
చిన్నారిపై మహిళా టీచర్ లైంగిక వేధింపులు!
గార్డెన్ సిటీలోని స్కూళ్లలో చదువుతున్న చిన్నారులకు మగాళ్ల నుంచే కాదు.. మహిళా టీచర్ల నుంచి కూడా ముప్పు పొంచి ఉంటోంది. ఐదేళ్ల బాలికపై ఓ మహిళా టీచర్ లైంగిక దాడికి పాల్పడటంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ దాఖలుచేసిన ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మహిళా టీచర్ తనను గట్టిగా కొట్టిందని, తర్వాత ఈ దారుణానికి పాల్పడిందని ఆ బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది.
దాంతో పిల్లలపై లైంగిక నేరాల నిరోధ చట్టం (పోస్కో) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని కౌన్సెలింగ్కు పంపారు. తదుపరి చర్యలు తీసుకోడానికి ముందు ఆమె నుంచి వాంగ్మూలం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బెంగళూరులోని ప్రముఖ పాఠశాలల్లో వరుసపెట్టి బాలికలపై ఇలాంటి సంఘటనలు జరగడం ఇది ఐదోసారి.