posco case
-
బాలికపై బస్సులో సామూహిక అత్యాచారం
డెహ్రడూన్: ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్‌లో 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరాఖండ్ రోడ్‌వేస్‌కు చెందిన బస్సులో డెహ్రడూన్‌లోని అంతర్రాష్ట్ర బస్ టెర్మినల్ (ఐఎస్బీటీ)లో ఇద్దరు డ్రైవర్లు, సహా మరో ముగ్గురు ఆగస్టు 12వ తేదీన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. 13వ తేదీ తెల్లవారుజామున బస్ టెర్మినల్‌లోని ఓ దుకాణం వద్ద బాలికను గార్డు గుర్తించాడు. వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాడు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి ఉత్తరాఖండ్ రోడ్ వేస్ బస్సును గుర్తించారు. ఐదుగురిని అరెస్టు చేశారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నేరం జరిగిన బస్సు, మరో బస్సును దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపించారు. మానసికంగా స్థిమితంగా లేని బాలిక సరైన సమాచారం ఇవ్వలేదు. తనది యూపీలోని మొరాదాబాద్ అని తెలిపింది. కుటుంబ సభ్యుల వివరాలను వెల్లడించింది. మొరాదాబాద్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీలోని కశ్మీరీ గేట్ నుంచి బస్సులో డెహ్రడూన్‌కు వచ్చానని, అక్కడ ఐదుగురు వ్యక్తులు తనపై ఒక్కొక్కరుగా అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక చెప్పిందని డెహ్రాడూన్ ఎస్ఎస్పీ అజయ్ సింగ్ తెలిపారు. నిందితులందరినీ అరెస్టు చేసి, పోక్సో కేసు నమోదు చేశామని చెప్పారు. -
రాజకీయ అండ.. స్వామిజీ ముసుగులో విద్యార్థినులపై అత్యాచారం..
ఇటీవలే బెంగళూరులో ఓ నకిలీ స్వామి ఐదేళ్లుగా యువతిని బ్లాక్మెయిల్ చేసి లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం బయటపడడం తెలిసిందే. ఇంతలోనే ఓ నిఖార్సైన స్వామి, రాష్ట్ర, జాతీయ నేతలతో సన్నిహిత సంబంధాలున్న మఠాధిపతి లైంగిక దాడి కేసులో ఇరుక్కున్నారు. చిత్రదుర్గంలోని మఠంలోని విద్యాలయాల్లో చదివే బాలికలు స్వామి లీలలపై ఏకంగా మైసూరుకు వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఆ ప్రముఖ మఠం పరువు బజారున పడింది. మైసూరు: చిత్రదుర్గలో ఉన్న ప్రసిద్ధి చెందిన మఠానికి చెందిన స్వామీజీ ఒక ఆ మఠంలో ఉన్న పాఠశాల, కాలేజీలోని విద్యార్థినులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని బాధిత బాలికలు మైసూరు జిల్లా బాలల సంక్షేమ కమిటీ ముందు గోడు వెళ్లబోసుకున్నారు. దాంతో మఠాధిపతి అయిన స్వామీజీతో పాటు మొత్తం నలుగురిపై మైసూరు నజరాబాద్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. స్వామీజీ మొదటి నిందితుడు, అక్కడి హాస్టల్ వార్డెన్ రశ్మి రెండవ నిందితురాలుగా ఉన్నారు. ఇక్కడైతే న్యాయం జరగదని.. వివరాలు... ఆ మఠం ఆధ్వర్యంలో పలు పాఠశాలలు, కాలేజీలు నడుస్తుండగా వందలాది మంది బాలికలు చదువుకుంటున్నారు. మఠం స్వామీజీ పలువురు బాలికల పైన లైంగిక దాడి చేశాడని, చిత్రదుర్గలో అయితే మాకు న్యాయం జరగదని అలోచించి మైసూరుకు వచ్చి ఒడనాడి సేవా సంస్థ ప్రతినిధులను ఆశ్రయించారు. వారితో కలిసి జిల్లా బాలల సంక్షేమ సమితికి ఫిర్యాదు చేశారు. సమితి అధ్యక్షురాలు హెచ్.టి.కమల సెలవులో ఉండటంతో సీనియర్ సభ్యులు ధనంజయ, అశోక్, సవితా కుమారిలు బాధితుల సమస్యలను ఆలకించారు. తమతో పాటు అనేక మంది విద్యార్థినులకు తీరని అన్యాయం జరిగిందని వివరించారు. చిత్రదుర్గానికి కేసు బదిలీ ఈ కేసును చిత్రదుర్గ పోలీసులకు బదిలీ చేశారు. సంఘటన జరిగింది అక్కడే కాబట్టి స్థానిక పోలీసులే విచారణ చేయాలని తెలిపారు. బాధిత విద్యార్థినులు మైసూరు ఒడనాడి సంస్థలో ఆశ్రయం పొందుతున్నారని పోలీసులు చెప్పారు. ప్రసాదంలో మత్తు మందిచ్చేవారు హాస్టల్ వార్డెన్ రశ్మి తమను తీసుకుని వెళ్ళి స్వామీజీ వద్దకు వదిలేవారని, స్వామీజీ మా కష్టసుఖాలను తెలుసుకునే సాకుతో లైంగికంగా వాడుకొనేవారని, ఒకవేళ తాము ఒప్పుకోక పోతే బెదిరించే వారని బాలికలు తెలిపారు. ప్రసాదంలో మత్తు మందు కలిపి మత్తు వచ్చేలా చేసి ఆపైన అత్యాచారం చేసేవారని, ఈ విషయం బయటకి చెబితే చంపేస్తామని బెదిరించేవారని పోలీసులు ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ మాదిరిగా దౌర్జన్యానికి గురైన అనేక మంది బాలికలు అక్కడ ఉన్నారని, ప్రాణ భయంతో బయటకు రావడం లేదని చెప్పారు. కాగా, నజరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా, స్వామీజీ, రశ్మి, మరికొందరిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. #BREAKING | Two minors allege that #Lingayat Swami Shivamurthy Sharanaru sexually assaulted them for over 3 years; Mysuru Police registered a case @harishupadhya brings forth the details | @ridhimb pic.twitter.com/TFyJjbSyip — News18 (@CNNnews18) August 27, 2022 -
అతనికి ఇద్దరు భార్యలు...మళ్లీ బాలికతో మూడో పెళ్లి...
అనంతపురం క్రైం: పోక్సో కేసులో ఇద్దరిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వివరాలను గురువారం అనంతపురం మూడో పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులు వెల్లడించారు. నగరంలోని హనుమాన్ కాలనీకి చెందిన రమణకు ఇద్దరు భార్యలు. జులాయిగా తిరిగే రమణ మద్యం, ఇతర వ్యసనాలకు బానిస. ఇతని ప్రవర్తనతో విసిగిపోయిన మొదటి భార్య వేరుగా జీవనం సాగిస్తోంది. కొన్ని నెలలుగా మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీకి చెందిన బాలికను ప్రేమ పేరుతో నమ్మించి గత నెల 25న ధర్మవరానికి తీసుకెళ్లాడు. మరుసటి రోజు అక్కడే ఓ ఆలయంలో బాలికను పెళ్లి చేసుకుని స్నేహితుడు మహేష్ సాయంతో ధర్మవరంలోనే ఓ ఇంటిలో బాలికను ఉంచాడు. బాలిక కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు గత నెల 25న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గత నెల 30న బాలికను గుర్తించి పోలీసు స్టేషన్‌కు తరలించారు. విచారణ అనంతరం బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా రమణపై పోక్సోతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సహకరించిన మహేష్‌పై కూడా కేసులు నమోదయ్యాయి. గురువారం ఉదయం స్థానిక రైల్వేస్టేషన్లో నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. (చదవండి: ఫోర్జరీ కేసు కీలక మలుపు) -
బాలికను గర్భవతిని చేసిన యువకుడిపై పోక్సో కేసు
పెందుర్తి: తనకు కాబోయే భార్య (బాలిక)ను గర్భవతిని చేసి ఆ తర్వాత మొహం చాటేసిన ఓ యువకుడిపై పెందుర్తి పోలీసులు పోక్సో చట్ట ప్రకారం కేసు నమోదు చేశారు. సీఐ కె.అశోక్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పసలపూడికి చెందిన ఓ మహిళ పెందుర్తి సమీపంలోని అయ్యప్పనగర్‌కు వలస వచ్చింది. ఆమె కుమార్తె (16)కి స్థానికంగా నివాసం ఉంటున్న టేకు ముత్యాలు అనే యువకుడితో పెళ్లి చేయాలని నిర్ణయించారు. బాలికకు మైనారిటీ తీరిన తర్వాత వివాహం జరిపించాలని పెద్దల సమక్షంలో అంగీకారం చేసుకున్నారు. అయితే కొన్ని నెలల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై ముత్యాలు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. దీనిపై తీవ్ర మనస్థాపానికి గురైన బాలిక కుటుంబ సభ్యులు ముత్యాలుపై పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. బాలికపై అఘాయిత్యానిక పాల్పడ్డ వృద్ధుడు కుమ్మరాపల్లి గ్రామంలో మైనర్ బాలికపై ఇదే గ్రామానికి చెందిన వృద్ధుడు శారీరక వేధింపులకు పాల్పడి అసభ్యకరంగా ప్రవర్తించడంపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.రాజారావు తెలిపారు. ఎస్ వరప్రసాద్ (66) ఇదే గ్రామంలో నివాసం వుంటున్న ఎనిమిదేళ్ల బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు. ఎస్పీ గౌతమి శాలి ఆదేశాల మేరకు సీఐ వెంకటరమణ, ఎస్ఐ రాజారావు సంఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. (చదవండి: భర్తపై ఇద్దరి భార్యల ఫిర్యాదు) -
వివాదాస్పద న్యాయమూర్తి జస్టిస్ పుష్ప రాజీనామా
ముంబై: బాలలపై లైంగిక దాడికి వివాదాస్పద నిర్వచనమిచ్చి వార్తల్లోకెక్కిన బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ అదనపు న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేడివాలా గురువారం రాజీనామా చేశారు. దానికి వెంటనే ఆమోదం లభించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మైనర్ చేతులు పట్టుకోవడం, ప్యాంటు జిప్పు విప్పడం లైంగిక దాడి కావంటూ 2021 ఫిబ్రవరిలో పుష్ప తీర్పు ఇచ్చారు. లైంగికపరమైన కోరికతో నేరుగా శరీరాన్ని తాకితే మాత్రమే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) చట్టం కింద లైంగిక దాడిగా పరిగణనలోకి వస్తుందన్నారు. ఇది దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ నేపథ్యంలో ఆమెను శాశ్వత న్యాయమూర్తిగా నియమించాలన్న సిఫార్సులను అప్పట్లో సుప్రీంకోర్టు కొలీజియం వెనక్కు తీసుకుంది. ఏడాది పాటు అదనపు న్యాయమూర్తిగానే కొనసాగించింది. అది శుక్రవారంతో ముగియనున్నా పొడిగింపు గానీ, పదోన్నతి గానీ ఇవ్వలేదు. ఆమె పదవిలో కొనసాగితే శుక్రవారం నుంచి జిల్లా సెషన్స్ కోర్టు జడ్జిగా పని చేయాల్సి వచ్చేది. -
మమ్మీ డాడీ..సారీ.. నాదే తప్పు
సాక్షి, జడ్చర్ల: ఆన్లైన్ క్లాసుల పేరుతో ఓ ప్రైవేట్ టీచర్ ఉచ్చులో చిక్కుకున్న బాలిక కథ విషాదాంతమైంది. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో కలకలం రేపిన పోక్సో కేసులో బాధితురాలు (15ఏళ్ల బాలిక) బుధవారం జడ్చర్లలోని గౌరీశంకర్ కాలనీలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ‘మమ్మీ, డాడీ సారీ.. తప్పు నాదే’ అని బాలిక రాసిన సూసైడ్ నోట్ గదిలో దొరికింది. ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేసి మానేసిన రాజాపూర్‌కు చెందిన దేవరకాడి మహేశ్(35) ఆన్లైన్ క్లాసుల పేరుతో బాధితురాలిని వలలో వేసుకుని పలుసార్లు తన కామవాంఛ తీర్చుకున్నాడు. చదవండి: Drugs Case: నాలుగేళ్ల కిందటి డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు ఈ నేపథ్యంలోనే ఈ నెల 4న కారులో బాలికను హైదరాబాద్ తీసుకెళ్లాడు. ఈలోగా పోలీసు కేసు, విచారణ గురించి తెలుసుకున్న నిందితుడు బాలికను 10న రాజాపూర్ బస్టాండ్‌లో వదిలిపెట్టి వెళ్లాడు. నిందితుడు మహేశ్, అతడికి సహకరించిన అతని మిత్రుడిని 13న పోలీసులు అరెస్ట్ చేసి, పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, ఈ కేసుకు సంబంధించి బుధవారం పోలీసులు బాలికకు సమన్లు జారీ చేశారు. పోలీసులు ఇంటికి వచ్చి సమన్లు ఇవ్వడంతో బాలిక మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. చదవండి: నేపాలీ గ్యాంగ్: దోచేస్తారు.. దేశం దాటేస్తారు! -
ఆ ఆధారాలతోనే శ్రీనివాస్‌రెడ్డి దోషిగా తేలాడు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల కేసులో సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ మీడియాతో మాట్లాడారు. హాజీపూర్ వరుస హత్యల కేసులో శ్రీనివాస్‌రెడ్డి దోషిగా తేలాడని, ముగ్గురు బాలికలను అతను అత్యాచారం చేసి హత్య చేసినట్టు కోర్టు నిర్ధారించిందిన సీపీ భగవత్ చెప్పారు. అభంశుభం తెలియని బాలికలను శ్రీనివాస్‌రెడ్డి టార్గెట్‌గా చేసుకున్నాడని, స్కూలు నుంచి ఇంటికి వెళుతున్న బాలికలకు తన బైక్ మీద లిఫ్ట్ ఇస్తానని నమ్మించి తీసుకెళ్లేవాడని, తన వ్యవసాయ బావి వద్దకు వారిని తీసుకెళ్లి.. అత్యాచారం చేసి, హత్య చేసేవాడని వివరించారు. అతని వ్యవసాయ బావి వద్ద దొరికిన బాధిత బాలిక స్కూల్ బ్యాగ్ ఆధారంగా ఈ వరుస హత్యల కేసు మిస్టరీని ఛేదించామని, ఈ కేసు విచారణలో సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదిక కీలక పాత్ర పోషించాయని, ఈ ఆధారాలతోనే శ్రీనివాస్‌రెడ్డిని దోషిగా నిరూపించామని తెలిపారు. కర్నూలులో ఓ మహిళను హత్య చేసిన కేసులోనూ శ్రీనివాస్‌రెడ్డి దోషి అని సీపీ భగవత్ చెప్పారు. -
సభ్య సమాజానికే ఇది తలవంపు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో 2013లో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఇద్దరు నిందితులను పోక్సో కోర్టు శనివారం దోషులుగా నిర్ధారించింది. ఈ ఘటన సమాజానికే తలవంపులు తెచ్చిందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ దారుణ సంఘటన 2012 డిసెంబర్లో నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసు తర్వాత నాలుగు నెలలకు చోటుచేసుకుంది. నిందితులు మనోజ్ షా, ప్రదీప్ కుమార్ బాధితురాలిని లైంగికంగా హింసించారు. అనంతరం బాలిక చనిపోయిందనుకుని వదిలేసి వెళ్లారు. 40 గంటల తరువాత ఏప్రిల్ 17న బాలికను రక్షించారు. ప్రస్తుతం ఈ కేసులో అదనపు సెషన్స్ జడ్జి నరేశ్‌కుమార్ మల్హోత్రా ఇద్దరినీ దోషులుగా నిర్ధారించారు. బాలికను వారు క్రూరంగా హింసించారని వ్యాఖ్యానించారు. ‘మన సమాజంలో మైనర్ బాలికలను దేవతలుగా ఆరాధిస్తారు. కానీ ఈ ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉంది’ అని పోక్సో కోర్టు వ్యాఖ్యానించింది. కాగా, తన కుమార్తెకు న్యాయం లభించినందుకు బాలిక తండ్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ‘విచారణ రెండేళ్ళలో పూర్తి కావాలి, కానీ ఆరేళ్ల తరువాతైనా మాకు న్యాయం లభించినందుకు సంతోషం’ అని అన్నారు. దోషులకు శిక్షల విధింపుపై జనవరి 30న విచారిస్తామని కోర్టు తెలిపింది. 2013లో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు మే 24 చార్జిషీట్ దాఖలు చేశారు. జూలై 11న అభియోగాలు మోపుతూ హాజరుపరిచారు. -
నారాయణ ఇ–టెక్నో సిబ్బందిపై పోక్సో కేసు, అరెస్ట్
సాక్షి, బెంగళూరు : ఏడో తరగతి విద్యార్థి తలకు గాయం అయ్యేలా కొట్టిన బెంగళూరులోని నారాయణ ఇ–టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్, ఇద్దరు ఉపాధ్యాయులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వివరాలు.. పాఠశాల వార్షికోత్సవంలో ప్రదర్శించడానికి 13 ఏళ్ల విద్యార్థి స్కూల్లో శిక్షణ పొందుతున్నాడు. ఈ నెల 16న సౌండ్ ఎక్కువగా పెట్టి నృత్య సాధన చేస్తుండగా అక్కడికి చేరుకున్న ఉపాధ్యాయురాలు రేష్మా... విద్యార్థిని మందలించాలని కట్టెతో కొట్టబోయింది. విద్యార్థి తప్పించుకోవడంతో ఆమె కోపం పట్టలేక డస్టర్ విసరగా, అది విద్యార్థి తలకు తగిలి రక్తం కారింది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దంటూ ప్రిన్సిపల్ శాజి సెబాస్టిన్, ఉపాధ్యాయుడు మ్యాథ్యోలు విద్యార్థిని బెదిరించారు. తర్వాత విద్యార్థి తల్లికి ఫోన్ చేసి, మీ కొడుకు కాలుజారి పడ్డాడని చెప్పగా ఆమె వచ్చి బాలున్ని తీసుకెళ్లి వైద్యం చేయించింది. బాలుడు ఆరోజు రాత్రి జరిగిన విషయాన్ని తల్లికి వివరించాడు. ఈ ఉదంతంపై ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోక్సో చట్టం కింద ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులపై కేసును నమోదు చేశారు. ముగ్గురినీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నిందితుల్లో రేష్మా ఏపీకి చెందినవారు కాగా, మిగతా ఇద్దరూ కేరళ వారు. -
చేతులు కట్టేసి.. రోడ్లపై నగ్నంగా..
ముంబై: మహారాష్ట్రలో నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన 35 ఏళ్ల ఒక యువకుడి చేతులను తాళ్లతో కట్టేసి.. రోడ్లపై నగ్నంగా తిప్పిన ఘటన ఆదివారం నాగ్‌పూర్‌లోని పర్దిలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు వైద్య.. స్థానికంగా కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్‌లో ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. విధి నిర్వహణ నిమిత్తం ప్రతిరోజు వైద్య.. క్యాష్‌ను కలెక్ట్ చేసుకోవడానికి బాలిక ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. అలానే ఆదివారం సాయంత్రం బాలిక ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి యత్నిస్తున్న వైద్యను గుర్తించిన బాలిక తల్లి.. కేకలు వేయడంతో స్థానికులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొన్నారు. అఘాయిత్యానికి పాల్పడుతున్న నిందితుడు వైద్యను పట్టుకొని చితకబాదారు. అంతేకాక అతని చేతులను తాళ్లతో కట్టేసి.. వీధుల్లో నగ్నంగా తిప్పారు. ఆ తర్వాత అతనిని పోలీసులకు అప్పగించారు. పోస్కోచట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. -
బాలికపై అత్యాచారం: స్కూలు ప్రిన్సిపాల్ అరెస్టు
మూడేళ్ల బాలికపై స్కూలు వాచ్‌మన్ అత్యాచారం చేసినట్లు ఆరోపణలు రావడంతో బెంగళూరులోని స్కూలు ప్రిన్సిపాల్, ప్రెసిడెంట్ ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. పిల్లల రక్షణ గురించి తాము గతంలో ఇచ్చిన సూచనలు పాటించనందుకు వీరిని అరెస్టు చేశారు. కాగా బాలికపై అత్యాచార ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహించారు. పోలీసులతో కూడా ఘర్షణ పడ్డారు. తనకు చెప్పుకోలేనిచోట నొప్పిగా ఉందని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వెంటనే బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. స్కూలు వాచ్‌మన్‌పై పోస్కో కేసు పెట్టి అతడిని అరెస్టు చేశారు. బెంగళూరు నగరంలో ఇటీవలి కాలంలో బాలికలపై లైంగిక నేరాలు పెరిగిపోతున్నాయి. స్కూళ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేయాలని, ఫ్లోర్ విజిలెన్స్ అధికారులను నియమించుకోవాలని పోలీసులు గతంలో సూచించినా, చాలా స్కూళ్లలో వాటిని పాటించడంలేదు.