బెంగళూరు స్కూల్లో బాలికపై అత్యాచారం | minor girl raped in Bangalore school | Sakshi
Sakshi News home page

బెంగళూరు స్కూల్లో బాలికపై అత్యాచారం

Published Wed, Oct 22 2014 8:57 AM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

బెంగళూరు స్కూల్లో బాలికపై అత్యాచారం - Sakshi

బెంగళూరు స్కూల్లో బాలికపై అత్యాచారం

బెంగళూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో మూడేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. గడిచిన నాలుగునెలల్లో ఇలాంటి సంఘటన ఇది మూడోది. బాలిక తండ్రి ఫిర్యాదు చేయడంతో పోస్కో చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదుచేశారు. జలహళ్లి ప్రాంతంలో ఉన్న స్కూలు నుంచి పాపను తీసుకురావడానికి వెళ్లినప్పుడు ఆమె బాగా ఏడుస్తోందని, ఆమెకు జ్వరం కూడా ఉందని బాలిక తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తొలుత ఎవరో తనను కొట్టారని చెప్పినా, తర్వాత తల్లికి జరిగిన విషయం చెప్పింది.

పాఠశాలను సందర్శించిన పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి.. ఈ కేసు బాధ్యతలను మల్లేశ్వరం ఏసీపీ సారా ఫాతిమాకు అప్పగించారు. స్కూలు సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నామని, సిబ్బంది అందరినీ ప్రశ్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఇంతకుముందు ఓ పాఠశాలలో 63 ఏళ్ల టీచర్ ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై ప్రజాగ్రహం తీవ్రస్థాయిలో రేగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement