Bigg Boss 8: అంతా ఫేక్.. నామినేషన్స్‌లో మణికంఠ vs యష్మి | Bigg Boss 8 Telugu 3rd Week Nominations Promo Latest | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Telugu: ఈసారి నామినేషన్స్‌లోనూ మొత్తం గొడవలే

Sep 16 2024 11:21 AM | Updated on Sep 16 2024 11:50 AM

Bigg Boss 8 Telugu 3rd Week Nominations Promo Latest

సోమవారం వచ్చేసింది. అంటే బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ అందరూ మాటలతో కొట్టేసుకునే రోజు. అందుకు తగ్గట్లే ఈ వారం కూడా ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో పేరు, కారణం చెప్పి వాళ్ల తలపై చెత్త పోసే కార్యక్రమం పెట్టాడు బిగ్ బాస్. దీంతో ఒకరిపై ఒకరు రెచ్చిపోయి మరీ అరిచేసుకున్నారు.

తొలుత సీత.. యష్మి, పృథ్వీని నామినేట్ చేసింది. ఏ టాస్క్ జరిగినా సరే యష్మిది డామినేటింగ్ వాయిస్‌లా అనిపించిందని కారణం చెప్పింది. అలానే గేమ్‌లో ప్రవర్తించిన తీరుపై సీత-పృథ్వీ మధ్య మాటల యుద్ధమే సాగింది.

(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు)

మణికంఠ.. యష్మి, పృథ్వీని నామినేట్ చేశాడు. అయితే యష్మితో పెద్ద గొడవే పెట్టేసుకున్నాడు. మణికంఠ మాట్లాడుతున్నప్పుడు యష్మి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయగా.. నేను మాట్లాడుతున్నప్పుడు వినడం నేర్చుకో లేడీ అని వేలు చూపించి మరీ మణికంఠ సీరియస్ అయ్యాడు. దీంతో యష్మి రెచ్చిపోయింది. 'ఫ్రెండ్‌గా నా దగ్గరికొచ్చి నువ్వు డ్రామాలు చేస్తావ్ చూడు. అన్నీ ఫేక్' అని రివర్స్ కౌంటర్ ఇచ్చింది.

అలానే తన పాయింట్ ఆఫ్ వ్యూని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నావ్ అని మణికంఠ చెప్పగా.. నీకు దమ్ము లేదా అని యష్మి రెచ్చిపోయింది. ఇక చివర్లో విష్ణుప్రియ.. ప్రేరణని నామినేట్ చేసింది. ప్రోమో చూస్తుంటేనే హోరాహోరీగా ఉంది. ఇక ఫుల్ ఎపిసోడ్ ఇంకేలా ఉంటుందో ఏంటో?

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: శేఖర్ భాషా ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?)

Advertisement
 
Advertisement
Advertisement