బాలికపై అత్యాచారం: స్కూలు ప్రిన్సిపాల్ అరెస్టు | Sexual assault of girl: School principal, president arrested | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచారం: స్కూలు ప్రిన్సిపాల్ అరెస్టు

Published Thu, Aug 6 2015 7:33 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM

బాలికపై అత్యాచారం: స్కూలు ప్రిన్సిపాల్ అరెస్టు

బాలికపై అత్యాచారం: స్కూలు ప్రిన్సిపాల్ అరెస్టు

మూడేళ్ల బాలికపై స్కూలు వాచ్మన్ అత్యాచారం చేసినట్లు ఆరోపణలు రావడంతో బెంగళూరులోని స్కూలు ప్రిన్సిపాల్, ప్రెసిడెంట్ ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. పిల్లల రక్షణ గురించి తాము గతంలో ఇచ్చిన సూచనలు పాటించనందుకు వీరిని అరెస్టు చేశారు. కాగా బాలికపై అత్యాచార ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహించారు. పోలీసులతో కూడా ఘర్షణ పడ్డారు.

తనకు చెప్పుకోలేనిచోట నొప్పిగా ఉందని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వెంటనే బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. స్కూలు వాచ్మన్పై పోస్కో కేసు పెట్టి అతడిని అరెస్టు చేశారు.

బెంగళూరు నగరంలో ఇటీవలి కాలంలో బాలికలపై లైంగిక నేరాలు పెరిగిపోతున్నాయి. స్కూళ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేయాలని, ఫ్లోర్ విజిలెన్స్ అధికారులను నియమించుకోవాలని పోలీసులు గతంలో సూచించినా, చాలా స్కూళ్లలో వాటిని పాటించడంలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement