బిగ్‌బాస్ 8: శేఖర్ భాషా ఎలిమినేట్.. తెర వెనక ఇంత జరిగిందా? | Shekar Basha First Comments After Bigg Boss 8 Telugu Elimination | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Shekar Basha: జరిగింది చూపించలేదు.. శేఖర్ భాషా బయటపెట్టాడు

Sep 16 2024 11:48 AM | Updated on Sep 16 2024 12:07 PM

Shekar Basha First Comments After Bigg Boss 8 Telugu Elimination

బిగ్‌బాస్ 8వ సీజన్‌లో ఊహించని ఎలిమినేషన్ జరిగింది. చాలా వారాల పాటు హౌసులో ఉంటాడనుకున్న శేఖర్ భాషా అనుహ్యంగా బయటకొచ్చేశాడు. కానీ ఇతడి ఎలిమినేషన్ వెనక పెద్ద తతంగమే నడించింది. కానీ బిగ్‌బాస్ మనకు అవేం చూపించలేదు. తాజాగా పలు యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చిన శేఖర్ భాషా.. తన ఎలిమినేషన్‌కి కారణాన్ని రివీల్ చేశాడు.

రేడియా జాకీ, యాంకర్‌గా చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న శేఖర్ భాషా.. రాజ్ తరుణ్-లావణ్య గొడవ మధ్యలో దూరి కాస్త పేరు తెచ్చుకున్నాడు. అదే ఊపులో బిగ్ బాస్ 8లోకి వెళ్లాడు. అయితే హౌస్‪‌లోకి వెళ్లే టైంలో ఇతడి భార్య 9 నెలల గర్భవతి. తాజాగా ఆమె మగ పిల్లాడికి జన్మనిచ్చింది. శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఈ శుభవార్త భాషాకి చెప్పాడు. అప్పటి నుంచి కొడుకుని చూడాలనే ఆరాటం ఎక్కువైంది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: శేఖర్ భాషా ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?)

దీంతో తనకు బయటకెళ్లిపోవాలనుందని మిగతా కంటెస్టెంట్స్ దగ్గర, హౌసులో కెమెరాల ముందు కూడా చెప్పాడు. కానీ ఆ ఫుటేజీని నిర్వహకులు చూపించలేదు. అలానే నేరుగా బయటకు పంపేస్తే షో పరువు పోతుంది కాబట్టి ఓట్లు బాగానే పడినప్పటికీ, బిగ్‌బాస్ బిగ్గెస్ట్ ట్విస్ట్ అని చెప్పి ఇంట్లోని సభ్యులతో శేఖర్ భాషాని బిగ్ బాస్ ఆర్గనైజర్స్ చాలా తెలివిగా బయటకు తీసుకొచ్చారు. ఇదంతా భాషా చెబితే గానీ అర్థం కాలేదు.

'నేనే కావాలని బయటకొచ్చేశా. బిగ్‌బాస్ చరిత్రలో ఇదే ఫస్ట్ హ్యాపీ ఎలిమినేషన్. నా కొడుకుని చూడటానికి నేను అడిగి మరీ బయటకు వచ్చేశాను. నాక్కొంచెం ఫుడ్ ప్రాబ్లమ్ కూడా అయింది' అని శేఖర్ భాషా చెప్పాడు. ఎవరు విన్ అవ్వొచ్చు అని అడగ్గా.. తెలుగమ్మాయిలైన సీత, విష్ణుప్రియలలో అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా శేఖర్ భాషా వెళ్లిపోవడాన్ని కూడా బిగ్‌బాస్ చాలా చాకచక్యంగా వాడేసుకున్నాడు.

(ఇదీ చదవండి: Bigg Boss 8: అంతా ఫేక్.. నామినేషన్స్‌లో మణికంఠ vs యష్మి)

Advertisement
 
Advertisement
Advertisement