డెహ్రడూన్: ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్‌లో 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరాఖండ్ రోడ్‌వేస్‌కు చెందిన బస్సులో డెహ్రడూన్‌లోని అంతర్రాష్ట్ర బస్ టెర్మినల్ (ఐఎస్‌బీటీ)లో ఇద్దరు డ్రైవర్లు, సహా మరో ముగ్గురు ఆగస్టు 12వ తేదీన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. 13వ తేదీ తెల్లవారుజామున బస్ టెర్మినల్‌లోని ఓ దుకాణం వద్ద బాలికను గార్డు గుర్తించాడు. వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాడు.
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి ఉత్తరాఖండ్ రోడ్ వేస్ బస్సును గుర్తించారు. ఐదుగురిని అరెస్టు చేశారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నేరం జరిగిన బస్సు, మరో బస్సును దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపించారు.
మానసికంగా స్థిమితంగా లేని బాలిక సరైన సమాచారం ఇవ్వలేదు. తనది యూపీలోని మొరాదాబాద్ అని తెలిపింది. కుటుంబ సభ్యుల వివరాలను వెల్లడించింది. మొరాదాబాద్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీలోని కశ్మీరీ గేట్ నుంచి బస్సులో డెహ్రడూన్‌కు వచ్చానని, అక్కడ ఐదుగురు వ్యక్తులు తనపై ఒక్కొక్కరుగా అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక చెప్పిందని డెహ్రాడూన్ ఎస్‌ఎస్పీ అజయ్ సింగ్ తెలిపారు. నిందితులందరినీ అరెస్టు చేసి, పోక్సో కేసు నమోదు చేశామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment