హోలీ వేళ సీఎం యోగి రుద్రాభిషేకం! | Uttar Pradesh CM Yogi Performs Rudrabhishek On The Occasion Of Holi - Sakshi
Sakshi News home page

Uttar Pradesh: హోలీ వేళ సీఎం యోగి రుద్రాభిషేకం!

Published Mon, Mar 25 2024 12:29 PM | Last Updated on Mon, Mar 25 2024 12:48 PM

CM Yogi Performed Rudrabhishek on the Occasion of Holi - Sakshi

హోలీ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించారు. సీఎం యోగి పలు సందర్భాల్లో శివుణ్ణి పూజిస్తుంటారు. తరచుగా కాశీకి వెళ్లి విశ్వనాథునికి పూజలు నిర్వహిస్తుంటారు. 

సీఎం యోగి తాజాగా చేసిన ఒక పోస్ట్‌లో గడచిన ఏడు సంవత్సరాలలో  రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావడంలో విజయం సాధించామన్నారు. ఈ 7 సంవత్సరాలు ‘న్యూ ఉత్తర ప్రదేశ్ ఆఫ్ న్యూ ఇండియా’ను సృష్టించేందుకు కృషి చేశామన్నారు. 
 

ప్రజా సంక్షేమ బాటలో నడుస్తూ, రాష్ట్ర ప్రజల కలలను నెరవేర్చడానికి డబుల్ ఇంజన్ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నదన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రజల సహకారం లభిస్తున్నదని, అందుకు వారికి కృతజ్ఞతలు. హ్యాపీ హోలీ’ అని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement