వంట చేస్తూ అందరి కడుపు నింపిన బేబక్కను మొదటివారమే పంపించేశారు. దీంతో నిఖిల్ గరిట తిప్పాల్సిన పరిస్థితి! కానీ ఒక్కరికోసం మాత్రమే స్పెషల్‌గా వండాడు. మరోవైపు బేబక్క ఎలిమినేషన్‌తో నైనిక, సీతకు బయట ఏం జరుగుతుందో అర్థమైపోయింది. జనాలు ఎటువంటి గేమ్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు? ఏంటనేది సినిమా క్లియర్‌గా తెలిసిపోయింది. ఇక నామినేషన్స్‌ను కంటెస్టెంట్లు యుద్ధంలా పూర్తి చేశారు. హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (సెప్టెంబర్ 9) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..
చిట్టా పెద్దగానే ఉందే!
ఎవరు ఎలిమినేట్ అవుతారనుకున్నానో వాళ్లే ఫస్ట్ సేవ్ అయ్యారంటూ తన బాధను బయటపెట్టింది విష్ణుప్రియ. అయినా సోనియా ఎలిమినేట్ అవుతుందని ఎలా అనుకున్నావని ప్రేరణ నోరెళ్లబెట్టింది. అనంతరం పృథ్వీ.. సోనియాకు ఎలాంటి అబ్బాయి నచ్చుతాడనేది కూపీ లాగింది. అందుకామె.. నన్ను అర్థం చేసుకోవాలి, ప్రోగ్రెసివ్‌గా ఉండాలి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, ముఖ్యంగా నేను చేయాలనుకున్నదానికి అడ్డుపడొద్దు, నా అంత బుద్ధి ఉండొద్దు అని కోరికల చిట్టా బయటపెట్టింది.
ఆమెకు ఇష్టమైన కూర చేసిన నిఖిల్
మరోపక్క ఈమె మెంతి టమాట కూర తినాలని కోరిక పుట్టడంతో నిఖిల్ కిచెన్‌లో గరిట తిప్పాడు. ఈ విషయాన్ని సీత బయటపెట్టడంతో విష్ణుప్రియ నోరెళ్లబెట్టింది. తర్వాత నామినేషన్ ప్రక్రియ మొదలైంది. కంటెస్టెంట్లు తమ టీమ్‌లోని సభ్యులను మినహాయించి అవతలి టీమ్స్‌లో ఎవరినైనా నామినేట్ చేయొచ్చని బిగ్‌బాస్ (#BiggBoss8Telugu) తెలిపాడు. పెద్ద టీమ్ చీఫ్ అయిన కారణంగా యష్మి నామినేషన్స్‌లో ఉండబోదని పేర్కొన్నాడు.
కోరిక తీర్చేసుకున్న సీత
మొదటగా సీత.. గతవారమే నిన్ను నామినేట్ చేయాలనుకున్నాను, ఇప్పుడు ఆ ఛాన్స్ దొరికిందంటూ నిఖిల్‌పై రంగు పోసింది. చెత్తబుట్టలో నుంచి గ్లాస్ తీసి బయటపెట్టడం నన్ను అవమానించినట్లుగా అనిపించిందని ప్రేరణను నామినేట్ చేసింది. అభయ్.. ఇంకా బెస్ట్ ఇవ్వాలంటూ విష్ణుప్రియను, ఇన్వాల్వ్‌మెంట్ తక్కువైందంటూ ఆదిత్యను నామినేట్ చేశాడు.
సోనియా వర్సెస్ సీత
సోనియా.. చీఫ్‌గా ఫెయిలైందంటూ నైనికను నామినేట్ చేసింది. సీతను నిలబెట్టి.. టాస్కులు అర్థం చేసుకోలేకపోతున్నావంటూ క్లాసు పీకింది. అభయ్‌తో జరిగిన గొడవలోనూ నీకు పర్సనాలిటీ ప్రాబ్లమ్ ఉందని తేలిందని, నీకింకా మెచ్యూరిటీ రావాలంటూ తిట్టిపోసింది. అసలు టీమ్‌లో ఎలా ఉండాలో కూడా తెలియదని చులకన చేసింది. టోటల్‌గా గ్రూప్ అంతా ఫెయిలైందని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇదంతా విన్న సీత.. నువ్వు గేమ్‌ను అర్థం చేసుకున్నాక నాతో మాట్లాడని కౌంటరిచ్చింది. నీకు మెచ్యూరిటీ లేదని తిరిగనేసరికి.. మెచ్యూరిటీ గురించి మాట్లాడొద్దని సోనియా హెచ్చరించింది.
ఆదిత్యపై పడ్డారే!
మణికంఠ.. ప్రతి మనిషి గురించి పాజిటివ్స్ చెప్తున్నారు. అది సేఫ్ గేమా? లేదంటే మీ వ్యక్తిత్వమే అలాంటిదా? అనేది అర్థం కావడం లేదు. అలాగే నామినేషన్స్ ఒత్తిడిని ఎలా తీసుకుంటావో చూడాలనుందని ఆదిత్యను నామినేట్ చేశాడు. అందుకతడు.. మీరు నాకు పబ్లిసిటీ చేస్తున్నారంటూ నవ్వుతూ స్వీకరించాడు. సీరియస్ టైంలో కుళ్లు జోకులు వేస్తున్నావని, అలాగే స్వీట్లు తీసుకెళ్లి దాచేశావని బాషాను నామినేట్ చేశాడు.
ఆరని జ్వాల
ఆదిత్య వంతు రాగా.. స్ట్రాంగ్ కంటెండర్ అంటూ అభయ్ నవీన్‌ను, ఈ గేమ్‌కు మీరు ఫిట్ కాదంటూ శేఖర్ బాషాను నామినేట్ చేశాడు. విష్ణుప్రియ.. నా తప్పులు వెతకడానికి నాతో జర్నీ చేశానని గతవారం నామినేషన్‌లో చెప్పడం నచ్చలేదని మణికంఠపై రంగు చల్లింది. తర్వాత సోనియాను నామినేట్ చేస్తూ.. మీకు కోపం వచ్చినప్పుడు అవతలివారిపై నిందలు వేస్తున్నారంది.
దుస్తులు సరిగా వేసుకోవు!
అందుకామె.. నీకు నాతో అంత ర్యాపో లేకపోయినా నాపై జోకులు వేశావు.. సారీ చెప్పినంత మాత్రాన మాటల్ని వెనక్కు తీసుకోలేం.. నువ్వు అడల్ట్రేటెడ్ జోకులు చేస్తావు.. ఇప్పటికీ అదే అంటాను. బట్టలు సరిగా వేసుకుని ఒక మనిషి పక్కన నిల్చోవాలనేది కూడా నీకు తెలియదు కదా.. ఒకరు కంఫర్ట్‌గా లేరని తెలిసినా కూడా అలా వారి పక్కన నిల్చున్నప్పుడే నీ వ్యక్తిత్వం తెలుస్తోంది అంటూ విష్ణుప్రియను మరింత రెచ్చగొట్టింది. పచ్చకామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని సెటైర్లు వేసింది విష్ణుప్రియ.
ఒకే ఒక్కడితో ప్రాబ్లమ్
బాషా వంతు రాగా.. నాకు ఒకే ఒక్కడితో ప్రాబ్లమ్.. అతడే మణికంఠ.. అతడు జనజీవన స్రవంతిలో కలవనంతవరకు నామినేట్ చేస్తూనే ఉంటానంటూ తనపై రంగు గుమ్మరించాడు. నేను బిగ్‌బాస్‌కు అన్‌ఫిట్ అని మీరు నిర్ణయించడం బాధేసిందంటూ ఆదిత్య ఓంను నామినేట్ చేశాడు.
వీళ్ల రూటే సెపరేటు
దీంతో ఆదిత్య.. నా వయసులో ఏం జరుగుతుందో మీకు తెలియదు.. నేను ఫ్యామిలీని వదిలేసి వచ్చాను. అన్ని పనులు చేస్తున్నాను అంటూ సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడాడు. నిజానికి వీళ్లిద్దరూ ఒకర్ని ఒకరు నామినేట్ చేసుకున్నారు కానీ మనసులో మాత్రం బాధపడుతున్నారని చూసే జనాలకు ఇట్టే తెలిసిపోతుంది. అందుకే నామినేషన్ అయ్యాక హగ్ చేసుకుని ముద్దులు పెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment