత్తైన రాతి కట్టడంపైనున్న సింహాసనంలో ఆసీనుడైన రాజు ప్రజల బాధలను ఆలకిస్తున్నారు. ఓ పెద్దావిడ రాజుముందు మోకరిల్లి తన బాధలను చెప్పుకోవడం మొదలు పెట్టింది. బాధలను చెప్పుకోవడంలో ఆమె గొంతుకాస్త పైకిలేచింది. అంతే, రాజుకు చిర్రెత్తుకొచ్చింది. పక్కనే ఉన్న భటులను పిలిచి, ఆమెను తీసుకెళ్లి కారాగారంలో పడేయాల్సిందిగా ఆదేశించారు. మాట జవదాటని భటులు రాజుగారు చెప్పినట్లే చేశారు. ఇక్కడ బాధలు చెప్పుకున్న పెద్దావిడ పేరు ఉత్తర బహుగుణ. 57 ఏళ్ల ఆమె ఓ ప్రాథమిక పాఠశాల టీచరు. ఇక రాజెవరంటే అత్యంత శక్తివంతమైన పాలకుడు టీఎస్ రావత్. ఆయన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి. జూన్ 28వ తేదీన టీఎస్ రావత్ నిర్వహించిన ప్రజా దర్బార్‌లో చోటుచేసుకున్న సన్నివేశం ఇది. రావత్ ఆదేశం మేరకు ‘ముఖ్యమైన సమావేశానికి అంతరాయం కల్పిస్తున్నారు’ అన్న ఆరోపణలపై ఉత్తర బహుగుణను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. ఆమె గత పాతిక సంవత్సరాలుగా ప్రాథమిక పాఠశాల టీచరుగా పనిచేస్తున్నారు. అందులో 17 సంవత్సరాలు ఉత్తరాఖండ్ మారుమూల పర్వత ప్రాంతాల్లోనే పనిచేశారు. ఇప్పుడూ చేస్తున్నారు. మరో రెండు, మూడేళ్లలో ఆమె పదవీ విరమణ చేయాల్సి ఉంది. మూడేళ్ల క్రితం అనారోగ్యంతో ఆమె భర్త చనిపోయారు. ఉద్యోగరీత్య కొడుకు డెహ్రాడూన్‌లో ఉంటున్నారు. ఈ వయస్సులో, మారుమూల కొండ ప్రాంతంలో ఒంటరిగా బతకలేక పోతున్నానని, తనను డెహ్రాడూన్‌కు బదిలీ చేయాలని ఆమె ముఖ్యమంత్రి రావత్‌ను ప్రజాదర్బార్‌లో కోరుకుంది. ‘ఉద్యోగంలో చేరే ముందు నియమ నిబంధనలు ఏమిటో తెలుసుకోకుండానే సంతకం చేశావా?’ అని సీఎం ఎదురు ప్రశ్నించారు. అందుకు ఆమె ‘ప్రవాస జీవితం గడుపుతానని మాత్రం సంతకం చేయలేదు’ అని గడుసుగా సమాధానమిచ్చింది. అంతే సీఎంకు కోపం నసాలానికి ఎక్కింది. ఆమెను తక్షణమే అరెస్ట్ చేయాల్సిందిగా పక్కనే భటుల్లా నిలుచున్న పోలీసులను ఆదేశించారు. ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏమిటంటే సీఎం రావత్ భార్య సునీత రావత్ కూడా ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల టీచరు. ఆమె ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఇప్పటి వరకు 22 ఏళ్లుగా ‘yì డిజైరబుల్ (కోరుకున్న)’ డెహ్రాడూన్లోనే ఉద్యోగం చేస్తున్నారు. ఉత్తర బహుగుణనేమో గత 17 సంవత్సరాలుగా ‘అన్డిజైరబుల్ (కోరుకోని)’ ప్రాంతంలో పనిచేస్తున్నారు. ఇక్కడ ‘అన్డిజైరబుల్’ అంటే ప్రభుత్వ దష్టిలో దష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉన్న అభివద్థికి నోచుకోని, రవాణా, ఇతర సౌకర్యాలు సరిగ్గాలేని మారుమూల ప్రాంతం అని అర్థం. అలాంటి మారుమూల ప్రాంతాలకు బదిలీపై వెళ్లడం ఇష్టంలేక చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతులు కూడా వదులుకుంటుంటారు. కొందరు పదవీ విరమణ కూడా తీసుకుంటారు. ఇది ఒక్క టీచర్లకే కాదు, ప్రభుత్వంలోని అన్ని విభాగాల ఉద్యోగులకు, ఆఖరికి డాక్టర్లకు కూడా వర్తిస్తుంది. మారుమూల ప్రాంతాల్లో డాక్టర్లు పనిచేసేందుకు వీలుగా ఇదే ఉత్తరాఖండ్ ప్రభుత్వం మెడిసిన్ చదివే విద్యార్థులకు ఫీజు రాయితీని కల్పించింది. మెడిసిన్ పూర్తయిన అనంతరం విధిగా రెండేళ్లు మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తానంటూ బాండ్ రాసిచ్చిన వారికే ఈ ఫీజు రాయితీ అవకాశాన్ని ఇచ్చింది. అందుకనే 2014లో ఇదే షరతుపై 331 మంది డాక్టర్లు నియమితులయ్యారు. ఇలా ఏ ఉద్యోగానికైనా బదిలీలు, అందుకు నియమ నిబంధనలు ఉంటాయి. అదేమి దౌర్భాగ్యమేమోగానీ నేటి కంప్యూటర్ల యుగంలో కూడా నియమ నిబంధనలు సామాన్యులకే వర్తిస్తాయి. రాజకీయ నాయకులకుగానీ, వారి బంధు వర్గానికిగానీ, అనుచర వర్గానికిగానీ వర్తించవు. ఏ రాష్ట్రంలోనైనా డిజైరబుల్ అంటే కోరుకున్న చోట ఐదారేళ్లు పనిచేసిన వారినే సాధారణంగా మారుమూల ప్రాంతాలకు బదిలీ చేస్తారు. అయితే నేడు ఉత్తరాఖండ్‌లో టీచర్ల బదిలీల ప్రక్రియ ఓ పరిశ్రమగా మారిందని, బదిలీల కోసం భారీగా డబ్బులు చేతులు మారుతున్నాయని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ ఉన్నత విద్యాశాఖాధికారి తెలిపారు. మరి, 22 ఏళ్లుగా డెహ్రాడూన్‌లో పనిచేస్తున్న సీఎం భార్య సునీత రావత్‌ను ఉన్నచోటు నుంచి కదలించక పోవడం ఏమిటీ? మారుమూల ప్రదేశంలో పనిచేస్తున్న బహుగుణను కరుణించక పోవడం ఏమిటీ! ఎంత సీఎం అయినా ఇదెంతటి అన్యాయం? ఇలాంటి విధానాల కారణంగా సమాజానికి మరో అన్యాయం కూడా జరుగుతోంది. మారుమూల ప్రాంతంలో 17 ఏళ్లుగా పని చేస్తున్న బహుగుణ ఎక్కువ సార్లు సుదీర్ఘంగా సెలవులు పెట్టారు. గతంలో భర్త అనారోగ్యం కారణంగా ఏడాదికి పైగా సెలవులో ఉన్నారు. మళ్లీ గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ఆమె సెలవులోనే ఉన్నారు. ఆమె సెలవులు కారణంగా ఆమె పనిచేస్తున్న ప్రాథమిక పాఠశాల పిల్లలు టీచరులేని కొరతను అనుభవిస్తున్నారు. ఆమెను కోరుకున్న చోటుకు బదిలీ చేయకపోవడం వల్ల ఇటు విద్యార్థులకు కూడా నష్టం వాటిల్లుతోంది. -
ఎంత పొగరు.. మహిళా టీచర్ పై ప్రతాపమా!
క్లాసు రూమ్ లో విద్యార్థులు ఏదో సమయంలో గొడవ పడటం తరచుగా చూస్తూనే ఉంటాం. క్లాసు రూమ్ లో టీచర్ పై ఓ విద్యార్థి చెయ్యి చేసుకోవడంతో తరగతి గది రణరంగంలా మారిపోయింది. ఇందుకు సంబంధించిన ఆ ఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోను గమనించినట్లయితే.. మనకు మొదట ఇద్దరు విద్యార్థులు గొడవ పడుతుంటారు. ఆ విద్యార్థులను వారించేందుకు వారి క్లాస్ టీచర్ యత్నిస్తారు. రెడ్ డ్రెస్ లో ఉన్న విద్యార్థి తీవ్ర ఆవేశంలో టీచర్ పై కూడా దాడిచేసి, ఆమె ముఖంపై పంచ్ విసురుతాడు. ఆ వెంటనే టీచర్ కాస్త పక్కకు వెళ్లిపోతారు. టీచర్ కొట్టిన ఆ స్టూడెంట్(రెడ్ టీషర్ట్)ను తరగతి గదిలోనే ఉన్న మరికొందరు విద్యార్థులు టార్గెట్ చేసి చితకబాదుతారు. నీకు ఎంత పొగరు ఉంటే మేడమ్ ను కొడతావ్ అంటూ ఓ స్టూడెంట్ గట్టిగా పంచ్ ఇవ్వడంతో రెడ్ టీషర్ట్ వేసుకున్న స్టూడెంట్ ఒక్కసారిగా కిందపడిపోతాడు. ఆ తర్వాత క్లాసు రూమ్ నుంచి బయటకు గెంటేశారు. ఇది ఎక్కడ, ఏ స్కూళ్లో జరిగిందన్న దానిపై స్పష్టతలేకున్నా.. అమెరికాలో అయి ఉంటుందని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసినవారు రెడ్ టీషర్ట్ స్డూడెంట్ చర్యపై మండిపడుతున్నారు. -
ఎంత పొగరు.. మహిళా టీచర్ పై ప్రతాపమా!
-
చిన్నారిపై మహిళా టీచర్ లైంగిక వేధింపులు!
గార్డెన్ సిటీలోని స్కూళ్లలో చదువుతున్న చిన్నారులకు మగాళ్ల నుంచే కాదు.. మహిళా టీచర్ల నుంచి కూడా ముప్పు పొంచి ఉంటోంది. ఐదేళ్ల బాలికపై ఓ మహిళా టీచర్ లైంగిక దాడికి పాల్పడటంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ దాఖలుచేసిన ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మహిళా టీచర్ తనను గట్టిగా కొట్టిందని, తర్వాత ఈ దారుణానికి పాల్పడిందని ఆ బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో పిల్లలపై లైంగిక నేరాల నిరోధ చట్టం (పోస్కో) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని కౌన్సెలింగ్‌కు పంపారు. తదుపరి చర్యలు తీసుకోడానికి ముందు ఆమె నుంచి వాంగ్మూలం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బెంగళూరులోని ప్రముఖ పాఠశాలల్లో వరుసపెట్టి బాలికలపై ఇలాంటి సంఘటనలు జరగడం ఇది ఐదోసారి.