ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‍పై ఓ మహిళ లైంగిక వేధింపుల కేసు పెట్టింది. హైదరాబాద్‌లోని రాయ్‌దుర్గ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు బెదిరింపు (506), గాయపరచడం (323) క్లాజ్ (2) కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఘటన నార్సింగి పరిధిలో జరగడంతో కేసుని పోలీసులు అక్కడికి బదిలీ చేశారు.
ఏం జరిగింది?
మధ్యప్రదేశ్‌కి చెందిన 21 ఏళ్ల మహిళ.. జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా గత ఆరు నెలలుగా పనిచేస్తోంది. అయితే ఔట్ డోర్ షూటింగ్స్ టైంలో తనని పలుమార్లు లైంగికంగా వేధించాడని సదరు మహిళ కేసు పెట్టింది. అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని చెప్పుకొచ్చింది. నార్సింగిలోని తన ఇంటికి కూడా వచ్చి ఇబ్బందులకు గురిచేసినట్లు తన ఫిర్యాదులో పేర్కొంది. అవకాశాలు అడ్డుకోవడమే కాకుండా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని వాపోయింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!)
ఇంతకు ముందు కూడా
ఈ ఏడాది జూన్‌లోనూ జానీ మాస్టర్‌పై సతీష్ అనే కొరియోగ్రాఫర్ కేసు పెట్టాడు. సినిమాల్లో అవకాశాలు రాకుండా తనని వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశాడు. అంతకు ముందు 2019లో మేడ్చల్ కోర్టు జానీ మాస్టర్‌కి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2015లో ఓ కాలేజీలో జరిగిన గొడవ విషయమై ఇలా తీర్పిచ్చింది. ఇలా జానీ మాస్టర్ ఎప్పటికప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నాడు.
జనసేన నాయకుడు
కొరియోగ్రాఫర్‌గా అందరికీ తెలిసిన జానీ మాస్టర్.. పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి స్టార్ క్యాంపెయినర్. కొన్నాళ్ల క్రితం జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ప్రచారం చేసారు. కొన్నిరోజుల క్రితం మాట్లాడుతూ పవన్ కల్యాణ్ త్వరలో సీఎం, ప్రధాని అవుతారని కూడా చెప్పుకొచ్చాడు. మరి ఇప్పుడు తనపై నమోదైన కేసు విషయంలో ఏం చెబుతాడో చూడాలి?
(ఇదీ చదవండి: బిగ్ బాస్ 8లో రెండో ఎలిమినేషన్.. కొత్త ట్విస్ట్)
Comments
Please login to add a commentAdd a comment