
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్, సినీ నటుడు ధర్మమహేశ్ సతీమణి గౌతమి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్‌బాస్ రీతూ చౌదరి రాత్రి సమయంలో తన భర్తతో పాటుగా ఫ్లాట్‌కు వచ్చేదని ఆమె చెప్పిన విషయం తెలిసిందే. అలాంటి సమయంలో వాళ్లు కలిసి ఏం చేస్తారో చెప్పలేనని పేర్కొంది. అయితే, తాజాగా బిగ్‌బాస్-8 కంటెస్టెంట్, బేబీ సినిమా ఫేమ్ కిరాక్ సీత గురించి ఆమె సంచలన ఆరోపణలు చేసింది.
డ్రింకర్ సాయి సినిమాలో తన భర్త ధర్మమహేశ్‌తో కిరాక్ సీత, రీతూ చౌదరి కలిసి నటించినట్లు గౌతమి గుర్తుచేసింది. ఆపై ఈ మూవీలో హీరోయిన్‌గా కనిపించిన ఐశ్వర్య శర్మ కూడా ఒక పనికిమాలిన వ్యక్తి అంటూ చెప్పుకొచ్చింది. అయితే, ఈ ముగ్గురు తన భర్తకు చాలా దగ్గరగా ఉంటారని చెప్పింది. ఈ క్రమంలో కిరాక్ సీత గురించి గౌతమి ఇలా చెప్పింది. ' నాకు ఇప్పటికే 15 రెస్టారెంట్లు ఉన్నాయి. 16వ బ్రాంచ్‌ని గౌలిదొడ్డి వద్ద ఓపెనింగ్ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాను. ఆ సమయంలో ఐపీఎల్ ఉంది.. ఓపెనింగ్ కోసం ఒక క్రికెటర్‌ను తీసుకురావలని నేను చూస్తున్నాను.

ఒక పెద్ద క్రికెటర్‌ను కూడా కలిశాను. కానీ, కొన్ని కారణాల వల్ల కుదరలేదు. అయితే, సడెన్‌గా కిరాక్ సీత నాకు మెసేజ్ చేసింది. నువ్వు చేయలేని పని నేను చేస్తానంటూ చెప్పుకొచ్చింది. నీకు కావాలంటే చెప్పు ఎవరినైనా ఒక సెలబ్రిటీని సెట్ చేస్తానని మెసేజ్ పెట్టింది. నా వ్యాపారంలోకి నా ప్రమేయం లేకుండా సీత రావడం ఏంటి.. ఆమె వెనుక నా భర్త ఉన్నాడని అర్థం అయింది. ఒక క్రికెటర్ కోసం వెతుకుతున్నట్లు నీకు ఎలా తెలుసు అంటే దానికి సమాధానం చెప్పదు. నీవు రెస్టారెంట్ ఎలా ఓపెన్ చేస్తావో చూస్తాం అంటూ సీత వార్నింగ్ ఇచ్చింది. 15 రెస్టారెంట్స్ నడుపుతున్నాను.. నాకే వ్యాపారం గురించి చెబుతుంది. అసలు సీతతో నాకు పరిచయమే లేదు. కానీ, నాకు మెసేజ్‌లు చేయడం ఎందుకు.. మా ఇంటికి రావడం ఎందుకు..?' అని ఆమె ప్రశ్నించింది. అయితే, కిరాక్ సీత, ధర్మమహేశ్ మధ్య ఎలాంటి బంధం ఉందో తనకు తెలియదని ఆమె చెప్పింది.

13 ఏళ్ల బంధం.. రీతూ వల్ల పోయింది
ఒక ఇంటర్వ్యూలో గౌతమి మాట్లాడుతూ బిగ్‌బాస్ రీతూ చౌదరి గురించి మరోసారి పలు వ్యాఖ్యలు చేసింది.. 'నేను, ధర్మమహేశ్ 13 ఏళ్లు ప్రేమించుకున్నాం. 2019లో పెళ్లి చేసుకున్నాం. అయితే, మా బంధానికి రీతూ చౌదరి అడ్డుకట్ట వేసింది. పెళ్లి తర్వాత చాలా అన్యోన్యంగా ఉన్నాం. అయితే, 2023లో నేను గర్భం దాల్చాను. దీంతో కాస్త బరువు పెరిగిపోయాను. దీంతో దర్మమహేశ్‌కు నేను నచ్చలేదు. నువ్వు చాలా బరువు పెరిగిపోయావు.. నీపై నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదనే విధంగా నా ముఖం మీద చెప్పేవాడు.. అలా చెప్పేసరికి తట్టుకోలేకపోయాను.
సరిగ్గా అలాంటి సమయంలోనే నా భర్తకు రీతూ చౌదరి పరిచయమయ్యింది. మొదట్లో అప్పుడప్పుడు మాత్రమే మా ఫ్లాట్‌కు వచ్చేది. తర్వాత రెగ్యూలర్‌గా రావడం జరిగేది.. ఒక్కోసారి నన్ను కూడా ఇంటి నుంచి బయటకు పంపాడు. ముఖ్యంగా రీతు చౌదరి నా పర్సనల్ లైప్‌లో ఇన్వాల్వ్మెంట్ అయింది. ఎక్కువగా రాత్రి సమయంలో మాత్రమే ఆమె మా ఫ్లాట్‌కి వచ్చేది. అసలు నా ఫ్లాట్‌కి రావాల్సిన అవసరం ఆమెకు ఏముంది..? అంటూ గౌతమి ప్రశ్నించింది.