సీఎం యోగికి పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు PM Narendra Modi extended birthday wishes to Uttar Pradesh CM Yogi Adityanath. Sakshi
Sakshi News home page

సీఎం యోగికి పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు

Published Wed, Jun 5 2024 10:31 AM | Last Updated on Wed, Jun 5 2024 12:30 PM

CM yogi Birthday Modi Wished with a Post on x

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పుట్టినరోజు నేడు(జూన్‌ 5). ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ప్రధాని మోదీ సీఎం యోగికి శుభాకాంక్షలు తెలియజేశారు.

‘ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఉత్తరప్రదేశ్ ప్రగతికి, పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు విశేష కృషి చేస్తున్నారు. రాబోయే కాలంలో దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను’ అని మోదీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రధాని మోదీ అభినందనలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ‘మీ హృదయపూర్వక శుభాకాంక్షలు నాకు అపారమైన స్ఫూర్తినిచ్చాయి. మీ విజయవంతమైన మార్గదర్శకత్వంలో ‘స్వయం-ఆధారిత ఉత్తరప్రదేశ్-అభివృద్ధి దిశగా ఉత్తరప్రదేశ్’ అనే భావనతో ముందుకు నడుస్తున్నాం. మీరు శుభాకాంక్షలు తెలిపినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని యోగి పేర్కొన్నారు. యోగి ఆదిత్యనాథ్‌ 1972, జూన్‌ 5న ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లాలో జన్మించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement