ఉత్తరాఖండ్‌లో ఇంతవరకూ జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఎంపీల ప్రాతినిధ్యం నామమాత్రంగానే ఉంది. ప్రకృతి సౌందర్యానికి, ఆధ్యాత్మిక ప్రదేశాలకు ఉత్తరాఖండ్ పేరుగాంచింది. అయితే రాజకీయాల్లో ఇక్కడ నేటికీ లింగవివక్ష కనిపిస్తూనే ఉంది. 1952లో రాష్ట్రంలోని తెహ్రీ నుంచి ఎన్నికైన కమలేందు మతి షా ఉత్తరాఖండ్ నుంచి ఎన్నికైన తొలి మహిళా ఎంపీ. 1998లో నైనిటాల్ నుంచి ఎన్నికైన రెండో మహిళా ఎంపీ ఇలా పంత్. ఈ విధంగా చూస్తే రాష్ట్రం నుంచి లోక్‌సభకు మహిళా ఎంపీ చేరేందుకు 46 ఏళ్లు పట్టింది.
2012లో మాలా రాజ్య లక్ష్మి షా అనే మరో మహిళ ఎంపీ స్థాయికి చేరుకోగలిగారు. ఏడు దశాబ్దాల ఎన్నికల చరిత్రలో ముగ్గురు మహిళలకు మాత్రమే లోక్‌సభలో ప్రాతినిధ్యం దక్కింది. 2014, 2019లలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెహ్రీ నుంచి మాలా రాజ్యలక్ష్మి షా ఎంపీ అయ్యారు. 1952 ఎన్నికల్లో తెహ్రీ గర్వాల్ సీటు నుంచి రాజమాత కమలేందు మతి షా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. నాటి రోజుల్లో కాంగ్రెస్‌కు భారీ మద్దతు ఉన్నప్పటికీ, ఇక్కడి ఎన్నికల్లో కమలేందు మతి షా విజయం సాధించారు. నాటి రాజ్యాంగ పరిషత్ సభ్యుడు, కాంగ్రెస్ అభ్యర్థి ఠాకూర్ కృష్ణ సింగ్ ఓటమి చవిచూశారు.
Comments
Please login to add a commentAdd a comment