తడిబట్టలతో అబ్బాయిల ముందు! మళ్లీ విష్ణుప్రియకు నీతి సూక్తులు | Bigg Boss Telugu 8: Sonia Akula Defame Vishnu Priya Bhimeneni | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Telugu: విష్ణుప్రియను చూసి అతడు వణికిపోయాడట! అసలేం జరిగిందంటే?

Published Wed, Sep 11 2024 6:21 PM | Last Updated on Thu, Sep 12 2024 3:24 PM

Bigg Boss Telugu 8: Sonia Akula Defame Vishnu Priya Bhimeneni

పర్సనల్‌ వేరు, గేమ్‌ వేరు. దీనికి మధ్య తేడా తెలుసుకోవాలి.. ఇది సోనియా చెప్పిన మాటే!అయితే తాను అందరికీ సూక్తులు చెప్తాను కానీ పాటించనంటోందీ ఆర్జీవీ బ్యూటీ. మొన్న జరిగిన నామినేషనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. నన్ను అడల్ట్‌రేటెడ్‌ జోకులు అనడం నచ్చలేదని విష్ణుప్రియ.. సోనియాను నామినేట్‌ చేసింది. 

విష్ణుప్రియ కౌంటర్‌
తను పద్ధతిగా సోనియా గారు అని మాట్లాడుతుంటే సోనియా మాత్రం తనపై బురదజల్లే ప్రయత్నం చేసింది. నీకు అలాంటి జోకులే వచ్చని మాట్లాడింది. దీంతో సహనం కోల్పోయిన విష్ణుప్రియ.. అడల్ట్‌ అనేది నాలో లేదు, నీ బుర్రలో ఉంది. పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని కౌంటర్‌ ఇచ్చింది.

సోనియా దిగజారుడు వ్యాఖ్యలు
తనకు ఎదురు తిరగడంతో సోనియా మరింత దిగజారుడు వ్యాఖ్యలు చేసింది. దుస్తులు సరిగ్గా వేసుకుని ఆ మనిషి పక్కన నిల్చోవాలన్నది కూడా తెలీదు. అతడు ఇబ్బందిగా ఫీల్‌ అవుతున్నా కూడా మళ్లీ వెళ్లి అతడి పక్కనే నిలబడుతున్నావంటే నీ మాటలు, చేతలు అడల్ట్‌లాగే అనిపిస్తాయి అని దారుణంగా మాట్లాడింది. ఎవరి దగ్గర ప్రవర్తించానో చెప్పు అని విష్ణు సాఫ్ట్‌గానే అడిగినా.. అందరి దగ్గర అలాగే ప్రవర్తిస్తావని మండిపడింది. 

పొరపాటున..
అసలు అంతగా ఇబ్బంది పడ్డ వ్యక్తి ఎవరు? ఏం జరిగింది? అంటే.. బాత్‌రూమ్‌లో చీర కట్టుకోవడం కష్టం కాబట్టి విష్ణుప్రియ బెడ్‌రూమ్‌లోకి వెళ్లింది. అది తెలియక పొరపాటున ఆదిత్య ఓం బెడ్‌రూమ్‌లోకి వెళ్లాడు. ఆమె చీర కట్టుకుంటుందని తెలిసి వెంటనే బయటకు వెళ్లిపోయాడు. అతడిని గమనించిన విష్ణు.. ఆదిత్య దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది. ఇంతదానికి సోనియా.. ఏదో చెండాలం జరిగిపోయినంత బిల్డప్‌ ఇచ్చింది. 

మరి నీ డ్రెస్సింగ్‌ సెన్స్‌ ఏది?
అక్కడ ఆదిత్య ఇబ్బందిపడకపోయినా సోనియానే తెగ ఫీలైపోయింది. నిఖిల్‌, అభయ్‌ దగ్గరకు వెళ్లి విష్ణుప్రియ చీర మార్చుకుంటుండగా ఏం జరిగిందో తెలిసా? అని మళ్లీ మొదలుపెట్టింది. పైగా తడిచిన బట్టల్లో, కేవలం టీషర్ట్‌తో ఉండగానే వాళ్ల ముందు నిలబడింది. విష్ణుప్రియ డ్రెస్సింగ్‌ గురించి ఓవర్‌గా మాట్లాడిన సోనియా.. మరి ఇలా తడిచిన బట్టలతో వాళ్ల ముందు నిలబడటమేంటో తనకే తెలియాలి!

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement