bangalore school
-
హోంవర్కు చేయలేదని.. బెల్టుతో కొట్టారు!
ఇచ్చిన హోం వర్కు చేయలేదని.. రెండో తరగతి చదివే చిన్నారిని బెల్టుతో వీపుమీద తోలు ఊడేలా కొట్టాడో టీచర్. ఈ దారుణం బెంగళూరు శివార్లలోని నేలమంగళ ప్రాంతంలో గల సెయింట్ జోసెఫ్ స్కూల్లో జరిగింది. ఏడేళ్ల ఆ చిన్నారి గత ఏడాది కాలం నుంచి ఆ టీచర్ వద్ద ట్యూషన్ చెప్పించుకుంటోంది. మంగళవారం నాడు ఆమె క్లాసుకు వెళ్లినప్పుడు.. ముందురోజు ఇచ్చిన హోం వర్కు చేయలేదని, తాను ధరించిన తోలుబెల్టు తీసుకుని ఆమెను విచక్షణా రహితంగా కొట్టాడు. ఆమె ఏడుస్తూ ఇంటికి వెళ్లే సరికి తల్లిదండ్రులు ఏం జరిగిందని అడిగారు. టీచర్ కొట్టారని చెప్పగా చూస్తే.. ఆమె వీపు నిండా వాతలు తేలి ఉన్నాయి. చర్మం లేచిపోయింది. దాంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 15 ఏళ్లుగా ట్యూషన్లు చెబుతున్న సదరు టీచర్‌ను పోలీసులు ఇంకా అరెస్టు చేయాల్సి ఉంది. -
బాలికపై అత్యాచారం: స్కూలు ప్రిన్సిపాల్ అరెస్టు
మూడేళ్ల బాలికపై స్కూలు వాచ్‌మన్ అత్యాచారం చేసినట్లు ఆరోపణలు రావడంతో బెంగళూరులోని స్కూలు ప్రిన్సిపాల్, ప్రెసిడెంట్ ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. పిల్లల రక్షణ గురించి తాము గతంలో ఇచ్చిన సూచనలు పాటించనందుకు వీరిని అరెస్టు చేశారు. కాగా బాలికపై అత్యాచార ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహించారు. పోలీసులతో కూడా ఘర్షణ పడ్డారు. తనకు చెప్పుకోలేనిచోట నొప్పిగా ఉందని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వెంటనే బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. స్కూలు వాచ్‌మన్‌పై పోస్కో కేసు పెట్టి అతడిని అరెస్టు చేశారు. బెంగళూరు నగరంలో ఇటీవలి కాలంలో బాలికలపై లైంగిక నేరాలు పెరిగిపోతున్నాయి. స్కూళ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేయాలని, ఫ్లోర్ విజిలెన్స్ అధికారులను నియమించుకోవాలని పోలీసులు గతంలో సూచించినా, చాలా స్కూళ్లలో వాటిని పాటించడంలేదు. -
స్కూలుకు రాలేదని.. గుండు గీశారు..
బెంగళూరు: స్కూలుకు రాలేదని.. 12 మంది విద్యార్ధులకు గుండు గీసిన సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. నగరంలోని విటల్ మాలియా రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్లో ఈ ఘటన జరిగింది. స్కూల్లోని 9,10వ తరగతి విద్యార్థులను వార్డెన్ ఇలా శిక్షించినట్టు సమాచారం. హాస్టల్ వార్డెన్ కిరణ్ పిల్లలకు తలలో చుండ్రు ఉందనే గుండు గీయించిట్టు చెబుతున్నారు. విద్యార్థులందరితో పాటు వార్డెన్‌ను కూడా విచారించామని, చట్టబద్ధంగా ముందుకెళ్లామని కబ్బన్ పార్క్ డీసీపీ సందీప్ పాటిల్ తెలిపారు. అయితే పిల్లల తల్లిదండ్రులు మాత్రం దీనిపై మండిపడుతున్నారు. 'మా అబ్బాయి తరగతులకు హాజరు కాలేదని ఒకరోజంతా గ్రౌండ్లో నిలబెట్టి ఉంచారు. ఒక రోజు తరగతికి హాజరు కాకపోతేనే శిక్షించారు. మరుసటి రోజు స్కూలుకు వెళ్లి చూస్తే మా అబ్బాయి తల మీద జుట్టు లేకపోవడం చూసి ఆశ్చర్యపోయాం' అని ఓ బాలుడి తండ్రి పేర్కొన్నారు. స్కూల్లో మొత్తం 12 మంది విద్యార్థులకు గుండు గీయించారు. విద్యార్థులు గత వారంలో తరగతులకు హాజరు కాలేదని.. దీనికి సంబంధించి ఆ వారంలోనే అధికారులు దండనలు విధించారని పోలీసులు తెలిపారు. -
ఏడేళ్ల బాలికపై లైంగిక వేధింపులు
బెంగళూరులోని ఓ స్కూల్లో ఘోరం జరిగింది. ఏడేళ్ల బాలికను లైంగికంగా వేధించిన వ్యాయామ ఉపాధ్యాయుడిని ఆమె తల్లిదండ్రులు పట్టుకుని చితకబాదారు. ఈ ఘటన పశ్చిమ బెంగళూరులోని బయతారాయణపుర ప్రాంతంలో జరిగింది. ఈ దారుణంతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు.. స్కూలు ప్రాంగణంలో ఉన్న వాహనాలను తగలబెట్టారు. స్కూలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దాంతో పోలీసులు చేరుకుని బాష్పవాయువు ప్రయోగించి లాఠీచార్జి కూడా చేశారు. ఈ గందరగోళంలో ఓ కానిస్టేబుల్‌కు తలమీద గాయాలయ్యాయి. అతడిని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఉదయం ఏడు గంటలకు ఏడేళ్ల బాలిక తల్లిదండ్రులు స్కూలుకు వచ్చి, తమ కుమార్తెను పీటీ లైంగికంగా వేధించారని ఆరోపించారు. ఈ విషయం వెంటనే చుట్టుపక్కల ప్రాంతాలకు పాకిపోయి, అందరూ చేరుకున్నారు. అయితే పోలీసు జీపు బయట పార్కు చేసి ఉండటంతో అందులో నిందితుడిని తీసుకెళ్లడం కష్టమని అర్థమైపోయింది. చివరకు ఎలాగోలా అతడిని బయటకు తీసుకొచ్చారు. జనంలో కొందరు అతడిని కొట్టడం మొదలుపెట్టగా, పోలీసులు లాఠీలకు పనిచెప్పి, పీటీని జీపులోకి ఎక్కించారు. అనంతరం జనంలో ఆగ్రహావేశాలు పెరగడంతో పలు వాహనాలకు నిప్పంటించారు. నాలుగు ప్లటూన్ల రిజర్వు పోలీసు బలగాలను, వాటర్ కేనన్లను కూడా మోహరించారు. సీనియర్ పోలీసు అధికారులు ఎంతగా విజ్ఞప్తి చేసినా జనం వినిపించుకోలేదని నగర పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి తెలిపారు. -
చిన్నారిపై మహిళా టీచర్ లైంగిక వేధింపులు!
గార్డెన్ సిటీలోని స్కూళ్లలో చదువుతున్న చిన్నారులకు మగాళ్ల నుంచే కాదు.. మహిళా టీచర్ల నుంచి కూడా ముప్పు పొంచి ఉంటోంది. ఐదేళ్ల బాలికపై ఓ మహిళా టీచర్ లైంగిక దాడికి పాల్పడటంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ దాఖలుచేసిన ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మహిళా టీచర్ తనను గట్టిగా కొట్టిందని, తర్వాత ఈ దారుణానికి పాల్పడిందని ఆ బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో పిల్లలపై లైంగిక నేరాల నిరోధ చట్టం (పోస్కో) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని కౌన్సెలింగ్‌కు పంపారు. తదుపరి చర్యలు తీసుకోడానికి ముందు ఆమె నుంచి వాంగ్మూలం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బెంగళూరులోని ప్రముఖ పాఠశాలల్లో వరుసపెట్టి బాలికలపై ఇలాంటి సంఘటనలు జరగడం ఇది ఐదోసారి. -
ఆరేళ్ల బాలికపై అత్యాచారం: టీచర్ అరెస్టు
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ స్కూల్లో ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. గడిచిన మూడు నెలల్లో ఇలాంటి కేసు ఇది బెంగళూరులో ఐదోది. మంగళ, బుధ వారాల్లో రెండుసార్లు ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు సదరు టీచర్ అంగీకరించాడని బెంగళూరు అదనపు పోలీసు కమిషన్ (శాంతిభద్రతలు) అలోక్ కుమార్ తెలిపారు. స్కూలు నుంచి ఇంటికి వెళ్లిన బాలిక తనకు బాగా నొప్పిగా ఉందని చెప్పడంతో వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా, ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు ఆ వైద్యుడు చెప్పారు. దీంతో గురువారం నాడు పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేశామని, కేసు నమోదు చేశామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. ఎక్కువగా ప్రైవేటు పాఠశాలల్లోనే ఈ తరహా సంఘటనలు జరుగుతున్నాయని, దాంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు ఓ సర్క్యులర్ పంపామని ఆయన చెప్పారు. -
బెంగళూరు స్కూల్లో బాలికపై అత్యాచారం
-
బెంగళూరు స్కూల్లో బాలికపై అత్యాచారం
బెంగళూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో మూడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. గడిచిన నాలుగునెలల్లో ఇలాంటి సంఘటన ఇది మూడోది. బాలిక తండ్రి ఫిర్యాదు చేయడంతో పోస్కో చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదుచేశారు. జలహళ్లి ప్రాంతంలో ఉన్న స్కూలు నుంచి పాపను తీసుకురావడానికి వెళ్లినప్పుడు ఆమె బాగా ఏడుస్తోందని, ఆమెకు జ్వరం కూడా ఉందని బాలిక తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తొలుత ఎవరో తనను కొట్టారని చెప్పినా, తర్వాత తల్లికి జరిగిన విషయం చెప్పింది. పాఠశాలను సందర్శించిన పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి.. ఈ కేసు బాధ్యతలను మల్లేశ్వరం ఏసీపీ సారా ఫాతిమాకు అప్పగించారు. స్కూలు సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నామని, సిబ్బంది అందరినీ ప్రశ్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఇంతకుముందు ఓ పాఠశాలలో 63 ఏళ్ల టీచర్ ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై ప్రజాగ్రహం తీవ్రస్థాయిలో రేగింది. -
ఆరేళ్ల చిన్నారిపై టీచర్ లైంగికదాడి