CM Yogi
-
Mahakumbh: ముఖ్యమంత్రి యోగి మరో రికార్డు
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా(Mahakumbh) అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. ఫిబ్రవరి 26(శివరాత్రి)తో కుంభమేళా ముగియనుంది. ఈ నేపధ్యంలో భక్తులు త్రివేణీ సంగమానికి భారీగా తరలివస్తున్నారు. దీంతో ఎటువంటి తొక్కిసలాట ఘటనలు లాంటివి చోటుచేసుకుండా ఉండేందుకు యూపీ సీఎం స్వయంగా కుంభమేళాను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన అరుదైన రికార్డును కూడా నెలకొల్పారు.జనవరిలో కుంభమేళా ప్రారంభం కావడానికి ముందు నుంచి ఫిబ్రవరి 22 వరకు గడచిన 45 రోజుల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Chief Minister Yogi Adityanath) 12 సార్లు కుంభమేళాను సందర్శించారు. దీంతో అత్యధికంగా కుంభమేళాను సందర్శించిన సీఎంగా చరిత్ర సృష్టించారు. స్వతంత్ర భారతదేశంలో మొదటి మహా కుంభమేళా 1954లో జనవరి 14 నుండి మార్చి 3 వరకు జరిగింది. ఆ సమయంలో నాటి ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ రెండుమూడు సార్లు సంగమ స్థలికి వచ్చి పరిస్థితులను పర్యవేక్షించారు. ఆ తరువాత మరే ముఖ్యమంత్రీ కుంభమేళాను పదేపదే సందర్శించలేదు.సీఎం యోగి కుంభమేళా సందర్శనలుజనవరి 09: 13 అఖాడాలు, దండిబారా, ఖాక్ చౌక్ మహాసభల శిబిరాలను సీఎం యోగి సందర్శించారు. డిజిటల్ మీడియా సెంటర్‌ను ప్రారంభించారు.జనవరి 10: ప్రసార భారతి ఛానల్ కుంభవాణిని ప్రారంభించి, రవాణా సంస్థ బస్సులకు పచ్చజెండా ఊపారు.జనవరి 19: పూజ్య శంకరాచార్య తదితర సాధువులతో సమావేశమయ్యారు. పోలీసు గ్యాలరీ, రాజ్యాంగ గ్యాలరీ, పర్యాటక గ్యాలరీలను ప్రారంభించారు.జనవరి 22: మంత్రివర్గంతో పవిత్ర సంగమ స్నానం చేశారు.జనవరి 25: గురు గోరక్షనాథ్ అఖారాలో, విశ్వ హిందూ పరిషత్(Vishwa Hindu Parishad) సమావేశంలో పన్నెండు శాఖల యోగి మహాసభలో అవధూత వేషధారణలో కనిపించారు.జనవరి 27: హోంమంత్రి అమిత్ షాను స్వాగతించారు. త్రివేణి సంగమంలో పూజలు చేశారు.ఫిబ్రవరి 01: భారత్ సేవాశ్రమ శిబిరాన్ని సందర్శించారు. ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికారు. ప్రపంచంలోని 73 దేశాల దౌత్యవేత్తలతో సంభాషించారు.ఫిబ్రవరి 04: బౌద్ధ మహా కుంభ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూటాన్ రాజుకు స్వాగతం పలికారు.ఫిబ్రవరి 05: ప్రధాని మోదీకి స్వాగతం పలికి, త్రివేణి సంగమంలో పూజలు చేశారు.ఫిబ్రవరి 10: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు.ఫిబ్రవరి 16: ప్రదీప్ మిశ్రా కథాశ్రవణం, ప్రభు ప్రేమి సంఘ్ శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఫిబ్రవరి 22: బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు స్వాగతం పలికారు. మహాశివరాత్రి సన్నాహాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు (ఆదివారం) మరోమారు మహాకుంభ్ నగర్ కు రానున్నారు. గత అక్టోబర్‌లో మహా కుంభ్ లోగో విడుదలైన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రయాగ్‌రాజ్ రావడం ఇది 18వ సారి అవుతుంది.ఇది కూడా చదవండి: బడా నేతల పుట్టినిల్లు డీయూ.. జైట్లీ నుంచి రేఖా వరకూ.. -
కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకున్న సీఎం
వారణాసి: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శరన్నవరాత్రుల సందర్భంగా మహాశివుణ్ణి ఆరాధించారు. వారణాసికి చేరుకున్న ఆయన ముందుగా భారత సేవాశ్రమ సంఘ్‌లో దుర్గాదేవిని పూజించి, అనంతరం కాశీ విశ్వనాథుణ్ణి, కాలభైరవ ఆలయాన్ని, విశాలాక్షి ఆలయాన్ని సందర్శించారు.నవరాత్రులలో పంచమి రోజున వారణాసికి వచ్చిన సీఎం యోగి ముందుగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, ఆలయ అభివృద్ధి ప్రణాళికలకు స్థల పరిశీలన చేశారు. అనంతరం ఆయన పలు ఆలయాలను సందర్శించారు. త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి పర్యటన ఉండవచ్చని స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని పలు పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారని తెలిపారు.ఇది కూడా చదవండి: నాకేం తక్కువ..? నాకూ మద్యం షాపు కావాలి -
గురుపౌర్ణమి వేళ.. సీఎం యోగి పూజలు
దేశవ్యాప్తంగా గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌నాథ్ ఆలయంలో పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. #WATCH | UP CM Yogi Adityanath offers prayers at Gorakhnath Temple, on the occasion of #GuruPurnima2024 pic.twitter.com/goky8Ro8eK— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 21, 2024 మహర్షి వేద వ్యాసుడు ఈ రోజున జన్మించాడు. ఆయనను గుర్తు చేసుకుంటూ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. హిందువులు గురు పూర్ణిమకు ఎంతో ప్రాధాన్యతనిస్తుంటారు. హిందువులు గురువును దేవునితో సమానంగా భావిస్తారు. హరిద్వార్‌లో గురు పూర్ణిమ సందర్భంగా భక్తులు పవిత్ర గంగా నదిలో స్నానాలు చేస్తున్నారు. భక్తుల రద్దీతో గంగా ఘాట్లు నిండిపోయాయి. యూపీలోని అయోధ్యలోగల సరయూ నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. #WATCH | Haridwar, Uttarakhand: Devotees take a holy dip in the Ganga River, on the occasion of Guru Purnima pic.twitter.com/UcVQYZQAOY— ANI (@ANI) July 21, 2024 -
ఆస్పత్రిలో తల్లిని పరామర్శించిన సీఎం యోగి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాదాపు రెండేళ్ల తర్వాత రిషికేశ్‌లో తన తల్లిని కలుసుకున్నారు. అతని తల్లి రిషికేశ్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.తన తల్లి సావిత్రి దేవి(84)ని కలుసుకుని ఆమె యోగక్షేమాలు తెలుసుకునేందుకు యోగి ఆదిత్యనాథ్ ఎయిమ్స్‌కు వచ్చారు. దాదాపు అరగంటపాటు సీఎం యోగి ఎయిమ్స్‌లోనే ఉన్నారు. తల్లి ఆరోగ్యం గురించి తెలుసుకున్నాక సీఎం యోగి అక్కడి ట్రామా సెంటర్లో చికిత్స పొందుతున్న రుద్రప్రయాగ్ క్షతగాత్రులను పరామర్శించారు. వారి యోగక్షేమాలు తెలుసుకున్న అనంతరం హెలికాప్టర్లో తిరిగి లక్నో చేరుకున్నారు.నెల రోజుల వ్యవధిలోనే సీఎం యోగి తల్లి రెండోసారి ఆస్పత్రిలో చేరారు. అంతకుముందు ఆమె కంటి ఇన్ఫెక్షన్తో ఆసుపత్రిలో చేరారు. యోగి ఆదిత్యనాథ్ కుటుంబ సభ్యులు పౌరీ గర్వాల్లోని పంచూర్ గ్రామంలో నివసిస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ పూర్వీకుల గ్రామం రిషికేశ్కు 50 కి.మీ. దూరంలో ఉంది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్ తల్లిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పాలకవర్గానికి పలు సూచనలు చేశారు. యోగి తండ్రి ఆనంద్ 2020లో 89 ఏళ్ల వయసులో కన్నుమూశారు. #WATCH | Uttar Pradesh CM Yogi Adityanath today enquired about the well-being of his mother, admitted for treatment at AIIMS Rishikesh and received information related to her health from the doctors. pic.twitter.com/rwjSw5zyAJ— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 16, 2024 -
సీఎం యోగికి పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పుట్టినరోజు నేడు(జూన్ 5). ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ప్రధాని మోదీ సీఎం యోగికి శుభాకాంక్షలు తెలియజేశారు.‘ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఉత్తరప్రదేశ్ ప్రగతికి, పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు విశేష కృషి చేస్తున్నారు. రాబోయే కాలంలో దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను’ అని మోదీ ఆ ట్వీట్లో పేర్కొన్నారు.ప్రధాని మోదీ అభినందనలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ‘మీ హృదయపూర్వక శుభాకాంక్షలు నాకు అపారమైన స్ఫూర్తినిచ్చాయి. మీ విజయవంతమైన మార్గదర్శకత్వంలో ‘స్వయం-ఆధారిత ఉత్తరప్రదేశ్-అభివృద్ధి దిశగా ఉత్తరప్రదేశ్’ అనే భావనతో ముందుకు నడుస్తున్నాం. మీరు శుభాకాంక్షలు తెలిపినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని యోగి పేర్కొన్నారు. యోగి ఆదిత్యనాథ్ 1972, జూన్ 5న ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లాలో జన్మించారు. Birthday wishes to Uttar Pradesh CM, @myogiadityanath Ji on his birthday. He is working for UP’s progress and for empowering the poor and downtrodden. I wish him a long and healthy life in the times to come.— Narendra Modi (@narendramodi) June 5, 2024 -
హోలీ వేళ సీఎం యోగి రుద్రాభిషేకం!
హోలీ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించారు. సీఎం యోగి పలు సందర్భాల్లో శివుణ్ణి పూజిస్తుంటారు. తరచుగా కాశీకి వెళ్లి విశ్వనాథునికి పూజలు నిర్వహిస్తుంటారు. సీఎం యోగి తాజాగా చేసిన ఒక పోస్ట్‌లో గడచిన ఏడు సంవత్సరాలలో రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావడంలో విజయం సాధించామన్నారు. ఈ 7 సంవత్సరాలు ‘న్యూ ఉత్తర ప్రదేశ్ ఆఫ్ న్యూ ఇండియా’ను సృష్టించేందుకు కృషి చేశామన్నారు. #WATCH | Uttar Pradesh CM Yogi Adityanath performs 'Rudra Abhishek' in Gorakhnath temple, Gorakhpur pic.twitter.com/RA4r1oJDHG — ANI UP/Uttarakhand (@ANINewsUP) March 25, 2024 ప్రజా సంక్షేమ బాటలో నడుస్తూ, రాష్ట్ర ప్రజల కలలను నెరవేర్చడానికి డబుల్ ఇంజన్ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నదన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రజల సహకారం లభిస్తున్నదని, అందుకు వారికి కృతజ్ఞతలు. హ్యాపీ హోలీ’ అని పేర్కొన్నారు. आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के प्रेरणादायी मार्गदर्शन में उत्तर प्रदेश की 25 करोड़ जनता की सेवा, सुरक्षा और समृद्धि के संकल्प को आज 07 वर्ष पूरे हो रहे हैं। इन 07 वर्षों में सबका साथ-सबका विकास के मंत्र के माध्यम से हर व्यक्ति के जीवन में सकारात्मक परिवर्तन लाने… — Yogi Adityanath (मोदी का परिवार) (@myogiadityanath) March 25, 2024 -
అందరికీ న్యాయం
అలహాబాద్/చిత్రకూట్: దేశ ప్రజలందరికీ లబ్ధి చేకూరేలా, న్యాయం జరిగేలా చూడడం ప్రభుత్వాల బాధ్యతని ప్రధాని మోదీ అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు సహాయపడే ఉపకరణాల పంపిణీ కార్యక్రమం సామాజిక న్యాయ శిబిరంలో శనివారం ప్రధాని పాల్గొన్నారు. అయిదేళ్లలో తమ ప్రభుత్వం దేశంలో వివిధ ప్రాంతాల్లో 9 వేల క్యాంప్‌లను నిర్వహించి, రూ.900 కోట్ల కంటే ఎక్కువ విలువ చేసే పరికరాలను పంపిణీ చేశామని వెల్లడించారు. యూపీఏ సర్కార్ చేసిన సాయంతో పోల్చి చూస్తే ఇది రెండున్నర రెట్లు ఎక్కువని అన్నారు. మీ సహనమే మీకు రక్ష నవ భారత నిర్మాణంలో దివ్యాంగులు కూడా భాగస్వాములు కావాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ పరికరాలన్నీ మీలో ఆత్మ విశ్వాసం నింపడానికి పనికి వస్తాయని, కానీ మీలో ఉండే సహనం, సామర్థ్యం, మానసిక వికా సం ఎప్పుడూ మీకు రక్షగా ఉంటాయని అవే మీకు బలమని మోదీ అన్నారు. దివ్యాంగులు, వృద్ధులకు ఎన్నో పథకాలు సుగమ్య భారత్ అభియాన్ పథకంలో భాగంగా విమానాశ్రయాల్లో, 700కి పైగా రైల్వే స్టేషన్లలో దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. రాష్ట్రీయ వయోశ్రీ యోజన పథకం కింద వయో వృద్ధుల్ని కూడా ఆదుకుంటున్నామన్నారు. దివ్యాంగులందరి కోసం ఉమ్మడిగా ఒక కొత్త సైన్ లాంగ్వేజీని తయారు చేసే పనిలో ఉన్నట్టు ప్రధాని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 2.50 కోట్ల మందికి పైగా దివ్యాంగులుంటే, 10 కోట్ల మందికి పైగా సీనియర్ సిటిజన్లు ఉన్నారు. బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన యూపీలో 296కి.మీ.ల బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేకు శంకుస్థాపన చేశారు. చిత్రకూట్, బాందా, హమీర్పూర్, జలాన్ జిల్లాల మీదుగా మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ని కలుపుతూ ఈ ఎక్స్‌ప్రెస్‌వే సాగుతుంది. అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటైన బుందేల్‌ఖండ్‌లో ఈ ఎక్స్‌ప్రెస్ వేతో అభివృద్ధి జరిగి ప్రజల జీవనంలో అనూహ్యమైన మార్పులు వస్తాయని ప్రధాని అన్నారు. గిన్నిస్ రికార్డుల్లోకి.. అలహాబాద్‌లో త్రివేణి సంగమం వద్ద పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన సామాజిక న్యాయ కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డులకెక్కింది. ఈ మెగా క్యాంప్‌లో 56 వేలకు పైగా వివిధ రకాల ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేశారు. 26 వేల మంది లబ్ధిదారులు వాటిని అందుకున్నారు. హియరింగ్ ఎయిడ్లు, కృత్రిమ పాదాలు, బ్యాటరీతో నడిచే త్రిచక్ర వాహనాలు ఉన్నాయి. ఈ పరికరాలకే రూ.19 కోట్లకు పైగా ఖర్చు అయింది. మొత్తం మూడు రికార్డులను సొంతం చేసుకుంది. శుక్రవారం సాయంత్రం 1.8 కి.మీ. పొడవునా 300 మంది దివ్యాంగులు కూర్చున్న త్రిచక్ర వాహనాల పెరేడ్ గిన్నిస్ రికార్డుని సొంతం చేసుకుంది. ఒకే వేదికపై నుంచి భారీ స్థాయిలో పరికరాల పంపిణీ, ఆ తర్వాత వీల్ చైర్ల పెరేడ్ కూడా గిన్నిస్ రికార్డులకెక్కింది. -
కబేళాలు క్లోజ్.. పొగాకు ఉత్పత్తులు బంద్..
-
కబేళాలు క్లోజ్.. పొగాకు ఉత్పత్తులు బంద్..
♦ షీ-టీమ్స్ తరహాలో యాంటీ రోమియో బృందాల ఏర్పాటు ♦ మంత్రులకు శాఖల కేటాయింపు ♦ మూడో రోజే సీఎం యోగి సంచలన నిర్ణయాలు ♦ మీరట్‌లో మాంసం దుకాణాలకు నిప్పు లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కార్యరంగంలోకి దిగారు. బుధవారం కేబినెట్ సమావేశం అనంతరం పలు కీలక నిర్ణయాలు వెలువరించారు. హోం, ఆర్థికశాఖలను తానే పర్యవేక్షిస్తానని ప్రకటించారు. డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ వర్మ పీడబ్ల్యూడీ, విద్యాశాఖలను కేటాయించారు. మిగతా కేబినెట్ సభ్యులకు శాఖలు కేటాయించారు. ఇది ఉంటే, జంతువధశాలల మూసివేతకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. గోవుల అక్రమ రవాణాపై పూర్తి నిషేధం విధిస్తూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. అన్ని అక్రమ కబేళాలను మూయించి వేస్తామని, యంత్రాలతో నడిచే కబేళాలపై పూర్తి నిషేధం విధిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మీరట్‌లో గుర్తుతెలియని వ్యక్తులు మూడు మాంసం దుకాణాలకు నిప్పుపెట్టారు. మాన్యవర్ కాన్షీరాం కాలనీలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. దీంతో మీరట్వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేధిస్తే తాటతీస్తారు మహిళల భద్రత కోసం యాంటీ–రోమియో స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్టు యోగి ప్రభుత్వం ప్రకటించింది. లక్నోలో మహిళలను వేధిస్తూ కనిపించిన పలువురిని ఈ బృందాలు అరెస్టు చేశాయి. పాఠశాలలు కళాశాలలు, దుకాణాల దగ్గర పోలీసు బృందాలు నిరంతరం గస్తీ తిరుగుతూ ఆకతాయిలను అదుపులోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈవ్‌టీజర్లను గూండా చట్టం కింద అరెస్టు చేస్తామని హెచ్చరించారు. పొగాకు ఉత్పత్తులు బంద్ విద్యాసంస్థలు, ఆస్పత్రులు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పాన్ మసాలా, గుట్కా, సిగరెట్ వంటి పొగాకు ఉత్పత్తులను యూపీ ప్రభుత్వం నిషేధించింది. ఉద్యోగులు, సిబ్బంది ఇలాంటి వాటిని ఉపయోగించొద్దని, పర్యావరణం కోసం ప్లాస్టిక్ వాడకాన్ని మానుకోవాలని స్పష్టం చేసింది. పాత సచివాలయంలోని ఒక భవనం గోడలపై పాన్ మరకలు ఉండటాన్ని చూసి ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్వీట్‌కు తక్షణం స్పందించిన యోగి హోలీ రోజు ఒకరి ఇంట్లోకి చొరబడిన కొందరు యువకులు యజమాని భార్య, కూతురిని వేధించారు. ఈ విషయమై బాధితుడు కాన్పూర్‌లోని కల్యాణ్పూర్వాసి ట్వీట్ చేయడంతో సీఎం యోగి తక్షణం స్పందించారు. స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన స్పందించకపోవడంతో ముఖ్యమంత్రిని ఆశ్రయించానని ఆయన మీడియాకు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారులు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని వైద్యపరీక్షలకు పంపించారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, వారిపై మరిన్ని సెక్షన్ల కింద కేసులు పెడతామని పోలీసులు తెలిపారు. సీఎం అభ్యంతరకర ఫొటోల పోస్టింగ్: మహిళపై కేసు బెంగళూరు: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభ్యంతరకర ఫొటోలను ఫేస్బుక్లో పోస్టు చేసిన ప్రభ బైళహోంగల అనే కర్ణాటక మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ యువమోర్చా ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు చేసినట్టు పోలీసు అదనపు కమిషనర్ (క్రైమ్) ఎస్.రవి తెలిపారు. మహిళతో ఆదిత్యనాథ్ సన్నిహితంగా ఉన్న ఫొటోలను (మార్ఫింగ్) ప్రభ తన ఫేస్బుక్ పేజీలో పెట్టారు. ⇒ ముఖ్యమంత్రి వద్దే హోం, ఆర్థిక శాఖలు శాంతిభద్రతల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని విమర్శలు వస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తనవద్దే ఉంచుకున్నారు. మొత్తం 44 మందితో కూడిన మంత్రివర్గాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రులు ఇద్దరికీ కూడా కీలకమైన శాఖలే ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకు ప్రజా పనుల శాఖ, మరో డిప్యూటీ సీఎం దినేష్ శర్మకు పార్లమెంటరీ వ్యవహారాలు, ఉన్నత విద్యాశాఖలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో దాదాపు 24 ఏళ్ల పాటు ఉండి, ఎన్నికలకు కొంతకాలం ముందే బీజేపీలోకి వచ్చిన రీటా బహుగుణ జోషి, మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు సిద్దార్థ నాథ్ సింగ్ లాంటి పెద్దవాళ్లకు కూడా మంత్రిపదవులు లభించాయి. యోగి ఆదిత్యనాథ్: ముఖ్యమంత్రి, హోం శాఖ, ఆర్థిక శాఖ కేశవ్ ప్రసాద్ మౌర్య: ప్రజాపనుల శాఖ దినేష్ శర్మ: పార్లమెంటరీ వ్యవహారాలు, ఉన్నత విద్య చేతన్ చౌహాన్: క్రీడా శాఖ అశుతోష్ టాండన్: ప్రాథమిక విద్యాశాఖ రీటా బహుగుణ జోషి: సెకండరీ విద్యాశాఖ మొహసిన్ రజా: మైనారిటీ వ్యవహారాలు స్వామి ప్రసాద్ మౌర్య: వ్యవసాయ శాఖ యోగికి ఐసిస్ పేరిట హెచ్చరిక ఐసిస్ సభ్యులమని చెప్పుకుంటూ గుర్తు తెలియని వ్యక్తులు సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు హెచ్చరిక పంపారు. ఈ నెల 24న పూర్వాంచల్‌లో జరిగే హింసను దమ్ముంటే అడ్డుకోండంటూ సవాల్ విసిరారు. ఇస్లామిక్ స్టేట్ పేరిట ఉన్న ఆ లేఖను బుధవారం పోలీసులు గుర్తించారు. వారణాసిలోని మీర్జామురాద్ ప్రాంతంలో దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కాగితంపై పాకిస్తాన్ జిందాబాద్ అని కూడా రాసి ఉంది. పూర్వాంచల్ ప్రాంతంలో హింస సృష్టిస్తామని, ఆ గందరగోళాన్ని ఆపండి అంటూ ఆ లేఖలో రాశారు. ఈ కేసులో పోలీసులు కొందర్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.