
నామినేషన్స్‌లో ఫైర్ చూపించాలని నబీల్ బాగా తాపత్రయపడ్డాడు. నాగార్జున మాటలతో గౌతమ్ డిస్టర్బ్ అయ్యాడో, ఏమోకానీ ఓపక్క కోప్పడుతూనే మరోపక్క బాధపడుతున్నట్లు కనిపించింది. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే నేటి (నవంబర్ 25) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..

ఫైర్ లేదు
బిగ్‌బాస్ హౌస్‌లో పదమూడోవారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఫైనలిస్టుగా చూడకూడదనుకుంటున్న ఇద్దర్ని నామినేట్ చేయాలన్నాడు బిగ్‌బాస్. మొదటగా నబీల్.. నామినేషన్స్‌లో తప్ప గేమ్‌లో ఫైర్ లేదంటూ గౌతమ్‌ను నామినేట్ చేశాడు. నబీల్‌తో పెట్టుకుంటే బొరాన్ ఉంటదంటూ దమ్కీ ఇచ్చాడు.

ఆ ఫోకస్ గేమ్‌పై చూపించు
నీ గేమ్ కనిపించడం లేదు, నీకు సీరియస్‌నెస్ లేదంటూ విష్ణుప్రియను నామినేట్ చేశాడు. ఒక మనిషిపై పెట్టిన ఫోకస్ గేమ్‌పై పెడ్తే గెలుస్తావని సలహా ఇచ్చాడు. కానీ ఈ సలహాలు పట్టించుకునే పరిస్థితిలో విష్ణు లేదు. పృథ్వీ వంతురాగా.. అమ్మాయిలు గొడవపడ్తున్నప్పుడు మెగా చీఫ్‌గా నువ్వు దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించలేదంటూ అవినాష్‌ను నామినేట్ చేశాడు.

తొడగొట్టిన అవినాష్
ఎంటర్‌టైన్‌మెంట్ తప్ప ఏమీ చేయట్లేదు, ఆడియన్స్ నిన్ను నామినేషన్స్‌లోకి వచ్చినవారమే ఎలిమినేట్ చేశారు, కానీ నబీల్ ఎవిక్షన్ షీల్డ్‌తో సేవ్ చేశాడని ఎగతాళి చేశాడు. దీంతో అవినాష్.. నేను వచ్చిన ఏడువారాల్లో రెండుసార్లు మెగా చీఫ్ అయ్యానంటూ తొడగొట్టి చెప్పాడు. తర్వాత పృథ్వీ.. కెమెరాలతో మాట్లాడటం, ఏం పీకుతావనడం నచ్చలేదంటూ గౌతమ్‌ను నామినేట్ చేశాడు. ఇక్కడ వీళ్లిద్దరూ బుగ్గలు గిల్లుకోవడం గమనార్హం.

విష్ణు ఎవర్ని నామినేట్ చేసిందంటే?
ప్రేరణ.. గెలవాలన్న స్పిరిట్ నీలో లేదంటూ విష్ణుప్రియను, నువ్వు గెలవకూడదంటూ గౌతమ్‌ను నామినేట్ చేసింది. ఈ క్రమంలో ప్రేరణ, గౌతమ్ చాలాసేపు గొడవపడ్డారు. తేజ.. నీ గేమ్ నచ్చలేదంటూ విష్ణును, ఎదుటివారిని రెచ్చగొడుతున్నావంటూ పృథ్వీని నామినేట్ చేశాడు. విష్ణుప్రియ.. తేజను, ప్రేరణను నామినేట్ చేసింది.

మాట తప్పావ్: గౌతమ్
గౌతమ్.. ఫిజికల్ అవకూడదని చెప్పిన నువ్వే చాలా గేమ్స్‌లో ఫిజికల్ అయ్యావని నిఖిల్‌ను నామినేట్ చేశాడు. పృథ్వీ ఎందరినో అవమానించాడు, అలాంటప్పుడు అతడినెందుకు నామినేట్ చేయలేదని ప్రశ్నించాడు. వీళ్లిద్దరూ గొడవపడుతుంటే మరోసారి పృథ్వీ మధ్యలో దూరడంతో ఇది చిలికిచిలికి గాలివానలా మారింది.

నీ కాళ్లు పట్టుకుంటా ప్రేరణ
తర్వాత ప్రేరణను నామినేట్ చేశాడు. నువ్వు కావాలని ట్రిగ్గర్ చేస్తావని ఆమె అనడంతో.. నీ కాళ్లు పట్టుకుంటా ప్రేరణ.. నేను ట్రిగ్గర్ చేయలేదు, ఏదో సరదాగా చేశానంటూ గౌతమ్ ఫ్రస్టేట్ అయ్యాడు. అవినాష్ వంతు రాగా.. మూటల టాస్క్‌లో ఫౌల్ గేమ్ ఆడావు, ఎదుటివారికి గౌరవమర్యాదలు ఇవ్వడం లేదంటూ పృథ్వీని, కసిగా ఆడట్లేదంటూ విష్ణుప్రియను నామినేట్ చేశాడు.

మెగా చీఫ్ తప్ప అందరూ నామినేషన్‌లో
నిఖిల్ వంతు రాగా గౌతమ్, ప్రేరణను నామినేట్ చేశాడు. చివరగా మెగా చీఫ్ రోహిణి.. నేను పక్కవాళ్లను తొక్కుకుంటూ వెళ్తానని చెప్పడం నచ్చలేదని విష్ణును నామినేట్ చేసింది. గేమ్‌లో నిన్నెవరైనా సైడ్ చేస్తుంటే భరించలేవు, అలాగే నన్ను వీక్ అన్నావంటూ నబీల్‌ను నామినేట్ చేసింది. అలా ఈ వారం విష్ణుప్రియ, గౌతమ్, ప్రేరణ, పృథ్వీ, తేజ, అవినాష్, నిఖిల్, నబీల్ నామినేట్ అయ్యారు.

Comments
Please login to add a commentAdd a comment