
శేఖర్ బాషా ఎలిమినేషన్‌తో హౌస్‌లో పన్నెండుమంది మిగిలారు. వీరిలో మళ్లీ ఒకర్ని పంపించడానికి అవసరమైన నామినేషన్ నేడు వాడివేడిగా జరిగింది. ఎప్పుడూ ఎదుటివాళ్లమీద నోరు పారేసుకునే సోనియాకు యష్మి చుక్కలు చూపించింది. అటు మణికంఠ మీద కూడా బాగానే ఫైర్ అయింది. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 16) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..

ఇంట్లో ఉండి వ్యర్థం
ఇంట్లో ఉండి వేస్ట్ అనుకునేవాళ్లపై చెత్త గుమ్మరించి నామినేట్ చేయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. మొదటగా సీత.. మీ టీమ్ సభ్యుల ప్రవర్తన లేదంటూ యష్మిని, పక్కవాళ్లను తొక్కేసి గెలవాలనుకోవడం నచ్చలేదని పృథ్వీపై చెత్త గుమ్మరించింది. విష్ణుప్రియ వంతురాగా.. సంచాలకురాలిగా ఫెయిల్ అయ్యావని, అలాగే నేను పిలుస్తుంటే కూడా పలకట్లేదని ప్రేరణను నామినేట్ చేసింది. మీ టీమ్‌సభ్యులు తొండాట ఆడారని, చీఫ్‌గా నువ్వు దాన్ని ఆపలేదంటూ యష్మిని నామినేట్ చేసింది.

ప్రతిదాంట్లో జోక్యం అవసరమా?
నాగమణికంఠ మాట్లాడుతూ.. ప్రతిదాంట్లో దూరడం నచ్చడం లేదదని యష్మిని నామినేట్ చేశాడు. అందుకు యష్మి.. అప్పుడు చీఫ్‌గా ఉన్నాను కాబట్టే ప్రతి విషయంలోనూ కలగజేసుకున్నానంది. నువ్వు ఫ్రెండ్ అంటూ డ్రామాలు చేశావు, ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నావు, నువ్వు ఫేక్ అని అరిచేసింది. ఫ్రెండ్ అయినా సరే నాకు ఏదైనా నచ్చకపోతే ముఖం మీదే చెప్తానన్నాడు మణికంఠ. పృథ్వీలో క్షణికావేశం నచ్చడం లేదని అతడిపై మణి చెత్త గుమ్మరించాడు. అయినా సరే తన కోపాన్ని మార్చుకునేదే లేదన్నాడు పృథ్వీ.

విష్ణుప్రియ స్వార్థబుద్ధి
ఎమోషన్స్ ఎక్కువైపోతున్నాయని సీతను ప్రేరణ నామినేట్ చేసింది. ఎమోషన్స్ లేకుండా బండరాయిలా ఉండాలా? అని సీత సెటైర్ వేయగా నీకసలు కామన్‌సెన్స్ లేదంటూ ఏదేదో అరిచింది. విష్ణుప్రియను నామినేట్ చేస్తూ.. ఉన్నవే ఐదు గుడ్లు అయితే ఎవరి గురించి ఆలోచించకుండా అందులో రెండు గుడ్లు ఒక్కదానివే తినేశావంది. ఈ క్రమంలో బ్రెయిన్‌లెస్ పీపుల్ అని విష్ణు, యూజ్‌లెస్ పీపుల్ అని ప్రేరణ ఒకరినొకరు తిట్టుకున్నారు.

నువ్వసలు కాంపిటీషనే కాదు
ఆదిత్య వంతురాగా.. ఎవరితో కలవనంత మాత్రాన నాలో నాయకత్వ లక్షణాలు లేవనడం బాధేసిందని విష్ణుప్రియను నామినేట్ చేశాడు. నీకు ఎంతో సపోర్ట్ చేస్తే విక్టిమ్ కార్డ్ వాడుతున్నావని మణికంఠను నామినేట్ చేశాడు. నైనిక మాట్లాడుతూ.. నాకసలు కాంపిటీషనే అనిపించడం లేదని సోనియాను, సంచాలకురాలిగా ఫెయిల్ అయ్యావంటూ ప్రేరణను నామినేట్ చేసింది. యష్మి వంతురాగా.. ఫ్రెండ్‌షిప్ పేరుతో మోసం చేసి నా హార్ట్ బ్రేక్ చేశావు కాబట్టి ఈ హౌస్‌కే నువ్వు డేంజరస్‌గా కనిపిస్తున్నావు అంటూ మణికంఠపై చెత్త వేసింది.

చిన్నపిల్లల్లా వెక్కిరింతలేంటో!
ఇందుకు మణికంఠ స్పందిస్తూ.. ఫ్రెండ్‌షిప్‌ను, గేమ్‌ను తాను మిక్స్ చేయను అని క్లారిటీ ఇచ్చాడు. తర్వాత యష్మి.. పనులు సరిగా చేయడం లేదంటూ నైనికను నామినేట్ చేసింది. నబీల్ వంతురాగా.. ఒక గేమ్‌లో సంచాలకురాలు ప్రేరణను మానిప్యులేట్ చేయడానికి ప్రయత్నించావంటూ యష్మిపై చెత్త గుమ్మరించాడు. సంచాలకురాలిగా ఫెయిల్ అయ్యావని, నీ వల్ల నేను రూ.1 లక్ష గెలిచే ఛాన్స్ కోల్పోయానని ప్రేరణను నామినేట్ చేశాడు.

నీ మైండ్‌లో విషం..
ఈ క్రమంలో ప్రేరణ, నబీల్ ఒకరినొకరు వెక్కిరించుకుంటూ వాదించుకున్నారు. తర్వాత పృథ్వీ.. సీత, నైనికలను నామినేట్ చేశాడు. సోనియా వంతురాగా.. నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్, లీడర్‌గా నీకు మంచి లక్షణాలు లేవంటూ నైనికను నామినేట్ చేసింది. తర్వాత యష్మిని నామినేట్ చేస్తూ.. నీ మైండ్‌ను పాజిటివ్ వైపు తీసుకెళ్తే బాగుంటుంది, లేదంటే అది విషంగా మారుతుందని, అది ఎవరికీ మంచిది కాదని పేర్కొంది.

ఏడ్చేసిన యష్మి
ఆమె మాటలతో షాకైన యష్మి.. నువ్వు నిఖిల్, పృథ్వీ, అభయ్ మీద చూపించిన ఇంట్రస్ట్ టీమ్‌పై చూపించలేదు అని ఉన్నమాట అనేసింది. ఎప్పుడూ సంచాలకురాలిగా ఉంటానన్నావే తప్ప ఎక్కడా గేమ్ ఆడేందుకు ముందుకు రాలేదు అంటూ ఇచ్చిపడేసింది. ఇంత మాట్లాడిన యష్మి.. సోనియా అన్న సూటిపోటి మాటలకు హర్టయి ఏడ్చేసింది. దీంతో సోనియా వెళ్లి తనను ఓదార్చడం గమనార్హం.

నామినేషన్స్‌లో అభయ్
చివర్లో నిఖిల్, అభయ్ ఇద్దరు చీఫ్‌లలో ఒకరికే నామినేషన్ నుంచి సేవ్ అయ్యే ఛాన్స్ ఉందన్నాడు బిగ్‌బాస్. దీంతో అభయ్.. తనకు సేవ్ అవుతానన్న నమ్మకం ఉందంటూ నామినేషన్స్‌లోకి వచ్చేందుకు అంగీకరించాడు. అలా ఈ వారం ప్రేరణ, పృథ్వి, మణికంఠ, విష్ణుప్రియ, సీత, నైనిక, యష్మి, అభయ్ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు.



చదవండి: జరిగింది చూపించలేదు.. శేఖర్ బాషా ఎలిమినేషన్ వెనక అసలు రహస్యం
Comments
Please login to add a commentAdd a comment