బిగ్‌బాస్ 9 రెండో ఎలిమినేషన్.. సామాన్యుడు ఔట్! | Bigg Boss 9 Week 2 Elimination | Manish Out, Voting Twist Shocks House | Sakshi
Sakshi News home page

Bigg Boss 9: ఆమె అనుకుంటే అతడు ఎలిమినేట్!

Sep 20 2025 9:18 PM | Updated on Sep 21 2025 10:34 AM

Manish Eliminated From Bigg Boss 9 Telugu

బిగ్‌బాస్ 9 హౌస్‌లో మరో వికెట్ డౌన్. గతవారం ఊహించని విధంగా కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ ఎలిమినేట్ అయింది. ఈసారి ఎవరు బయటకొస్తారా అని అందరూ పలు అంచనాలు వేశారు. అయితే కామనర్స్ (సామాన్యుల) నుంచి తొలి వికెట్ పడినట్లు తెలుస్తోంది. చివర్లో ఓటింగ్‌లో ట్విస్ట్ చోటుచేసుకోవడంతో ఆమె బదులు అతడు ఎలిమినేట్ అయ్యాడట. ఇంతకీ ఏంటి విషయం?

తొలివారం అంతా గుడ్డు దొంగతనం లాంటి వాటితో అందరూ బోర్ కొట్టించారు. కానీ రెండో వారం వచ్చేసరికి హరీశ్ వల్ల హౌస్ అంతా హాట్ హాట్‌గానే ఉంది. మరోవైపు రీతూ చౌదరి లవ్ ట్రాక్ కోసం తెగ ప్రయత్నిస్తోంది. కానీ అదంతా స్క్రిప్టెడ్ అన్నట్లు అందరికీ తెలిసిపోతోంది. అలానే సామాన్యుల నుంచి డీమన్ పవన్ కెప్టెన్ అయితే అయ్యాడు కానీ వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున దాన్ని పీకేయబోతున్నారు.

(ఇదీ చదవండి: రీతూ బండారం బట్టబయలు.. పవన్ కెప్టెన్సీ ఫసక్)

అసలు విషయానికొస్తే ఈసారి ఎలిమినేషన్లలో మొత్తంగా ఏడుగురు ఉన్నారు. సుమన్ శెట్టి, భరణి, ఫ్లోరా సైనీ, హరీశ్, మనీష్, ప్రియ, పవన్. గతవారంలానే ఈసారి కూడా ఓటింగ్‌లో సుమన్ శెట్టి టాప్‌లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తర్వాత భరణి, పవన్, ఫ్లోరా సైనీలకు కూడా ఓట్లు బాగానే పడుతున్నాయి. దీంతో వాళ్లందరూ సుమన్ శెట్టి తర్వాత స్థానాల్లో ఉన్నారట. చివరి మూడు స్థానాల్లో హరీశ్, మనీష్, ప్రియ ఉన్నట్లు తెలిసింది.

ఈ క్రమంలోనే ప్రియకు తక్కువగా ఓటింగ్ ఉండేసరికి కచ్చితంగా ఈమె ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ చివరి రోజైన శుక్రవారం రోజు ప్రియకు బాగానే ఓట్లు పడ్డాయని దీంతో మనీష్‌పై వేటు పడినట్లు తెలుస్తోంది. రెండో వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ అయినట్లు సమాచారం. సామాన్యుల్లో ఇతడు చివరగా వచ్చాడు. కానీ ఇప్పుడు వేగంగా ఎలిమినేట్ అయిపోయి బయటకొచ్చేశాడు!

(ఇదీ చదవండి: 'ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసుండరు'.. టాక్ ఏంటి?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement