బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ లాంచింగ్ రోజు 14 మంది కంటెస్టెంట్లు హౌస్‌లో అడుగుపెట్టారు. విష్ణుపప్రియ, ఆదిత్య ఓం వంటివాళ్లు తప్ప మిగతా అందరూ జనాలకు పెద్దగా పరిచయం లేనివాళ్లే! కానీ రోజులు గడిచేకొద్దీ అందరూ సుపరిచితులైపోయారు. అంతలోనే ఎలిమినేషన్ దగ్గరకు రాగా బేబక్క ఇంటిని వీడింది..
రెండో వారం నామినేషన్‌లో..
మొదట్లో గమ్ముగా కూర్చున్న ఆమె వెళ్లిపోయేముందు మాత్రం తనలో ఫైర్ చూపించింది. ఇక రెండో వారం నాగమణికంఠ, కిర్రాక్ సీత, పృథ్వీ శెట్టి, నైనిక, శేఖర్ బాషా, విష్ణుప్రియ, ఆదిత్య, నిఖిల్ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో నిఖిల్, విష్ణుప్రియ అందరికంటే ముందు సేవ్ అవుతారనడంలో డౌటే లేదు. రోజురోజుకీ ఆట మెరుగుపర్చుకుంటున్న మణికంఠకూ బాగానే ఓట్లు పడుతున్నాయి. నైనికకు కూడా ఓట్లు పర్వాలేదనిపిస్తున్నాయి.
సీతను కాపాడింది అదే!
మిగిలిందల్లా ఆదిత్య, సీత, శేఖర్ బాషా, పృథ్వీ. ఈ నలుగురిలో ఈ వారం గేమ్‌లో రఫ్ఫాడించింది సీత. ఆమె డేంజర్ జోన్‌లో ఉన్నప్పటికీ తన గేమ్ ఆమెను కాపాడింది. పృథ్వీ.. గొడవలకు సై అంటూ దూకుతున్నాడు కాబట్టి.. ఆ కొట్లాటల కోసం మరికొన్నాళ్లు అలాగే కొనసాగించే ఛాన్స్ ఉంది. మిగిలింది బాషా, ఆదిత్య.
కావాలనే..
హౌస్‌లో అంతో, ఇంతో నవ్విస్తోంది బాషాయే! తన జోకులతో, పంచులతో చిరాకు పుట్టిస్తూనే చిరునవ్వు తెప్పిస్తున్నాడు. కానీ ఈ వారం అతడికి గేమ్స్ ఆడే అవకాశమే బిగ్‌బాస్ ఇవ్వలేదు. ఈ లెక్కన తనను పంపించేయాలని ముందే డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అటు ఆదిత్య.. హౌస్‌లో ఉన్నాడా? లేడా? అన్నట్లుగానే ఉన్నాడు.
ఆదిత్య ఉన్నాడా? లేదా?
ఈ వారమైనా కాస్త కనిపించమని నాగ్ చెప్పినా సరే ఎక్కడా యాక్టివ్‌గా ఉన్నట్లు కనిపించలేదు. దీంతో ఇతడిని ఎలిమినేట్ చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆదిత్యను సేవ్ చేసి బాషాను ఎలిమినేట్ చేశారట!
బాషా ఎలిమినేట్!
త్వరలోనే అవినాష్ లేదా రోహిణి వంటి కమెడియన్స్‌ను వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా హౌస్‌లోకి పంపించాలన్నది బిగ్‌బాస్ ప్లాన్. ఇందుకోసమే తనకు తెలిసిన కామెడీతో నవ్విస్తున్న బాషాను బయటకు పంపిస్తున్నారట! మరి ఇదెంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment