
వారణాసి: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శరన్నవరాత్రుల సందర్భంగా మహాశివుణ్ణి ఆరాధించారు. వారణాసికి చేరుకున్న ఆయన ముందుగా భారత సేవాశ్రమ సంఘ్‌లో దుర్గాదేవిని పూజించి, అనంతరం కాశీ విశ్వనాథుణ్ణి, కాలభైరవ ఆలయాన్ని, విశాలాక్షి ఆలయాన్ని సందర్శించారు.
నవరాత్రులలో పంచమి రోజున వారణాసికి వచ్చిన సీఎం యోగి ముందుగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, ఆలయ అభివృద్ధి ప్రణాళికలకు స్థల పరిశీలన చేశారు. అనంతరం ఆయన పలు ఆలయాలను సందర్శించారు. త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి పర్యటన ఉండవచ్చని స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని పలు పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారని తెలిపారు.
ఇది కూడా చదవండి: నాకేం తక్కువ..? నాకూ మద్యం షాపు కావాలి