ఆస్పత్రిలో తల్లిని పరామర్శించిన సీఎం యోగి | Uttar Pradesh CM Yogi Adityanath Visits His Ailing Mother At AIIMS Rishikesh | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో తల్లిని పరామర్శించిన సీఎం యోగి

Published Mon, Jun 17 2024 1:08 PM

CM Yogi Reached Rishikesh AIIMS to Meet his Mother

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాదాపు రెండేళ్ల తర్వాత రిషికేశ్‌లో తన తల్లిని కలుసుకున్నారు. అతని తల్లి రిషికేశ్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.

తన తల్లి సావిత్రి దేవి(84)ని కలుసుకుని ఆమె యోగక్షేమాలు తెలుసుకునేందుకు యోగి ఆదిత్యనాథ్ ఎయిమ్స్‌కు వచ్చారు. దాదాపు అరగంటపాటు సీఎం యోగి ఎయిమ్స్‌లోనే ఉన్నారు. తల్లి ఆరోగ్యం గురించి తెలుసుకున్నాక సీఎం యోగి అక్కడి ట్రామా సెంటర్‌లో చికిత్స పొందుతున్న రుద్రప్రయాగ్‌ క్షతగాత్రులను పరామర్శించారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్న అనంతరం హెలికాప్టర్‌లో తిరిగి లక్నో చేరుకున్నారు.

నెల రోజుల వ్యవధిలోనే సీఎం యోగి తల్లి రెండోసారి ఆస్పత్రిలో చేరారు. అంతకుముందు ఆమె కంటి ఇన్ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరారు. యోగి ఆదిత్యనాథ్ కుటుంబ సభ్యులు పౌరీ గర్వాల్‌లోని పంచూర్ గ్రామంలో నివసిస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ పూర్వీకుల గ్రామం రిషికేశ్‌కు 50 కి.మీ. దూరంలో ఉంది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తల్లిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పాలకవర్గానికి పలు సూచనలు చేశారు. యోగి తండ్రి ఆనంద్ 2020లో 89 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement