కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master)పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ తన దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడంతో జానీ మాస్టర్‌ని అరెస్ట్ కూడా చేశారు. దాదాపు నెల రోజుల వరకు జైల్లో ఉండి..కొన్నాళ్ల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చాడు. తను ఏ తప్పు చేయలేదని, తనేంటో నిరూపించుకుంటాననీ, తన నిర్దోషిత్వాన్ని బయటపెడతానని వరుస ఇంటర్వ్యూల్లో చెబుతున్నాడు. జైలు నుంచి బయటకు వచ్చాక..భార్యతో కలిసి జానీ మాస్టర్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. కానీ ఫిర్యాదు చేసిన లేడి కొరియోగ్రాఫర్ మాత్రం ఇంతవరకు ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. చాలా కాలం తర్వాత తాజాగా ఆమె మీడియా ముందుకు వచ్చారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచనల విషయాలు వెల్లడించారు.
మాస్క్ ఎందుకు వేసుకోవాలి?
సదరు మీడియా చానల్ ఇంటర్వ్యూకి ముందు జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన లేడి కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ(Shrasti Verma )ను మాస్క్ వేసుకోవాలని కోరింది. అయితే తాను ఏ తప్పు చేయలేదని.. మాస్క్ వేసుకోకుండా ఇంటర్వ్యూ ఇస్తానని శ్రేష్ట చెప్పింది. అంతేకాదు ఒక అమ్మాయి అన్యాయం జరిగిందని కేసు పెట్టినప్పుపు మాస్క్ వేసుకొని మీడియా ముందుకు రావాల్సిన అవసరం లేదన్నారు. తాను వారియర్‌ని అని..మంచి కోసం ఫైట్ చేస్తున్నాని చెప్పింది. తనను ఆదర్శంగా తీసుకొని పది మంది అమ్మాయిలు మారినా చాలని అంటున్నారు. ఇక జానీ మాస్టర్ కేసు విషయం గురించి మాట్లాడుతూ.. రివేంజ్ కోసం ఆ కేసు పెట్టలేదని.. సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే ఫిర్యాదు చేశానని చెప్పింది. అమ్మాయి అంటే ఆట బొమ్మ కాదని..వాళ్లకు ఇష్టం లేదని చెబితే దాన్ని గౌరవించాలని కోరింది.
అందుకే నాలుగేళ్ల తర్వాత ఫిర్యాదు
జానీ మాస్టర్ నాలుగేళ్ల క్రితం వేధిస్తే..ఇప్పుడెందుకు కేసు పెట్టావని చాలా మంది అడుగుతున్నారు. నేను ఒక అమ్మాయిని. అప్పుడు మైనర్‌ని కూడా. ఒక పలుకుబడి ఉన్న వ్యక్తితో పోరాడే శక్తి నాకు లేదు. పైగా ఆ పర్సన్(జానీ మాస్టర్) మారతాడేమోనని భావించాను. కానీ నేను ఆశించినట్లుగా ఆయనలో మార్పు రాలేదు. వేధింపులు ఇంకా కొనసాగించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. కేసు పెట్టే ముందు నా దగ్గర రెండే ఆప్షన్లు ఉన్నాయి. ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడమా లేదా ఆత్మహత్య చేసుకోవడమా? వాటిలో నేను మొదటిదే ఎంచుకున్నాను.
నేను ఫైట్ చేయగలను అనుకున్నప్పడే బయటకు వచ్చాను. సొసైటీ గురించి ఆలోచించలేదు. సోషల్ మీడియాను పట్టించుకోలేదు. ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేశాను. అందుకే మాస్క్ లేకుండా మీడియా ముందుకు వచ్చాను. ఫ్యామిలీ ఏదో అంటుంది. స్నేహితులు అలా అంటారు అని ఆలోచించకుండా నాలాగే అన్యాయం జరిగిన అమ్మాయిలంతా ధైర్యంగా ముందుకు రావాలి.
ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు?
నేను కేసు పెట్టిన తర్వాత సమీర్ అనే అబ్బాయితో నాపై ఫిర్యాదు చేయించే ప్రయత్నం చేశాడు. అతను నిందితుడు(జానీ మాస్టర్) బంధవు. ఆయన భార్యనే స్వయంగా తీసుకెళ్లి నాపై ఫిర్యాదు చేయించేందుకు ప్రయత్నించింది. కానీ పోలీసులు అతని ఫిర్యాదు స్వీకరించలేదు. నేను అతన్ని మోసం చేశానని, లైంగికంగా వేధించానని సమీర్ చెప్పాడు. అదంతా మీడియా ప్రసారం చేసింది కూడా. అంతేకాదు పోలీసులు స్వీకరించకపోతే సూసైడ్ చేసుకుంటాను అన్నాడు. మరి నిజంగా సూసైడ్ చేసుకున్నాడా? ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? మీడియా అతని గురించి ఎందుకు ఆరా తీయడం లేదు?
బెదిరింపులకు భయపడే అమ్మాయిని కాదు. అతనికి తల్లి, చెల్లి ఉన్నారు కదా.. భవిష్యత్తులో భార్య కూడా వస్తుంది. ఇలాంటి చీప్ ఆరోపణలు చేయడానికి సిగ్గు ఉండాలి. నాలుగేళ్ల తర్వాత కేసు ఎందుకు పెట్టావని నన్ను అంటున్నారు. మరి సమీర్ నాలుగేళ్ల తర్వాత నాపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నాడు? నేనంటే అమ్మాయిని భయపడి ఇన్నాళ్లు ఫిర్యాదు చేయకుండా ఉన్నాను అనుకో. అతను అబ్బాయి కదా.. అప్పుడు ఎందుకు కేసు పెట్టలేదు? ఇదంతా నిందితుడి భార్య ఆడుతున్న డ్రామా. ఆమె కొంచెం కూడా సిగ్గులేదు.
నేషనల్ అవార్డు రద్దుతో నాకు సంబంధం లేదు
జానీ మాస్టర్‌కి ప్రకటించిన నేషనల్ అవార్డు రద్దు కావడానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని శ్రేష్ట చెప్పారు. ‘నేషనల్ రద్దు కోసం నేను ఎలాంటి లేఖలు రాయలేదు. నాకు లాయర్ కూడా లేరు. అతనిపై ఆరోపణలు వచ్చాయి కనుకే అవార్డు రద్దు అయింది. వ్యక్తిగత జీవితం వేరు..ప్రొఫెషినల్ లైఫ్ వేరు కదా.. అవార్డు ఎందుకు రద్దు చేస్తారని కొంతమంది అంటున్నారు. కానీ ప్రొఫెషనల్‌గా ఎంత బాగున్నప్పటికీ..బుద్ది మంచిగా లేకపోతే ఎలా? నేషనల్ అవార్డు అనేది చాలా పెద్దని.. అన్ని చూస్తారు. ఆరోపణలు ఉన్నాయనే అవార్డు రద్దు చేశారు. అంతేకానీ నేను అయితే ఎలాంటి లేఖ రాయలేదు.
Comments
Please login to add a commentAdd a comment