Kirrak Seetha
-
తెర వెనక 'బిగ్‌బాస్ 8' ఫినాలే హంగామా (ఫొటోలు)
-
కిర్రాక్ సీత ఎలిమినేటికి కారణాలు ఇవే..
-
తేజ చేతిలో మరొకరు బలి.. ఈ వేట ఆగదా?
మొన్నటి నామినేషన్స్‌లో తేజ సూటిగా, సుత్తి లేకుండా మాట్లాడాడు. కరెక్ట్ పాయింట్లు చెప్తూ సీత, మణికంఠను నామినేట్ చేశాడు. అయితే మణికి ఒకే ఒక్క నామినేషన్ పడటంతో అతడు నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు. కానీ సీతకు ఏకంగా ఐదు పడటంతో నామినేషన్స్‌లోకి వచ్చింది. ఇప్పటికే సండే ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తవగా సీత ఎలిమినేషన్ కూడా జరిగిపోయింది.నీళ్లు చల్లిందని నామినేట్..ఇంతకీ విషయమేంటంటే.. గత సీజన్లో తేజ ఎవర్ని నామినేట్ చేస్తే వాళ్లు నేరుగా ఎలిమినేట్ అయిపోయారు. పైగా చెత్త కారణాలు చెప్పి నామినేట్ చేయడం మరింత విడ్డూరం. నిద్రపోతున్న తన మీద నాలుగు చుక్కల నీళ్లు చిలకరించిందంటూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ పూజామూర్తిని నామినేట్ చేసి పంపించేశాడు.ఆరుగురిని పంపించేశాడుస్ట్రాంగ్ కంటెస్టెంట్, నామినేషన్స్‌లోకి వస్తే ఆత్మస్థైర్యం పెరుగుతుందంటూ సందీప్ మాస్టర్‌ను పొగుడుతూ మరీ బయటకు తోసేశాడు. ఇలా ఒకరిద్దరు కాదు.. దామిని భట్ల, రతిక రోజ్, నయని పావని, శుభశ్రీ.. వీళ్లంతా తేజ బాధితులే! ఆరుగురిని పంపించాక తొమ్మిదోవారం ఇతడు ఎలిమినేట్ అయ్యాడు. సిల్లీ రీజన్స్‌తో నామినేట్ చేయొద్దంటూ శివాజీ ఇతడిని నామినేట్ చేయగా అదే వారం వెళ్లిపోయాడు.ఈసారి కూడా సీన్ రిపీట్ఇప్పుడు తేజ వచ్చీరాగానే సీతను నామినేట్ చేయడం, ఆమె ఎలిమినేట్ అవడం చూస్తుంటే ఈసారి కూడా సీజన్ 7లో జరిగింది రిపీట్ అయ్యేట్లు కనిపిస్తోంది. ఇది గమనించిన కొందరు నెటిజన్లు.. నెక్స్ట్ వీక్ తేజ ఎవర్ని ఎలిమినేట్ చేస్తాడో చూడాలంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో.. మా ఫేవరెట్ కంటెస్టెంట్ తేజ చేతిలో పడకపోతే చాలని కోరుకుంటున్నారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హింటిస్తే అర్థం చేసుకోరే..! మణిని చెడుగుడు ఆడుకున్న గంగవ్వ
వైల్డ్‌కార్డ్ ఎంట్రీలతో హౌస్ కళకళలాడిపోయింది. సీజన్ ప్రారంభం అయినప్పుడు 14 మంది ఉన్నారు. కానీ వైల్డ్ కార్డ్స్ రాకతో కంటెస్టెంట్ల సంఖ్య 16కు చేరుకుంది. మరి వీళ్ల నామినేషన్స్ ఎలా ఉన్నాయో నేటి (అక్టోబర్ 7) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..గంగవ్వా.. మజాకా!వైల్డ్ కార్డ్స్‌ను చూసి హౌస్‌మేట్స్‌కు భయం పట్టుకుంది. ఎవరు ఎలాంటివాళ్లు, ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలనేది చర్చించుకున్నారు. తర్వాతి రోజు ఉదయం గంగవ్వ మణికంఠను ఓ ఆటాడుకుంది. నీ పెండ్లాం, పిల్ల యాదొచ్చిందని ఏడ్చినవ్.. అంత యాదికొస్తే ఎందుకొచ్చినవ్ ఇక్కడికి అని కౌంటర్ వేసింది. నా బాధ తట్టుకోలేకున్నా అని మణి అంటే మరి ఈ వారం పోతవా అని మరో పంచ్ వేసింది. ఇకపోతే ప్రైజ్‌మనీ రూ.38 లక్షలకు చేరుకుంది.తేజకు శిక్షఓజీ టీమ్ పాలు సహా కొన్ని రేషన్ సామానును రాయల్ టీమ్‌కు ఇచ్చేందుకు తటపటాయించింది వచ్చీరావడంతోనే తనతో బోళ్లు తోమించారని అవినాష్ తెగ ఫ్రస్టేట్ అయ్యాడు. దీంతో అతడికి హరితేజ, మణికంఠ సాయం చేశారు. ఆడుతూపాడుతూ బోళ్లన్నీ తోమేశారు. మరోవైపు టేస్టీ తేజ కూర్చోవడంతో కుర్చీ విరిగిపోయింది. బిగ్‌బాస్ ప్రాపర్టీ ధ్వంసం చేసిన పాపానికి కాసేపు అతడు కుక్కలా నటించాడు.మణికంఠను టార్గెట్ చేశావ్..తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలైంది. రాయల్ టీమ్‌కు మాత్రమే నామినేట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. మొదటగా హరితేజ.. గ్రూపిజం చేస్తున్నావు, మణికంఠను టార్గెట్ చేశావంటూ యష్మిని నామినేట్ చేసింది. ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావ్, సొంతంగా ఆడటం లేదంటూ పృథ్వీని నామినేట్ చేసింది. గౌతమ్.. నీ గేమ్ వదిలేసి వేరొకరి వెనకాల పడుతున్నావంటూ విష్ణుప్రియను, మణికంఠపై ప్రతీకారం తీర్చుకోవడం బాగోలేదని యష్మిని నామినేట్ చేశాడు. మణిని టార్గెట్ చేయడం వల్లే అతడికి సింపతీ వస్తోందని రాయల్ టీమ్ హింటిస్తోంది. కానీ దాన్ని యష్మీ అర్థం చేసుకోలేకపోయింది.మెహబూబ్ సిల్లీ నామినేషన్స్నయని వంతురాగా.. నీకసలు సీరియస్‌నెస్, ఇంట్రస్ట్ లేదంటూ విష్ణు మెడలో నామినేటెడ్ బోర్డు వేసింది. సీత మెడలోనూ బోర్డు వేస్తూ.. నామినేట్ చేయడం దేనికి? బయటకు వెళ్లిపోతుంటే ఏడ్వడం దేనికని ఆమె ఎమోషన్‌ను ప్రశ్నించింది. మెహబూబ్ వంతురాగా.. నువ్వు నాతో సరిగా మాట్లాడలేదంటూ సీతను నామినేట్ చేశాడు. మా రాకను జీర్ణించుకోలేకపోతున్నారంటూ యష్మి మెడలో బోర్డు వేశాడు. తేజ మాట్లాడుతూ.. చీఫ్‌గా ఫెయిలయ్యావంటూ సీతను నామినేట్ చేశాడు. ఒక్కో పాయింట్ కూడా తూటామణికంఠ మెడలో బోర్డు వేస్తూ కరెక్ట్ పాయింట్లు చెప్పాడు. 1. ఎప్పుడు చూసినా నీ గోడు చెప్పుకుంటూనే ఉంటావ్.. అది నీ గేమా? 2. సీత నీకు ఫ్రెండ్ అన్నావ్, కానీ బిగ్‌బాస్ అడిగినప్పుడు నబీల్, విష్ణు పేర్లు మాత్రమే చెప్పావ్, అంటే సీత నీ ఫ్రెండ్ కాదా? 3. తన ఫుడ్ వస్తే తీసుకోవద్దని పృథ్వీ మరీ మరీ చెప్పాడు, అయినా సరే యష్మిది పక్కనపెట్టి మరీ అతడికే ఫుడ్ తీసుకెళ్లావ్.. దీన్నెలా అర్థం చేసుకోవాలంటూ మణికంఠను నామినేట్ చేశాడు. యష్మి సైకోయిజం!ఈ నామినేషన్ జరుగుతున్నప్పుడు యష్మి ఆనందం అంతా ఇంతా కాదు. చప్పట్లు కొట్టి మరీ సంతోషించింది. మణికంఠ ఎప్పటిలాగే తడబడకుండా సమాధానాలిచ్చాడు. పదేపదే ఏడ్వడం మానుకుంటున్నానని, సీత ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ కాదని, మదర్ సెంటిమెంట్ వల్లే పృథ్వీకి ఫుడ్ ఇచ్చానని మూడింటికీ ఆన్సరిచ్చాడు. మిగతావారి నామినేషన్స్ రేపటి ఎపిసోడ్లో ప్రసారం కానుంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణుప్రియ స్వార్థాన్ని బయటపెట్టిన ప్రేరణ.. యష్మి మైండ్‌లో విషం!
శేఖర్ బాషా ఎలిమినేషన్‌తో హౌస్‌లో పన్నెండుమంది మిగిలారు. వీరిలో మళ్లీ ఒకర్ని పంపించడానికి అవసరమైన నామినేషన్ నేడు వాడివేడిగా జరిగింది. ఎప్పుడూ ఎదుటివాళ్లమీద నోరు పారేసుకునే సోనియాకు యష్మి చుక్కలు చూపించింది. అటు మణికంఠ మీద కూడా బాగానే ఫైర్ అయింది. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 16) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఇంట్లో ఉండి వ్యర్థంఇంట్లో ఉండి వేస్ట్ అనుకునేవాళ్లపై చెత్త గుమ్మరించి నామినేట్ చేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. మొదటగా సీత.. మీ టీమ్ సభ్యుల ప్రవర్తన లేదంటూ యష్మిని, పక్కవాళ్లను తొక్కేసి గెలవాలనుకోవడం నచ్చలేదని పృథ్వీపై చెత్త గుమ్మరించింది. విష్ణుప్రియ వంతురాగా.. సంచాలకురాలిగా ఫెయిల్ అయ్యావని, అలాగే నేను పిలుస్తుంటే కూడా పలకట్లేదని ప్రేరణను నామినేట్ చేసింది. మీ టీమ్‌సభ్యులు తొండాట ఆడారని, చీఫ్‌గా నువ్వు దాన్ని ఆపలేదంటూ యష్మిని నామినేట్ చేసింది.ప్రతిదాంట్లో జోక్యం అవసరమా?నాగమణికంఠ మాట్లాడుతూ.. ప్రతిదాంట్లో దూరడం నచ్చడం లేదదని యష్మిని నామినేట్ చేశాడు. అందుకు యష్మి.. అప్పుడు చీఫ్‌గా ఉన్నాను కాబట్టే ప్రతి విషయంలోనూ కలగజేసుకున్నానంది. నువ్వు ఫ్రెండ్ అంటూ డ్రామాలు చేశావు, ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నావు, నువ్వు ఫేక్ అని అరిచేసింది. ఫ్రెండ్ అయినా సరే నాకు ఏదైనా నచ్చకపోతే ముఖం మీదే చెప్తానన్నాడు మణికంఠ. పృథ్వీలో క్షణికావేశం నచ్చడం లేదని అతడిపై మణి చెత్త గుమ్మరించాడు. అయినా సరే తన కోపాన్ని మార్చుకునేదే లేదన్నాడు పృథ్వీ.విష్ణుప్రియ స్వార్థబుద్ధిఎమోషన్స్ ఎక్కువైపోతున్నాయని సీతను ప్రేరణ నామినేట్ చేసింది. ఎమోషన్స్ లేకుండా బండరాయిలా ఉండాలా? అని సీత సెటైర్ వేయగా నీకసలు కామన్సెన్స్ లేదంటూ ఏదేదో అరిచింది. విష్ణుప్రియను నామినేట్ చేస్తూ.. ఉన్నవే ఐదు గుడ్లు అయితే ఎవరి గురించి ఆలోచించకుండా అందులో రెండు గుడ్లు ఒక్కదానివే తినేశావంది. ఈ క్రమంలో బ్రెయిన్లెస్ పీపుల్ అని విష్ణు, యూజ్లెస్ పీపుల్ అని ప్రేరణ ఒకరినొకరు తిట్టుకున్నారు.నువ్వసలు కాంపిటీషనే కాదుఆదిత్య వంతురాగా.. ఎవరితో కలవనంత మాత్రాన నాలో నాయకత్వ లక్షణాలు లేవనడం బాధేసిందని విష్ణుప్రియను నామినేట్ చేశాడు. నీకు ఎంతో సపోర్ట్ చేస్తే విక్టిమ్ కార్డ్ వాడుతున్నావని మణికంఠను నామినేట్ చేశాడు. నైనిక మాట్లాడుతూ.. నాకసలు కాంపిటీషనే అనిపించడం లేదని సోనియాను, సంచాలకురాలిగా ఫెయిల్ అయ్యావంటూ ప్రేరణను నామినేట్ చేసింది. యష్మి వంతురాగా.. ఫ్రెండ్షిప్ పేరుతో మోసం చేసి నా హార్ట్ బ్రేక్ చేశావు కాబట్టి ఈ హౌస్‌కే నువ్వు డేంజరస్‌గా కనిపిస్తున్నావు అంటూ మణికంఠపై చెత్త వేసింది. చిన్నపిల్లల్లా వెక్కిరింతలేంటో!ఇందుకు మణికంఠ స్పందిస్తూ.. ఫ్రెండ్షిప్ను, గేమ్‌ను తాను మిక్స్ చేయను అని క్లారిటీ ఇచ్చాడు. తర్వాత యష్మి.. పనులు సరిగా చేయడం లేదంటూ నైనికను నామినేట్ చేసింది. నబీల్ వంతురాగా.. ఒక గేమ్‌లో సంచాలకురాలు ప్రేరణను మానిప్యులేట్ చేయడానికి ప్రయత్నించావంటూ యష్మిపై చెత్త గుమ్మరించాడు. సంచాలకురాలిగా ఫెయిల్ అయ్యావని, నీ వల్ల నేను రూ.1 లక్ష గెలిచే ఛాన్స్ కోల్పోయానని ప్రేరణను నామినేట్ చేశాడు.నీ మైండ్‌లో విషం.. ఈ క్రమంలో ప్రేరణ, నబీల్ ఒకరినొకరు వెక్కిరించుకుంటూ వాదించుకున్నారు. తర్వాత పృథ్వీ.. సీత, నైనికలను నామినేట్ చేశాడు. సోనియా వంతురాగా.. నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్, లీడర్‌గా నీకు మంచి లక్షణాలు లేవంటూ నైనికను నామినేట్ చేసింది. తర్వాత యష్మిని నామినేట్ చేస్తూ.. నీ మైండ్‌ను పాజిటివ్ వైపు తీసుకెళ్తే బాగుంటుంది, లేదంటే అది విషంగా మారుతుందని, అది ఎవరికీ మంచిది కాదని పేర్కొంది. ఏడ్చేసిన యష్మిఆమె మాటలతో షాకైన యష్మి.. నువ్వు నిఖిల్, పృథ్వీ, అభయ్ మీద చూపించిన ఇంట్రస్ట్ టీమ్‌పై చూపించలేదు అని ఉన్నమాట అనేసింది. ఎప్పుడూ సంచాలకురాలిగా ఉంటానన్నావే తప్ప ఎక్కడా గేమ్ ఆడేందుకు ముందుకు రాలేదు అంటూ ఇచ్చిపడేసింది. ఇంత మాట్లాడిన యష్మి.. సోనియా అన్న సూటిపోటి మాటలకు హర్టయి ఏడ్చేసింది. దీంతో సోనియా వెళ్లి తనను ఓదార్చడం గమనార్హం. నామినేషన్స్‌లో అభయ్చివర్లో నిఖిల్, అభయ్ ఇద్దరు చీఫ్‌లలో ఒకరికే నామినేషన్ నుంచి సేవ్ అయ్యే ఛాన్స్ ఉందన్నాడు బిగ్‌బాస్. దీంతో అభయ్.. తనకు సేవ్ అవుతానన్న నమ్మకం ఉందంటూ నామినేషన్స్‌లోకి వచ్చేందుకు అంగీకరించాడు. అలా ఈ వారం ప్రేరణ, పృథ్వి, మణికంఠ, విష్ణుప్రియ, సీత, నైనిక, యష్మి, అభయ్ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు.చదవండి: జరిగింది చూపించలేదు.. శేఖర్ బాషా ఎలిమినేషన్ వెనక అసలు రహస్యం -
బాషాకు మూకుమ్మడిగా అన్యాయం.. బ్రేకప్ స్టోరీ చెప్పిన సీత
బయట జనాలు చూస్తున్నారు, చూస్తున్నారు అంటూ విష్ణుప్రియ విషయంలో జాగ్రత్తగా ఉండమని నాగార్జున సోనియాకు బాగానే హింట్లు ఇచ్చాడు. ఆటలో చివర్లో ఉంటుందేమో కానీ ఇలాంటివి క్యాచ్ చేయడంలో ముందుండే సోనియా నేడు మొత్తం విష్ణుప్రియ పక్కనే కూర్చుంది. అంటే అప్పుడే స్నేహం మొదలెట్టేసిందన్నమాట! అటు శేఖర్ బాషాను అన్యాయంగా ఎలిమినేట్ చేశారు. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో నేటి (సెప్టెంబర్ 15) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..నిఖిల్‌కు నా గైడెన్స్ అవసరం: సోనియాసోనియా పాటతో ఫండే ఎపిసోడ్ మొదలైంది. తర్వాత హౌస్‌ను రెండు టీములుగా విడగొట్టే పనికి పూనుకున్నాడు నాగ్. నిఖిల్, అభయ్ టీమ్స్‌లోకి ఎవరు వెళ్లాలనుకుంటున్నారో చెప్పాలని హౌస్‌మేట్స్‌ను అడిగాడు. అలా సీత, మణికంఠ, విష్ణుప్రియ, పృథ్వీ, సోనియా.. నిఖిల్ టీమ్‌ను ఎంచుకున్నారు. ఈ క్రమంలో సోనియా.. నా అవసరం, నా గైడెన్స్ నిఖిల్‌కు ఎక్కువ అవసరం అంటూ తన గురించి గొప్పగా చెప్పుకుంది. హౌస్‌లోనే టాప్ పర్ఫామర్ అయిన నిఖిల్‌కు ఇంతవరకు ఏ గేమ్‌లోనూ గెలవని సోనియా.. గైడెన్స్ ఇస్తాననడం కాస్త విడ్డూరంగా అనిపించకమానదు. విష్ణుప్రియతో గొడవలకు ఫుల్స్టాప్!అభయ్ టీమ్‌లో యష్మి, ప్రేరణ, ఆదిత్య, నబీల్, మణికంఠ ఉన్నారు. అభయ్ టీమ్‌కు కాంతార, నిఖిల్ టీమ్‌కు శక్తి అన్న పేర్లు ఫిక్స్ చేశారు. అనంతరం విష్ణుప్రియ సేవ్ అయినట్లు ప్రకటించడంతో సోనియా వెళ్లి ఆమెను హగ్ చేసుకుంది. నాగ్ ఇచ్చిన హింట్లను బాగానే తలకు ఎక్కించుకుందని చూసేవారికి ఇట్లే అర్థమైపోయింది. తర్వాత శక్తి, కాంతారల టీమ్స్‌తో సరదా గేమ్ ఆడించారు. ఇందులో రెండు టీమ్స్‌కు టై అయింది. దీంతో ఎవరైనా తన బ్రేకప్ స్టోరీ చెప్తే వారికి ఎక్స్ట్రా పాయింట్ ఇస్తానన్నాడు నాగ్. అలా అన్నాడో లేదో సీత టక్కున లేచి తన విషాద లవ్ స్టోరీని మొదలుపెట్టింది. ఆరు నెలల్లో 14 కిలోలు తగ్గానా ఐదేళ్ల ప్రేమ గతేడాది ఏప్రిల్‌తో ముక్కలైంది. మా ఇంట్లో చెప్పి పెళ్లికి సైతం ఒప్పించాక ఆ అబ్బాయి వదిలేశాడు. ఆరు నెలలపాటు తనను ఒప్పించేందుకు ఎంతో ప్రయత్నించాను. ఈ క్రమంలో అతడు నన్ను ఏడాది నుంచి మోసం చేస్తున్నాడని తెలుసుకున్నాను. ఆ బ్రేకప్ బాధ వల్ల 14 కిలోల బరువు తగ్గాను. బాధ నుంచి బయటపడేందుకు సైక్రియాట్రిస్ట్‌ను కలిశాను. ఇప్పుడు ఆలోచిస్తుంటే బ్రేకప్ అవడమే మంచిదైందనిపిస్తోందని సీత పేర్కొంది. సీత పాయింట్ గెలవడంతో తన శక్తి టీమ్ విజేతగా నిలిచింది.హౌస్మేట్స్ చేతిలో ఎలిమినేషన్మీకు గిఫ్ట్ హ్యాంపర్ కావాలా? ప్రైజ్‌మనీలో మరో రూ.15 వేలు యాడ్ చేయాలా? అని నాగ్ రెండు ఆఫర్స్ ముందు పెట్టాడు. టీమ్ ముక్తకంఠంతో ప్రైజ్‌మనీ పెరగడమే ముఖ్యమని తేల్చి చెప్పింది. దీంతో ప్రైజ్‌మనీ రూ.5,60,000కు చేరింది. తర్వాత సీత సేవ్ అయినట్లు నాగ్ ప్రకటించాడు. అనంతరం నాగార్జున పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. నామినేషన్లో మిగిలిన బాషా, ఆదిత్యలలో ఎవరు సేవ్ అవ్వాలి? ఎవరు ఎలిమినేట్ అవ్వాలనేది హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. సీత తప్ప ప్రతి ఒక్కరూ బాషా గేమ్‌పై ఫోకస్ చేయలేకపోతున్నాడని, తను వెళ్లిపోవడమే మంచిదని నిర్ణయించారు. సీత మాత్రమే బాషాకు సపోర్ట్ఆదిత్యకు పూలమాల వేసి ఇంట్లో ఉండాలని కోరుకున్నారు. శేఖర్ లేకుండా ఇంటిని ఊహించలేకపోతున్నా అని సీత మాత్రమే అతడికి సపోర్ట్ చేసింది. ఫైనల్‌గా శేఖర్ ఎలిమినేట్ అని చెప్పడంతో విష్ణుప్రియ, సీత, నైనిక ఏడ్చేశారు. వాళ్లను ఓదార్చిన బాషా.. వెళ్లేముందు కూడా అందర్నీ నవ్వించి పోయాడు. నేను జోక్ చేస్తే మీరు వినేస్తారో లేదో కానీ మీరు అందరి హార్టులు విన్ చేస్తారు అని తెలిపాడు.ఎవరు ఫేక్? ఎవరు రియల్?స్టేజీపైకి వచ్చిన బాషాతో.. ఎవరు ఫేక్, ఎవరు రియల్ అన్నది చెప్పమని గేమ్ ఆడించాడు. అలా బాషా ముందుగా.. సీత.. మనసులో ఏదనిపిస్తే అదే మాట్లాడుతుంది, విష్ణుప్రియ.. చాలా అమాయకురాలు, ప్రేరణ.. జెన్యూన్, తను కూడా మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడుతుంది అంటూ ముగ్గురి ఫోటోలను రియల్ పర్సన్ లిస్టులో చేర్చాడు. సోనియాకు రెండు ముఖాలుఫేక్ మనుషుల గురించి ప్రస్తావిస్తూ సోనియా.. నవ్వు చాలా ప్రశాంతంగా అనిపించింది. కానీ నామినేషన్లో మాత్రం కాళి అవతారం చూశాను. తనకు రెండు ముఖాలున్నాయి. మణికంఠ కావాలనే ఫేక్ ఫేస్ పెట్టుకుంటాడు. బహుశా అది అతడి స్ట్రాటజీయేమో! ఆదిత్య.. తను నన్ను నామినేట్ చేసినప్పుడు స్పోర్టివ్‌గా తీసుకున్నాను. కానీ నేను నామినేట్ చేస్తే దాన్నతడు స్పోర్టివ్‌గా తీసుకోలేదు అని ఈ ముగ్గురినీ ఫేక్ లిస్టులో చేర్చాడు. మొత్తానికి ఒక మంచి వ్యక్తిని బిగ్‌బాస్ హౌస్ కోల్పోయింది.బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మి, నైనికలకు షాకిచ్చిన నాగ్.. సోనియా ఇక మాట్లాడకు!
వీకెండ్లో క్లాసులు పీకే ఆనవాయితీని నాగ్ మళ్లీ మొదలుపెట్టాడు. లేకపోతే కంటెస్టెంట్లు దారితప్పడం ఖాయం. అందుకే నాగ్ కొందరికి చీవాట్లు పెట్టాడు, వార్నింగ్‌లు ఇచ్చాడు. టీమ్ లీడర్‌గా విర్రవీగిన యష్మి ఫెయిల్ అని ప్రకటించాడు. అసలు ఉన్న మూడు టీముల్లో రెండింటినీ పీకేశాడు. ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 14) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..పృథ్వీకి వార్నింగ్నాగార్జున వచ్చీరాగానే టీమ్ లీడర్స్‌తో గేమ్ ఆడించాడు. మీ టీమ్‌లో బాగా ఆడిన వారి ఫోటోలను గ్రీన్ బాక్స్‌లో, సరిగా ఆడనివారి ఫోటోలను రెడ్ బాక్స్‌లో పెట్టాలన్నాడు. ముందుగా అఖండ టీమ్ చీఫ్ యష్మి.. అభయ్, పృథ్వీ బాగా ఆడారంది. ఈ సందర్భంగా నాగ్.. ఆటలో వాడకూడని పదాలు వాడుతున్నావు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అని పృథ్వీకి వార్నింగ్ ఇచ్చాడు.సంచాలక్‌గా ఫెయిల్ప్రేరణ సంచాలకురాలుగా కన్ఫ్యూజ్ అయిందంటూ తన ఫోటోను రెడ్ బాక్స్‌లో పెట్టింది యష్మి. ఈ సందర్భంగా నాగ్.. సంచాలకురాలిగా నువ్వు కూడా ఫెయిలే అంటూ ఓ వీడియో చూపించాడు. అందులో రేషన్ టాస్క్‌లో పావుకిలోకు దగ్గరగా మరమరాలు తీసుకొచ్చినవారిని విజేతగా ప్రకటిస్తానంది. తీరా సీతకు బదులుగా మణికంఠ పావుకిలోకు దగ్గరగా తెచ్చినప్పుడు కరెక్ట్‌గా 250 గ్రాములు తేలేదు కాబట్టి ఎవరినీ విన్నర్‌గా ప్రకటించనంది. కావాలనే అలా చేశాను: యష్మిఈ వీడియో చూపించేసరికి యష్మి ఏడ్చేసింది. తను కావాలనే అలా చేసినట్లు నిజం ఒప్పుకుంది. అంతులేని వీరులు టీమ్ ఓడిపోతే ఐదుగురు ఆకలితో అలమటిస్తారని.. వారు గెలవాలన్న ఉద్దేశ్యంతోనే ఆ పని చేశానని అంగీకరించింది. తర్వాత సోనియా ఫోటోను సైతం రెడ్ బాక్స్‌లో పెట్టింది. అప్పుడు నాగ్ మాట్లాడుతూ.. సోఫాలో కూర్చుంటే అయిపోదు, గేమ్స్ ఆడాలని ఆమెకు హితవు పలికాడు. అలాగే నామినేషన్స్‌లో విష్ణుప్రియకు ఫ్యామిలీ లేదని మాట్లాడిన వీడియో ప్లే చేసి క్లాసు పీకాడు.బెస్ట్ పర్ఫామర్ అతడేఅప్పటికీ సోనియా.. ఆ మాటలు అనుకోకుండా వచ్చాయే తప్ప కావాలని అనలేదని కవర్ చేసింది. దీంతో నాగ్ కోప్పడుతూ.. ఇంకేం మాట్లాడకు.. విష్ణుప్రియ డ్రెస్సింగ్ గురించి కూడా మాట్లాడావు, ప్రతీది జనాలు చూస్తున్నారు, నీ మంచి కోసమే చెప్తున్నా.. జాగ్రత్తగా ఉండు, నోరు అదుపులో పెట్టుకో అని హింటిస్తూనే, సుతిమెత్తగా హెచ్చరించాడు. యష్మి చివరగా శేఖర్ బాషా ఫోటోను రెడ్ బాక్స్‌లో పెట్టింది. అప్పుడు నాగ్.. బాషా తండ్రయ్యాడంటూ గుడ్‌న్యూస్ చెప్పాడు. అనంతరం యష్మి.. అవతలి టీమ్స్‌లో నబీల్‌కు బెస్ట్ పర్ఫామర్ అంటూ అతడికి గ్రీన్ బ్యాడ్జ్ ఇచ్చింది.అసలైన ఆడపులిఅనంతరం అంతులేని వీరులు టీమ్ చీఫ్ నైనిక వంతు రాగా.. నబీల్, విష్ణుప్రియ, సీతల ఫోటోలను గ్రీన్ బాక్స్‌లో పెట్టి ఆదిత్యను రెడ్ బాక్స్‌లో పడేసింది. సీత అద్భుతంగా ఆడిందని, తనే నాకు అసలైన ఆడపులి అని, మేము తింటున్న ఫుడ్ తనవల్లే గెలుచుకున్నామని పొగిడింది. ఈ సందర్భంగా నాగ్ సీత కోసం ఇంటి నుంచి వచ్చిన బహుమతిని ఇచ్చాడు. తర్వాత.. ఇతర టీమ్స్‌లో నుంచి నాగమణికంఠ బెస్ట్ పర్ఫామర్ అంటూ అతడికి నైనిక గ్రీన్ బ్యాడ్జ్ ఇచ్చింది.ఇద్దరికి బుల్లెట్లు దింపిన నాగ్మూడో టీమ్‌లో ఉన్నది ఇద్దరే ఇద్దరు. వీరి గురించి వీళ్లు చెప్పుకోనవసరమే లేదు. ఇద్దరూ అద్భుతంగా ఆడి ప్రైజ్‌మనీని పెంచడం గొప్ప విషయమని స్వయంగా నాగార్జునే మెచ్చుకున్నాడు. అటు నిఖిల్ కూడా మణికంఠ బాగా ఆడుతున్నాడని తన ఫోటోను గ్రీన్ బోర్డులో పెట్టాడు. బెస్ట్ పర్ఫామర్ అంటూ సీతకు గ్రీన్ బ్యాడ్జ్ తొడిగాడు. తర్వాత నాగ్.. చీఫ్‌గా నైనిక, యష్మి ఫెయిలయ్యారంటూ వారి ఫోటోలకు బుల్లెట్లు దింపాడు. అంతేకాకుండా ఆ క్లాన్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు.చీఫ్‌ను మీరే ఎంచుకోండిఇప్పుడు చీఫ్‌ను ఎంచుకోవాల్సిన బాధ్యతను కంటెస్టెంట్లపైనే వేశాడు. ఎవరిని చీఫ్‌గా సెలక్ట్ చేయాలనుకుంటున్నారు? ఎవరిని వద్దనుకుంటున్నారో చెప్పాలన్నాడు. ఈ క్రమంలో మణికంఠ.. విష్ణుప్రియను సెలక్ట్ చేసుకోగా అభయ్‌ను వద్దనుకున్నాడు. నబీల్.. మణికి సపోర్ట్ చేస్తూ ప్రేరణ చీఫ్‌గా వద్దనుకున్నాడు. విష్ణుప్రియ వంతురాగా.. మణికంఠకు సపోర్ట్ చేయగా ఆదిత్య చీఫ్‌గా వద్దని పేర్కొంది. ఆదిత్య వంతురాగా.. సీత చీఫ్ కావాలని, పృథ్వీ మాత్రం లీడర్‌గా వద్దన్నాడు.కొత్త చీఫ్ ఎవరంటే?సోనియా.. అభయ్ చీఫ్ అవాలని, శేఖర్ బాషా చీఫ్‌గా వద్దని పేర్కొంది. సీత వంతురాగా అభయ్ చీఫ్ అవాలని, ప్రేరణ లీడర్‌గా వద్దంది. ప్రేరణ, పృథ్వీ.. అభయ్కు సపోర్ట్ చేయగా ఆదిత్యకు లీడర్ అయ్యే అర్హత లేదన్నారు. అభయ్ వంతురాగా సోనియా లీడర్ కావాలని, మణికంఠకు చీఫ్ కావొద్దన్నాడు. బాషా.. అభయ్కు మద్దతివ్వగా సోనియాకు లీడర్ అయ్యే అర్హత లేదన్నాడు. మెజారిటీ జనాలు అభయ్కు సపోర్ట్ చేయడంతో అతడు లీడర్‌గా నిలిచాడు. దీంతో హౌస్‌లో ఇప్పుడు రెండు క్లాన్సే మాత్రమే ఉన్నాయి. ఏ క్లాన్లో ఎవరు ఉంటారేంటనేది నాగ్ తర్వాత నిర్ణయిస్తానన్నాడు. చివర్లో నైనిక, నిఖిల్ సేవ్ అయినట్లు ప్రకటించాడు. చదవండి: విజయ్ చివరి సినిమా ఫిక్స్ -
అతడే ఎలిమినేట్.. ముందే స్కెచ్చేసిన బిగ్‌బాస్!
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ లాంచింగ్ రోజు 14 మంది కంటెస్టెంట్లు హౌస్‌లో అడుగుపెట్టారు. విష్ణుపప్రియ, ఆదిత్య ఓం వంటివాళ్లు తప్ప మిగతా అందరూ జనాలకు పెద్దగా పరిచయం లేనివాళ్లే! కానీ రోజులు గడిచేకొద్దీ అందరూ సుపరిచితులైపోయారు. అంతలోనే ఎలిమినేషన్ దగ్గరకు రాగా బేబక్క ఇంటిని వీడింది..రెండో వారం నామినేషన్లో..మొదట్లో గమ్ముగా కూర్చున్న ఆమె వెళ్లిపోయేముందు మాత్రం తనలో ఫైర్ చూపించింది. ఇక రెండో వారం నాగమణికంఠ, కిర్రాక్ సీత, పృథ్వీ శెట్టి, నైనిక, శేఖర్ బాషా, విష్ణుప్రియ, ఆదిత్య, నిఖిల్ నామినేషన్లో ఉన్నారు. వీరిలో నిఖిల్, విష్ణుప్రియ అందరికంటే ముందు సేవ్ అవుతారనడంలో డౌటే లేదు. రోజురోజుకీ ఆట మెరుగుపర్చుకుంటున్న మణికంఠకూ బాగానే ఓట్లు పడుతున్నాయి. నైనికకు కూడా ఓట్లు పర్వాలేదనిపిస్తున్నాయి. సీతను కాపాడింది అదే!మిగిలిందల్లా ఆదిత్య, సీత, శేఖర్ బాషా, పృథ్వీ. ఈ నలుగురిలో ఈ వారం గేమ్‌లో రఫ్ఫాడించింది సీత. ఆమె డేంజర్ జోన్లో ఉన్నప్పటికీ తన గేమ్ ఆమెను కాపాడింది. పృథ్వీ.. గొడవలకు సై అంటూ దూకుతున్నాడు కాబట్టి.. ఆ కొట్లాటల కోసం మరికొన్నాళ్లు అలాగే కొనసాగించే ఛాన్స్ ఉంది. మిగిలింది బాషా, ఆదిత్య. కావాలనే..హౌస్‌లో అంతో, ఇంతో నవ్విస్తోంది బాషాయే! తన జోకులతో, పంచులతో చిరాకు పుట్టిస్తూనే చిరునవ్వు తెప్పిస్తున్నాడు. కానీ ఈ వారం అతడికి గేమ్స్ ఆడే అవకాశమే బిగ్‌బాస్ ఇవ్వలేదు. ఈ లెక్కన తనను పంపించేయాలని ముందే డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అటు ఆదిత్య.. హౌస్‌లో ఉన్నాడా? లేడా? అన్నట్లుగానే ఉన్నాడు. ఆదిత్య ఉన్నాడా? లేదా?ఈ వారమైనా కాస్త కనిపించమని నాగ్ చెప్పినా సరే ఎక్కడా యాక్టివ్‌గా ఉన్నట్లు కనిపించలేదు. దీంతో ఇతడిని ఎలిమినేట్ చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆదిత్యను సేవ్ చేసి బాషాను ఎలిమినేట్ చేశారట!బాషా ఎలిమినేట్!త్వరలోనే అవినాష్ లేదా రోహిణి వంటి కమెడియన్స్‌ను వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా హౌస్‌లోకి పంపించాలన్నది బిగ్‌బాస్ ప్లాన్. ఇందుకోసమే తనకు తెలిసిన కామెడీతో నవ్విస్తున్న బాషాను బయటకు పంపిస్తున్నారట! మరి ఇదెంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
చనిపోదామనుకున్న ఆదిత్య.. గిఫ్టులు అందుకున్నదెవరంటే?
ప్రైజ్‌మనీని పెంచుకునేందుకు బిగ్‌బాస్ ఇంటిసభ్యులు బాగానే కష్టపడ్డారు. అయితే అందరికంటే చిన్న టీమ్ ఎక్కువ ప్రైజ్‌మనీ గెలవడం విశేషం. టాస్కుల్లో రెచ్చిపోయిన హౌస్‌మేట్స్‌ను మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు సరదా గేమ్ ఆడించారు. ఆ వెంటనే వాళ్ల ఇంటి నుంచి కొన్ని వస్తువులు తెప్పించి కొందరికి ఇచ్చి మరికొందరికి కళ్లముందు ఆశపెట్టివెనక్కు తీసేసుకున్నారు. ఇంతకీ ఎవరెవరు బహుమతులు అందుకున్నారో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 13) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఆడపులిలా సోనియాప్రైజ్మనీ కోసం ఇచ్చిన పోటీ ముగిసిందని బిగ్‌బాస్ ప్రకటించాడు. అంతులేని వీరులు టీమ్.. రూ.75 వేలు, అఖండ టీమ్ రూ.1,25,000, కెరటం రూ.2,45,000 సాధించినట్లు వెల్లడించాడు. ఈ మూడింటిలో కెరటం టీమ్ సాధించిన డబ్బును ప్రైజ్‌మనీలో యాడ్ చేశారు. దీంతో ప్రైజ్‌మనీ రూ.5,45,000కు చేరింది. అనంతరం బిగ్‌బాస్ ఇంటిసభ్యులతో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడించాడు. ఈ క్రమంలో యష్మి చికెన్ దొంగిలించినట్లు ఒప్పుకుంది. సోనియా ఆడపులిలా రెడీ అయింది. విష్ణుప్రియ పోల్ డ్యాన్స్ చేసింది. నిఖిల్ చీర కట్టుకుని స్టెప్పులేశాడు.ఇంటి నుంచి బహుమతులుతర్వాత కంటెస్టెంట్లకు ఇంటి నుంచి బహుమతులు వచ్చాయని గుడ్‌న్యూస్ చెప్పాడు. కానీ ఐదుగురికి మాత్రమే గిఫ్ట్స్ పొందే అవకాశం ఉందని మెలిక పెట్టాడు. ఆ ఐదుగురు ఎవరనేది హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. ఎవరు గిఫ్ట్ పొందాలి? ఎవరి బహుమతి వెనక్కు పంపించాలన్నది ఇంటిసభ్యుల చేతిలోనే ఉంటుందన్నాడు. మొదటగా అభయ్, నిఖిల్ గిఫ్టులు వచ్చాయి.నాన్నకు తెలియకుండా దొంగతనంఅభయ మాట్లాడుతూ.. మా నాన్న లెక్కల మాస్టారు. తాను చాలా స్ట్రిక్ట్. కానీ, నేను సినిమాల్లోకి వస్తానంటే సపోర్ట్ చేశాడు. అలా నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నేను సంపాదించిన డబ్బుతో కొన్న వాచ్ అది.. ఆయన ఉన్నన్ని రోజులు అదే ధరించాడు అని చెప్పాడు. నిఖిల్ మాట్లాడుతూ.. అబ్బాయిలకు నాన్నను హగ్ చేసుకునే అదృష్టం ఉండదు. అందుకని నాన్నకు తెలియకుండా ఆయన షర్ట్ దొంగతనం చేశాను అంటూ ఏడ్చేశాడు. నైనిక కోసం సీత త్యాగంమెజారిటీ ఇంటిసభ్యులు అభయ్కు లాలీపాప్ ఇచ్చి సపోర్ట్ చేశారు. దీంతో అతడు వాచీ అందుకున్నాడు. నైనిక, సీతకు బొమ్మలు గిఫ్ట్స్‌గా వచ్చాయి. సీత మాట్లాడుతూ.. ఐదేళ్లపాటు రిలేషన్లో ఉన్నాక అతడు నన్ను వదిలేసి పోయాడు. అప్పుడు నాకు ఒక ఫ్రెండ్ దొరికాడు. అతడే ఈ బొమ్మ కొనిచ్చాడు. ఆ బొమ్మ లేకుండా నేనసలు నిద్రపోలేనంటూ ఏడ్చేసింది. కానీ ఈ బిగ్‌బాస్ హౌస్‌లో నైనిక, విష్ణుప్రియ దొరికారని.. వాళ్లతో కబుర్లు చెప్తూ నిద్రపోతున్నానంది. కాబట్టి ఆ బొమ్మ లేకుండా ఉండగలనని నైనికకు గిఫ్ట్ ఇచ్చేయండని కోరింది.చాలాసార్లు విడిపోదామనుకున్నామునైనిక మాట్లాడుతూ.. ఎవరినైనా గాఢంగా ప్రేమిస్తే ఎన్నో గొడవలు జరుగుతాయి. అలా ఎన్నోసార్లు గొడవలయ్యాయి, చాలాసార్లు విడిపోదామనుకున్నాము. ఒక హింసాత్మక రిలేషన్ నుంచి బయటకొచ్చాక ఈ వ్యక్తి వల్లే ఆ బాధను మర్చిపోయాను. నేనూ కొన్ని తప్పులు చేశాను, సారీ కన్నా, నన్ను ఇంతలా ప్రేమిస్తున్నందుకు థాంక్యూ అని ఏడ్చేసింది. సీత త్యాగం, హౌస్మేట్స్ సపోర్ట్‌తో నైనిక తన బొమ్మను గెల్చుకుంది.అదే చివరి ఫోటో..నబీల్, పృథ్వీలకు తండ్రి ఫోటోలు వచ్చాయి. నబీల్ మాట్లాడుతూ.. నాన్నకు సింగర్ అవ్వాలన్నది కోరిక. తనకెలాగూ అనుకున్న కల నెరవేరలేదని నాకు ఎక్కువ సపోర్ట్ చేసేవాడు. కాలేజీకి కూడా సరిగా వెళ్లకుండా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఉండేవాడిని. 2021 జూన్‌లో నాన్నతో చివరిసారి ఫోటో దిగాను. ఆ మరుసటి నెలలోనే తను చనిపోయాడు. కానీ, నేను స్ట్రాంగ్.. పృథ్వీకి వచ్చిన బహుమతిని అతడికి ఇచ్చేయమని కోరాడు.నాన్నతో దిగిన ఏకైక ఫోటోపృథ్వీ మాట్లాడుతూ.. మా నాన్నతో నేను దిగిన ఏకైక ఫోటో ఇదొక్కటే. మా నాన్నతో ఆగస్టు 15న చాలాసేపు మాట్లాడాను. ఆరోజే ఆయన కాలం చేశాడు. నేను నటుడినవ్వాలన్నది ఆయన కల. అది నెరవేర్చాను అని చెప్పుకొచ్చాడు. మెజారిటీ ఇంటిసభ్యులు నబీల్‌కు లాలీపాప్స్ ఇవ్వడంతో అతడు ఫోటోఫ్రేమ్ అందుకున్నాడు. అనంతరం మణికంఠకు శాలువా, ఆదిత్యకు తండ్రి ఫోటో ఫ్రేమ్ గిఫ్టుగా వచ్చాయి. చనిపోదామనుకున్నా..మణికంఠ మాట్లాడుతూ.. అమ్మ చనిపోతుందనడానికి ముందు తన శాలువా ఇచ్చింది. సింపతీ కోసమైతే దీన్ని నాకు ఇవ్వకండి అన్నాడు. ఆదిత్య మాట్లాడుతూ.. నాలో ఉన్న మంచి లక్షణాలకు నాన్నే కారణం. కరోనా టైంలో నా భార్య, కుమారుడు, తల్లి.. అందరికీ కోవిడ్ వచ్చింది. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. అప్పుడు నాన్న ఫోటో కిందపడి నన్ను హెచ్చరించింది అని ఎమోషనల్ అయ్యాడు. దొంగతనంఈ క్రమంలో నాన్న గొప్పదనం గురించి చెప్తూ బాషా భావోద్వేగానికి లోనయ్యాడు. హౌస్మేట్స్ సపోర్ట్‌తో ఆదిత్య తన తండ్రి ఫోటో అందుకున్నాడు. ఇకపోతే మణికంఠ అర్ధరాత్రి అఖండ టీమ్ బెడ్రూమ్లో దూరి సరుకులు దొంగతనం చేశాడు. అందర్నీ ఓ ఆటాడుకుందామనే ఈ ప్లాన్ వేసినట్లున్నాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణుప్రియను టార్గెట్ చేసిన సోనియా! ఇప్పటికీ అదే అంటా!
వంట చేస్తూ అందరి కడుపు నింపిన బేబక్కను మొదటివారమే పంపించేశారు. దీంతో నిఖిల్ గరిట తిప్పాల్సిన పరిస్థితి! కానీ ఒక్కరికోసం మాత్రమే స్పెషల్‌గా వండాడు. మరోవైపు బేబక్క ఎలిమినేషన్‌తో నైనిక, సీతకు బయట ఏం జరుగుతుందో అర్థమైపోయింది. జనాలు ఎటువంటి గేమ్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు? ఏంటనేది సినిమా క్లియర్‌గా తెలిసిపోయింది. ఇక నామినేషన్స్‌ను కంటెస్టెంట్లు యుద్ధంలా పూర్తి చేశారు. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (సెప్టెంబర్ 9) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..చిట్టా పెద్దగానే ఉందే!ఎవరు ఎలిమినేట్ అవుతారనుకున్నానో వాళ్లే ఫస్ట్ సేవ్ అయ్యారంటూ తన బాధను బయటపెట్టింది విష్ణుప్రియ. అయినా సోనియా ఎలిమినేట్ అవుతుందని ఎలా అనుకున్నావని ప్రేరణ నోరెళ్లబెట్టింది. అనంతరం పృథ్వీ.. సోనియాకు ఎలాంటి అబ్బాయి నచ్చుతాడనేది కూపీ లాగింది. అందుకామె.. నన్ను అర్థం చేసుకోవాలి, ప్రోగ్రెసివ్‌గా ఉండాలి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, ముఖ్యంగా నేను చేయాలనుకున్నదానికి అడ్డుపడొద్దు, నా అంత బుద్ధి ఉండొద్దు అని కోరికల చిట్టా బయటపెట్టింది.ఆమెకు ఇష్టమైన కూర చేసిన నిఖిల్మరోపక్క ఈమె మెంతి టమాట కూర తినాలని కోరిక పుట్టడంతో నిఖిల్ కిచెన్‌లో గరిట తిప్పాడు. ఈ విషయాన్ని సీత బయటపెట్టడంతో విష్ణుప్రియ నోరెళ్లబెట్టింది. తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలైంది. కంటెస్టెంట్లు తమ టీమ్‌లోని సభ్యులను మినహాయించి అవతలి టీమ్స్‌లో ఎవరినైనా నామినేట్ చేయొచ్చని బిగ్‌బాస్ (#BiggBoss8Telugu) తెలిపాడు. పెద్ద టీమ్ చీఫ్ అయిన కారణంగా యష్మి నామినేషన్స్‌లో ఉండబోదని పేర్కొన్నాడు.కోరిక తీర్చేసుకున్న సీతమొదటగా సీత.. గతవారమే నిన్ను నామినేట్ చేయాలనుకున్నాను, ఇప్పుడు ఆ ఛాన్స్ దొరికిందంటూ నిఖిల్‌పై రంగు పోసింది. చెత్తబుట్టలో నుంచి గ్లాస్ తీసి బయటపెట్టడం నన్ను అవమానించినట్లుగా అనిపించిందని ప్రేరణను నామినేట్ చేసింది. అభయ్.. ఇంకా బెస్ట్ ఇవ్వాలంటూ విష్ణుప్రియను, ఇన్వాల్వ్మెంట్ తక్కువైందంటూ ఆదిత్యను నామినేట్ చేశాడు. సోనియా వర్సెస్ సీతసోనియా.. చీఫ్‌గా ఫెయిలైందంటూ నైనికను నామినేట్ చేసింది. సీతను నిలబెట్టి.. టాస్కులు అర్థం చేసుకోలేకపోతున్నావంటూ క్లాసు పీకింది. అభయ్‌తో జరిగిన గొడవలోనూ నీకు పర్సనాలిటీ ప్రాబ్లమ్ ఉందని తేలిందని, నీకింకా మెచ్యూరిటీ రావాలంటూ తిట్టిపోసింది. అసలు టీమ్‌లో ఎలా ఉండాలో కూడా తెలియదని చులకన చేసింది. టోటల్‌గా గ్రూప్ అంతా ఫెయిలైందని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇదంతా విన్న సీత.. నువ్వు గేమ్‌ను అర్థం చేసుకున్నాక నాతో మాట్లాడని కౌంటరిచ్చింది. నీకు మెచ్యూరిటీ లేదని తిరిగనేసరికి.. మెచ్యూరిటీ గురించి మాట్లాడొద్దని సోనియా హెచ్చరించింది.ఆదిత్యపై పడ్డారే!మణికంఠ.. ప్రతి మనిషి గురించి పాజిటివ్స్ చెప్తున్నారు. అది సేఫ్ గేమా? లేదంటే మీ వ్యక్తిత్వమే అలాంటిదా? అనేది అర్థం కావడం లేదు. అలాగే నామినేషన్స్ ఒత్తిడిని ఎలా తీసుకుంటావో చూడాలనుందని ఆదిత్యను నామినేట్ చేశాడు. అందుకతడు.. మీరు నాకు పబ్లిసిటీ చేస్తున్నారంటూ నవ్వుతూ స్వీకరించాడు. సీరియస్ టైంలో కుళ్లు జోకులు వేస్తున్నావని, అలాగే స్వీట్లు తీసుకెళ్లి దాచేశావని బాషాను నామినేట్ చేశాడు.ఆరని జ్వాలఆదిత్య వంతు రాగా.. స్ట్రాంగ్ కంటెండర్ అంటూ అభయ్ నవీన్‌ను, ఈ గేమ్‌కు మీరు ఫిట్ కాదంటూ శేఖర్ బాషాను నామినేట్ చేశాడు. విష్ణుప్రియ.. నా తప్పులు వెతకడానికి నాతో జర్నీ చేశానని గతవారం నామినేషన్లో చెప్పడం నచ్చలేదని మణికంఠపై రంగు చల్లింది. తర్వాత సోనియాను నామినేట్ చేస్తూ.. మీకు కోపం వచ్చినప్పుడు అవతలివారిపై నిందలు వేస్తున్నారంది.దుస్తులు సరిగా వేసుకోవు!అందుకామె.. నీకు నాతో అంత ర్యాపో లేకపోయినా నాపై జోకులు వేశావు.. సారీ చెప్పినంత మాత్రాన మాటల్ని వెనక్కు తీసుకోలేం.. నువ్వు అడల్ట్రేటెడ్ జోకులు చేస్తావు.. ఇప్పటికీ అదే అంటాను. బట్టలు సరిగా వేసుకుని ఒక మనిషి పక్కన నిల్చోవాలనేది కూడా నీకు తెలియదు కదా.. ఒకరు కంఫర్ట్‌గా లేరని తెలిసినా కూడా అలా వారి పక్కన నిల్చున్నప్పుడే నీ వ్యక్తిత్వం తెలుస్తోంది అంటూ విష్ణుప్రియను మరింత రెచ్చగొట్టింది. పచ్చకామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని సెటైర్లు వేసింది విష్ణుప్రియ.ఒకే ఒక్కడితో ప్రాబ్లమ్బాషా వంతు రాగా.. నాకు ఒకే ఒక్కడితో ప్రాబ్లమ్.. అతడే మణికంఠ.. అతడు జనజీవన స్రవంతిలో కలవనంతవరకు నామినేట్ చేస్తూనే ఉంటానంటూ తనపై రంగు గుమ్మరించాడు. నేను బిగ్‌బాస్‌కు అన్‌ఫిట్ అని మీరు నిర్ణయించడం బాధేసిందంటూ ఆదిత్య ఓంను నామినేట్ చేశాడు. వీళ్ల రూటే సెపరేటుదీంతో ఆదిత్య.. నా వయసులో ఏం జరుగుతుందో మీకు తెలియదు.. నేను ఫ్యామిలీని వదిలేసి వచ్చాను. అన్ని పనులు చేస్తున్నాను అంటూ సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడాడు. నిజానికి వీళ్లిద్దరూ ఒకర్ని ఒకరు నామినేట్ చేసుకున్నారు కానీ మనసులో మాత్రం బాధపడుతున్నారని చూసే జనాలకు ఇట్టే తెలిసిపోతుంది. అందుకే నామినేషన్ అయ్యాక హగ్ చేసుకుని ముద్దులు పెట్టుకున్నారు.బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
చుక్కలు చూపిస్తున్న యష్మి టీమ్.. మణిలో ఈ యాంగిల్ ఉందా!
సాధారణంగా బిగ్‌బాస్ మొదలైన ఒకటీరెండు వారాలవరకు పెద్దగా కంటెంట్ ఏమీ ఉండదు. కానీ ఈ సీజన్లో మాత్రం కంటెస్టెంట్లు తొలి రోజు నుంచే కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. శేఖర్ బాషా తన వెరైటీ కామెడీతో, సోనియా పాయింట్లు లాగుతూ గొడవ పడుతూ, నాగమణికంఠ ఏడుస్తూ.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఎంటర్టైన్నారు. మరి ఈరోజు బిగ్‌బాస్ హౌస్‌లో ఏం జరిగిందో నేటి (సెప్టెంబర్ 6) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..తెలివిగా ఆడిన నైనిక టీమ్యష్మి, నైనిక, నిఖిల్.. ఈ ముగ్గురు చీఫ్స్‌లో ఎవరు పవర్ఫులో తేల్చుకోవాలంటూ బిగ్‌బాస్ టాస్కులు ఇచ్చాడు. అయితే నిఖిల్ టీమ్‌లో కేవలం ముగ్గురే ఉండటంతో యష్మి, నైనిక టీమ్స్‌కు మాత్రమే పోటీ పెట్టాడు. ఇప్పటికే ఓ టాస్కులో యష్మి టీమ్ గెలవగా తాజాగా మరో టాస్క్ ఇచ్చాడు. అందులో బుర్ర పెట్టి ఆడిన నైనిక టీమ్‌ను సంచాలకుడు నిఖిల్ విజేతగా ప్రకటించాడు. తన ఫ్రెండ్ నిఖిల్ తన టీమ్‌నే గెలిపిస్తాడని బోలెడు ఆశలు పెట్టుకున్న యష్మి ఇది జీర్ణించుకోలేక కాసేపు కస్సుబుస్సులాడింది.ఈ వారం ఎవరిపై వేటుఎప్పుడూ గొడవకు సై అంటూ ముందుకు దూకే సోనియా సైలెంట్‌గా ఉండటంతో ఏమైందని నిఖిల్ ఆరా తీశాడు. ఒంటరిగా కూర్చున్న తనతో కబుర్లు పెట్టేందుకు ప్రయత్నించాడు. మరోవైపు కిచెన్‌లో అభయ్, బాషా, ప్రేరణ ఈ వారం నాగమణికంఠ ఎలిమినేట్ అవచ్చని ఊహించారు. కానీ పోలింగ్ చూస్తుంటే ఈ ఊహాగానాలు బోల్తా కొట్టడమే ఖాయమనిపిస్తోంది. ఇకపోతే ఇప్పటివరకు రెండు గేముల్లో చెరొకటి గెలిచిన యష్మి, నైనిక టీమ్స్‌కు ఆఖరిగా ఓ ఛాలెంజ్ ఇచ్చాడు. స్వింగింగ్ ప్లాట్‌ఫామ్‌పై ఐదు ఇటుకలను మొదటగా పేర్చాలని చెప్పాడు. పవర్ఫుల్ చీఫ్‌గా యష్మిఇక్కడ రెండు టీమ్స్ ఎలా గెలవాలన్నదానికి బదులు పక్కవారిని ఎలా ఓడించాలన్నదానిపైనే దృష్టి పెట్టారు. ఈ ఛాలెంజ్‌లో యష్మి టీమ్ గెలిచింది. రెండు టాస్కులు గెలిచి పవర్ఫుల్ చీఫ్గగా నిలిచిన యష్మి.. నిఖిల్ టీమ్‌లో నుంచి సోనియాను లాక్కుంది. అలాగే డ్రాగన్ రూమ్‌లోకి తన టీమ్‌తో పాటు వెళ్లే ఛాన్స్ కొట్టేసింది. అందులో చాక్లెట్లు, కూల్‌డ్రింక్స్ అన్నీ ఉండటంతో టీమ్ సభ్యులు తెగ ఆనందపడిపోయారు.మూడు టీమ్స్ పేర్లివేఅనంతరం మూడు టీమ్స్‌ను మూడు జెండాలు, పేర్లు రూపొందించుకోవాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. అందులో భాగంగా యష్మి టీమ్ అఖండగా, నైనిక టీమ్.. అంతులేని వీరులుగా, నిఖిల్ టీమ్.. కెరటంగా నిలుచున్నారు. ఈ మూడు టీమ్ లీడర్స్‌ను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచాడు. పవర్ఫుల్ చీఫ్ అయిన యష్మి టీమ్‌లో ఎవరూ ఇంటి పనులు చేయాల్సిన అవసరం లేదంటూ వారికి గుడ్‌న్యూస్ చెప్పాడు. లబోదిబోమన్న అంతులేని వీరులు టీమ్అంతేకాకుండా ఇంట్లో ఎవరు ఏ పని చేయాలనేది యష్మి నిర్ణయించాలన్నాడు. దీంతో ఆమె కెరటం టీమ్‌కు వంటపని కేటాయించింది. మిగతా పనులన్నీ అంతులేని వీరులు టీమ్ చేయాలని నిర్ణయించింది. ఇది విని అంతులేని వీరులు టీమ్ సభ్యులు గుండెలు బాదుకున్నారు. గొడ్డుచాకిరీ చేయాలా? అని ఆవేశపడ్డారు, ఎమోషనలయ్యారు. అటుపక్క దొరికిందే ఛాన్స్ అన్నట్లు అఖండ టీమ్ రెచ్చిపోయింది. డస్ట్‌బిన్‌లో గ్లాస్ పడేసిన ప్రేరణ.. ఇది తన పని కాదన్నట్లు ఆ గ్లాసును మళ్లీ బయట తీసిపెట్టింది. నోరేసుకుని పడిపోకు..అటు అభయ్ నవీన్.. నచ్చింది వండుకుంటానంటూ కిచెన్‌లో అడుగుపెట్టాడు. అలాగైతే వండుకున్నాక మీ గిన్నెలు కూడా మీరే తోముకోండని సీత ఒంటికాలిపై లేచింది. అందుకు అభయ్.. మీరేమీ నా ఇంట్లో పని చేస్తలేరు.. ఇది గేమ్.. దిమాక్ ఉండాలి.. నోరేసుకుని పడిపోకు.. అని ఫైర్ అయ్యాడు. ఆ మాటతో సీత ఏడ్చేసింది. ఇక మొన్నటివరకు కన్నీళ్ల కుళాయి తెరిచిన మణికంఠ తనలో రెమోని బయటకు తీశాడు. భార్యను తలుచుకుని రొమాంటిక్ అయ్యాడు. ఈసారి భార్యను హగ్ చేసుకోవడానికి వెళ్లినప్పుడు సెంటు పూసుకుని వెళ్తానంటూ సిగ్గుపడిపోయాడు. బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
'బేబీ' నటికి బెదిరింపులు.. చంపేస్తామంటూ!
విడుదలైన 10 రోజులు అవుతున్నా 'బేబీ' దూకుడు తగ్గట్లేదు. ఇందులో హీరోహీరోయిన్లు వైష్ణవి, ఆనంద్, విరాజ్తోపాటు సహాయ పాత్రల్లో నటించిన వాళ్లు తమ యాక్టింగ్‌తో ఇచ్చిపడేశారు. హీరోయిన్ ఫ్రెండ్‌గా నెగిటివ్ క్యారెక్టర్ చేసిన కిరాక్ సీత ఆకట్టుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈమె.. తనని కొందరు లైంగిక వేధించేందుకు ప్రయత్నించారనే విషయాన్ని బయటపెట్టింది. 'ఓ ఈవెంట్‌కి నేను వెళ్లొస్తున్న టైంలో కొందరు కుర్రాళ్లు వెంటబడ్డారు. నా ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి ఈ విషయం చెబితే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వమని సలహా ఇచ్చారు. కానీ నేను అలా చేయలేదు. కొందరైతే నన్ను రేప్ చేస్తాం, చంపేస్తామని బెదిరించారు. మరికొందరు నా అడ్రస్ తెలుసుకోవడానికి ట్రై చేశారు. కానీ వీటన్నింటినీ నేను లైట్ తీసుకున్నాను' (ఇదీ చదవండి: కలెక్షన్స్‌లో 'బేబీ' ఆల్‌టైమ్ రికార్డ్!) 'నన్ను అంతలా బెదిరించినా సరే వాటిని నేను లైట్ తీసుకోవడానికి ఒక్కటే కారణం. నా రీల్ లైఫ్ క్యారెక్టర్ చూసి, వాళ్లు ఈ అభిప్రాయానికి వచ్చారు. కానీ నా రియల్ లైఫ్ వేరే అని వాళ్లకు తెలీదు. అందుకే వాటిని పట్టించుకోలేదు. 'బేబీ'లో పాత్ర వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందని డైరెక్టర్ నాకు ముందే చెప్పారు' అని కిరాక్ సీత చెప్పుకొచ్చింది. గతంలో యూట్యూబర్ సరయూతో కలిసి వర్క్ చేసిన ఈమె.. ఆ తర్వాత ఏదో సమస్య కావడంతో ఆ ఛానెల్ నుంచి బయటకొచ్చేసింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో బోల్డ్ తరహా పాత్రల్లో చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి ఈమె, తనని కొందరు బెదిరించారని చెప్పడం చర్చనీయాంశంగా మారిపోయింది. (ఇదీ చదవండి: 'బేబీ' ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్)