మొన్నటి నామినేషన్స్‌లో తేజ సూటిగా, సుత్తి లేకుండా మాట్లాడాడు. కరెక్ట్ పాయింట్లు చెప్తూ సీత, మణికంఠను నామినేట్ చేశాడు. అయితే మణికి ఒకే ఒక్క నామినేషన్ పడటంతో అతడు నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు. కానీ సీతకు ఏకంగా ఐదు పడటంతో నామినేషన్స్‌లోకి వచ్చింది. ఇప్పటికే సండే ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తవగా సీత ఎలిమినేషన్ కూడా జరిగిపోయింది.
నీళ్లు చల్లిందని నామినేట్..
ఇంతకీ విషయమేంటంటే.. గత సీజన్‌లో తేజ ఎవర్ని నామినేట్ చేస్తే వాళ్లు నేరుగా ఎలిమినేట్ అయిపోయారు. పైగా చెత్త కారణాలు చెప్పి నామినేట్ చేయడం మరింత విడ్డూరం. నిద్రపోతున్న తన మీద నాలుగు చుక్కల నీళ్లు చిలకరించిందంటూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ పూజామూర్తిని నామినేట్ చేసి పంపించేశాడు.
ఆరుగురిని పంపించేశాడు
స్ట్రాంగ్ కంటెస్టెంట్, నామినేషన్స్‌లోకి వస్తే ఆత్మస్థైర్యం పెరుగుతుందంటూ సందీప్ మాస్టర్‌ను పొగుడుతూ మరీ బయటకు తోసేశాడు. ఇలా ఒకరిద్దరు కాదు.. దామిని భట్ల, రతిక రోజ్, నయని పావని, శుభశ్రీ.. వీళ్లంతా తేజ బాధితులే! ఆరుగురిని పంపించాక తొమ్మిదోవారం ఇతడు ఎలిమినేట్ అయ్యాడు. సిల్లీ రీజన్స్‌తో నామినేట్ చేయొద్దంటూ శివాజీ ఇతడిని నామినేట్ చేయగా అదే వారం వెళ్లిపోయాడు.
ఈసారి కూడా సీన్ రిపీట్
ఇప్పుడు తేజ వచ్చీరాగానే సీతను నామినేట్ చేయడం, ఆమె ఎలిమినేట్ అవడం చూస్తుంటే ఈసారి కూడా సీజన్ 7లో జరిగింది రిపీట్ అయ్యేట్లు కనిపిస్తోంది. ఇది గమనించిన కొందరు నెటిజన్లు.. నెక్స్ట్ వీక్ తేజ ఎవర్ని ఎలిమినేట్ చేస్తాడో చూడాలంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో.. మా ఫేవరెట్ కంటెస్టెంట్ తేజ చేతిలో పడకపోతే చాలని కోరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment