బిగ్ బాస్ 8లో రెండో ఎలిమినేషన్.. కొత్త ట్విస్ట్ | Bigg Boss 8 Telugu 2nd Week Elimination And Latest Promo | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Elimination: ఎలిమినేషన్‌లో వెరైటీ ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్

Published Sun, Sep 15 2024 3:56 PM | Last Updated on Sun, Sep 15 2024 4:18 PM

Bigg Boss 8 Telugu 2nd Week Elimination And Latest Promo

బిగ్‌బాస్ 8వ సీజన్ ఉందా లేదా అన్నట్లే సాగుతోంది. మిగతా రోజుల్లో ఎపిసోడ్స్ చూసినా చూడకపోయినా సరే వీకెండ్ వస్తే మాత్రం ఆడియెన్స్ అలెర్ట్ అయిపోతారు. దానికి కారణం నాగార్జున వస్తాడు. అలానే ఎలిమినేషన్ ఉంటుంది. ఈసారి కూడా ఊహించని వ్యక్తి ఎలిమినేట్ కాబోతున్నాడని తెలుస్తోంది. అయితే దానికోసం ఈసారి పెట్టిన ట్విస్ట్ కాస్త విచిత్రంగా అనిపించింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు విడుదలైంది.

సెప్టెంబరు 1న 8వ సీజన్ మొదలవగా.. తొలివారం బేబక్కని ఎలిమినేట్ చేసి పంపేశారు. ఇక రెండో వారం ఎలిమినేషన్ లిస్టులో నాగమణికంఠ, కిర్రాక్‌ సీత, పృథ్వీ శెట్టి, నైనిక, శేఖర్‌ బాషా, విష్ణుప్రియ, ఆదిత్య, నిఖిల్‌ ఉన్నారు. వీళ్లలో విష్ణుప్రియ, నిఖిల్ ఓటింగ్‌లో ముందున్నారు. అలానే తాజా ప్రోమోలోనూ ఆదిత్య, మణికంఠ, పృథ్వీ, శేఖర్ భాషాని ఎలిమినేట్ విషయంలో హైలైట్ చేశారు. అంటే చివరగా వీళ్లు నలుగురే మిగులుతారని అనిపిస్తోంది.

(ఇదీ చదవండి: ఈసారి అతడే ఎలిమినేట్‌.. ముందే స్కెచ్చేసిన బిగ్‌బాస్‌!)

ప్రతివారం చివరి స్థానంలో నిలిచిన వాళ్లని ఎలిమినేట్ చేసి పంపించేస్తుంటారు. అయితే ఈసారి అలా కాకుండా చివరి రెండు స్థానాల్లో ఉన్నవాళ్లలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలో మిగిలిన హౌస్‌మేట్స్ డిసైడ్ చేస్తారని హోస్ట్ నాగార్జున షాకిచ్చాడు. మిగతా గేమ్స్ విషయంలో పర్లేదు గానీ కీలకమైన ఎలిమినేషన్‌లో ఇలా హౌస్‍‌మేట్స్ నిర్ణయం తీసుకోవడం అన్నది ఇదే తొలిసారి అవుతుంది.

సోషల్ మీడియాలో వినిపిస్తున్న దాని ప్రకారం శేఖర్ భాషాని రెండో వారం ఎలిమినేట్ చేసి పంపేశారని తెలుస్తోంది. కామెడీ చేస్తూ హౌసులో ఉంటాడనుకున్న ఇతడిని పంపేయడం కాస్త షాకింగ్ అని చెప్పొచ్చు. అయితే ముక్కు అవినాష్ లేదా రోహిణి తర్వాతి వారాల్లో హౌసులోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. అంటే శేఖర్ భాషాతో మిస్సయిన కామెడీని ఇలా భర్తీ చేయిస్తారేమో? 

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌: సీత, సోనియా అలా ప్రవర్తించడానికి కారణమిదే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement