breaking news
Maryada Manish
-
బిగ్ బాస్ ను వదిలిన మర్యాద మనీష్
-
హౌస్‌లో తనే నెం.1, ఇచ్చిపడేసిండు.. ప్రియపై బిగ్‌బాంబ్ వేసిన మనీష్
బిగ్‌బాస్ షోలో మనీష్ ఓవర్ కాన్ఫిడెన్స్, అతి చేష్టలతో ఎలిమినేషన్ ఏరికోరి తెచ్చుకున్నాడు. దీంతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మొదటి కామనర్‌గా నిలిచాడు. వెళ్తూ వెళ్తూ కామనర్‌పై ఓ బిగ్‌బాంబ్ విసిరాడు. మరి సండే ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చూద్దాం.. రీతూ చౌదరి వల్ల కెప్టెన్సీ పెంటపెంటయింది. దీంతో కెప్టెన్సీ టాస్క్‌ను రద్దు చేసి మళ్లీ గేమ్ పెట్టారు. ఈ గేమ్‌లో పవన్ కష్టపడి కెప్టెన్సీ సాధించుకున్నాడు. తర్వాత ఓ ఫన్ గేమ్ ఆడించగా అందులో కామనర్స్ గెలిచారు.మనీష్ ఎలిమినేటెడ్ఇక నాగ్ ఒక్కొక్కరినీ సేవ్ చేస్తూ రాగా చివరకు ఫ్లోరా, మనీష్ (Manish Maryada) మిగిలారు. ఎలాగో ఫ్లోరా ఎలిమినేషన్ ఖాయమని ఫిక్సయిన కామనర్లు.. ఆమెకు ఆల్ ద బెస్ట్, మిస్ యూ అంటూ డైలాగులు చెప్పారు. తీరా ఫ్లోరా సేఫ్, మనీష్ ఎలిమినేట్ అని నాగార్జున ప్రకటించగానే అందరూ నోరెళ్లబెట్టారు. మనీష్ వెళ్లేముందు అతడితో ఓ గేమ్ ఆడించారు. ఈ షోలో టాప్ 3 ఎవరు? బాటమ్ 3 ఎవరు? చెప్పాలన్నాడు. బాటమ్ 3లో శ్రీజఅందుకు మనీష్ ముందుగా బాటమ్ 3లో శ్రీజ (Dammu Srija) పేరు చెప్తూ తను గేమ్ సరిగా ఆడట్లేదన్నాడు. తర్వాత ఫ్లోరా సైనిని బాటమ్‌లో పెడుతూ.. ఆమె పని తప్ప గేమ్ కనిపించట్లేదన్నాడు. సుమన్‌ను కూడా బాటమ్ 3లో యాడ్ చేశాడు. సుమన్ అన్నా.. హ్యాట్సాఫ్. మీరు ఏం ఆడుతున్నారన్నా.. నేనసలు ఊహించనేలేదు. అయినా బాటమ్‌లో ఎందుకున్నారంటే.. అలా కనిపించి, ఇలా వెళ్లిపోతారు. మీకంటూ ఓ స్టాండ్ తీసుకోరు అని చెప్పుకొచ్చాడు. తర్వాత టాప్ 3 గురించి మాట్లాడాడు. ఆయనే నెం.1నా ప్రకారం భరణిగారు నెం.1. ఆయన అందరి కోసం ఆలోచిస్తారు, మరోపక్క గేమ్ కూడా ఆడతారు. మీరు చాలా స్ట్రాంగ్ కంటెండర్. మీలాంటివాళ్లతో స్టేజ్ షేర్ చేసుకున్నందుకు, మీతో ఫైట్ చేసినందుకు సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఇమ్మాన్యుయేల్.. మొదట ఇతడిని నేను సీరియస్‌గా తీసుకోలేదు. కామెడీ చేస్తారంతే అనుకున్నా.. కానీ ఇచ్చిపడేసిండు. కామెడీ, ఎమోషన్స్, గేమ్.. అన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. మిమ్మల్ని తప్పకుండా టాప్ 3లో చూడాలనుకుంటున్నా.. వేరేవాళ్ల కోసం ఆటను వదిలేయకండి అని సూచనలిచ్చాడు.అపార్థం చేసుకున్నా..కామనర్ల నుంచి ఏకైక వ్యక్తిని టాప్ 3లో చేర్చాడు. అతడే హరీశ్. ఎమోషన్స్ దగ్గరే ఆగిపోకండి. కొంచెం కోపం తగ్గించుకుంటే టాప్ 1కి వెళ్తారు అన్నాడు. తర్వాత నాగార్జునను అడిగి మరో వ్యక్తిని టాప్ 4గా వెల్లడించాడు. ఆవిడే సంజన. సంజనను నేను ఎంత అపార్థం చేసుకున్నానో తర్వాత అంత అర్థం చేసుకున్నాను. నాకు, తనకు ఇంట్లో ఏ పనీ లేదు. అయితే పని రాలేదు కాబట్టి తనే పని తెచ్చుకుంటా.. అది కూడా గేమే అంది. అప్పుడే నాకు మైండ్ బ్లాక్ అయింది.రాత్రి ఒంటరిగా కన్నీళ్లుపగలంతా అందర్నీ సతాయిస్తుంది. రాత్రి ఒంటరిగా కూర్చుని ఏడుస్తుంది. ఈ విషయం ఎవరికీ తెలియదు. నేను ఎక్కువ మిస్ అయ్యేది సంజననే.. అని ఎమోషనలయ్యాడు మనీష్. అందరినీ పని అడిగాను, ఎవరూ ఇవ్వలేదు. ఈమె ఒక్కరే నాకు వర్క్ ఇచ్చింది. తనకు నేను వంట చేసి పెట్టాను. మీరు టాప్ 3లో ఉండాలి. భాష నీకు అడ్డు కాదు. నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని మనీష్ ధైర్యం చెప్పాడు. జైల్లోకి ఫ్లోరా..అందుకు సంజనా.. నేను తెలుగమ్మాయినే, నాకు భాష ఏం అడ్డం కాదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. హౌస్‌లో మోస్ట్ బోరింగ్ మనిషిగా ఫ్లోరాను ఎంపిక చేశారు. దీంతో ఆమె జైల్లోకి వెళ్తుంది. కాబట్టి ఆమె చేసే వాష్‌రూమ్ డ్యూటీ టెనెంట్స్‌లో ఒకరికి వేయాలన్నాడు నాగ్. దీంతో ఈ బిగ్‌బాంబ్‌ను మనీష్ ఇది నా రివేంజ్ అంటూ ప్రియకు ఆ క్లీనింగ్ పని అప్పగించి సెలవు తీసుకున్నాడు.చదవండి: ఆ ఒక్క పని వల్లే మనీష్ ఎలిమినేట్! రెండువారాల సంపాదన ఎంతంటే? -
ఆ ఒక్క పని వల్లే మనీష్ ఎలిమినేట్! రెండువారాల సంపాదన ఎంతంటే?
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో రెండోవారం కూడా ఫ్లోరా సేవ్ అయింది. ఆ విషయం ఆమె కూడా నమ్మలేకపోతోంది. అందుకే నిన్నటి ఎపిసోడ్లో నాగార్జున.. ఫ్లోరా సేవ్, మనీష్ ఎలిమినేట్ అనగానే ఏంటి? ఇది నిజమేనా? అని కొన్ని క్షణాలపాటు షాక్‌లో ఉండిపోయింది. ఆమెకే కాదు హౌస్‌మేట్స్‌కు కూడా ఇది పెద్ద షాకే! అందులోనూ కామనర్లకు మరీ పెద్ద షాక్!తన గోతి తనే తవ్వుకున్న మనీష్మనీష్ (Maryada Manish) ఎలిమినేషన్‌కు ఎవరూ కారణం కాదు, ఆయన స్వీయతప్పిదాలే తన కొంప ముంచాయి. హౌస్‌లో ఓవర్ థింకింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. కామనర్లను ఓనర్లను చేయగానే ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యాడు. కారణం లేకుండానే సెలబ్రిటీ రాము రాథోడ్‌ను ఈసడించుకున్నాడు, కసురుకున్నాడు. భరణిని సైతం అసహ్యంగా చూశాడు. అలాంటి వ్యక్తి పక్కన పడుకుంటే నాకు నిద్ర కూడా పట్టదు. నా బెడ్ షేర్ చేసుకోను అని భరణిని శత్రువును చూసినట్లే చూశాడు.కన్నీళ్లు వృథాఓ గేమ్‌లో సంచాలక్‌గా వ్యవహరించి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ప్రియ, శ్రీజల వల్ల ఎక్కువ ఇబ్బందిపడింది మనీషే! మూలన కూర్చుని ఏడువుపో అని శ్రీజ అతడిని కూరలో కరివేపాకులా తీసిపడినా మాటలు పడ్డాడు, పక్కకెళ్లి ఏడ్చాడు, తప్ప ఆమెను నామినేట్ చేయలేదు. ప్రియ మానిటర్‌గా ఉంటే భోజనం కూడా చేయనని భీష్మించుకున్నాడు తప్ప ఆమెను కూడా నామినేట్ చేయలేదు. కొంప ముంచిన నామినేషన్వీళ్లిద్దరి వల్ల మాత్రమే కన్నీళ్లు పెట్టుకున్న మనీష్.. నామినేషన్స్‌లో మాత్రం వాళ్లను వదిలేసి సెలబ్రిటీలను నామినేట్ చేయడం ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. ఈ డబుల్ స్టాండర్డ్స్ అతడిపై నెగెటివిటీని మరింత పెంచాయి. మనీష్ ఎలిమినేషన్‌కు ఇదే బలమైన కారణం! వాళ్లను నామినేషన్ చేసుంటే మనీష్ సేవ్ అవడంతో పాటు అతడి గ్రాఫ్ విపరీతంగా పెరిగుండేది. ఇకపోతే మనీష్.. ఇంగ్లీష్ దొరలా ఎప్పుడూ ఇంగ్లీష్ మాట్లాడుతూనే ఉండేవాడు. లైవ్‌లో అయితే మరీ దారుణంగా తెలుగు తప్ప ఇంగ్లీషే మాట్లాడేవాడు.రెమ్యునరేషన్ ఎంత?ఈ విషయంపై బిగ్‌బాస్ నుంచి వార్నింగ్స్ కూడా వచ్చాయి. తెలుగు రాని ఫ్లోరా, సంజనాయే చక్కగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటే మనీష్ మాత్రం మహామేధావిలా ఇంగ్లీష్‌లోనే ఎందుకు వాగుతాడన్న అసహనం కూడా జనాల్లో ఉంది. ఇలా తను చేసిన తప్పులకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు. రెండోవారంలోనే ఎలిమినేట్ అయ్యాడు. కామనర్లందరికీ దాదాపు రూ.70-80 వేలు ఇచ్చారని తెలుస్తోంది. ఈ లెక్కన మనీష్ రెండు వారాలకుగానూ లక్షన్నర సంపాదించాడన్నమాట!చదవండి: నా భర్తతో బిగ్‌బాస్ రీతూ ఎఫైర్.. వీడియో విడుదల చేసిన నటుడి భార్య -
బిగ్‌బాస్ 9 రెండో ఎలిమినేషన్.. సామాన్యుడు ఔట్!
బిగ్‌బాస్ 9 హౌస్‌లో మరో వికెట్ డౌన్. గతవారం ఊహించని విధంగా కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ ఎలిమినేట్ అయింది. ఈసారి ఎవరు బయటకొస్తారా అని అందరూ పలు అంచనాలు వేశారు. అయితే కామనర్స్ (సామాన్యుల) నుంచి తొలి వికెట్ పడినట్లు తెలుస్తోంది. చివర్లో ఓటింగ్‌లో ట్విస్ట్ చోటుచేసుకోవడంతో ఆమె బదులు అతడు ఎలిమినేట్ అయ్యాడట. ఇంతకీ ఏంటి విషయం?తొలివారం అంతా గుడ్డు దొంగతనం లాంటి వాటితో అందరూ బోర్ కొట్టించారు. కానీ రెండో వారం వచ్చేసరికి హరీశ్ వల్ల హౌస్ అంతా హాట్ హాట్‌గానే ఉంది. మరోవైపు రీతూ చౌదరి లవ్ ట్రాక్ కోసం తెగ ప్రయత్నిస్తోంది. కానీ అదంతా స్క్రిప్టెడ్ అన్నట్లు అందరికీ తెలిసిపోతోంది. అలానే సామాన్యుల నుంచి డీమన్ పవన్ కెప్టెన్ అయితే అయ్యాడు కానీ వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున దాన్ని పీకేయబోతున్నారు.(ఇదీ చదవండి: రీతూ బండారం బట్టబయలు.. పవన్ కెప్టెన్సీ ఫసక్)అసలు విషయానికొస్తే ఈసారి ఎలిమినేషన్లలో మొత్తంగా ఏడుగురు ఉన్నారు. సుమన్ శెట్టి, భరణి, ఫ్లోరా సైనీ, హరీశ్, మనీష్, ప్రియ, పవన్. గతవారంలానే ఈసారి కూడా ఓటింగ్‌లో సుమన్ శెట్టి టాప్‌లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తర్వాత భరణి, పవన్, ఫ్లోరా సైనీలకు కూడా ఓట్లు బాగానే పడుతున్నాయి. దీంతో వాళ్లందరూ సుమన్ శెట్టి తర్వాత స్థానాల్లో ఉన్నారట. చివరి మూడు స్థానాల్లో హరీశ్, మనీష్, ప్రియ ఉన్నట్లు తెలిసింది.ఈ క్రమంలోనే ప్రియకు తక్కువగా ఓటింగ్ ఉండేసరికి కచ్చితంగా ఈమె ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ చివరి రోజైన శుక్రవారం రోజు ప్రియకు బాగానే ఓట్లు పడ్డాయని దీంతో మనీష్‌పై వేటు పడినట్లు తెలుస్తోంది. రెండో వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ అయినట్లు సమాచారం. సామాన్యుల్లో ఇతడు చివరగా వచ్చాడు. కానీ ఇప్పుడు వేగంగా ఎలిమినేట్ అయిపోయి బయటకొచ్చేశాడు!(ఇదీ చదవండి: 'ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసుండరు'.. టాక్ ఏంటి?) -
ఎలిమినేషన్: కామనర్ల ఓవరాక్షన్.. ఆ కంటెస్టెంట్‌కు మూడినట్లే!
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) హౌస్‌లో కెప్టెన్సీ కోసం పోరు మొదలైంది. ఓనర్స్‌లో ఏ నలుగురికి కెప్టెన్ అయ్యే అర్హత లేదో టెనెంట్స్ చెప్పాలన్నాడు. దీంతో సెలబ్రిటీలందరూ చర్చించుకుని ప్రియ, శ్రీజ, హరీశ్, పవన్ కల్యాణ్‌లను పక్కన పెట్టేశారు. భరణి, డిమాన్ పవన్, మర్యాద మనీష్‌లను కెప్టెన్సీ కంటెండర్లుగా సెలక్ట్ చేశారు. రేసులో లేకుండా పోయిన కామనర్లు సెలబ్రిటీలపై విరుచుకుపడ్డారు. మీరు కావాలనే చేశారు, ఫేవరిటిజం చూపించారంటూ నోరేసుకుని పడిపోయారు. వీళ్ల ఓవరాక్షన్ వల్ల వారికే చేటు రానుంది. ఈ వారం కామనర్స్‌లో ఒకరు ఇంటి నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంది.నామినేషన్స్‌లో ఏడుగురుఈ వారం మనీష్, హరీశ్, సుమన్ శెట్టి, ప్రియ, డిమాన్ పవన్, ఫ్లోరా, భరణి నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో ఎక్కువగా భరణి, సుమన్ శెట్టి (Suman Shetty)కే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. హరీశ్, ఫ్లోరా సైనీకి పర్వాలేదనిపించేలా ఓట్లు పడుతున్నాయి. ఫ్లోరాకు ఓట్లు పడటానికి బలమైన కారణమే ఉంది. కామనర్స్ ఓవరాక్షన్‌తో ప్రేక్షకుల తల బొప్పి కడుతోంది. దీంతో వారిలో ఒకరిని పంపిస్తే కానీ వీళ్ల నోటికి తాళం పడేలా లేదని జనం ఫీలవుతున్నారు. అందుకే కామనర్స్‌లో ఒకరిని ఎలిమినేట్ చేయాలన్న కసితో ఫ్లోరాకు ఓట్లేసి మరీ ఆమెను సేవ్ చేస్తున్నారు. డేంజర్ జోన్లో ముగ్గురుదీంతో మనీష్, ప్రియ, డిమాన్ పవన్ డేంజర్ జోన్లో ఉన్నారు. డిమాన్ పవన్.. తన గేమ్ కన్నా రీతూ చుట్టూ తిరగడంపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ప్రియ.. తను చెప్పిందే రైట్ అంటూ వాగుతూనే ఉంటుంది. మనీష్.. వరస్ట్ కామనర్స్ అంటూ తన టీమ్‌నే తిడతాడు, మళ్లీ వాళ్లనే సపోర్ట్ చేస్తాడు. ఒక మాట మీద నిలబడడు. అందుకే వీళ్లలో ఒకర్ని బయటకు పంపించాలన్నది బుల్లితెర ప్రేక్షకుల ఆలోచన. ముఖ్యంగా మనీష్, పవన్‌లపైనే ఎలిమినేషన్ కత్తి వేలాడుతోంది. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి! చదవండి: ఓనర్స్ ఆర్ టెనెంట్స్.. కెప్టెన్సీ ఎవరికీ దక్కింది..! -
మర్యాద మర్చిపోయిన మనీష్.. ఎందుకు పట్టుకొచ్చావ్ శ్రీముఖి?
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 9) ఏ ముహూర్తాన కామనర్స్‌ను ఓనర్లు చేశారో కానీ వాళ్లు తెగ రెచ్చిపోతున్నారు. బిగ్‌బాస్ హౌస్ అంతా మాదే అన్నట్లుగా జులుం చూపిస్తున్నారు. టెనెంట్లు.. అదేనండి సెలబ్రిటీలను పనివాళ్లుగా హీనంగా చూస్తున్నారు. మర్యాద మనీష్ అయితే తనో పెద్ద తోపుగా ఫీలవుతున్నాడు. మొన్న రాము రాథోడ్ ఏదో చెప్పడానికి వస్తుంటే కూడా నేను నిన్ను నమ్మను, సింపథీ ఆడతావ్.. అదీ,ఇదీ అంటూ తనను చీదరించుకున్నాడు. నిన్నటి ఎపిసోడ్లో అయితే సంచాలక్‌గా ఫెయిలవడమే కాకుండా ఇమ్మాన్యుయేల్‌ను నానామాటలన్నాడు. అసలేం జరిగిందో చూద్దాం..ఐదుగురు కెప్టెన్సీ కంటెండర్లుబిగ్బాస్ సంజన (Sanjana Galrani)ను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి ఐదుగురిని కెప్టెన్సీ కంటెండర్లుగా ఎంపిక చేసుకోమన్నాడు. ఆమె తన పేరుతో పాటు హరీశ్, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, శ్రష్టిలను సెలక్ట్ చేసింది. అయితే ఇక్కడే బిగ్‌బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. కెప్టెన్ అవ్వాలంటే గేమ్ ఆడాల్సింది కంటెండర్లు కాదు, వారికి సపోర్ట్‌గా నిలబడేవారని బిగ్‌బాస్ చెప్పాడు. అలా శ్రష్టి కోసం రాము, ఇమ్మాన్యుయేల్‌కు భరణి, సంజనకు శ్రీజ, పవన్‌కు ప్రియ, హరీశ్‌కు పవన్ కల్యాణ్ సపోర్ట్‌గా వచ్చారు.సంచాలక్‌గా మర్యాద మనీష్వీళ్లకు వదలకు బెదరకు టాస్క్ ఇచ్చారు. ఈ గేమ్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉంచిన గోడకు రాడ్స్ ఉంటాయి. నేలకు ఆనకుండా వాటిని పట్టుకుని ఉండాలి. కంటెండర్స్‌ను సంచాలక్ ఇష్టానుసారంగా పిలుస్తూ ఉంటాడు. గ్రీన్ లైట్ పడ్డప్పుడు వారు ఒక రాడ్ తీసేయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌కు మనీష్ సంచాలకుడు. మొదట రాడ్ తీసే ఛాన్స్ డీమాన్ పవన్‌కు ఇచ్చాడు. అయితే రెడ్ సిగ్నల్ ఉండటంతో అతడిని ఆపి గ్రీన్ లైట్ పడ్డాక తీయమన్నాడు. ఇమ్మాన్యుయేల్‌ను ఎలిమినేట్ చేసిన సంచాలక్శ్రష్టికి కూడా అలాగే చెప్పాడు. తర్వాత ఇమ్మాన్యుయేల్ వెళ్లినప్పుడు మాత్రం ఏమీ చెప్పకుండా నిల్చుండిపోయాడు. అతడు కూడా రెడ్ సిగ్నల్ చూసుకోకుండా రాడ్ తీసేశారు. దాంతో సంచాలక్ మనీష్.. ఇమ్మాన్యుయేల్ టీమ్‌ను ఎలిమినేట్ చేశాడు. నేను వెళ్లినప్పుడు మీరు ఆపాలి కదా.. కనీసం నేను రాడ్ పట్టుకున్నప్పుడైనా చెప్పాలిగా అని నిలదీశాడు. నేను చెప్పేవరకు ఆగలేదంటూ మనీష్ నసిగాడు. సంచాలక్‌గా ఫెయిల్ఇమ్మూ ఆవేశంతో సంచాలక్‌గా ఫెయిల్, మీరు వాళ్లకు సపోర్ట్ చేశారు, అన్‌ఫెయిర్ అంటూ అని మనీష్‌ను తిట్టిపోశాడు. అందుకు మనీష్.. నువ్వు కంటెస్టెంట్‌గా ఫెయిల్, వచ్చాడు పెద్ద ప్లేయర్.. వైల్డ్ కార్డులను తీసుకోండి అని బిగ్‌బాస్‌కే సలహాలు ఇచ్చాడు. అతడి ప్రవర్తన చూస్తుంటే శ్రీముఖి ఎందుకితడిని హౌస్‌లోకి పంపించిందిరా బాబూ అని ప్రేక్షకులు తల పట్టుకుంటున్నారు. ఇలా గొడవలు జరుగుతుండగానే ఎపిసోడ్ పూర్తయింది. అయితే ఇప్పటికే అందుతున్న లీకుల ప్రకారం సంజన ఫస్ట్ కెప్టెన్ అయింది. మరోవైపు సంజనా.. సుమన్ సిగరెట్స్ దాచేసింది. అతడు ఎంత బతిమాలుతున్నా తాను దాచిపెట్టలేదంటూ అబద్ధమాడి ఏడిపిస్తోంది. చదవండి: ఎంతమంది వద్దన్నా లక్ష్మణ రేఖ నాకే వచ్చింది: నటి జయసుధ