Rishikesh
-
మాజీ ప్రేయసితో పాట
హ్యాపీగా ప్రేయసితో వెంకటేశ్ డెహ్రాడూన్‌లో పాట పాడుకుంటున్నారు. వెంకటేశ్, మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది.ఈ చిత్రంలో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య, ఆయన మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. ప్రస్తుతం డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్‌లోని లొకేషన్లలో వెంకటేశ్, మీనాక్షీ చౌదరి పాల్గొనగా ఓ పాట షూట్ చేస్తున్నారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
కంప్లీట్ టూర్ : రిషికేశ్, రుద్రాక్షలు స్పెషల్
అక్టోబర్ వస్తోంది. దసరా సెలవులు వస్తాయి. కాలేజ్, ఉద్యోగం స్ట్రెస్ నుంచి రిలీఫ్ కోసం ఎటైనా టూర్‌కెళ్తే బావుణ్ననిపిస్తుంది. ఈ సీజన్లో మనదేశంలో ఏ ప్లేస్ బెస్ట్ అంటే ముందు రిషికేశ్ని గుర్తు చేసుకోవాలి. రిషికేశ్ టూర్ అంటే అట్లా ఇట్లా ఉండదు. ఒక అడ్వెంచరస్ టూర్, ఒక తీర్థయాత్ర, ఒక హనీమూన్ వెకేషన్, ఓ తథాత్మ్యత... అన్నీ కలిపిన తీర్థం, క్షేత్రం ఇది. గంగోత్రి నుంచి గంగానది కొండ వాలుల మధ్య ప్రవహిస్తూ నేల మీదకు వచ్చే వరకు ప్రవాహం చాలా ఉధృతంగా ఉంటుంది. గంగోత్రి నుంచి రిషికేశ్కు 250 కిమీల దూరం ఉంటుంది. రిషికేశ్ పట్టణం సముద్రమట్టానికి పదకొండు వందల నుంచి పదిహేడు వందల అడుగుల ఎత్తులో విస్తరించి ఉంది. రిషికేశ్ వరకు గంగానది ఎక్కువ వెడల్పు లేకుండాపాయలాగ వేగంగా ప్రవహిస్తూ ఆకాశం నుంచి దూకుతున్నట్లే ఉంటుంది. అక్కడి నుంచి పాతిక కిలోమీటర్ల దూరాన ఉన్న హరిద్వార్ వరకు ప్రవాహం విశాలమవుతూ, పరుగు వేగం తగ్గుతుంటుంది. గంగానది కలుషితం కావడం హరిద్వార్ దగ్గర నుంచే మొదలవుతుంది. కాబట్టి అంతకంటే పైన రిషికేశ్ దగ్గర గంగాస్నానం చేయాలనుకుంటారు ఎక్కువ మంది. యువత అయితే గంగానదితోపాటు ఒక్క ఉదుటున భూమ్మీదకు దూకడం కోసం రిషికేశ్కు ఇరవై కిలోమీటర్ల పైకి వెళ్లి అక్కడి నుంచి రాఫ్టింగ్ మొదలు పెడతారు. రిషికేశ్‌లో రివర్‌రాఫ్టింగ్ నిర్వహించే సంస్థలు ప్రతి వీధిలోనూ కనిపిస్తాయి. బంగీ జంప్, ఫ్లయింగ్ పాక్స్ కూడా చేయవచ్చు. నగరం ఎంత ఇరుకుగా ఉంటుందో నది తీరాన గుడారాల్లో క్యాంపింగ్ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ కార్పొరేట్ విద్యాసంస్థలు కూడా చెప్పుకోదగిన సంఖ్యలో కనిపిస్తాయి.లక్ష్మణ్ ఝాలాగంగానది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరడానికి సస్పెన్షన్ బ్రిడ్జి ఉంది. దాని పేరు లక్ష్మణ్ ఝాలా. రామాయణ కాలంలో రాముడు, లక్ష్మణుడు, సీత కొంతకాలం ఇక్కడ నివసించారని చెబుతారు. సీత నది దాటడం కోసం లక్ష్మణుడు అడవి చెట్ల తీగలతో వంతెనను అల్లాడని, దాని పేరే లక్ష్మణ్ ఝాలా అని చెబుతారు. రిషికేశ్కు మరికొంత దూరంలో రామ్ ఝాలా ఉంది. అది రాముడు అల్లిన తీగల వంతెన. ఈ రెండు వంతెనలు నది దాటడానికి అనువుగా ఉండేవి. కాలక్రమంలో ఆ వంతెనల స్థానంలోనే ఇనుప వంతెనలు నిర్మాణం జరిగింది. పర్యాటకులు లక్ష్మణ్ ఝాలా మీద నుంచి అవతలి తీరానికి చేరి అక్కడి నుంచి పడవలో విహరిస్తూ ఇవతలి ఒడ్డుకు రావచ్చు. పడవలో మెల్లగా సాగుతూ ఒక ఒడ్డున మనుషులను, మరో ఒడ్డునున్న ఎత్తైన కొండలను, కొండవాలులో, నది తీరాన ఉన్న నిర్మాణాలను చూస్తూ ఉంటే ఒక్కసారిగా తుళ్లింతలతో యువకులు రివర్ రాఫ్టింగ్ చేస్తూ దూసుకొస్తారు. నదిలో బోట్ షికార్ టికెట్ల మీద ప్రభుత్వ నిఘా పెద్దగా ఉండదు. ప్రైవేట్ బోట్ల వాళ్లు ఒక్క ట్రిప్‌కి వేలల్లో అడుగుతారు. పెద్ద బోట్లలో వెళ్లడమే శ్రేయస్కరం. గంగ పరవళ్లు తొక్కుతుంటుంది. చిన్న పిల్లలతో వెళ్లిన వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి.యోగా క్యాపిటల్రిషికేశ్, హరిద్వార్ రెండూ నేషనల్ హెరిటేజ్ సిటీలు. కేరళలో ఉన్నట్లే ఆయుర్వేద వైద్యం, పంచకర్మ చికిత్స కేంద్రాలుంటాయి. హిమాలయాల నుంచి సేకరించిన ఔషధ మొక్కలతో వైద్యం చేస్తారు. రిషికేశ్‌లో ఏటా యోగా, మెడిటేషన్ సెషన్లు జరుగుతాయి. భారత ప్రధాని కూడా రిషికేశ్ పర్యటన సందర్భంగా పట్టణంలోని ఒక గుహలో ధ్యానం చేశారు. భవబంధాలను వదిలి మోక్షసాధన కోసం జీవితంలో అంత్యకాలాన్ని ఇక్కడ గడపడానికి వచ్చేవాళ్లు కూడా ఉంటారు. రోజూ సాయంత్రం గంగాహారతి కనువిందు చేస్తుంది. నది మధ్యలో ధ్యానముద్రలో ఉన్న ఈశ్వరుని విగ్రహాన్ని చూడడానికి దగ్గరకు వెళ్లడం కంటే ఒడ్డున ఘాట్ నుంచి చూస్తేనే శిల్పసౌందర్యాన్ని ఆస్వాదించగలుగుతాం. ఉత్తరాఖండ్ వర్షాకాలం వరదల బారిన పడుతుంటుంది. కానీ ఆ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు టూరిజమే. కాబట్టి సీజన్ వచ్చే సరికి టూరిస్టుల కోసం సిద్ధమైపోతుంది. అన్నట్లు ఈ టూర్ గుర్తుగా రుద్రాక్ష తెచ్చుకోవడం మర్చిపోవద్దు. మన దగ్గర జామచెట్లు ఉన్నట్లు ఎక్కడ చూసినా రుద్రాక్ష చెట్లే. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
రిషికేశ్ కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు
రిషికేశ్: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రిషికేశ్- కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. ప్రాజెక్టులోని ప్యాకేజీ-2లో శివపురి, గూలర్ మధ్య ఆరు కిలోమీటర్ల రైలు సొరంగ నిర్మాణం విజయవంతంగా పూర్తయ్యింది. దీనికి సమాంతరంగా వెళ్లే సొరంగ నిర్మాణం 2023 సెప్టెంబరు నాటికే పూర్తయ్యింది.రిషికేశ్‌లోని కర్ణప్రయాగ్ వరకూ 125 కిలోమీటర్ల పొడవైన రైల్వే లైనులోని 104 కిలోమీటర్ల ప్రాంతం 17 విభిన్న సొరంగాల మధ్య నుంచి వెళుతుంది. అన్ని సొరంగాల మొత్తం పొడవు 213.4 కిలోమీటర్లు. ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్టులోని మొత్తం 213.4 కిలోమీటర్లలో ఇప్పటికే 169.496(79.42 శాతం) సొరంగం తవ్వకాల పనులు పూర్తయ్యాయి. ఈ నేపధ్యంలో రైల్వే ఉన్నతాధికారులు ఈ ప్రాజెక్టు పనులు పర్యవేక్షిస్తున్న లార్సన్ అండ్ టుబ్రో(ఎల్ అండ్ టీ) బృందానికి అభినందనలు తెలిపారు.రిషికేశ్-కర్ణప్రయాగ్ రైలు ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనులు ఎల్ అండ్ టీ కంపెనీ చేపడుతున్న నేపధ్యంలో తాజాగా కంపెనీ ప్రాజెక్టు మేనేజర్ రాజేష్ చోప్రా మాట్లాడుతూ ప్యాకేజీ-2లో ఎల్ అండ్ టీ చేతిలో ఎడిట్-2(56 మీటర్లు), మెయిన్ టన్నెల్-2లో డబుల్ లైన్ 7-స్టేజ్(80 మీటర్లు) ముఖ్య సొరంగం(6002) మీటర్లు, నికాస్ సొరంగం(6066 మీటర్లు)నకు సంబంధించిన టన్నలింగ్ పనులు ఉన్నాయన్నారు. వీటిలోని చాలా పనులు 2023 సెప్టెంబరు 12 నాటికే పూర్తయ్యాయని తెలిపారు. -
ఆస్పత్రిలో తల్లిని పరామర్శించిన సీఎం యోగి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాదాపు రెండేళ్ల తర్వాత రిషికేశ్‌లో తన తల్లిని కలుసుకున్నారు. అతని తల్లి రిషికేశ్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.తన తల్లి సావిత్రి దేవి(84)ని కలుసుకుని ఆమె యోగక్షేమాలు తెలుసుకునేందుకు యోగి ఆదిత్యనాథ్ ఎయిమ్స్‌కు వచ్చారు. దాదాపు అరగంటపాటు సీఎం యోగి ఎయిమ్స్‌లోనే ఉన్నారు. తల్లి ఆరోగ్యం గురించి తెలుసుకున్నాక సీఎం యోగి అక్కడి ట్రామా సెంటర్లో చికిత్స పొందుతున్న రుద్రప్రయాగ్ క్షతగాత్రులను పరామర్శించారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్న అనంతరం హెలికాప్టర్లో తిరిగి లక్నో చేరుకున్నారు.నెల రోజుల వ్యవధిలోనే సీఎం యోగి తల్లి రెండోసారి ఆస్పత్రిలో చేరారు. అంతకుముందు ఆమె కంటి ఇన్ఫెక్షన్తో ఆసుపత్రిలో చేరారు. యోగి ఆదిత్యనాథ్ కుటుంబ సభ్యులు పౌరీ గర్వాల్లోని పంచూర్ గ్రామంలో నివసిస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ పూర్వీకుల గ్రామం రిషికేశ్కు 50 కి.మీ. దూరంలో ఉంది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్ తల్లిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పాలకవర్గానికి పలు సూచనలు చేశారు. యోగి తండ్రి ఆనంద్ 2020లో 89 ఏళ్ల వయసులో కన్నుమూశారు. #WATCH | Uttar Pradesh CM Yogi Adityanath today enquired about the well-being of his mother, admitted for treatment at AIIMS Rishikesh and received information related to her health from the doctors. pic.twitter.com/rwjSw5zyAJ— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 16, 2024 -
నిందితుని కోసం ఆసుపత్రిలోకి దూసుకొచ్చిన పోలీస్ వ్యాన్
నిజ జీవితంలోని కొన్ని ఘటనలు సినిమా సీన్లను తలపిస్తాయి. ఇటువంటి ఉదంతాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఒక వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఈ వీడియో ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్కు సంబంధించినది. ఈ వీడియోలో ఆసుపత్రిలోకి పోలీసుల వాహనం దూసుకువెళ్లడం కనిపిస్తుంది. దీనిని చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు.రిషికేశ్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు తమవాహనంతో సహా ఆసుపత్రిలోనికి దూసుకువచ్చారు. ఆ నిందితుడు అదే ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా వైద్యురాలిని వేధించాడని పోలీసులకు ఫిర్యాదు అందించింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆసుపత్రిలోకి వాహనంతో సహా వచ్చిన పోలీసులు ఆ నిందితుడిని అరెస్టు చేసి, అదే వాహనంలో తీసుకువెళ్లారు.దీనికి ముందు ఆ నిందితుని చర్యను నిరసిస్తూ ఆసుపత్రి వైద్యులు, ఇతర సిబ్బంది డీన్ కార్యాలయాన్ని చుట్టుముట్టి, నిరసనలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ఆస్పత్రికి తమ వాహనంలో చేరుకున్నారు. ఈ సమయంలో వారు సినిమా తరహాలో వాహనంతో సహా ఆసుపత్రిలోనికి వచ్చి, నిందితుడిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అయితే ఇంతకీ పోలీసులు.. నిందితుడిని పట్టుకునేందుకు వాహనంతో సహా లోనికి ఎందుకు వచ్చారన్న ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు.The cops drove their car inside AIIMS Rishikesh.pic.twitter.com/rZDkCvHipM— Divya Gandotra Tandon (@divya_gandotra) May 22, 2024 -
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
చార్ధామ్ వెళ్లాలనుకుంటున్నవారికి శుభవార్త. 2025 నుండి చార్ధామ్ యాత్రకు రైలులో వెళ్లే అవకాశం కలగబోతోంది. ఈ రూట్లోని 327 కిలోమీటర్ల రైలు మార్గాన్ని రైల్వేశాఖ సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రిషికేష్-కర్ణప్రయాగ్ మధ్య 125 కి.మీ. రైల్వే లైన్ పనులు దాదాపు పూర్తయ్యాయి.రైల్వేశాఖ చేపట్టిన చార్ధామ్ ప్రాజెక్టు కింద గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్‌లను రైల్వేలతో అనుసంధానం చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రైల్వే బోర్డు సీఈవో జయ వర్మ సిన్హా ఇటీవల ఈ పనులను పరిశీలించారు. ఈ ప్రాజెక్టులో ఇంకా 327 కి.మీ రైల్వే ట్రాక్‌ను సిద్ధం చేయాల్సి ఉంది. మూడు దశలుగా విభజించిన ఈ ప్రాజెక్టును 2025 నాటికి పూర్తి చేస్తామని రైల్వే పేర్కొంది.ఈ ప్రాజెక్టులో 153 కి.మీ. రైలు మార్గం మొరాదాబాద్ డివిజన్లో ఉంది. దీనిలో 105 కి.మీ. రైల్వే లైన్ సొరంగం గుండా వెళుతుంది. ఈ రూట్లో మొత్తం 12 స్టేషన్లు నిర్మిస్తున్నారు. రూ.16 వేల 216 కోట్లతో 125 కిలోమీటర్ల రైలు మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు.హిమాలయాల్లోని చార్ధామ్ దేవాలయాలైన గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్‌లకు రైలు కనెక్టివిటీని అందించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. సొరంగాల్లో రైల్వే లైన్లు వేయడం, ఇతర పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. 2025 నాటికి ఈ మార్గంలో రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. -
సర్వోదయ నేత మురారీ లాల్ కన్నుమూత
గోపేశ్వర్: సామాజిక కార్యకర్త, సర్వోదయ, చిప్కో ఉద్య మాల నేత మురారీ లాల్(91) కన్నుమూశారు. శ్వాసలో ఇబ్బందులు తలెత్తడంతో మూడు రోజుల క్రితం రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో చేర్పించారు. పరిస్థితి విషమించి శుక్రవారం మురారీ లాల్ తుదిశ్వాస విడిచారు. చమోలి జిల్లా గోపేశ్వర్‌కు సమీపంలోని పాప్డియానా గ్రామంలో 1933లో మురారీ లాల్ జన్మించారు. చిప్కో ఉద్యమ మాతృసంస్థ అయిన దశోలీ గ్రామ స్వరాజ్య మండల్‌కు మురారీ లాల్ అధ్యక్షుడిగా పనిచేశారు. మురారీ లాల్ తన స్వగ్రామంలోని బంజరు భూములను సస్యశ్యామలంగా మార్చడంతోపాటు సహజ వనరుల సంరక్షణ, వినియోగానికి సంబంధించి వినూత్న విధానాలను రూపొందించి గుర్తింపు పొందారు. చమోలీ జిల్లా మద్య నిషేధం కోసం ఉద్యమించారు. 1975–76 కాలంలో భూమి లేని పేదలకు లీజుపై భూమి దక్కేలా చేశారు. శ్రమదానంతో స్వగ్రామంలో పాఠశాలను ఏర్పాటు చేశారు. -
Lok sabha elections 2024: ఉగ్రవాదులకు చావుదెబ్బ: మోదీ
రిషికేశ్/జైపూర్: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఉగ్రవాదులు చావుదెబ్బ తిన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ముష్కర మూకలను మన భద్రతా దళాలు వారి సొంత గడ్డపైనే మట్టుబెట్టాయని పేర్కొన్నారు. ఫీర్ ఏక్ భార్ మోదీ సర్కారు(మరోసారి మోదీ ప్రభుత్వం) అనే నినాదం దేశమంతటా ప్రతిధ్వనిస్తోందని అన్నారు. స్థిరమైన ప్రభుత్వం వల్ల కలిగే లాభాలను ప్రజలు ప్రత్యక్షంగా చూశారని తెలిపారు. గురువారం ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో, రాజస్తాన్‌లోని కరౌలీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గతంలో కేంద్రంలో బలహీన, అస్థిర ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఉగ్రవాదులు చెలరేగిపోయారని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక తోక ముడిచారని వ్యాఖ్యానించారు. దేశాన్ని లూటీ చేయకుండా అవినీతిపరులను అడ్డుకున్నానని, అందుకే వారంతా తనను దూషిస్తున్నారని ఆక్షేపించారు. -
వీల్‌చైర్‌లో వచ్చాడు... విల్‌పవర్ చూపాడు
వీల్‌చైర్‌కు పరిమితమైన ఈ యువకుడు విల్ పవర్ మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. స్నేహితుల సహాయంతో వీల్‌చైర్‌లో నుంచి రిషికేష్‌లో బంగీ జంప్ చేశాడు. ఈ వీడియోతో ప్రపంచవ్యాప్తంగా నెటిజనుల మనసు దోచుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్ చేసిన ఈ వీడియో 24 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ యూ డేర్’ ‘మోర్ పవర్ టు యూ, బాయ్’లాంటి కామెంట్స్ కనిపించాయి. చాలామంది హార్ట్ ఇమోజీలతో రియాక్ట్ అయ్యారు. గతంలో లెఫ్టినెంట్ కల్నల్ అవనీష్ బాజ్‌పాయ్ ఆర్టిఫిషియల్ లింబ్‌తో భటిండాలో 14,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. -
రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు కార్మికుల తరలింపు
ఉత్తరకాశీ: సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు బుధవారం తరలించారు. అక్కడ కార్మికులకు అన్ని రకాల మెడికల్ చెకప్‌లను నిర్వహించనున్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చినూక్ హెలికాఫ్టర్‌లో 41 మంది కార్మికులను రిషికేశ్కు తరలించారు. గత 17 రోజులుగా సొరంగంలోనే చిక్కుకున్న నేపథ్యంలో కార్మికులకు ఏమైనా ఇన్ఫెక్షన్లు సోకాయా? అని వైద్యులు పరీక్షించనున్నారు. #WATCH | Uttarkashi tunnel rescue | IAF's transport aircraft Chinook, carrying 41 rescued workers, arrives in Rishikesh. It has been flown to AIIMS Rishikesh from Chinyalisaur for the workers' further medical examination.#Uttarakhand pic.twitter.com/hrWm1dlxsM — ANI (@ANI) November 29, 2023 కార్మికులను సొరంగం నుంచి రక్షించిన తర్వాత స్థానికంగా ఉన్న చిన్యాలిసౌర్ ఆస్పత్రికి కార్మికులను తరలించారు. బుధవారం తెల్లవారుజామున, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కూడా కార్మికులను కలిశారు. కార్మికులంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు. తదుపరి పరీక్షల కోసం ఎయిమ్స్‌కు తరలిస్తామని వెల్లడించారు. #WATCH | Uttarakhand CM Pushkar Singh Dhami meets and enquires about the health of rescued tunnel workers at Chinyalisaur Community Health Centre, also hands over relief cheques to them pic.twitter.com/fAT6OsF4DU — ANI (@ANI) November 29, 2023 కార్మికులను రక్షించడానికి కీలక సహాయం అందించిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులను కూడా పుష్కర్ సింగ్ ధామీ కలిశారు. వారికి ధన్యవాదాలు తెలిపిన ఆయన.. ప్రోత్సాహకం కింద ఒక్కొక్కరికి రూ.50 వేలు ఆర్దిక సహాయాన్ని ప్రకటించారు. అనంతరం కార్మికుల కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. #WATCH | Matli: Uttarakhand CM Pushkar Singh Dhami meets the ITBP personnel involved in the Uttarkashi Silkyara tunnel rescue. pic.twitter.com/tVlklz4FOl — ANI (@ANI) November 29, 2023 నవంబర్ 12న ఉత్తకాశీలోని సిల్క్యారా సొరంగం కూలిన ఘటనలో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని బయటకు తీసుకురావడానికి గత 17 రోజులుగా నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ పనులు జరిగాయి. అయితే.. ర్యాట్ హోల్ కార్మికుల సాహస చర్యల అనంతరం బాధిత కార్మికులు మంగళవారం క్షేమంగా బయటపడ్డారు. ఇదీ చదవండి:41 మంది కార్మికులతో ప్రధాని మోదీ సంభాషణ -
ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న యాత్రికులు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. కొడియాల వద్ద 1500 వాహనాలు నిలిచిపోగా సుమారు 20 వేల మంది రోడ్ల మీద చిక్కుకుపోయారు. సుమారు 40 కి.మీ మేర యాత్రికులు, స్థానికులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడటంతో యాత్రికులు దారిపొడవునా ఆవస్థలు పడుతున్నారు. కొడియాల్ వద్ద 40 కి.మీ. మేర సుమారు 1500 వాహనాలు నిలిచిపోయాయి. అందులో కనీసం 20 వేల మంది జనం ఎటూ మరలలేక అక్కడే నిలిచిపోయారు. రిషికేష్ యాత్రికులు, స్థానికులు రోడ్డుపైనే గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. వీరిలో ఏపీ, బెంగుళూరుకు చెందిన వారు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. వీరంతా తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా అక్కడ చిక్కుకున్నట్లు తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈరోజు కూడా అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అక్కడి వాతావారణ శాఖ వెల్లడిస్తూ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మమ్మల్ని ఎలాగైనా బయట పడేయమని విపత్తులో చిక్కుకున్న యాత్రికులంతా ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులని అభ్యర్థిస్తున్నారు. ఇది కూడా చదవండి: చెన్నైలో నిత్య పెళ్లికొడుకు కల్యాణసుందరం అరెస్ట్ -
రణభూమిలో యోగ సాధన: సిరియా ముఖచిత్రాన్ని మారుస్తున్న రిషికేశ్
సిరియా.. ప్రపంచంలో గడచిన 12 ఏళ్లుగా అంతర్యుద్ధాలతో అట్టుడికికి పోతున్న ఏకైక దేశం. ఈ యుద్ధాల కారణంగా అక్కడున్న వారు సర్వం కోల్పోతున్నారు. ఆర్థిక, శారీరక, మానసిక కష్టాలతో నిత్యం కుంగిపోతున్నారు. ఇంతటి దుర్భర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశంలోని వారికి ఇప్పుడు యోగవిద్య వరప్రదాయనిగా మారింది. బ్రిటీష్ మ్యాగజైన్ ఎకనామిస్ట్‌లోని ఒక రిపోర్టు ప్రకారం ప్రస్తుతం సిరియాలో ఉన్న అన్ని మైదానాలు, స్టేడియంలు యోగా తరగతులతో కళకళలాడుతున్నాయి. ఈ తరగతులకు పెద్దలు మొదలు కొని పిల్లల వరకూ అన్ని వయసులు వారు హాజరవుతున్నారు. వారి దినచర్య సూర్యనమస్కారాలతో ప్రారంభమవుతోంది. సిరియాలో హిందువుల వేషధారణతో యోగా ట్రైనర్లు యోగ సాధనకు విపరీతమైన ప్రచారం కల్పిస్తున్నారు. యోగ విద్యను మహాశివుని వరప్రసాదంగా చెబుతున్నారు. సిరియాలో యోగ శిక్షణ అందిస్తున్న ఒక అధ్యాపకుడు మాట్లాడుతూ నిత్యం యుద్ధ భయంతో కొట్టుమిట్టాడుతున్న ఇక్కడి ప్రజలకు యోగ ద్వారా ప్రశాంతత పొందే విధానాలను వివరిస్తున్నట్లు తెలిపారు. సిరియాకు చెందిన మాజోన్ ఈసా అనే వ్యక్తి రెండు దశాబ్ధాల క్రితం యోగా అధ్యయనం కోసం భారత్‌లోని హిమాలయాల్లో గల రిషికేశ్ వచ్చారు. తన యోగా అధ్యయనం ముగిశాక తిరిగి సిరియా చేరుకుని, ఒక యోగా సెంటర్ ప్రారంభించారు. ఇప్పుడు అతని ప్రేరణతో దేశంలో వేలాది యోగాకేంద్రాలు నడుస్తున్నాయి. కాగా ఈ కేంద్రాలలో ఉచితంగా శిక్షణ అందించడం విశేషం. సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ ఇటువంటి యోగ శిక్షణ కేంద్రాలకు మద్దతుగా నిలుస్తున్నారు. సున్నీ ముస్లిం జనాభా అత్యధికంగా కలిగిన సిరియాను అర్ధశతాబ్ద కాలంగా అసద్ కుటుంబ సభ్యులు పరిపాలిస్తున్నారు. వారు గతంలో తమ ప్రభావాన్ని పెంచుకునేందుకు ఇస్లాంలోని మరోశాఖ అల్విత్తో దోస్తీ కుదుర్చుకున్నారు. అయితే ఇప్పుడు అసద్ కుటుంబ సభ్యుల తీరుతెన్నుల్లో మార్పు వచ్చింది. ఇతర మతాల వారికి కూడా తగిన గుర్తింపునిస్తున్నారు. దీనిలో భాగంగానే యోగ విద్యకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. అలాగే ఇక్కడి క్రైస్తవులకు చర్చిలు నిర్మించుకునేందుకు అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఇది కూడా చదవండి: ప్రియుని కోసం పాకిస్తాన్ వచ్చిన బ్రిటన్ మహిళ.. పోలీసులకు చుక్కలు! -
ఏం స్వారీ చేశాడు భయ్యా! అర్థరాత్రి తాగిన మైకంలో ఎద్దుపైకి ఎక్కి..
తాగిన మైకంలో పలువురు వ్యక్తులు ఏం చేస్తారో కూడా తెలియదు. కొందరికి ఆ సమయంలో తాము ఏం చేశాం అనే స్పృహ కూడా ఉండదు. మత్తులో చిత్తయిన ఓ యువకుడు చేసిన పని అందర్నీ షాక్‌కి గురి చేసింది. అసలేం జరిగిందంటే.. ఓ యువకుడు తాగిన మత్తులో ఎద్దుపై స్వారీ చేస్తూ వీధుల గుండా హల్చల్ చేశాడు. రోడ్డుపై ఉన్న జనం ఆ యవకుడిని చూసి ఒకింత ఆశ్చర్యానికి, ఎక్కడ ఆ ఎద్దు తమపైకి దూసుకొస్తుందోననని మరొకింత ఆందోళనకు గురయ్యారు. జల్లికట్టు మాదిరిగా ఆ ఎద్దుపైకి ఎక్కి కూర్చొని వెళ్లడం అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని రిషీకేశ్ తపోవన్ ప్రాంతంలో జరిగినట్లుగా గుర్తించారు. ఈ మేరకు ఉత్తరాఖండ్ పోలీసులు ట్విట్టర్ వేదికగా.. మే 5న అర్థరాత్రి రిషికేశ్‌లోని తపోవన్‌లో మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు ఎద్దుపై స్వారీ చేస్తూ కనిపించిన వైరల్ వీడియోని గుర్తించాం. ఆ యువకుడిపై చర్యలు తీసుకున్నాం. జంతువులతో ఎవరూ అసభ్యంగా ప్రవర్తించొద్దని యువతను గట్టిగా హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు ఉత్తరాఖండ్ పోలీసులు. కొందరు నెటిజన్లు ఎద్దును ఇలా హింసించడం సరికాదని ట్వీట్ చేయగా, మరికొందరూ జల్లికట్టు క్రీడతో పోల్చుతూ ట్వీట్లు చేశారు. (చదవండి: రెజ్లర్ల నిరసనలో పాల్గొనేందుకు తరలి వస్తున్న రైతులు..బారికేడ్లను చేధించి..) -
Char Dham Yatra 2023: 30దాకా కేదార్నాథ్ రిజిస్ట్రేషన్ నిలిపివేత
రిషికేశ్: ఎగువ హిమాలయాల ప్రాంతం గర్వాల్ హిమాలయాల్లో వర్షం, హిమపాతం కారణంగా కేదార్నాథ్ యాత్ర కోసం రిషికేశ్, హరిద్వార్‌లలో జరిగే యాత్రికుల రిజిస్ట్రేషన్లను ఈ నెల 30వ తేదీదాకా నిలుపుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు కేదార్నాథ్ ఆలయ ద్వారాలు మంగళవారం తెరుచుకోనున్న సంగతి తెల్సిందే. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని సంబంధిత అధికారులు తెలిపారు. బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ధామ్‌ల దర్శనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కొనసాగుతోంది. -
రిషికేశ్ ఆలయాన్ని సందర్శించిన విరుష్క జంట.. ఫోటోలు వైరల్
-
ప్రకృతి ఒడిలో.. వామికాను ఆటలాడిస్తూ.. విరుష్క ఫొటోలు వైరల్
Virat Kohli- Anushka Sharma: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో తనకు లభించిన విరామ సమయాన్ని పూర్తిగా కుటుంబానికే కేటాయించాడు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి. భార్య అనుష్క శర్మ, కూతురు వామికతో కలిసి ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లాడు. ఈ సందర్భంగా రిషికేశ్‌లో స్వామి దయానంద్ ఆశ్రమాన్ని సందర్శించిన విరుష్క జోడి.. తర్వాత ‘సాహసయాత్ర’కు బయల్దేరింది. PC: Anushka Sharma Instagram ప్రకృతిని ఆస్వాదిస్తూ తమ గారాల పట్టి వామికాతో కలిసి విరాట్- అనుష్క రిషికేశ్ కొండల్లో ట్రెక్కింగ్ చేశారు. అడుగడుగునా తారసపడిన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ.. తేటతెల్లంగా ఉన్న నీటిలో వామికాను ఆటలాడిస్తూ మురిసిపోయారు. PC: Virat Kohli Instagram దారిలో తమను రంజింపచేసిన ఆవులు, మేకలు.. పూర్వకాలం నాటి ఇళ్లతో కూడిన పల్లె వాతావరణాన్ని ఎంజాయ్ చేశారు. బిడ్డను భుజాన వేసుకుని కోహ్లి నడుస్తుండగా.. అనుష్క ఫొటోలు క్లిక్‌మనిపించింది. ఇందుకు సంబంధించిన చిత్రాలను విరాట్ కోహ్లి, అనుష్క శర్మ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. PC: Anushka Sharma Instagram తదుపరి టెస్టు సిరీస్‌లో.. కాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో 8, 11 పరుగులు మాత్రమే చేసిన కోహ్లి.. మూడో వన్డేలో 36 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ద్విశతకం, శతకంతో చెలరేగిన వేళ తన స్థాయికి తగ్గట్లు రాణించడంలో ఈ రన్‌మెషీన్ విఫలమయ్యాడు. PC: Anushka Sharma Instagram ఇక టీ20 సిరీస్ నేపథ్యంలో సెలక్టర్లు విశ్రాంతినివ్వగా.. ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో ఆరంభం కానున్న టెస్టు సిరీస్‌తో విరాట్ కోహ్లి మళ్లీ మైదానంలో దిగనున్నాడు. చదవండి: Ind Vs NZ: ఏదైతేనేం.. హార్దిక్ అలా! సూర్య ఇలా!... ఎన్నో మార్పులు.. భావోద్వేగానికి లోనైన ‘స్కై’ Ind Vs NZ 3rd T20: అతడిని కొనసాగించాల్సిందే.. పృథ్వీ షాను ఆడించండి! -
ఖేలో ఇండియా స్పాన్సర్‌గా ‘స్పోర్ట్స్ ఫర్ ఆల్’
సాక్షి, హైదరాబాద్: ప్రతిభ గల క్రీడాకారుల ప్రదర్శనకు పదును పెట్టే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (కేఐవైజీ)తో దేశీయ క్రీడల నిర్వాహక సంస్థ ‘స్పోర్ట్స్ ఫర్ ఆల్’ (ఎస్ఎఫ్ఏ) జతకట్టింది. యువతలోని క్రీడా నైపుణ్యాన్ని మెరుగు పరచడానికి విశేష కృషి చేస్తున్న ఎస్ఎఫ్ఏ ఐదేళ్ల పాటు ఖేలో ఇండియా గేమ్స్‌కు స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది. ఈ మేరకు రూ. 12.5 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఎస్ఎఫ్ఏ వ్యవస్థాపకులు రిషికేశ్ జోషి తెలిపారు. కుర్రాళ్ల ప్రతిభాన్వేషణలో భాగమైన ఎస్ఎఫ్ఏ స్పాన్సర్షిప్ లభించడంపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హర్షం వ్యక్తం చేసింది. గతంలో ఎస్ఎఫ్ఏ ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో భారత జట్టుకు స్పాన్సర్‌గా ఉంది. -
ఫ్రెండ్స్‌తో అడవిలో మందు తాగుతుండగా ఈడ్చుకెళ్లిన పులి.. సగం తిని..
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్ రిషికేశ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్న 32 ఏళ్ల వ్యక్తిని అకస్మాతుగా పులి వచ్చి ఈడ్చుకెళ్లింది. అనంతరం అతడ్ని సగం తిని వదిలేసింది. రామ్‌నగర్ అడవిలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మృతుడ్ని ఖతారి గ్రామానికి చెందిన నఫీస్‌గా గుర్తించారు. శనివారం సాయం కాలం అతడు స్నేహితులతో కలిసి మద్యం తాగేందుకు ఊరిబయటకు వెళ్లాడు. కాలువ బ్రిడ్జ్ పక్కన కూర్చొని మందుతాగుతున్నారు. ఇంతలో ఓ పులి అక్కడకు వచ్చింది. నఫీస్‌ను నోటితో పట్టుకుని ఈడ్చుకెళ్లింది. ఇది చూసి స్నేహితులు భయంతో అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులకు సమాచారం అందడంతో వాళ్లు నఫీస్ కోసం గాలించారు. బ్రిడ్జికి 150 మీటర్ల దూరంలో ఆదివారం ఉదయం అతని మృతదేహం సగ భాగం లభ్యమైంది. పులి అతడ్ని సగం తిని వదిలేసింది. అయితే ఇది కార్బెట్ టైగర్ రిజర్వ్ ప్రాంతమని, తరచూ పులులు ఇక్కడ సంచరిస్తాయని పోలీసులు తెలిపారు. గ్రామస్థులు ఈ ప్రదేశానికి వెళ్లవద్దని సూచించారు. చదవండి: యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా? -
అంకిత హత్యపై... ‘ఫాస్ట్‌ట్రాక్’ విచారణ
డెహ్రాడూన్/రిషికేశ్: రిషికేశ్‌లోని రిసార్టు రిసెప్షనిస్ట్ అంకితా భండారి(19)హత్యపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపిస్తామని సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదివారం ప్రకటించారు. పోస్ట్‌మార్టం రిపోర్టు బయట పెడతామన్నారు. ఈ హామీ అనంతరం కుటుంబసభ్యులు అంకిత అంత్యక్రియలు పూర్తి చేశారు. హత్యపై కీలక ఆధారాలు దొరికే అవకాశమున్న రిసార్ట్‌ను ప్రభుత్వం ఎందుకు కూల్చేసిందని అంకిత తండ్రి అంతకుముందు ప్రశ్నించారు. దోషులను శిక్షించాలంటూ రిషికేశ్–బద్రీనాథ్ జాతీయ రహదారిపై 8 గంటలు ఆందోళనజరిగింది. మరోవైపు హత్యను పక్కదారి పట్టించేందుకు నిందితుడు, మాజీ మంత్రి వినోద్ దకొడుకు పులకిత్ ప్రయత్నించినట్లు వెలుగులోకి వచ్చింది. వినోద్ మాత్రం తన కొడుకు అమాయకుడంటూ వెనకేసుకుని వచ్చారు. -
కన్వర్ యాత్ర భక్తులకు కలెక్టర్, పోలీసుల సేవలు.. కాళ్లు నొక్కి..
ఈ ఏడాది కన్వర్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. అయితే, శ్రావణ మాసంలో శివ భక్తులు (కన్వరిలు) భక్తి శ్రద్ధలతో గంగా నది ఒడ్డుకు వెళ్లి ప్రవిత గంగా జలాలను తమ ఇళ్లలో, దేవాలయాల్లోకి నీటిని తీసుకుని వెళ్తారు. ఈ క్రమంలో గంగా నది నీటి కోసం ఉత్తరాఖండ్, యూపీ, హరిద్వార్, రిషికేశ్, గౌముఖ్, తదితర ప్రాంతాలకు కాలినడకన బయలుదేరుతారు. ఇదిలా ఉండగా.. కన్వర్ యాత్రికుల కోసం ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. భక్తులు కాలినడకన వస్తుండటంతో తీవ్రంగా అలిసిపోతున్నారు. ఈ క్రమంలో పోలీసులు, ప్రజలు వారికి సాయం అందిస్తున్నారు. తాజాగా యూపీలో కొందరు పోలీసు అధికారులు వారికి తమ వంతు సాయం అందించారు. యూపీలోని అమ్రోహాలో ఎస్ఐ రాజేంద్ర పుందిర్.. కన్వరిల కాళ్లకు పేయిన్ రిలీఫ్ స్ప్రే కొట్టి.. మసాజ్ చేశారు. హపూర్ క్యాంపులో సైతం సీఐ సోమ్‌వీర్ సింగ్.. కన్వరియాల కాళ్లు నొక్కారు. దీంతో కన్వరియాలకు కొంత ఉపశమనం కలిగింది. అంతకు ముందు.. అమ్రోహ కలెక్టర్, ఎస్పీ.. ఓ భక్తురాలి కాళ్లు కడిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Haridwar: Helicopter showers flower petals on thousands of Kanwariyas at Har Ki Pauri I Watch pic.twitter.com/sn0ZiJ6qgA — Hindustan Times (@htTweets) July 24, 2022 ఇక, హరిద్వార్ కన్వర్ యాత్రికులపై ప్రభుత్వం.. హెలికాప్టర్ల సాయంతో పూల వర్షం కురిపించింది. కొన్ని చోట్ల మతాలకు అతీతంగా ముస్లింలు కూడా కన్వరియాలకు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. కాగా, జూలై 14న ప్రారంభమైన కన్వర్ యాత్ర.. జూలై 26తో ముగియనుంది. Visuals from Amroha, UP. A sub-inspector Rajendra Pundir seen applying ointment on the leg of Kanwariyas resting in a makeshift camp. pic.twitter.com/YaFkd6lCoQ — Piyush Rai (@Benarasiyaa) July 24, 2022 मुजफ्फरनगर : कमिश्नर और DIG ने कावड़ियों पर की पुष्पवर्षा ◆मौसम की खराबी के चलते पुष्पवर्षा के लिए नहीं आ सका Helicopter pic.twitter.com/TTxRn6M308 — News24 (@news24tvchannel) July 24, 2022 Amroha Collector And SP Washed Feet Of Kanwariyas Returning From Haridwar ANN https://t.co/gsdrMAtFzh — TIMES18 (@TIMES18News) July 24, 2022 -
నేటి నుంచి విశాఖ శ్రీ శారదా పీఠం చాతుర్మాస్య దీక్ష
-
ఫ్యామిలీ వెకేషన్స్.. టాప్ 5 డెస్టినేషన్స్ ఇవే
న్యూఢిల్లీ: కుటుంబ సభ్యులంతా కలసి వేసవి సెలవుల్లో గడిపేందుకు వెళ్లాలనుకుంటున్న ప్రాంతాల్లో గోవా, నైనిటాల్, రిషికేశ్, గ్యాంగ్‌టక్, మౌంట్అబూ టాప్–5గా ఉన్నట్టు ఓయో నిర్వహించిన సర్వేలో తెలిసింది. ‘సమ్మర్ వెకేషన్ ఇండెక్స్ – ఫ్యామిలీ ఎడిషన్ 2022’పేరుతో తన సర్వే వివరాలను ఒక నివేదిక రూపంలో ఓయో విడుదల చేసింది. వేసవి సెలవుల్లో పిల్లలను ఆడించడం, వారినే అట్టిపెట్టుకోవడం కష్టమైన టాస్క్‌గా తల్లిదండ్రులు చెప్పారు. దీనికి బదులు కొన్ని రోజుల పాటు కుటుంబమంతా కలసి విహారయాత్రకు వెళ్లి రావాలనుకుంటున్నట్టు తెలిపారు. ‘‘65 శాతం తల్లిదండ్రులు తమ పిల్లలతో కలసి వేసవి సెలవులకు ట్రిప్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నట్టు చెప్పారు. వరుసగా రెండేళ్లపాటు వేసవిలో లౌక్డౌన్లు ఉండడం కూడా ఈ ధోరణి పెరగడానికి కారణం’’అని ఓయో పేర్కొంది. జూన్ మొదటి రెండు వారాల్లో ఓయో ఈ సర్వే నిర్వహించింది. 1,072 మంది అభిప్రాయాలను సమీకరించింది. పిల్లలకు సదుపాయాలు ఇందులో 41 శాతం మంది తమ ఎంపిక గోవా అని చెప్పారు. పిల్లలు, కుటుంబ సభ్యులతో కలసి చూడతగ్గ ప్రదేశంగా దీన్ని భావిస్తున్నారు. ఆ తర్వా త నైనిటాల్, రిషికేశ్, గ్యాంగ్‌టక్, మౌంట్అబూ, పుదుచ్చేరి, మెక్లయోడ్ గంజ్, మహాబలేశ్వర్ ఎంపికలుగా ఉన్నాయి. ఈ ఎంపికలను పరిశీలిస్తే తల్లిదండ్రులు ప్రకృతి సహజత్వం ఎక్కువగా ఉన్న పర్వత ప్రాంతాలు, బీచ్‌లకు ప్రాధాన్యం ఇస్తున్న ట్టు ఓయో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీరంగ్ గాడ్ బోల్ పేర్కొన్నారు. హోటళ్లలో ఎంపికలను గమనిస్తే.. 56 శాతం మంది స్విమ్మింగ్ పూల్ ఉన్న హోటళ్లకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. పిల్లల కోసం వారు స్విమ్మింగ్ పూల్, ఆటలాడుకునే ప్లే ఏరియా ను హోటళ్లలో కోరుకుంటున్నారు. ఆ తర్వాత వాటర్ పార్క్‌లు, పెద్ద టెలివిజన్ ఇతర సదుపాయాలు ఉంటే బావుంటుందని చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది 1–3 రోజుల పాటు ట్రిప్‌కు వెళ్లొచ్చే ఆలోచనతో ఉన్నట్టు చెబితే.. 38 శాతం మంది ఒక వారం రోజులైనా జాలీగా గడిపి రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. -
వేసవి ప్రయాణానికి రెడీ
న్యూఢిల్లీ: పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పర్యాటకులు చల్లటి ప్రదేశాలకు ప్రయాణం కడుతున్నారు. వరుసగా రెండు వేసవి సీజన్లలో కరోనా కారణంగా ప్రయాణం చేయలేని పరిస్థితులు.. ఈ విడత లేకపోవడం కూడా పర్యాటక రంగంలో సందడిని పెంచింది. గరిష్ట ఉష్ణోగ్రతల నుంచి సేదతీరేందుకు పట్టణ వాసులు మొగ్గు చూపిస్తున్నారు. పర్వత, కొండ ప్రాంతాల్లోని పర్యాటక కేంద్రాలకు ఈ విడత డిమాండ్ అనూహ్యంగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. హోటళ్లు, ఫ్లయిట్ బుకింగ్‌లు జోరుగా జరుగుతున్నట్టు పేర్కొన్నాయి. ప్రతి ఇద్దరు భారతీయుల్లో ఒకరు ఈ వేసవిలో ప్రయాణం చేయాలని అనుకుంటున్నారు. ఇందులోనూ ఎక్కువ మంది విహార యాత్రలకే మొగ్గు చూపిస్తున్నట్టు ఓయో సర్వేలో తెలిసింది. 64 శాతం మంది వేసవిలో సెలవులు పెట్టేసి నచ్చిన ప్రదేశానికి వెళ్లొద్దామని అనుకుంటుంటే.. 94 శాతం మంది దేశీయంగా ఉన్న పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారు. ఉత్తరాదిలో వీటికి డిమాండ్.. ఆన్లైన్లో వివిధ పోర్టళ్లపై బుకింగ్ తీరును పరిశీలిస్తే.. ఉత్తరాదిలో రిషికేష్, హరిద్వార్, సిమ్లా, ముస్సోరీ, డెహ్రాడూన్ ప్రాంతాలకు ఎక్కువ డిమాండ్ నెలకొంది. ఈ ప్రాంతాల్లోని హోటల్స్, రిసార్ట్‌ల్లో దాదాపు గదులన్నీ బుకింగ్ అయిపోయాయి. రూమ్ టారిఫ్‌లు కరోనాకు ముందుతో పోలిస్తే 10–15 శాతం అధికంగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా రిషికేష్, హరిద్వార్‌లోని అన్ని ఇంటర్నేషనల్ బ్రాండెడ్ హోటళ్లలో మే నుంచి జూన్ చివరికి నాటికి బుకింగ్‌లు పూర్తిగా అయిపోయాయి. ఈ ఏడాది పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లకు డిమాండ్ కరోనా ముందు నాటి స్థాయికి చేరుకున్నట్టు, సగటు రూమ్ చార్జీలు 10 శాతం పెరిగినట్టు ఎస్సైర్ హాస్పిటాలిటీ గ్రూపు సీఈవో అఖిల్ అరోరా తెలిపారు. ఎస్సైర్ గ్రూపునకు బిమ్టల్, జిమ్‌కార్బెట్ ప్రాంతాల్లో హోటళ్లు ఉన్నాయి. కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నా ప్రయాణాలకు డిమాండ్ తగ్గలేదని అరోరా చెప్పారు. పుంజుకున్న బుకింగ్‌లు.. వేసవి కోసం కశ్మీర్, రాజస్తాన్, హిమాచల్‌ప్రదేశ్, గోవా, అరుణాచల్, మణిపూర్, త్రిపుర ప్రాంతాలు ఆకర్షణీయంగా (అధిక డిమాండ్) మారిపోయాయి. దేశం బయట దుబాయి, మాల్దీవులు, థాయిలాండ్, యూఎస్‌కు డిమాండ్ నెలకొంది. ‘‘మే, జూన్ నెలలకు సంబంధించి ముందస్తు బుకింగ్‌లు పెద్ద ఎత్తున పెరిగాయి. ప్రజలు ఎక్కువ రోజుల పాటు విడిది కోసం వెళ్లాలని చూస్తున్నారు’’అని ఈజ్‌మైట్రిప్ ప్రెసిడెంట్ హిమంక్ త్రిపాఠి తెలిపారు. ఫ్లయిట్ బుకింగ్‌లు కరోనా ముందు నాటికి చేరినట్టు మేక్మైట్రిప్ సీఈవో రాజేష్ మాగోవ్ వెల్లడించారు. సులభ వాయిదాల్లో రుణాలు లభించడం డిమాండ్‌కు తోడ్పడుతున్నట్టు ఆయన చెప్పారు. రికవరీ బలంగా.. 2022 ఏప్రిల్ నెలలో సగటు రోజువారీ ఫ్లయిట్ డిపార్చర్లు 2,726గా ఉన్నాయి. 2021 ఏప్రిల్‌లో రోజువారీ 2,000తో పోలిస్తే మంచి వృద్ధి కనిపిస్తోంది. మార్చి నెలలో రోజువారీ డిపార్చర్లు 2,588తో పోల్చి చూసినా ఏప్రిల్‌లో 5 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. విమానాల్లో ప్రయాణికుల భర్తీ కూడా గతేడాది ఇదే నెలతో పోలిస్తే 2022 ఏప్రిల్‌లో 36 శాతం అధికంగా ఉంది. గత నెలలో ఒక ఫ్లయిట్లో సగటు ప్రయాణికుల సంఖ్య 128గా ఉంది. కరోనాకు ముందు సగటు ప్రయాణికులు 135 కంటే కొంచెం తక్కువగా ఉంది. దేశీయంగా ప్రయాణికుల రద్దీ ఏప్రిల్‌లో వార్షికంగా చూస్తే 83 శాతం పెరిగి 10.5 మిలియన్లుగా ఉంది. కరోనాకు ముందున్న 11 మిలియన్ల కంటే ఇది స్వల్పంగానే తక్కువ. పెంటప్ డిమాండ్ ఈ ఏడాది పర్యాటక ప్రాంతాలు, విహార యాత్రా స్థలాలకు డిమాండ్ గణనీయంగా ఉండడానికి.. గత రెండు వేసవి సీజన్లలో ప్రయాణం చేయలేని వారు ఈ ఏడాది ప్రాధాన్యం ఇస్తుండడం వల్లేనని అనుకోవాలి. గుడ్ ఫ్రైడే, విసు వీక్ సందర్భంగా 8 లక్షల బుకింగ్‌లు నమోదయ్యాయని.. 2022లో ఇదే అత్యధికమని ఓయో చీఫ్ సర్వీస్ ఆఫీసర్ షీరంగ్ గాడ్బోల్ తెలిపారు. రానున్న కొన్ని నెలల్లో ఈ డిమాండ్ మరింత పెరుగుతుందని తాము అంచనా వేస్తున్నట్టు చెప్పారు. -
ప్రతి జిల్లాలో వైద్య కళాశాల
రిషికేశ్: దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కనీసం ఒక వైద్య కళాశాల ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్‌లను నెలకొల్పే దిశగా కృషి కొనసాగుతోందని వివరించారు. పీఎం కేర్స్ ఫండ్ కింద 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన 35 ప్రెషర్ స్వింగ్ అబ్సార్ప్షన్(పీఎస్ఏ) ఆక్సిజన్ ప్లాంట్లను మోదీ గురువారం ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ ‘ఎయిమ్స్’ ఈ కార్యక్రమానికి వేదికగా మారింది. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మోదీ చెప్పారు. ప్రభుత్వమే ప్రజల వద్దకు.. కరోనా మహమ్మారి ఉనికి తొలిసారిగా బయటపడినప్పుడు దేశంలో ఒకే ఒక్క టెస్టింగ్ ల్యాబ్ ఉండేదని, ఇప్పుడు వాటి సంఖ్య 3,000కు చేరిందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. మెడికల్ ఆక్సిజన్‌కు డిమాండ్ పెరగడంతో ఉత్పత్తిని 10 రెట్లు పెంచామన్నారు. కొత్త ప్లాంట్లతో కలిపి పీఎం కేర్స్ ఫండ్ కింద ఇప్పటిదాకా 1,150 ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించారు. దేశంలో ప్రతి జిల్లాకు వీటితో సేవలు అందుతాయన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 93 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు ఇవ్వడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని చెప్పారు. త్వరలోనే ఈ సంఖ్య 100 కోట్ల మార్కును దాటుతుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద, వేగవంతమైన వ్యాక్సినేషన్ భారత్‌లో కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం తమ వద్దకు వచ్చేదాకా ప్రభుత్వం ఎదురుచూడడం లేదని, ప్రభుత్వమే వారి వద్దకు వెళ్తోందని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్‌లో ‘డబుల్ ఇంజన్’ ప్రభుత్వం అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తోందని తెలిపారు. -
Coronavirus: డేంజరస్ డెల్టా ఒళ్లంతా తిష్ట!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సెకండ్‌వేవ్‌లో వ్యాప్తి చెందిన డెల్టా వేరియంట్ శరీరంలోని కీలక భాగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. బి.1.617.2 కోడ్‌తో ఉన్న వేరియంట్‌ను డెల్టాగా పిలుస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఎక్కువగా వ్యాప్తి చెందిన ఈ వేరియంట్ మానవ శరీరంలోకి ప్రవేశించాక అవయవాలపై వేగంగా ప్రభావాన్ని చూపడంతో ఎక్కువ మంది ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తోంది. కరోనా మొదటి దశతో పోలిస్తే రెండో దశలో ఎక్కువ మంది ఆస్పత్రిపాలయ్యారు. అస్వస్థతకు గురైన వారిలో చాలా మంది మరణం అంచులవరకు వెళ్లి వచ్చారు. కొందరిలో అవయవాలు దెబ్బతినగా, మరికొందరు జీవితకాల వ్యాధులైన బీపీ, షుగర్ బారినపడ్డారు. మొదటి దశ, రెండో దశలో ఆస్పత్రిలో చేరి.. వారు ఎదుర్కొన్న సమస్యలు, వైరస్ ప్రభావం తదితర అంశాలపై రిషికేష్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) పరిశోధన చేసింది. దీనికి ప్రత్యేకంగా కొన్ని కేటగిరీల రోగులను ఎంపిక చేసుకుని పరిశీలించి ఆ నివేదికను విడుదల చేసింది. అన్ని అవయవాలపైనా ప్రభావం... మొదటి దశ కోవిడ్ వ్యాప్తి సమయంలో ఎక్కువ మంది శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫె„క్షన్ రావడంతో ఆస్పత్రులకు పరుగులు తీశారు. కానీ, రెండో దశ తీవ్రత ఎక్కువగా ఉంది. ఊపిరితిత్తులతో పాటు మూత్రపిండాలు, కాలేయం, మెదడు తదితర కీలకమైన అవయవాలపై వైరస్ ప్రతాపాన్ని చూపింది. వీలైనంత ఎక్కువ మార్గాలను ఏర్పాటు చేసుకుని వైరస్ వ్యాప్తి చెందిన శరీరాన్ని గుల్ల చేసింది. మొదటి దశతో పోలిస్తే రెండో దశలో మూత్రపిండాలపై ప్రభావం ఆరు రెట్లు అధికంగా ఉంది. కాలేయంపై చూపిన ప్రభావం గతేడాది కంటే రెండు రెట్లు ఎక్కువ. లివర్‌లోకి వైరస్ వ్యాప్తి చెందడంతో ఆ అవయవం విడుదల చేసే ఎంజైమ్స్ రెట్టింపు చేసి సామర్థ్యాన్ని తగ్గించినట్లు గుర్తించారు. దేశంలో కోవిడ్ బారినపడ్డ 70 శాతం మందిలో డెల్టా వేరియంట్ ఉన్నట్లు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది. బి.1.617.2 రకానికి చెందిన ఈ వేరియంట్ దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో తీవ్ర ప్రభావాన్ని చూపింది. డెల్టా వేరియంట్ తెల్ల రక్తకణాల్లోని లింపోసైట్లపై తీవ్ర ప్రభావం చూపడంతో ఎక్కువ మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ వేరియంట్ వైరస్ వ్యాప్తిని ముందుగా లక్షణాలతో గుర్తించి చికిత్స తీసుకున్న వారు ఇంటివద్దే కోలుకుంటుండగా... కాస్త నిర్లక్ష్యం చేసినా ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. దీని నియంత్రణకు వైద్యులు శ్రమించాల్సి వస్తోంది. మొదటి దశ, రెండో దశలో సివియర్ పేషంట్లలో పరిస్థితి ఇలా(గణాంకాలు శాతాల్లో)... కేటగిరీ మొదటి దశ రెండో దశ ఎస్పీఓ2 సగటు 92 85.5 ఫీవర్ 30 85 దగ్గు 14 78 గొంతులో గరగర 11 05 దమ్ము 15 80 నీరసం 9.5 19.6 లూస్మోషన్స్ 11 5 ► మొదటిదశ చికిత్సలో స్టెరాయిడ్లను 4 శాతం మందికే వాడగా... రెండో దశకు వచ్చే సరికి 72 శాతం మందికి ఇచ్చారు. ఇక యాంటిబయోటిక్స్ వినియోగం రెట్టింపు అయ్యింది. ►బాక్టీరియల్ న్యుమోనియా 1.1 శాతం నుంచి 9 శాతానికి పెరగగా, సివియర్ వైరస్ న్యుమోనియా 6 శాతం నుంచి ఏకంగా 49 శాతానికి ఎగబాకింది. ►సీటీ స్కాన్‌లో స్కోర్ గతేడాది కంటే ఈసారి భారీగా పెరుగుదల నమోదైంది. డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందిన ఎక్కువ మందిలో ఊపిరితిత్తులపై ప్రభావాన్ని చూపడంతో ఆక్సిజన్ స్థాయిలు భారీగా పడిపోయాయి. కరోనా తొలి దశలో 12 శాతం మందికే ఆక్సిజన్ సప్లిమెంట్ అవసరంపడగా... రెండో దశలో ఏకంగా 82 శాతానికి పెరిగింది. రెమిడెసివిర్ వినియోగం మొదటి దశలో ఒక శాతం కంటే తక్కువ ఉండగా... ప్రస్తుతం ఆస్పత్రిలో చేరిన 12 శాతం మంది వినియోగించారు. సివియర్ కోవిడ్‌తో ఆస్పత్రుల్లో చేరిన వారిలో గతేడాది 90 శాతం మంది డిశ్చార్జ్ కాగా.. సెకండ్ వేవ్‌లో 71శాతం మందే డిశ్చార్జ్ అయినట్లు గుర్తించారు. ఈ లెక్కన మొదటి దశలో నమోదైన మరణాల రేటుతో పోలిస్తే రెండో దశలో మరణాల రేటు మూడు రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది. గతేడాది ఆస్పత్రుల్లో చేరిన వారిలో 2.6 శాతం మందికే వెంటిలేటర్ అవసరపడగా ఈసారి 41 శాతానికి పెరిగినట్లు పరిశీలనలో తేలింది. పరిశోధన సాగిందిలా... మొదటి దశ కోవిడ్‌కు సంబంధించి గత ఏడాది ఏప్రిల్, మే, జూన్లలో ఎయిమ్స్‌లో అడ్మిట్ అయిన 106 మంది రోగులు.. రెండో దశ తీవ్రంగా ఉన్న ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మేలో చేరిన 104 మందిపై పరిశీలన చేశారు. మైల్డ్, మోడరేట్, సివియర్ కేటగిరీలుగా కోవిడ్‌ను విభజించి.. వీరిలో వైరస్ చూపిన ప్రభావం, అందించిన చికిత్సను పరిశీలించారు. తొలి దశలో లక్షణాలు లేకున్నా ఆస్పత్రుల్లో చేరగా.. ప్రస్తుతం మోడరేట్ స్టేజి దాటే క్రమం, సివియారిటీకి వచ్చిన తర్వాతే ఆస్పత్రుల్లో చేరారు. . తొలిదశలో 37.5% మందే ఆస్పత్రుల్లో చేరగా.. ప్రస్తుతం 70% మంది చేరారు. గతేడాది ఆస్పత్రుల్లో చేరిన వారి సగటు వయసు 37 యేళ్లు కాగా, ప్రస్తుతం 50.5 యేళ్లు.