
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవలే మహాకుంభ్ మేళాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ రోజు విమానం ఆలస్యం కావడంతో చాలా సేపు ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయారు. ఆ తర్వాత ప్రయాగ్ రాజ్ చేరుకున్న విజయ్ తన తల్లి మాధవితో కలిసి పవిత్ర స్నానం చేసిన ఫోటోలను పంచుకున్నారు. అయితే తాజాగా మహాకుంభ్ మేళా జర్నీకి సంబంధించిన మరికొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
మహాకుంభ్ మేళాకు వెళ్లిన విజయ్ దేవరకొండ కాశీ విశ్వనాథుని ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ పోస్ట్ పెట్టారు. వీరితో పాటు అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి, దర్శకుడు వంశీ పైడిపల్లి, కొందరు స్నేహితులు కూడా ఉన్నారు. ఈ ప్రయాణం తనకెంతో జ్ఞాపకాలను అందించిందని పోస్ట్ రాసుకొచ్చారు.
ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం యాక్షన్ మూవీ కింగ్‌డమ్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే టైటిల్, టీజర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ టీజర్‌కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన వాయిస్‌ను అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ మే 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment