
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. కొడియాల వద్ద 1500 వాహనాలు నిలిచిపోగా సుమారు 20 వేల మంది రోడ్ల మీద చిక్కుకుపోయారు. సుమారు 40 కి.మీ మేర యాత్రికులు, స్థానికులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడటంతో యాత్రికులు దారిపొడవునా ఆవస్థలు పడుతున్నారు. కొడియాల్ వద్ద 40 కి.మీ. మేర సుమారు 1500 వాహనాలు నిలిచిపోయాయి. అందులో కనీసం 20 వేల మంది జనం ఎటూ మరలలేక అక్కడే నిలిచిపోయారు. రిషికేష్ యాత్రికులు, స్థానికులు రోడ్డుపైనే గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు.
వీరిలో ఏపీ, బెంగుళూరుకు చెందిన వారు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. వీరంతా తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా అక్కడ చిక్కుకున్నట్లు తెలిపారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈరోజు కూడా అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అక్కడి వాతావారణ శాఖ వెల్లడిస్తూ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మమ్మల్ని ఎలాగైనా బయట పడేయమని విపత్తులో చిక్కుకున్న యాత్రికులంతా ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులని అభ్యర్థిస్తున్నారు.
ఇది కూడా చదవండి: చెన్నైలో నిత్య పెళ్లికొడుకు కల్యాణసుందరం అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment