
బిగ్‌బాస్ షోని ఒక్కొక్కరు ఒక్కోలా ఆడతారు. ఒకరు ఏడుస్తారు. మరొకరు కష్టపడతారు. ఇంకొకరు తమకు తామే టార్గెట్ అయిపోయి హైలైట్ అవ్వాలని చూస్తారు. తాజా సీజన్ చూస్తుంటే అలాంటి సందేహమే కలుగుతోంది. అందరూ మాస్క్ మ్యాన్ హరీశ్‌నే టార్గెట్ చేస్తున్నారు. అపరిచుతుడిలా ప్రవర్తిస్తూ అటు కామనర్స్, ఇటు సెలబ్రిటీలకు శత్రువులా మారిపోతున్న ఇతడి గేమ్ ప్లాన్ ఏంటనేది అర్థం కావట్లేదు. లేటెస్ట్ ప్రోమో చూస్తుంటే అలానే అనిపిస్తుంది.
సోమవారం ఎపిసోడ్‌లోనూ తినకుండా నిరాహార దీక్ష లాంటిది చేసిన హరీశ్.. వింతవితంగా ప్రవర్తిస్తూ అందరికీ చిరాకు తెప్పిస్తున్నాడు. తనూజ ఇతడినే నామినేట్ చేసింది. ఇప్పుడు మంగళవారం ఎపిసోడ్‌లోనూ ఇతడే మెయిన్ కాబోతున్నాడు. రాము రాథోడ్, ప్రియ, రీతూ చౌదరి.. ఇలా అందరూ హరీశ్‌నే నామినేట్ చేశారు.
(ఇదీ చదవండి: మాస్క్ మ్యాన్ కాదు టార్చర్ మ్యాన్.. ఉతికారేసిన తనూజ!)
నేను వెళ్లిపోతా రాము, ఇలాంటి మాస్క్ పెట్టుకుని తిరుగుతున్న వీళ్ల మధ్యలో నేను ఉండలేను అని చెప్పి వాళ్లనే డైరెక్ట్‌గా జడ్జ్ చేసేశారు అని రాము రాథోడ్.. హరీశ్‌ని నామినేట్ చేయగా ... షో వదిలేసి వెళ్లిపోతా అంటే అది గివప్ పర్సనాలిటీ అని రీతూ కారణం చెప్పింది. అయితే మీ వల్లే మా ఓనర్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయి అని హరీశ్ ఈమెకు కౌంటర్ ఇచ్చాడు. నాకు నచ్చినట్లు మిమ్మలి ఉండమని చెప్పట్లేదు. మీతో మీరు గొడవలు పెట్టుకుని, నా వల్ల అది జరుగుతుందని అంటే తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను అని రీతూ ఏడ్చేసింది.
ఎవరైనా ఏడిస్తే కాసేపు ఆపి, ఆ సంభాషణ కొనసాగిస్తారు. కానీ హరీశ్ మాత్రం రీతూతో.. సింపతీ కార్డ్, ఉమెన్ కార్డ్ ప్లే చేయొద్దు అని హర్ష్‌గా కౌంటర్ వేశాడు. ప్రియ అయితే ఇతడినే నామినేట్ చేస్తూ.. హ్యుమానిటీ మీకే కాదు మాకు ఉంది అంటూ కౌంటర్ వేసింది. ప్రోమో చూస్తుంటే అసలు హౌస్‌మేట్స్ అందరూ మాస్క్ మ్యాన్‌ని టార్గెట్ చేస్తున్నారా? హైలైట్ చేస్తున్నారా అనిపిస్తుంది. ఏదైనా సరే ఇలాంటి వాళ్లని ఎంకరేజ్ చేస్తే టీఆర్పీలు వస్తాయి కాబట్టి బిగ్‌బాస్ కూడా ఇతడిని వదులుకోడేమో?
(ఇదీ చదవండి: కోర్ట్‌ని ఆశ్రయించిన 'కాంతార' నిర్మాతలు?)