
బిగ్బాస్ 9 హౌసులో మూడో వారం వచ్చేసింది. వీకెండ్ వస్తే నాగార్జున వచ్చి హౌస్‍మేట్స్‌తో ఆటాడుకుంటాడు. సోమవారం వస్తే నామినేషన్స్ హడావుడి మొదలవుతుంది. ఈసారి కూడా రచ్చ రచ్చ జరిగింది. అయితే ఒకేరోజులో ఈ ప్రక్రియ అంతా పూర్తయింది. కెప్టెన్ కావడంలో సహాయపడ్డ రీతూని పవన్ మోసం చేసేశాడు. మరోవైపు హరీశ్ బూతు పదం వాడుతూ పంచాయతీ పెట్టాడు. ఈసారి నామినేషన్స్‌లో కామనర్స్‌ని సెలబ్రిటీలు గట్టిగా ఇరికించేశారు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ కిర్రాక్ సీత, రీతూపై సంచలన ఆరోపణలు చేసిన గౌతమి)
ఈ వారం నామినేషన్స్ గురించి చెప్పిన బిగ్‌బాస్.. టెనెంట్స్ అందరూ ఐదుగురు ఓనర్లని నామినేట్ చేయాలని అందులో ఒకరు టెనెంట్ అయ్యిండాలని కండీషన్ పెట్టాడు. దీంతో అందరూ ఏకాభిప్రాయంతో మాజీ కెప్టెన్ సంజనని నామినేట్ చేశారు. దొంగబుద్ది చూపించడం, ఆడవాళ్లని హరీశ్ డీగ్రేడ్ చేశాడని చాడీలు చెప్పడం, సుమన్ శెట్టి గాజుల వేసుకుని కూర్చున్నారని తక్కువ చేసి మాట్లాడిందని కారణాలు చెప్పారు. మాటలు జారుతోందని, ఓ స్టాండ్ అనేది లేదు, ప్రతిదానికి అలుగుతోంది అంటూ రీతూని.. వీరిద్దరితో పాటు ఫ్లోరా, సుమన్ శెట్టిని నామినేట్ చేశారు. అలానే టెనెంట్స్‌లో హరీశ్‌ని అందరూ కలిసి బుక్ చేశారు.
అయితే టెనెంట్స్ మధ్య నామినేట్ ఎవరినీ చేయాలా అనే చర్చ నడుస్తున్నప్పుడు పవన్-రీతూ చౌదరి గురించి మాట్లాడిన హరీశ్.. లత్కోర్ అనే పదం ఉపయోగించాడు. దీన్ని పవన్, ప్రియ, శ్రీజ తప్పు పట్టగా.. అసలు ఆ పదం బూతు కాదని చెప్పి వాదించాడు. అయితే టెనెంట్స్ అందరూ కలిసి ఓనర్స్‌ని నామినేట్ చేశారు కదా. దీన్ని మార్చే పవన్ ఓనర్స్‌కి ఇస్తున్నానని చెప్పి బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పటికే ఉన్న వాటికి ఇద్దరిని అదనంగా జోడించండి. ఉన్నవాటిలో ఇద్దరిని స్వైప్ చేయండి అని ఆదేశించాడు. అలానే నామినేషన్లలో ముగ్గురు టెనెంట్స్ కచ్చితంగా ఉండాలని బిగ్‍బాస్ చెప్పాడు. దీంతో టెనెంట్స్‌కి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి.
ఈ క్రమంలో లిస్టులో ఉన్న సంజన, సుమన్ శెట్టి ప్లేసులో టెనెంట్స్ అయిన ప్రియ, కల్యాణ్‌ని స్వైప్ చేశారు. అలానే గతవారం కెప్టెన్సీ టాస్క్‌లో సంచాలక్‌గా తప్పు చేసిందని రీతూని నామినేట్ చేశారు. అలా హరీశ్, ప్రియ, కల్యాణ్, ఫ్లోరా, శ్రీజ, రాము నామినేట్ అయ్యారు. ఇక్కడివరకు బాగానే ఉంది. చివరలో ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్.. స్పెషల్ పవర్ ఉపయోగించి ఒకరిని సేవ్ చేయొచ్చు అని చెప్పగా.. పవన్, రీతూ బదులు శ్రీజని సేవ్ చేశాడు. దీంతో రీతూ ముఖం మాడిపోయింది. ఎందుకంటే గతవారం అంతా కష్టపడి రీతూ.. డీమన్ పవన్ కెప్టెన్ అయ్యేందుకు సాయం చేసింది. కానీ ఇప్పుడు అతడు రీతూని మోసం చేశాడు. ఇలా మూడోవారం నామినేషన్స్ ముగిశాయి.
మూడోవారం నామినేషన్స్ లిస్ట్
హరీశ్
ప్రియ
కల్యాణ్
రాము
రీతూ
ఫ్లోరా
మరి ఈ వారం టెనెంట్స్ నుంచి ఎలిమినేట్ అవుతారా? లేదంటే ఓనర్స్ నుంచి నామినేట్ అయిన ముగ్గురిలో ఒకరు బయటకు వచ్చేస్తారా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ సినిమా)