జానీ మాస్టర్ (Jani Master) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ మహిళ కొరియోగ్రాఫర్(choreographer) ఫిర్యాదుతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపుల కేసులో ఆయనను అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత బెయిల్ మంజూరు కావడంతో జానీ విడుదలయ్యారు. తాజాగా ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.
లైంగిక వేధింపులకు పాల్పడ్డారు: ఛార్జ్ షీట్‌లో పోలీసులు
పలు ఈవెంట్స్ పేరుతో మహిళ కొరియోగ్రాఫర్‌ను లైంగిక వేధింపులకు గురి చేశాడని పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఆమెను పలు ప్రాంతాలకు తీసుకెళ్లి వేధింపులకు గురి చేసినట్లు అందులో ప్రస్తావించారు. కాగా.. తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ ఓ మహిళ కొరియోగ్రాఫర్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: పెళ్లి చేసుకోమని ఆమె నన్ను వేధించేది: జానీ మాస్టర్)
అసలేం జరిగిందంటే..
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై 21 ఏళ్ల అమ్మాయి హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనని అత్యాచారం చేయడంతో పాటు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని వాపోయింది. మధ్యప్రదేశ్‌కి చెందిన బాధితురాలు 2017లో జానీ మాస్టర్‌కి పరిచయమైంది. 2019లో అతని వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరింది. ఓ షో కోసం ముంబయికి వెళ్లిన టైంలో తనని లైంగికంగా వేధించాడని బాధితురాలు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపివేస్తానని తనని బెదిరించే వాడని, షూటింగ్‌కు సంబంధించిన వాహనంలో కూడా తనని వేధించాడని బాధితురాలు వాపోయింది. దీంతో జానీపై లైంగిక వేధింపుల కేసుతో పాటు పోక్సో కేసు కూడా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment