లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయి, ఇటీవల బెయిల్‌పై బయటకొచ్చిన జానీ మాస్టర్‌కి ఊహించని షాక్ తగిలిందంటూ వార్తలు వచ్చాయి. ఆయనను డ్యాన్స్ అసోసియేషన్ నుంచి తొలగించారని సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్‌లో కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే, తాజాగా జానీ మాస్టర్ తన సోషల్‌మీడియా ద్వారా రియాక్ట్ అయ్యారు.
మొన్నటివరకు డ్యాన్సర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జానీ మాస్టర్ కొనసాగుతూ వచ్చారు. ఎప్పుడైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ని లైంగికంగా వేధించాడనే ఆరోపణలు వచ్చాయో.. ఇతడి పదవిపై నీలినీడలు కమ్ముకున్నాయి. అందుకు తగ్గట్లే తాజాగా ఆదివారం అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించగా.. జోసెఫ్ ప్రకాశ్ విజయం సాధించారు. 5వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2023లో అధ్యక్షుడిగా ఎన్నికైన జానీ.. తన పదవీ కాలం 2025 వరకు ఉంది. అయితే, గుట్టుచప్పుడు కాకుండా అసోషియేషన్‌లో ఎలక్షన్లు నిర్వహించడంపై ఆయన తప్పుబట్టారు
వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా: జానీ
తనను అసోసియేషన్ నుంచి తొలగించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని జానీ మాస్టర్ తెలిపారు. సోషల్‌మీడియాలో కావాలనే ఎవరో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని ఇలా చెప్పారు. 'నన్ను ఏ యూనియన్ నుంచి తొలగించలేదు. నేను డ్యాన్సర్ యూనియన్‌లో మెంబర్. అందులో నుంచి శాశ్వితంగా ఎవర్నీ తొలగించలేరు. నిన్న జరిగిన ఎన్నికలపై నేను ఫైట్ చేస్తాను. నా పదవీ కాలం ఇంకా ఉంది. కొందరు అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకున్నారు. వారికి ఆ హక్కు లేదు. దీనికి కారణమైన వారిపై చట్టపరంగా వెళుతున్నాను. టాలెంట్ ఉన్నవారికి పనివ్వకుండా, దొరక్కుండా ఎవ్వరూ ఆపలేరు. నా కొరియోగ్రఫీలో గేమ్ ఛేంజర్ నుంచి ఓ మంచి పాట రాబోతుంది, మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.' అని జానీ అన్నారు.
డ్యాన్స్ అసోసియేషన్ కోసం తీసుకున్న భూ వివాదంలలో భారీ స్కామ్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. శంకర్‌పల్లిలో డ్యాన్సర్ అసోసియేషన్ కోసం 15 ఎకరాలు భూమి కొనుగోలు సమయంలో కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని. ఆ స్కామ్ వివరాలను జానీ మాస్టర్ బయటకు తీయడం వల్లే జానీ మాస్టర్‌పై ఆరోపణలు వస్తున్నాయని తెలుస్తోంది. డ్యాన్సర్ అసోసియేషన్ కార్డుల జారీ విషయంలో కూడా భారీగా వసూళ్లకు పాల్పిడినట్లు జానీ ఆరోపించడంతో తనపై ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.
నిర్ధారణవ్వని ఆరోపణలని కారణంగా చూపిస్తూ నన్ను శాశ్వతంగా యూనియన్ నుండి తొలగించినట్టు మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారు. అవేవీ నమ్మకండి!!
నా పదవీ కాలం ఇంకా ఉన్నా కూడా అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. దీనికి… pic.twitter.com/qroJxE5Uxv— Jani Master (@AlwaysJani) December 9, 2024
Comments
Please login to add a commentAdd a comment