నీళ్ల ట్యాంకర్ దగ్గర గొడవపడ్డట్లు ఆ కొట్లాటలేంటి? ఆ మాటలేంటి? అని విష్ణుప్రియ, ప్రేరణ.. ఇద్దరికీ క్లాస్ పీకాడు నాగ్. పోయినవారం గుడ్డు దగ్గర మొదలైన వైరం గుడ్డుతోనే ముగిసిపోవాలని ఐదు ఎగ్స్ ఇచ్చి మరీ ఒకరికొకరు తినిపించుకోమన్నాడు. అప్పుడు సరేనంటూ తలూపిన వీళ్లు నామినేషన్స్ రాగానే మళ్లీ ఒరిజినల్ క్యారెక్టర్‌లోకి దిగిపోయారు.
నబీల్ వర్సెస్ సోనియా
విష్ణుప్రియ.. ప్రేరణను నామినేట్ చేయడంతో ఆమె షాకైంది. అయితే ప్రేరణ మాత్రం విష్ణును వదిలేసి నైనిక, మణికంఠలను నామినేట్ చేసింది. ఇక సోనియా.. తన యాటిట్యూడ్ చూపించింది. మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అని నబీల్‌కు ట్యాగ్ ఇచ్చింది. అటు ఆదిత్య ఓంను నామినేట్ చేస్తూ.. మీరేం పర్ఫామెన్స్ ఇవ్వలేదు కాబట్టి చెప్పడానికి పెద్దగా పాయింట్లు కూడా లేవంది.
వెళ్తాననుకున్నారుగా.. వెళ్లిపోండి
ఎలాగో ఈవారం వెళ్తాననుకున్నారు కదా.. కాబట్టి ఈ హౌస్ నుంచి వెళ్లిపోండి అని ఆదిత్య ముఖం మీదే చెప్పింది. మొత్తానికి ఈ వారం ప్రేరణ, నబీల్, ఆదిత్య, సోనియా, పృథ్వి, మణి ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. నిజానికి నైనిక కూడా నామినేషన్‌లో ఉండాల్సింది కానీ తనను నిఖిల్ సేవ్ చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment