holi
-
హోలీ ఆడినందుకు షమీ కూతురిపై మండిపడ్డ ముస్లిం మత పెద్ద
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీని ప్రముఖ మతాధికారి, ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ ఇటీవలికాలంలో తరుచూ టార్గెట్ చేస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సందర్భంగా షమీ ఎనర్జీ డ్రింక్ తాగడాన్ని తప్పుబట్టిన మౌలానా షాబుద్దీన్ రజ్వీ.. తాజాగా షమీ కూతురు ఐరా హోలీ ఆడటాన్ని పెద్ద ఇష్యూ చేశాడు. హోలీ రోజు ఐరా రంగులు పూసుకొని దిగిన ఫోటో ఒకటి సోషల్‌మీడియాలో ప్రత్యక్షం కావడంతో మౌలానా షాబుద్దీన్ రజ్వీ ఫైరయ్యాడు. పవిత్ర రంజాన్ మాసంలో ఐరా హోలీ ఆడటాన్ని తప్పుబట్టాడు. ఐరాను రంగులు పూసుకునేందుకు అనుమతించిన తల్లి హసీన్ జహాను తిట్టి పోశాడు. రంజాన్ మాసంలో ముస్లింలు హోలీ ఆడటం అక్రమమని.. షరియత్‌కు ఇది వ్యతిరేకమని అన్నాడు.ఐరా లాంటి చిన్నారి రంజాన్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోకపోవచ్చు. రంజాన్ విశిష్టత తెలియకుండా ఆ చిన్నారి హెలీ ఆడి ఉంటే అది నేరం కాదు. అయితే ఐరా రంజాన్ పవిత్రత తెలిసి కూడా హోలీ ఆడి ఉంటే మాత్రం అది ఇస్లాం చట్టానికి విరుద్ధమని ఓ వీడియో ద్వారా సందేశాన్ని పంపాడు. ఐరా విషయంలో మౌలానా షాబుద్దీన్ రజ్వీ స్పందించిన తీరును చాలా మంది తప్పుబడుతున్నారు. చిన్నారి సరదాగా రంగులు పూసుకుంటే ఇంత రాద్దాంతం చేయాలా అని మండిపడుతున్నారు. కొందరేమో ఇందులో చిన్నారి ఐరా తప్పు లేదు కానీ, రంజాన్ మాసం అని తెలిసి కూడా ఆమె తల్లి హోలీ ఆడేందుకు అనుమతించడం పెద్ద నేరమని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంలో ఐరా తల్లిని తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారు. ఐరా తల్లి హసీన్ జహా మహ్మద్ షమీతో విడాకులు తీసుకొని ప్రస్తుతం వేరుగా ఉంటుంది. కాగా, మౌలానా షాబుద్దీన్ రజ్వీ ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా షమీ ఎనర్జీ డ్రింక్ తాగినప్పుడు కూడా పెద్ద రాద్దాంతం చేశాడు. రంజాన్ మాసంలో రోజా (ఉపవాసం) ఉండకుండా షమీ పెద్ద నేరం చేశాడని అరోపించాడు. ఇలా చేసి షమీ ఇస్లాం సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నాడని విమర్శించాడు. మౌలానా షాబుద్దీన్ రజ్వీ వ్యాఖ్యలపై అప్పట్లో భారత క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. షమీ ఏం తప్పు చేశాడని ఇంత పెద్ద షో చేస్తున్నావని రజ్వీని ప్రశ్నించారు. దేశం కోసం శ్రమించాల్సి వచ్చినప్పుడు ఉపవాసం ఉండాలని అనడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. మతోన్మాధం ఎక్కువైనప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని చురకలంటించారు.ఇదిలా ఉంటే, షమీ ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించి భారత్ టైటిల్ గెలవడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో షమీ 5 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసి టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన షమీ.. ఆసీస్‌తో జరిగిన సెమీస్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. షమీ త్వరలో ఐపీఎల్లో ఆడనున్నాడు. ఈ సీజన్లో షమీని సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. షమీ గత సీజన్లో గుజరాత్ టైటాన్స్‌కు ఆడాడు. మెగా వేలంలో షమీని సన్‌రైజర్స్ రూ. 10 కోట్లకు దక్కించుకుంది. -
హోలీకి లీవ్ ఇవ్వని బాస్.. పైగా రూల్స్
భారతదేశంలో హోలీని ఎంతబాగా సెలబ్రేట్ చేసుకుంటారో అందరికి తెలుసు. ఈ పండుగను దృష్టిలో ఉంచుకుని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు కూడా మంజూరు చేస్తాయి. అయితే ఓ కంపెనీ బాస్ మాత్రం హోలీకి ఉద్యోగులకు సెలవు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అంతే కాకుండా కొన్ని రూల్స్ కూడా పాస్ చేశారు.ఒక ఉద్యోగి తన బాస్ పంపిన సందేశాన్ని రెడ్డిట్‌లో పోస్ట్ చేశారు. దీంతో అది నెట్టింట్లో వైరల్ అయింది. లీవ్ ఇవ్వకపోవడం మాత్రమే కాకుండా.. ఆఫీసుకు కూడా రంగులు తీసుకురాకూడదని రూల్ పాస్ చేశారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగింది, కంపెనీ పేరు ఏమిటనేది వెల్లడికాలేదు.హోలీ రోజు చెప్పకుండా సెలవు తీసుకుంటే లేదా అనుమతి లేకుండా సెలవు తీసుకుంటే.. అనుమతించనని, జీతం కూడా కట్ చేస్తామని బాస్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఉద్యోగులందరూ రాజీనామా చేయండి అని ఒకరు చెబితే.. కంపెనీ పేరు చెప్పి, బాస్ సిగ్గుపడేలా చేయాలసింది అని మరొకరు అన్నారు. భారత ప్రభుత్వం తన శ్రామిక శక్తిని రక్షించుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మొత్తం మీద ఉద్యోగులు దోపిడీకి గురవుతున్నారని ఇంకొకరు అన్నారు. -
ఈ వారం కథ: మసాన్ హోలీ
బ్లూసీ కేఫ్‌లో టీ తాగి బయటకొచ్చి నిలబడి, సిగరెట్ వెలిగించుకొని కాసేపు రోడ్డు అవతల కనిపిస్తోన్న సిటీ బస్టాపు వైపు, దాని పక్కనే ఉన్న మెట్రోస్టేషన్స్ వైపు చూస్తూ సిగరెట్ అంత్యక్రియల్లో చివరిదాకా పాల్గొని..పుట్‌పాత్ సందులోంచి తన యాభైఏళ్ల వయసు దాటుతోన్న పాదాలను ఆడించుకుంటూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్స్ కి చేరుకున్నాడు సత్యానంద్. ప్రయాణికుల్ని ఒరుసుకుంటూ డిసెంబర్ నెల చలికూడా రైల్వేస్టేషన్స్ లోకి నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది. ‘మణుగూరు వెళ్లే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మూడవనెంబర్ ప్లాట్‌ఫామ్ మీద...’లోయర్‌బెర్త్ మీద కూర్చొని విండోతెరిచి సెల్ఫోన్లో టైం చూశాడు. పదకొండున్నర. మిడిల్‌బెర్త్ ప్రయాణికుడు ఇంకా వచ్చినట్టు లేడు. అప్పర్‌బెర్త్ మీద అప్పటికే దుప్పటి కప్పుకొని పడుకొన్న వ్యక్తి ఒక చెయ్యిని తలకింద పెట్టుకొని, మరోచేత్తో పట్టుకున్న సెల్‌ఫోన్స్ వెలుతురు ముఖం మీద పడుతుంటే రీల్స్ చూస్తూ పడీపడీ నవ్వుతున్నాడు. చెప్పులు విప్పి సీటు కిందకు నెట్టి బాసింపట్టు వేసుకుని కిటికీలోంచి బయటికి చూశాడు.ప్లాట్‌ఫాం మీద మనుషులు అటూ ఇటూ కదులుతున్నారు. మీరందరూ వెళ్లిపోతే నేను కాసేపు కునుకు తీస్తాను అన్నట్లు అలసిన దేహంతో కనిపిస్తోంది రైల్వేస్టేషన్స్ .రైలు కదిలింది. చివరి నిమిషంలో పరుగెత్తుకుంటూ వచ్చి రైలెక్కినట్లున్నాడు ఆయాసపడుతూ మిడిల్‌బెర్త్ యువకుడు. బ్యాక్‌ప్యాక్ సీట్లో పెట్టి, పక్కన కూర్చొని షూస్ విప్పుకుంటూ ‘నాది మిడిల్‌బెర్త్ అంకుల్, మీరెక్కడిదాకా?’ అని అడిగాడు. ‘భద్రాచలం’ చెప్పాడు సత్యానంద్.‘మాది వరంగల్. మీకు నిద్రొచ్చినపుడు చెప్పండి బెర్త్ మీదకు వెళ్తాను’ అన్నాడా యువకుడు.‘థాంక్యూ... ఒక అరగంట’ అని తిరిగి కిటికీలోంచి బయటికి చూశాడు సత్యానంద్, కిటికీ అవతల ఒక్కో దృశ్యం వెనక్కి జారిపోతోంది. సికింద్రాబాద్ స్టేషన్స్ పరిసరాల నుండి అనుబంధం తెంచుకుంటోంది రైలు. రివ్వున కిటికీలోంచి వీచిన చల్లగాలికి అద్దం కిటికీ కిందికి దించబోతుండగా రేపు ఉదయమెప్పుడో సికింద్రాబాద్ నుండి వారణాసి వైపు వెళ్లే దానాపూర్ ఎక్స్‌ప్రెస్ పొగమంచులో తడుస్తూ కనిపించింది మసక మసగ్గా.గోదావరి నదివైపుకీ, గుడికీ వెళ్లాల్సిన ప్రయాణికులు దిగే స్టాప్‌లో బస్సు దిగి, ఆటో ఎక్కి గోదావరి వద్ద దిగి ఇరవైదాకా ఉన్న కరకట్ట మెట్లెక్కి అలసట తీర్చుకోడానికి కాసేపు నిలబడి ఎదురుగా మెట్లకింద కొద్ది దూరంలో లేతసూర్యకాంతిలో ఆవిరవుతున్న పొగమంచులో నింపాదిగా ప్రవహిస్తోన్న నదివైపు చూశాడు సత్యానంద్.పూజాసామాగ్రి అమ్మే షాపులు ఒక్కొక్కటీ తెరుస్తున్నారు, పితరులకు తర్పణం అర్పించడానికి వచ్చిన కొందరు పూజారులతో కలిసి మెట్లు దిగుతున్నారు.వీపుకి తగిలించిన బ్యాక్‌ప్యాక్ సవరించుకుని తను కూడా నదివైపు వెళ్లడానికి మెట్లు దిగసాగాడు సత్యానంద్. వెనక కొంచెం దూరంలోని మైకులో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గాత్రంలోంచి ‘ఏడనున్నాడో భద్రాద్రి వాసుడు’ కీర్తన వినిపిస్తోంది. ఏడనున్నాడో... అన్న శబ్దం వినగానే సత్యానంద్‌కి నలభై ఏళ్ల క్రితం ఇల్లు విడిచి వెళ్లిపోయిన తన తండ్రి శివరాం గుర్తుకొచ్చాడు. అతని జ్ఞాపకాల్లో గతం ఇసుకలా రాలడం మొదలుపెట్టింది.నలభై ఏళ్ల క్రితం సంగతి. సత్యానంద్‌కి పన్నెండు ఏళ్లుంటాయి. నమ్మిన స్నేహితుడు మోహన్స్ రావు వ్యాపారంలో సత్యానంద్ తండ్రి శివరాంను మోసం చేస్తే, ఖైరతాబాద్‌లో ఉన్న ఒక్కగానొక్క ఇల్లు అమ్మి ముప్పాతిక భాగం అప్పులు తీర్చి అద్దె ఇంట్లోకి మారారు. ఇంక ఏ వ్యాపారం జోలికి పోకుండా చిన్న ప్రైవేటు కంపెనీలో జీతానికి కుదిరాడు శివరాం. బొటాబొటి సంపాదన దానికితోడు పావుభాగం అప్పులు శివరాం ఖాళీజేబులకీ, అతని భార్య లక్ష్మీకాంతం చెవులకీ గుచ్చుకుంటూనే ఉన్నాయి. ఇంట్లో దంపతులిద్దరి మధ్యా చిన్నగా గొడవలు మొదలయ్యాయి. బంధువుల సూటిపోటి మాటల దగ్గరి నుండి అద్దె ఇంటి ఓనరమ్మ కళ్లల్లో అప్పుడప్పుడూ కనిపించే చిన్నచూపు వరకూ లక్ష్మీ కాంతానికి చిరాకు తెప్పించేవి, తల్లిదండ్రుల మధ్య క్రమంగా పెరుగుతున్న గొడవ చూసి ఒకరోజు రాత్రి, ‘నేను స్కూల్ మానేసి ఏదైనా పనిలో చేరుతాను నాన్నా’ అన్నాడు ఏడవతరగతి చదువుతున్న సత్యానంద్.కళ్లవెనుక తిరిగిన నీళ్లు బయటికి రాకుండా ఆపి ‘ఒద్దు బిడ్డా, నువ్వూ చెల్లాయి బాగా చదువుకొని బంధువుల్లో మన గౌరవం నిలబెట్టాలి’ అన్నాడు శివరాం కొడుకు సన్నని మెడపై ఉన్న తలను తన గుండెవైపుకు అద్దుకుంటూ. ఒకరోజు రాత్రి దంపతులిద్దరి మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరింది.‘‘దోస్తు దోస్తు అని వాడు చెప్పిన మాటలు విని దొరికిన కాడికి అప్పులు చేసి ఒక్కటి కాకుండా రెండు వ్యాపారాల్లో చేయిపెడితివి. అందులో ఒకటి సారా కాంట్రాక్టు. నీ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఆ మోహన్స్ రావుగాడు తెలివిగా డబ్బులన్నీ వాడి ఖాతాలో వేసుకొని నీకు నష్టాలు చూపెట్టాడు. చేతకాని వాడివి చేతకానివాడిలా ఉండాల్సింది. ఇవి నా మాటలు కాదు. మా అన్నదమ్ములు, బంధువులు అంటున్న మాటలు.’’ అన్న భార్య మాటలు గట్టిగా తగిలాయి శివరాం మనసుకి. వేరే ఎవరైనా అంటే ఏమోకానీ తన భార్య తనని ‘చేతకానివాడు’ అన్న మాట అతన్ని తీవ్రంగా వేధించింది. తనూ కుటుంబాన్ని పోషించడానికేగా వ్యాపారంలోకి దిగింది. కాకపోతే మోసపోయాడు.ఏమనుకున్నాడో ఏమో తెల్లవారుఝామున ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. అప్పట్నుండీ ఇప్పటి వరకు తిరిగి ఇంటికి రాలేదు. అతని ఆచూకీ కోసం శివరాం బావమరుదులు ఎన్ని చోట్ల వెదికినా ప్రయోజనం లేకపోయింది. ‘ఎక్కడోచోట ఏడుస్తూ ఉంటాడులే అక్కా’ అని ఓదార్పు మాటలు, ‘నాకంట పడాలే కానీ’ అనే చిన్నతమ్ముడి ఆవేశపు మాటలు లక్ష్మీ కాంతం చెవుల వద్ద నెమ్మదిగా సెలవు తీసుకున్నాయి. క్రమంగా శివరాం ఆ కుటుంబానికి ఎప్పుడో కాని గుర్తు వచ్చేలా వాళ్ల మనసులో ఒక మూల చీకట్లో ఉండిపోయాడు.సత్యానంద్‌కి మాత్రం తండ్రి అప్పుడప్పుడూ కలలో కనిపించేవాడు. అమ్మానాన్న చెల్లాయిలతో కలిసి భద్రాచలం గోదావరిలో తుళ్లింతలు కొడుతూ బాల్యంలో తను స్నానం చేసిన దృశ్యం కలలో అతనికి ఏడాదికి రెండుసార్లయినా వచ్చేది. ముఖ్యంగా హోళీ పండుగనాడు తన తండ్రి భద్రాచలం తీసుకెళ్లేవాడు. ఏ రంగులూ వాడకుండా పసుపు కుంకుమలు రుద్దుకొని అమ్మనాన్న గోదావరి ఒడ్డున హోళీ ఆడుకునేవారు. శివరాం భార్య లక్ష్మీకాంతం కుటుంబంతో భోజనం చేసే సమయంలో ఎప్పుడో ఒకసారి భర్త గుర్తుకొచ్చి పిల్లల్తో, ‘ఆ రోజు రాత్రి నేను మీ నాన్నని... చేతకాకపోతే అని తిట్టి ఉండాల్సింది కాదు. నిజానికి అది నా మాట కూడా కాదు.బంధువుల నోట్లోంచి వినీ వినీ విసుగొచ్చి తట్టుకోలేక అన్నమాట. అయినా ఆ మాట అనకుండా ఉండాల్సింది’ అని గుడ్లనీరు కక్కుకుంటుంటే ‘ఏదో బాధ తట్టుకోలేక అంటే మాత్రం ఆయన ఇల్లొదిలిపెట్టి వెళ్లిపోవాలా’ అని ఎదుగుతున్న కూతురు తండ్రిని కోపంగా గుర్తుచేసుకునేది.ఇంటర్ అర్హతతో సత్యానంద్‌కి రైల్వేలో ఉద్యోగం వచ్చాక చర్లపల్లిలో ఒక ప్లాటు కొనుక్కొని, ఇల్లు కట్టుకొని శివరాంలేని ఇంట్లోకి గృహప్రవేశం చేసిందా కుటుంబం. మరుసటి ఏడాదే చిన్నతమ్ముడికి తన కూతురినిచ్చి పెళ్లిచేసింది లక్ష్మీ కాంతం.నదుల అద్దాల్లో తమ ముఖాల్ని చూసుకుంటూ ముందుకు కదులుతోన్న మేఘాల్లాగా సాగిపోయింది కాలం.నాలుగురోజుల క్రితం ఆదివారపు న్యూస్పేపర్లో తన తండ్రిని వ్యాపారంలో మోసం చేసిన మోహన్‌రావు దశదిన కర్మ ప్రకటన కనిపించింది సత్యానంద్‌కి. ‘పాపి చిరాయువు అంటారు. నూరేళ్లు నిండకుండానే పోయాడన్న మాట మా కాపురంలో చిచ్చుపెట్టి’ అంది ఆ వార్త విని లక్ష్మీ కాంతం. సత్యానంద్‌కి కళ్లముందు తండ్రి మెదిలాడు. మోహన్స్ రావు చనిపోయిన వార్త తన తండ్రికి తెలుసోలేదో, అసలింతకీ తన తండ్రి బతికే ఉన్నాడో లేదో తెలియదు.జ్ఞాపకాల్లోంచి బయటకొచ్చాడు సత్యానంద్. భద్రాచలం గోదావరి ఒడ్డున చివరిమెట్టు దిగాక కాళ్లకు ఇసుక మెత్తగా తగిలింది. నీళ్లుపాడిన పాటలో కరిగి కన్నీరైపోయిన రాళ్ల సూక్ష్మ అవశేషాల్లాంటి తీపిలేని చక్కెరచుక్కల ఇసుక రేణువులపై నడుచుకుంటూ గోదావరివైపు కదులుతుండగా మళ్లీ తన తండ్రి శివరాం గుర్తుకొచ్చాడు.‘భద్రాచలం అంటే చాలా ఇష్టంరా సత్యానంద్. చిన్న ఊరు.. పెద్దగోదావరి.. ఆయనెవరో కంచర్ల గోపన్న కట్టిన గుడి. ప్రశాంతంగా అయిపోయే దర్శనం. చిన్నప్పుడు మా అయ్యశివయ్య ఎందుకోగానీ పండుగ రోజుల్లో కాకుండా మామూలు రోజుల్లో మమ్మల్ని భద్రాచలం తీసుకెళ్లేవాడు. కాబట్టి ఎప్పుడూ మేం ఇబ్బంది పడిందిలేదు. మా అయ్యకు భద్రాచలం అంటే బాగా ఇష్టం, కానీ ఎందుకో కాశీ విశ్వేశ్వరుడి పేరు చెబితే చాలు కళ్లనీళ్లు పెట్టుకునేవాడు. అందుకేనేమో నాకు శివరాం అని పేరు పెట్టాడు’ అని తన తండ్రి శివరాం వాళ్ల నాన్న శివయ్యను గుర్తుకు చేసుకునే సందర్భం ఎందుకో గుర్తుకొచ్చింది సత్యానంద్‌కి.జనసంచారం లేని చోటికి వెళ్లాడు సత్యానంద్. ఇసుకలో బ్యాగ్పెట్టి, ప్యాంటూ షర్టూ విప్పి గోదావరిలోకి అడుగుపెట్టి నీళ్లల్లో కూర్చున్నాడు.అతని గొంతువరకూ వచ్చాయి నీళ్లు. భద్రాచలం ఊరి మీది నుండి పైకి లేస్తున్నాడు సూర్యుడు. కరకట్ట మీది నుండి గోదావరివైపుకు మెట్లుదిగుతున్న భక్తుల సంఖ్య పెరిగింది. ఒక మెట్టు అంచున అప్పుడే వచ్చినట్లున్న వృద్ధ కాషాయధారి అక్కడ కూర్చోడానికి అప్పుడే మెట్టుమీద గుడ్డ పరుచుకుంటున్నాడు.‘ఒకవేళ నాన్న ఇల్లువదిలిపెట్టి వెళ్లిపోయిన ఆ రాత్రి సరాసరి భద్రాచలం వచ్చి ఉంటాడా? ఆయన ఆచూకీ కోసం ఈ ఊరికి కూడా వెళ్లి వెదకమని అమ్మ మావయ్యలకు చెప్పి ఉంటుందా? తను అప్పుడు చాలా చిన్నవాడు. తనకి గుర్తొస్తే తను చెప్పేవాడేమో! ఒకవేళ ఇక్కడికి వచ్చి తన తండ్రి నలభై సంవత్సరాల నుండీ ఇక్కడే ఉండిపోయి ఉంటాడా?’ హఠాత్తుగా కలిగిన ఈ ఆలోచనకు ఒళ్లు ఝల్లుమంది సత్యానంద్‌కి.‘ఒక్క రెండుమూడు రోజులు ఇక్కడే ఉండి తన తండ్రి కనిపిస్తాడేమో చూడాలి’ అనుకున్నాడు గోదావరిలో ఒక మునకవేస్తూ.. తర్వాత రెండో మునక.. మూడో మునక వేసి ఎందుకో.. నీళ్లలోనే కొన్నిక్షణాలు అలా ఉండిపోయి.. మనసులో ఇలా అనుకున్నాడు ‘మోహన్స్ రావు చనిపోయాడు నాన్నా’..(2025).(1995) లలితాఘాట్, వారణాసి (కాశీ) (ఫాల్గుణశుక్ల ద్వాదశి) స్నానం చేయడానికి గంగానదిలో దిగి రెండు మునకలు వేసి మూడో మునక వేయగానే నలభైఏళ్ల శివరాంకు భవిష్యత్ కాలంలోంచి వినిపించినట్లు ఏవో మాటలు వినిపించాయి నీళ్లల్లోంచి.‘మోహన్స్ రావు చనిపోయాడు నాన్నా’ దిగ్గున నీళ్లలోంచి తలబయటికి తీశాడతను. ఈ అకస్మాత్ పరిణామానికి కొన్ని క్షణాలు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. తెలియకుండా నోట్లోకి వెళ్ళిన నీళ్లను బయటికి వదిలి నోటితోనే గట్టిగా గాలి పీల్చుకున్నాడు. కాలంలో ముందెక్కడో ఉన్న సుదూరతీరం నుండి పాములా నీళ్లలో పాక్కుంటూ వచ్చి చెవిదగ్గరికి రాగానే నీటిబుడగలా పేలిపోయిన శబ్దంలోంచి వచ్చినట్లుగా వినిపించాయా మాటలు . ‘మోహన్స్ రావు చనిపోయాడు నాన్నా’ .యాభైఏళ్లు దాటిన వ్యక్తి గొంతులోంచి వచ్చినట్లుగా ఉన్నాయా మాటలు. గొంతులో ఇంకా ఎండిపోని లేతదనం, సన్నని జీరను బట్టి ఆ గొంతు తన కొడుకు సత్యానంద్‌ది అని శివరాం పోల్చుకున్నాడు. ‘తను వాడి పన్నెండవ ఏట ఇల్లువిడిచి పెట్టి వచ్చాడు. ఇప్పుడు వాడికి ఇరవై ఏళ్లు దాటుంటాయి. మరి యాభై ఏళ్ల వయసున్న వ్యక్తి గొంతులోంచి వచ్చిన మాటల్లా ఉన్నాయేంటి. అంటే తన కొడుక్కి యాభైఏళ్లు దాటాక మోహన్ రావు చనిపోతాడా?ఈ భవిష్యత్వాణి ఇప్పుడెందుకు వినిపించిందో? ఇల్లు విడిచిపెట్టి వచ్చిన ఈ పదేళ్లలో ఇలాంటి అనుభవం నాకెప్పుడు కలుగలేదు. ఇదంతా తన భ్రమ అయి ఉంటుందా? నీళ్లలో వినిపించిన మాటల్లోని శబ్దతీవ్రత ఇది భ్రమకాదు అన్నట్లుగా ఉంది. కాశీలో ఇలాంటి అనుభవాలు సాధారణమేనా?’ శివరాం ఆలోచనల్ని తెంచివేస్తూ అతడు స్నానంచేస్తున్న లలితాఘాట్ పక్కనున్న విశ్వనాథ మందిరం అవతలనున్న మణికర్ణికా ఘాట్నుండి ఏవో శబ్దాలు వినిపించాయి.అక్కడ ‘మసాన్స్ హోలీ’ వేడుక జరుగుతోంది. దహనక్రియలు జరిగిన వాళ్ళ చితాభస్మాన్ని చల్లుకుంటూ అఘోరాలు, బైరాగులు, సన్యాసులు, భంగు సేవిస్తూ ఢమరుకం వాయిస్తూ ఉత్సాహంగా కేరింతలు కొడుతూ నృత్యం చేస్తున్నారు. శవదహనం జరిగే మణికర్ణికా ఘాట్‌వద్ద ప్రతిఏటా ఫాల్గుణ శుక్ల ద్వాదశినాడు జరిగే వేడుక ‘మసాన్స్ హోలీ’. మసాన్స్ అంటే శ్మశానం, శ్మశానంలో జరిగే హోలీ.కాశీలో ప్రాచుర్యంలో ఉన్న కథనం ప్రకారం పార్వతీపరమేశ్వరుల వివాహానంతరం ఫాల్గుణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినాడు పార్వతిని పరమేశ్వరుడి చిరునామా అయిన కాశీలోని విశ్వనాథ మందిరానికి తీసుకొచ్చారు. ఆ వేడుకని పురస్కరించుకొని శివుడు దేవతలు, గంధర్వులతో కలసి ఉల్లాసంగా హోలీ ఆడాడు. ఆ హోలీయే రంగోభరీ ఏకాదశి. ఆ వేడుకలో పాల్గొనలేకపోయిన భూత ప్రేత పిశాచాలు శివగణాలు, అఘోరాల కోసం మరుసటి రోజైన ఫాల్గుణ శుక్ల ద్వాదశినాడు శివుడు సతీసమేతంగా మణికర్ణికాఘాట్‌కి వచ్చి వీరితో కలిసి భస్మ హోలీ ఆడాడు.ఆ సంప్రదాయమే కాశీలోని మణికర్ణికాఘాట్ వద్ద ఏటా కొనసాగుతోంది.గంగలో స్నానం పూర్తిచేసుకొని ఒడ్డున ఉన్న మెట్లవైపు కదులుతుండగా శివరాంకు మళ్లీ నీళ్లల్లో వినిపించిన మాటలే చెవుల్లో ప్రతిధ్వనించాయి. ‘మోహన్స్ రావు చనిపో.......’అప్రయత్నంగా మణికర్ణికాఘాట్వైపు చూశాడు. మసాన్స్ హోలీ దద్దరిల్లుతోంది అక్కడ, చితాభస్మం గాల్లోకి లేస్తోంది. సన్యాసుల, బైరాగుల, అఘోరాల నృత్యకేళి చిందులేస్తోంది.‘మోహన్స్ రావు చనిపోయిన వార్త, చితాభస్మలేపన మసాన్స్ హోలీ హేల ఒకదానికొకటి ఏమైనా సంబంధం ఉందా? రెండు విషయాలు ఒకే రోజున జరగడంలో అంతరార్థం ఏదైనా ఉందా.. ఎవరు చెబుతారు?’ అనుకుంటూ మెట్లమీద అడుగులు వేశాడు శివరాం.‘ఎల్లుండి పౌర్ణమిరోజు రాత్రి గంగఒడ్డున కూర్చొని చంద్రున్ని చూడు’ అని వృద్ధ్ద సన్యాసిని ఒక యువ సన్యాసినితో చెబుతున్న మాటల పక్కనుండి నడిచి మెట్ల పైకి వచ్చి తల తుడుచుకొని బట్టలు మార్చుకుంటుండగా శివరాంకి తన కుటుంబం గుర్తుకొచ్చింది.‘పిల్లలేం చేస్తున్నారో? కొడుకు సత్యానంద్‌కి ఇరవైయేళ్లు దాటి ఉంటాయి. కూతురు ఏం చదువుతోందో? అది వాళ్లమ్మతో కలిసి నన్ను తిట్టుకునే ఉంటుంది. లక్ష్మీకాంతం.. ఎన్ని శాపనార్థాలు పెడుతుందో తనని ఇంకా..భార్య గుర్తుకురాగానే తను కాశీకి వచ్చిన కొత్తలో తనలాగే ఇల్లువిడిచి ఎక్కడెక్కడో తిరిగి చివరికి ఇక్కడికి చేరి ఒక సాయంత్రం గంగా హారతి కార్యక్రమంలో తెలుగులో ఏదో గొణుక్కుంటూ తనకి పరిచయమైన సుందర్రావు గుర్తుకొచ్చాడు శివరాంకు. అతనిది శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల పల్లెటూరు. గయ్యాళి భార్య నోటికి వేగలేక ఆత్మహత్య చేసుకుందామని బయలుదేరి ఎందుకో మనసు మార్చుకొని ఎక్కడెక్కడో తిరిగి చివరికి కాశీకి వచ్చిచేరాడు.ఆ పరిచయంతో అప్పుడప్పుడు సాయంత్రాల్లో గంగాఘాట్ల వద్ద కలుస్తూ ఉండేవాడు.‘చచ్చినా తిరిగి ఇంటికి వెళ్లను’ అనేవాడు తరచుగా తన భార్య ప్రస్తావన వచ్చినపుడు. ‘చస్తే ఇంకేం వెళ్తావులే’ అని తనంటే పెదాల్ని చెవులదాకా సాగదీసి శబ్దంలేకుండా నవ్వేవాడు. ఆ నవ్వులో అమాయకత్వానికి పుట్టిన బిడ్డలాంటి ఏదో అందం ఉండేది. ఉన్నట్లుండి ఒకరోజు సాయంత్రం హరిశ్చంద్రఘాట్ దగ్గర కనిపించి ‘రేపుదయం ఇంటికి బయలుదేరుతున్నాను’ అన్నాడు. ‘అదేంటీ చచ్చినా ఇంటికి వెళ్లనని పదేపదే చెప్పేవాడివి కదా.. హఠాత్తుగా ఏంటీ మార్పు. ఎవరికైనా ఒంట్లో బాగోలేదా?’ అని తను అడిగితే,‘ఈ కాశీలో ఉండడం కష్టమైపోతోంది శివరాం. నా భార్యపేరు అన్నపూర్ణ. ఆ పేరు ఇక్కడ ఎవరో ఒకరి నోటినుండి రోజూ వినబడుతూనే ఉంటుంది. ‘అన్నపూర్ణ మాతాకీ జై’అంటూ. వినపడకపోయినా ఏదో ఒక బోర్డుమీద ఆ పేరు కనబడుతూనే ఉంటుంది.కాశీకి వచ్చినప్పటి నుండీ అన్నం తింటున్నప్పుడల్లా నా భార్య అన్నపూర్ణే గుర్తుకొస్తోంది. ఇక ఇక్కడ ఎక్కువరోజులు ఉండలేనని అర్థమైంది. నా పెళ్లాం గయ్యాళిదే కావొచ్చు. కానీ లౌక్యం తెలియని వెర్రిమాలోకం. అడుక్కునే బిచ్చగాడికి కూడా ఆమె వాలకం చూస్తే మోసం చేయాలనిపిస్తుంది.ఇంటికి వెళ్లి చూస్తాను. రానిచ్చిందా ఉండిపోతాను. మళ్లీ గయ్యాళి గంగమ్మ వేషం వేసిందా..’ అని గంగానది వైపు చూసి, ‘భరిస్తాను.. ఉండిపోతాను.. పాపం దానికి పిల్లలు కూడా పుట్టలేదు’ అని తన దగ్గర సెలవు తీసుకొని మెట్లెక్కి వెళ్లిపోయాడు. అతని వెనుకే మిగిలిన ఆ సాయంత్రపు నిశ్శబ్దంలో తనకి తన భార్య లక్ష్మీకాంతం గుర్తుకొచ్చింది.‘తన భార్య పేరు కూడా అన్నపూర్ణో, విశాలాక్షో అయితే సుందర్రావులా తనూ ఇంటికి బయలుదేరి వెళ్లేవాడా?’ అనుకున్నాడు ఆ నది ముందు నిల్చొని.వెంటనే ఆరోజు రాత్రి తన భార్య అన్నమాటలే మళ్లీ మెదిలాయి మనసులో.ఒకవేళ మనస్సు మార్చుకొని ఇల్లు విడిచిపెట్టివచ్చిన ఈ పదేళ్ల తర్వాత తను కూడా అతడిలా తిరిగి ఇంటికి వెళ్తే తన భార్యపిల్లలు ఇంట్లోకి రానిస్తారా? ‘ఎక్కడ చచ్చావ్ ఇంతకాలం’ అంటారా? ముఖ్యంగా తన చిన్న బావమరిది ముందు మెడపట్టుకొని బయటికి నెట్టేస్తాడు. వాడిదసలే దుడుకు స్వభావం. వాళ్ల చేతుల్లో అలాంటి అవమానం పొందేకంటే ఈ కట్టె కాశీలో కాలిపోవలసిందే’ అనుకున్నాడు ఆ రాత్రి సుందర్రావు వెళ్లిపోయిన వైపు మరోసారి చూసి.గత స్మృతుల్లోంచి బయటికొచ్చాడు శివరాం. అతనికి ఎందుకో టిఫిన్స్ చేయాలనిపించలేదు. మెట్లపైకి వెళ్లి టీ తాగి వచ్చి ఎండ పెరుగుతున్నా పట్టించుకోకుండా ఘాట్వద్దే కూర్చొని మసాన్స్ హోలీ వేడుకనే చూడసాగాడు. మధ్యాహ్నం పన్నెండవుతోంది. మణికర్ణికాఘాట్ వద్ద మసాన్స్ హోలీ ఆడుతున్న వాళ్లంతా నృత్యం చేస్తూనే ఎందుకో గంగానది వైపు చూడసాగారు.(2030)ఊరుచివరి శ్మశానం:చితిమీద ఎనభైఏళ్ల వృద్ధుడి భౌతిక కాయానికి నిప్పంటించి మేఘాలు దట్టంగా కమ్మిన ఆకాశం కింద మిగిలిన కార్యక్రమాలన్నీ చకచకా కానిచ్చేసి మృతుడి తాలూకు వాళ్లంతా ఇళ్లవైపు బయలుదేరాక భోరున వర్షం మొదలైంది.అంచుల్లో పెచ్చులూడిపోయి బాగా మసిపట్టిన సిమెంటురేకుల షెడ్డుకింద కాలుతున్న చితి మంటని కర్రతో సవరించి ఆ షెడ్డుకి కొంత దూరంలో ఉన్న మరొక షెడ్డువైపు వానలో తడుచుకుంటూనే పరుగెత్తాడు కాటికాపరి బహుశా సారాతాగి మళ్లీ వద్దామని.అంత వర్షంలోనూ చితికి కొద్దిదూరంలో ఆకాశం కింద నిలబడి వానను పట్టించుకోకుండా ఆ షెడ్డుకింద శివరాం చితివైపు చూస్తోంది లక్ష్మీకాంతం.భర్తతో గడిపిన మధురక్షణాలన్నీ ఆమె కళ్లముందు మెదిలాయి.వంటగదిలో గచ్చునేలమీద నూనెచుక్కపై తాను చూసుకోకుండా కాలువేసి జారి పడబోతుంటే కూరగాయలు కోస్తున్నవాడల్లా దిగ్గునలేచి కిందపడకుండా నడుంపట్టుకొని ఆపిన శివరాం చేతులు, పదిరోజుల దాకా తనకి జ్వరం తగ్గకపోతే సేవలు చేస్తూనే చిన్నపిల్లాడిలా ఏడ్చిన భర్త కళ్లు, ‘నీచేతుల్లో గోరింటాకు బాగా పండుతుంది లక్ష్మీ’ అని తన చేతుల్ని ముదు ్దపెట్టుకున్న ఆయన పెదాలు, ‘వెళ్లొస్తాను లక్ష్మీ’ అని బతుకుదెరువు కోసం బయలుదేరే ఆయన పాదాలు, రాత్రుల్లో తనని నిశ్చింతగా నిద్రపుచ్చిన ఆయన ఛాతీ..అన్ని దృశ్యాలూ ఆమె కళ్లముందు గిర్రున తిరిగాయి. ఆ చేతులు, కాళ్లు, ఛాతీ, పెదాలు అన్నీ ఎదురుగా చితిలో కాలిపోతున్నాయి అనిపించగానే ఆమె కళ్లలోంచి దుఃఖం కట్టలు తెంచుకుంది.ఆమె నోట్లోంచి మూడు అక్షరాల మాట ఒకటి బయటికి వెలువడబోతుండగానే చప్పున అక్కడి దృశ్యం మారింది.ఈసారి అదే చితిమీద డెబ్భైఅయిదేళ్ల లక్ష్మీకాంతం భౌతికకాయం కాలుతోంది. అదే బోరున వర్షం, అప్పటిదాకా లక్ష్మీకాంతం నిలుచున్న చోట నిల్చొని..ఇల్లు విడిచి వెళ్లిపోయిన నలభైఏళ్ల తర్వాత ఆ రోజే తిరిగివచ్చిన శివరాం.. పావుభాగం వంగిపోయిన దేహంతో భార్య చితివైపు చూస్తున్నాడు. ‘తల్లిలేని పిల్లనయ్యా.. నన్ను బాగా చూసుకుంటావు కదూ’ అని పెళ్లయిన కొత్తలో బేలకళ్లతో నవ్వుతూ తనని అడిగే భార్య శరీరం ఆకాశం కింద నేలకు పైన కాలి బూడిదవుతోంది. అతడి కళ్లలోంచి రెండు జలపాతాలు దుముకుతున్నాయి.ఉన్నచోటే కూలబడి భార్య చితివైపు చూస్తూ అతను కూడా మూడు అక్షరాల పదాన్ని గట్టిగా రోదిస్తూ పలికాడు.ఎక్కడో పిడుగుపడ్డ శబ్దానికి లక్ష్మీకాంతానికి కలచెదిరింది. మెల్లిగా కళ్లుతెరిచింది. చెంపలకు తడిగా దిండుతగిలింది. మూసి ఉన్న గది కిటికీల బయట పెద్ద చప్పుడుతో రాత్రి ఎప్పుడు మొదలైందో..వాన కురుస్తోంది. కరెంట్ పోయినా ఇన్వర్టర్ సాయంతో తక్కువ స్పీడులో ఫ్యాను తిరుగుతోంది. బెడ్‌లైట్ వెలుతురులో గడియారంలో మూడుగంటల ముల్లుని ముట్టుకొని ముందుకి కదిలింది సెకెన్ల ముల్లు. ఢెబ్భై అయిదేళ్ల వయస్సున్న శరీరాన్ని నెమ్మదిగాలేపి మంచం అంచున కూర్చోబెట్టి కొంగుతో కన్నీళ్లు్ల తుడుచుకుంది. వాన మరింత జోరు అందుకున్న శబ్దం వినిపిస్తోంది.ఆమెకెందుకో దగ్గరయిన వాళ్లు కాస్తా ఒకరి నుండి మరొకరు వెనక్కి వెనక్కి అడుగులు వేసుకుంటూ దూరంగా వెళ్లిపోతున్న ప్రపంచంలోని కొందరు స్త్రీ పురుషులు ఒక్క క్షణం కళ్ల ముందు మెదిలారు.గది కిటికీలకు ఇవతల మరో వర్షం మొదలైంది. తెల్లవారు జామున ఎప్పటికో వాన వెలిసింది. లక్ష్మీకాంతానికి ఎందుకో జీవితంలో మొదటిసారి కాశీకి వెళ్ళాలనిపించింది. -
రాళ్లతో హోలీ.. 42 మందికి గాయాలు.. ఎక్కడంటే?
దుంగార్పూర్: రాజస్థాన్‌లోని దుంగార్పూర్లో హోలీవేడుకలను రంగులతో కాకుండా రాళ్లతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గత 20 ఏళ్లుగా దుంగార్పూర్లోని భిలుడా గ్రామస్తులు రాళ్లతో హోలీని జరుపుకుంటున్నారు. ఈ వేడుకల్లో 42 మంది గాయపడగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. రెండు వర్గాలుగా విడిపోయిన స్థానికులు.. రాళ్లతో హోలీ చేసుకున్నారు. ఈ క్రమంలోనే పలువురికి గాయాలు కావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.గిరిజనులు ఎక్కువగా నివసించే భిలుడా గ్రామంలో రాళ్ల దాడిలో నేలపై పడే రక్తం ఏడాది పొడవునా గ్రామంలో జరిగే అవాంఛనీయ సంఘటనల నుంచి రక్షిస్తుందనే నమ్మకంతో దశాబ్దాలుగా ఇక్కడ హోలీ జరుపుకుంటున్నారు. హోలీని జరుపుకోవడానికి గ్రామంలోని రఘునాథ్జీ ఆలయం దగ్గర ప్రజలు హాజరై.. డ్రమ్స్ వాయిద్యాలతో నృత్యం చేశారు అనంతరం రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు.Believe me, this is not a clash; it is a Holi celebration!In Bhiluda village in Rajasthan, Holi is celebrated by pelting stones. Every year on Holi, in the evening, instead of colors and gulal, stones are pelted between two groups#Holi#Holi2025 #HoliCelebration pic.twitter.com/MVOQZll6TF— Pirzada Shakir (@pzshakir6) March 14, 2025 -
హోలీ వేడుకల్లో తమన్నా, విజయ్ వర్మ .... ప్యాచప్ అయ్యారా?
-
హోలీ వేడుకల్లో సోనాక్షి సిన్హా.. ఆయన ఎక్కడంటూ నెటిజన్ల ట్రోల్స్!
సినీ తారలంతా హోలీ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. ఫ్యామిలీతో కలిసి రంగులు చల్లుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలు పంచుకుంటున్నారు. అందరిలాగే బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా సైతం హోలీ పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇవీ చూసిన అభిమానులు ఈ ముద్దుగుమ్మకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.అయితే కొందరు నెటిజన్స్ మాత్రం సోనాక్షిని ట్రోల్ చేశారు. హోలీ వేడుకల్లో మీ భర్త జహీర్ ఇక్బాల్ ఎక్కడ అంటూ ప్రశ్నించారు. అయితే నెటిజన్ల కామెంట్స్‌కు సోనాక్షి కూడా స్పందించింది. 'నేను ప్రస్తుతం జటాధర మూవీ షూట్లో ఉన్నా.. నా భర్త జహీర్ ముంబయిలో ఉన్నారు.. మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి' అంటూ విమర్శలకు తనదైన స్టైల్లో కౌంటరిచ్చింది.కాగా.. గతేడాది జూన్‌లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. సోనాక్షి, జహీర్ దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్నారు. సల్మాన్‌ఖాన్ నిర్వహించిన పార్టీలో తొలిసారిగా వీరిద్దరు కలుసుకున్నారు. సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ 'నోట్‌బుక్'తో అరంగేట్రం చేసిన జహీర్.. సోనాక్షితో కలిసి డబుల్ ఎక్స్ఎల్ చిత్రంలో నటించారు. గతేడాది జూన్ 23, 2024న ముంబయిలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి సల్మాన్ ఖాన్, కాజోల్, విద్యాబాలన్ లాంటి అగ్రతారలు హాజరయ్యారు.ఇక సినిమాల విషయానికొస్తే సోనాక్షి సిన్హా ప్రస్తుతం జటాధార చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న జటాధర సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా జటాధర చిత్రబృందం సోనాక్షి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. అందులో ఈ బ్యూటీ కళ్లకు కాటుక, చిందరవందరగా ఉన్న జుట్టుతో కనిపించింది. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 14న లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీకి వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
భర్తతో బుల్లితెర నటి వాసంతి హోలి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
హైదరాబాద్ లో అంబరాన్నంటిన హోలీ వేడుకలు.. (ఫొటోలు)
-
హోలీ.. ఆర్థిక వ్యవస్థకు ఆనంద కేళి
రంగుల పండుగ హోలీ కేవలం ఆనందం, ఐక్యతకు వేడుకగా మాత్రమేకాదు, దేశంలో గణనీయమైన ఆర్థిక వ్యాపారానికి తోడ్పాటునందిస్తోంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) గణాంకాల ప్రకారం ఈ ఏడాది హోలీ రోజున రూ.60,000 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. గత ఏడాది నమోదైన రూ.50,000 కోట్ల వ్యాపారంతో పోలిస్తే ఇది 20 శాతం అధికమని తెలిపింది.అన్ని రంగాల్లో ఆర్థిక వృద్ధిసాధారణంగా పండుగ సమయాల్లో విభిన్న విభాగాల్లో వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. స్వీట్లు, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ), గిఫ్ట్ ఐటమ్స్, డ్రై ఫ్రూట్స్, దుస్తులు, పూలు, పండ్లు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ వంటి ఉత్పత్తులకు అధిక డిమాండ్ ఉంటుంది. పండుగలకు ముందే కొందరు ఆయా వస్తువులను కొనుగోలు చేస్తే, పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంకొందరు ఈమేరకు ఖర్చు చేస్తారు. దాంతో రిటైల్ వ్యాపారులతోపాటు, దుకాణదారులతో మార్కెట్లు సందడిగా ఉంటాయి. గతంలో కంటే ఈసారి అధికంగా ఖర్చు చేస్తారని అంచనాలు ఉండడంతో స్థానిక వ్యాపారాలు, చిన్న వ్యాపారులు, ఎంఎస్ఎంఈ రంగానికి ప్రయోజనం చేకూరుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.స్థానిక ఉత్పత్తులకు గిరాకీఈ ఏడాది వివిధ విభాగాల్లోని వ్యాపారులు భారత్‌లో తయారవుతున్న వస్తువులను ప్రమోట్ చేయడంపై దృష్టి సారించారు. వినియోగదారులు చైనీస్ ఉత్పత్తులకు దూరంగా స్థానికంగా తయారైన హెర్బల్ కలర్స్, ట్రెడిషనల్ వాటర్ గన్స్ (పిచ్కారీస్), బెలూన్లు, పూజా సామగ్రిని ఎంచుకుంటున్నారు. ఈ మార్పు దేశీయ పరిశ్రమలకు మద్దతుగా నిలుస్తుంది.ఇదీ చదవండి: బ్యాంకింగ్‌కు జెనరేటివ్ ఏఐ బూస్ట్!ఒక్క ఢిల్లీలోనే 3000కు పైగా కార్యక్రమాలు..పెద్ద ఎత్తున హోలీ మిలన్ కార్యక్రమాలు, సమావేశాలు ఆర్థిక వృద్ధికి మరింత దోహదం చేస్తున్నాయి. ఒక్క ఢిల్లీలోనే ఇలాంటి 3,000కు పైగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించడంతో వేదికలు, క్యాటరింగ్, సంబంధిత సేవలకు గిరాకీ పెరిగింది. వివిధ రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలను ఉత్తేజపరిచే ఈ ఉత్సవం సామర్థ్యం సాంస్కృతిక, సామాజిక కోణాలకు అతీతంగా దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. -
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు షురూ..(ఫొటోలు)
-
హైదరాబాద్‌లో ఫుల్ జోష్‌లో హోలీ సంబరాలు (ఫొటోలు)
-
హోలీ..జోష్ హైలీ
హోలీ సంబరాలకు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్పల్లి, నానక్‌రామ్‌గూడ, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో విశాలమైన వేదికలను ఏర్పాటు చేశారు. కొన్ని ఈవెంట్లలో చర్మానికి హాని చేయకుండా ఉండే రసాయనాలు లేని ఆర్గానిక్ రంగులను మాత్రమే అనుమతిస్తుండటం విశేషం. ఈ హోలీని మరింత సంబురంగా మార్చడానికి ముంబై,బెంగళూరు, ఢిల్లీ వంటి వివిధ నగరాల నుంచి ప్రముఖ డీజేలు నగరానికి చేరుకున్నారు. మరి కొందరు నిర్వాహకులు.. ఈ వేడుకల్లో వినూత్నంగా సాంస్కృతిక సంబరాలను నిర్వహించనున్నారు. దీని కోసం బ్యాండ్ బాజా, డోల్ దరువు, జానపద హొయలు పలికే డప్పులను నగరానికి ఆహా్వనించారు. \వందకు పైగా ఈవెంట్స్‌కు ఏర్పాట్లు రిస్టార్టులు, క్లబ్స్, పబ్లిక్ గ్రౌండ్స్‌లో భారీస్థాయిలో హోలీ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ భారీ వేదికల్లో 5 వేల నుంచి 15 వేల మందికి సరిపడా సౌకర్యాలు, విశాల ప్రాంగణాలు సిద్ధం చేశారు. ఇలాంటి భారీ హోలీ ఫెస్టివల్స్ సుమారు 30 నుంచి 40 వరకు నిర్వహిస్తుండగా.. మొత్తం నగరంలో వందకు పైగా హోలీ పబ్లిక్ ఈవెంట్స్‌కు ఏర్పాట్లు చేశారు. ఇందులో పాల్గొనడానికి ఎంట్రీ పాస్ కోసం రూ.500 నుంచి రూ.5,000 వేలకు పైగా వసూలు చేసే ఈవెంట్స్ ఉన్నాయి. కొందరు నిర్వాహకులు రంగులను ఉచితంగా అందిస్తుంటే మరికొందరు రంగులతో పాటు ఫుడ్ – డ్రింక్స్ కూడా అందిస్తున్నారు. ముఖ్యంగా ఈవెంట్ ఆర్గనైజర్లు హోలీ లవర్స్‌ను ఆకర్షించడానికి పలువురు సినీతారలను, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు, స్పోర్ట్స్ సెలబ్రెటీలను ముఖ్య అతిథులుగా ఆహా్వనిస్తున్నారు.60 ఫీట్ల ఎత్తయిన భారీ బ్యాక్‌గ్రౌండ్ స్టేజ్‌తో..లాత్మర్ హోలీ మీట్స్ టాలీవుడ్ పేరుతో నగరంలో అతిపెద్ద హోలీ సంబరాలను హైటెక్ ఎరీనాలో నిర్వహించనున్నారు. 60 ఫీట్ల ఎత్తయిన భారీ బ్యాక్‌గ్రౌండ్ స్టేజ్‌తో నగరంలో మొదటిసారి నిర్వహిస్తున్నారు. ఇందులో రంగుల సోయగాలతో పాటు సంగీతం, సెలబ్రెటీలతో అలరించనున్నారు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్‌లోని అంథమ్ వేదికగా నియాన్ హోలీ పార్టీ 2025కి ఘనంగా ఏర్పాట్లు చేశారు. బాలీవుడ్ బీట్స్‌తో లైవ్ మ్యాజిక్ ఉంటుంది. సుచిర్ ఇండియా ఆధ్వర్యంలో నగర శివార్లలోని హానీ బర్గ్ రిసార్ట్స్ వేదికగా హోలీ ఉత్సవ్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పదేళ్లుగా రంగ్ బర్సే..పదేళ్లుగా నగరంలో హోలీ సంబరాలను వినూత్నంగా నిర్వహిస్తున్నాం. ఈ సారి సిటీలోని యోలో ఎరీనాలో రంగ్ బర్సే 9.0 పేరుతో భారీ స్థాయిలో హోలీ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం. ఇందులో మ్యూజిక్‌తో పాటు రెయిన్ డ్యాన్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. హోలీ థీం టీ షర్ట్‌తో పాటు స్పెషల్ డ్రింక్స్, మీల్ బాక్స్ అందిస్తున్నాం. మా ఫెస్టివల్లో కార్పొరేట్ ఉద్యోగులు, యూత్‌తో పాటు కుటుంబ సమేతంగా పాల్గొనే వారు ఎక్కువగా ఉన్నారు. సిటీలో హోలీ అంటే ట్రెండీ కల్చర్‌గా మారింది. దీనికి అనుగుణంగానే అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశాం. 4 వేల మంది వరకు మా వేడుకల్లో పాల్గొంటారని అంచనా. – శరత్, రంగ్ బర్సే 9.0 నిర్వాహకులు మ్యూజిక్, డ్యాన్సింగ్తో పాటు బ్రుక్ ది పాట్ వంటి విభిన్న కార్యక్రమాలతో ఈ సంబరాలను ఏర్పాటు చేస్తున్నారు. సిటీలోని శ్రీపలాని కన్వెన్షన్ వేదికగా హోలీ మహోత్సవ్ 2.0 పేరుతో అతిపెద్ద ఓపెన్ ఎయిర్ ఫెస్టివల్ జరుపుతున్నారు. ఇందులో డీజే, లైవ్ డోల్, ఓపెన్ స్కై ఈవెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ వేడుకల్లో బిగ్ బాస్ ఫేం అశ్వినీశ్రీ, శుభశ్రీ కలర్‌ఫుల్ గెస్టులుగా సందడి చేయనున్నారు.గచ్చిబౌలిలోని సంధ్య పార్కింగ్ గ్రౌండ్ వేదికగా టోస్ట్ టానిక్ ఆధ్వర్యంలో హోలీ కారి్నవాల్ 2.0ను ఏర్పాటు చేస్తున్నారు. వేడుకల్లో అర్జున్ విజయ్, డీజే ఆకాశ్, డీజే మణి, డీజే రిష్, బీజే రుమీ వంటి వారు లైవ్ డీజేతో ఉర్రూతలూగించనున్నారు. బేగంపేట్ హాకీ స్టేడియం వేదికగా రంగ్ బసంత్ 2025 సంబరాలను, ఫ్లిప్ సైడ్ అడ్వెంచర్ పార్క్ గచ్చిబౌలిలో హోలీ కలర్ ల్యాండ్ ఓపెన్ ఎయిర్ ఫెస్టివల్‌తో పాటు నగరంలోని వివిధ వేదికల్లో హోలీ సంబరాలను నిర్వహిస్తున్నారు. -
Wine Shops Closed : వైన్‌షాపులు బంద్.. ఎందుకో తెలుసా?
సాక్షి,హైదరాబాద్ : మందు బాబులకు బ్యాడ్ న్యూస్. ఈ నెల 14న మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో హోలీ పండుగ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో 14వ తేదీ ఉదయం ఆరుగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు వైన్ షాపులు మూసి ఉండనున్నాయి.ఈ సందర్భంగా పోలీసులు పలు కీలక సూచలను జారీ చేశారు. శాంతి భద్రతలకు భంగం కలుగకుండా హోలీ షాపులు మూసివేయాలని వైన్స్ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో గొడవలు సృష్టిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.హోలీ వేడుకల్లో పాల్గొనే వారు ఇతరులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని, బహింగంగా ప్రదేశాల్లో వాహనదారులపై కలర్స్ వేసి ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించారు. -
వారణాసి : చితా భస్మంతో హోలీ వేడుకలు (చిత్రాలు)
-
పెరుగుతున్న ఫ్లైట్లు, హోటళ్ల బుకింగ్స్.. కారణం..
సాక్షి, బిజినెస్ డెస్క్ : మహా కుంభ మేళా హడావిడి ముగిసిన తర్వాత పర్యాటకానికి హోలీ పండుగ రూపంలో మరో కొత్త దన్ను దొరికింది. శుక్రవారం నాడు హోలీ కావడంతో సుదీర్ఘ వారాంతపు సెలవులొస్తున్న నేపథ్యంలో టూరిజానికి డిమాండ్ పెరిగింది. వివిధ ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీల డేటా ప్రకారం గత సీజన్‌తో పోలిస్తే ఫ్లయిట్ బుకింగ్స్ 25–30 శాతం ఎగిశాయి. అలాగే హోటల్ బుకింగ్స్ కూడా 20–30 శాతం పెరిగాయి.ఇక వీటితో పాటు ప్రయాణికులను ఆకట్టుకునేందుకు విమానయాన సంస్థ డిస్కౌంట్లు, ప్రమోషనల్ ఆఫర్లు ఇస్తున్నప్పటికీ చార్జీలు సైతం పెరిగాయి. దేశీ ప్రయాణాలకు సంబంధించి చార్జీలు సగటున 12–18 శాతం, అంతర్జాతీయ రూట్లలో చార్జీలు 8–14 శాతం పెరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి సందర్భాల్లో వీలైనంత ముందుగా ట్రావెల్ ప్రణాళికలు వేసుకోవాలంటూ కస్టమర్లకు సూచిస్తున్నట్లు వివరించాయి. లగ్జరీ హోటళ్లలో టారిఫ్‌లు జూమ్.. ఇక హోటళ్ల విషయం తీసుకుంటే, సాధారణ వీకెండ్ బుకింగ్స్‌తో పోల్చినప్పుడు లగ్జరీ, ప్రీమియం ప్రాపర్టీల్లో గదుల రేట్లు 30–40 శాతం పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. అదే స్టాండర్డ్ హోటళ్లలో చూస్తే ధరల పెరుగుదల 15–20 శాతం మేర ఉన్నట్లు వివరించాయి. జైపూర్, ఉదయ్‌పూర్, వారణాసి, గోవా, అలీబాగ్, లోనావాలా, రిషికేష్, కూర్గ్, కేరళ వంటి డెస్టినేషన్లలో హోటల్ గదుల బుకింగ్స్ 25–30 శాతం పెరిగాయి.కుటుంబాలు, ఫ్రెండ్స్ బృందాలు ఎక్కువగా ప్రైవేట్ విల్లాలు, లగ్జరీ హోటళ్లు, ప్రీమియం రిసార్టులవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో లగ్జరీ ప్రాపర్టీలు, ప్రైవేట్ విల్లాల బుకింగ్స్ సాధారణ వీకెండ్స్‌తో పోలిస్తే 40–50 శాతం పెరిగాయి. రాజస్థాన్, గోవాతో పాటు ప్రధాన మెట్రోలకు సమీపంలో ఉన్న హిల్ స్టేషన్లలో చాలా మటుకు ప్రీమియం, లగ్జరీ హోటల్స్ ఇప్పటికే 70–80 శాతం బుక్ అయిపోయాయి.కొన్ని రిసార్టుల్లో ఇప్పటికే ఆక్యుపెన్సీ పూర్తి స్థాయికి చేరినట్లు జోస్టెల్ సంస్థ వివరించింది. కాక్స్ అండ్ కింగ్స్ ప్రకారం జైపూర్, వారణాసి, రిషికేష్, గోవాలాంటి ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలు, హోటల్ బుకింగ్స్‌కి భారీ డిమాండ్ నెలకొంది. ఇక అంతర్జాతీయంగా చూస్తే దుబాయ్, సింగపూర్, బ్యాంకాక్లాంటివి ఫేవరెట్ డెస్టినేషన్లుగా ఉంటున్నాయి. ఎయిర్‌లైన్స్ ప్రత్యేక ఆఫర్లు..హోలీ అనంతరం కూడా ప్రయాణాలకు డిమాండ్ భారీగా పడిపోకుండా విమానయాన సంస్థలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆకాశ ఎయిర్, ఇండిగో తదితర సంస్థలు పరిమిత కాలం పాటు డిస్కౌంట్లు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. పౌర విమానయాన శాఖ డేటా ప్రకారం ఫిబ్రవరి ఆఖరు వారంలో నమోదైన 5.2 లక్షల మంది రోజువారీ విమాన ప్రయాణికుల సంఖ్య మార్చి తొలి రెండు వారాల్లో సుమారు 4.8 లక్షల ప్యాసింజర్లకు పడిపోయినప్పటికీ.. వార్షికంగా చూస్తే మాత్రం మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. -
మాదాపూర్ వేదికగా హోలినేషన్ 2025 వేడుకలో కాజల్ అగర్వాల్ (ఫొటోలు)
-
కర్నూలు జిల్లా: స్త్రీ వేషధారణలతో రథి మన్మథులకు పురుషుల పూజలు (ఫోటోలు)
-
విజయవాడలో హోలీ సందడి (ఫోటోలు)
-
అయోధ్య బాల రామ్ ప్రత్యేక ఆకర్షణ బోర్డర్ లో హోలీ సంబరాలు
-
కర్నూలు జిల్లా సంతేకుళ్లారు గ్రామంలో వెరైటీగా హోలీ పండగ
-
హోలీ వేళ సీఎం యోగి రుద్రాభిషేకం!
హోలీ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించారు. సీఎం యోగి పలు సందర్భాల్లో శివుణ్ణి పూజిస్తుంటారు. తరచుగా కాశీకి వెళ్లి విశ్వనాథునికి పూజలు నిర్వహిస్తుంటారు. సీఎం యోగి తాజాగా చేసిన ఒక పోస్ట్‌లో గడచిన ఏడు సంవత్సరాలలో రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావడంలో విజయం సాధించామన్నారు. ఈ 7 సంవత్సరాలు ‘న్యూ ఉత్తర ప్రదేశ్ ఆఫ్ న్యూ ఇండియా’ను సృష్టించేందుకు కృషి చేశామన్నారు. #WATCH | Uttar Pradesh CM Yogi Adityanath performs 'Rudra Abhishek' in Gorakhnath temple, Gorakhpur pic.twitter.com/RA4r1oJDHG — ANI UP/Uttarakhand (@ANINewsUP) March 25, 2024 ప్రజా సంక్షేమ బాటలో నడుస్తూ, రాష్ట్ర ప్రజల కలలను నెరవేర్చడానికి డబుల్ ఇంజన్ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నదన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రజల సహకారం లభిస్తున్నదని, అందుకు వారికి కృతజ్ఞతలు. హ్యాపీ హోలీ’ అని పేర్కొన్నారు. आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के प्रेरणादायी मार्गदर्शन में उत्तर प्रदेश की 25 करोड़ जनता की सेवा, सुरक्षा और समृद्धि के संकल्प को आज 07 वर्ष पूरे हो रहे हैं। इन 07 वर्षों में सबका साथ-सबका विकास के मंत्र के माध्यम से हर व्यक्ति के जीवन में सकारात्मक परिवर्तन लाने… — Yogi Adityanath (मोदी का परिवार) (@myogiadityanath) March 25, 2024 -
మోదీ వాటర్ గన్లపై కాంగ్రెస్ ఆగ్రహం
హోలీ వేడుకలకు రాజకీయ రంగు పులుముకుంది. దేశంలోని పలు ప్రాంతాలలో ప్రధాని మోదీ చిత్రాలతో కూడిన వాటర్ గన్లు కనిపిస్తున్నాయి. వీటిని వినియోగిస్తూ జనం హోలీ వేడుకలు చేసుకుంటున్నారు. అయితే ఈ వాటర్ గన్ల వినియోగంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో, కమలం గుర్తు కలిగిన వాటర్ గన్లు విరివిగా విక్రయమవుతున్నాయి. ఇది కాంగ్రెస్ నేతలను కలవరపాటుకు గురి చేస్తోంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ బీజేపీ వైఖరిపై పలు విమర్శలు చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం కంటే బ్రాండింగ్‌పై బీజేపీ దృష్టి పెట్టిందని ఆరోపించారు. మోదీ చిత్రాలతో కూడిన వాటర్ గన్స్, ఇతర హోలీ సామగ్రి తయారీకి అయ్యే ఖర్చును మోదీ ప్రభుత్వం భరిస్తున్నట్లుందని ఆయన ఆరోపించారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు మోదీ చిత్రాలతో కూడిన వాటర్ గన్లను వినియోగించరని స్పష్టం చేశారు. -
అయోధ్యలో హోలీ వేడుకలు.. రంగుల్లో రామ్‌లల్లా!
రామ్‌లల్లా అయోధ్యలోని నూతన రామాలయంలో కొలువైన దరిమిలా తన మొదటి హోలీని జరుపుకుంటున్నాడు. రంగుల పండుగ సందర్భంగా బాలరాముని మనోహర విగ్రహం పూలతో అలంకృతమయ్యింది. బాలరాముని నుదిటిపై గులాల్ పూశారు. గులాబీ రంగు దుస్తులతో రామ్‌లల్లా విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. హోలీ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు రామ్‌లల్లాను దర్శించుకునేందుకు ఆలయంలో బారులతీరారు. రంగుల పండుగ హోలీ సందర్భంగా ఆలయ ట్రస్టు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ధార్మిక నగరి అయోధ్యలో ఎక్కడ చూసినా హోలీ సందడి కనిపిస్తోంది. అయోధ్యలో గత ఏకాదశి నుంచి హోలీ వేడుకలు ప్రారంభమయ్యాయి. రామనగరిలో కొలువైన దేవతలు, రుషులకు రంగులు పూశారు. రాముని పరమ భక్తుడైన హనుమంతునికి కూడా హోలీ రంగులను పూశారు. -
Colors of Politics: నెహ్రూ నుంచి మోదీ వరకూ..
హోలీకి భారత రాజకీయాలకు మధ్య సంబంధం ఎంతో ప్రత్యేకమైనది. మొఘల్ చక్రవర్తులు, బ్రిటీష్ పాలకులు కూడా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. దేశ మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ హోలీ సందర్భంగా ప్రజల కోసం తన నివాసం తీన్ మూర్తి భవన్ తలుపులు తెరిచేవారు. నాటి ప్రధాని ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా ఢిల్లీ ప్రజలతో కలిసి హోలీ వేడుకలు చేసుకున్నారు. ఎన్నికల సంవత్సరంలో జరిగే హోలీ వేడుకలు రాజకీయాలకు మరింత ఉత్సాహాన్ని అందిస్తున్నాయి. తీన్ మూర్తి భవన్ గతంలో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నివాసంగా ఉండేది. అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ భార్య జాక్వెలిన్ భారత్‌లో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. నాటి దౌత్యవేత్త బీకే నెహ్రూ తన ఆత్మకథ ‘నైస్ గైస్ ఫినిష్ సెకండ్’లో జాక్వెలిన్ హోలీ వేడుకల్లో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావించారు. హోలీ వేడుల్లో నెహ్రూ.. 1962లో కెన్నెడీ భార్య జాక్వెలిన్ తొమ్మిది రోజుల వ్యక్తిగత పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చారు. అయితే ఆమె హోలీ రోజు తిరుగు ప్రయాణమయ్యారు. ఆరోజు ఆమె జవహర్లాల్ నెహ్రూకు వీడ్కోలు చెప్పడానికి తీన్ మూర్తి భవన్‌కు వెళ్లారు. ఆమె ఆరోజున ఫ్యాషన్ దుస్తులు ధరించారు. అక్కడ ఉన్న నాటి అమెరికన్ అంబాసిడర్ గాల్‌బ్రైత్ కుర్తా పైజామా ధరించి వచ్చారు. బికె నెహ్రూ తెలిపిన వివరాల ప్రకారం ప్రధాని నెహ్రూ హోలీ వేడుకలను ఎంతో ఇష్టపడేవారు. జాక్వెలిన్ తీన్ మూర్తి భవన్‌కు చేరుకోగానే వివిధ రంగులలో గులాల్ నింపిన చిన్న గిన్నెలను వెండి ట్రేలో ఆమె ముందుకు తీసుకువచ్చారు. నెహ్రూ.. జాక్వెలిన్ నుదుటిపై గులాల్ రాశారు. అక్కడే ఉన్న ఇందిరా గాంధీ కూడా జాక్వెలిన్‌కు రంగులు పూశారు. అనంతరం నెహ్రూ.. పాలం విమానాశ్రయంలో జాక్వెలిన్ కెన్నెడీకి వీడ్కోలు పలికారు. దేశ తొలి ప్రధాని నెహ్రూతో పాటు తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ కూడా హోలీ ఆడేవారు. తీన్ మూర్తి భవన్లో హోలీని జరుపుకునే ఈ ప్రక్రియ 1963 వరకు కొనసాగింది. 1964లో నెహ్రూ అస్వస్థతకు గురయ్యారు. ఆ సంవత్సరం అక్కడ హోలీ జరగలేదు. 1964లో ఆయన మరణానంతరం ప్రధానమంత్రి నివాసంలో హోలీ వేడుకలు నిలిచిపోయాయి. ఇందిర నివాసంలో.. ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సఫ్దర్‌జంగ్ రోడ్‌లోని ఆమె ప్రభుత్వ నివాసంలో హోలీ వేడుకలు జరిగేవి. ఆరోజు వచ్చిన అతిథులందరికీ ప్రత్యేక వంటకాలు వడ్డించేవారు. తరువాతి కాలంలో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలు తమ ఇంట్లో హోలీ ఆడేవారు. పలువురు కాంగ్రెస్ నేతలు వారి నివాసానికి చేరుకుని హోలీ వేడుకల్లో పాల్గొనేవారు. వాజపేయి, మోదీల రంగుల కేళి అటల్ బిహారీ వాజపేయి దేశ ప్రధాని అయ్యాక ఆయనకు గులాల్ పూయడానికి చాలా మంది ఆయన నివాసానికి వెళ్లేవారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ నాటి ప్రధాని వాజపేయి సమక్షంలో హోలీ వేడుకలు చేసుకున్న ఉదంతం 1999లో జరిగింది. వాజ్‌పేయి తన నివాసంలో హోలీ మిలన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో మిత్రపక్షాలే కాకుండా బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు. నాడు నేటి ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నాడు వాజ్‌పేయి, మోదీ పరస్పరం రంగులు పూసుకున్నారు. అప్పటి కేంద్ర మంత్రి విజయ్ గోయల్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అద్వానీ ఇంట్లో నీళ్లతో హోలీ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ ఇంట్లో నీళ్లతో హోలీ ఆడేవారు. నాటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం హోలీ వేడుకలను మానసిక వికలాంగ చిన్నారుల మధ్య జరుపుకునేవారు. ఇందులో రంగులు, గులాల్ బదులు పూలు జల్లుకునేవారు. ఢిల్లీలోని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారిక నివాసంలో కూడా హోలీ వేడుకలను ఉత్సాహంగా జరుగుతుంటాయి. పాత ఢిల్లీ వీధుల్లో ఉరిమే ఉత్సాహం పాత ఢిల్లీ వీధుల్లో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. ఇందులో అధికార, ప్రతిపక్షాలకు అతీతంగా నేతలంతా ఒకరినొకరు కలుసుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. నేటి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. తాజాగా ఆయన దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో నూతన చైతన్యం, ఉత్సాహం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. -
HOLI 2024: జీవితం వర్ణమయం
మానవ జీవితం రంగుల మయం. ఆ మాటకొస్తే అసలీ ప్రపంచమే రంగులమయం. ఎందుకంటే మన జీవనవిధానమే రకరకాల రంగులతో మమేకమై ఉంది. ఇంద్రధనుస్సులో ఏడు రంగులు ఉంటే ప్రకృతిలో వేనవేల రంగులున్నాయి. ఈ ప్రకృతిలోని రంగులన్నీ జీవన తత్త్వాన్ని బోధిస్తాయి. ఆ రంగులతో చేసుకునే సంబరమే హోలీ. అందుకే హోలీని ఆలయాలలో కూడా ఒక వేడుకగా... ఉత్సవంగా నిర్వహిస్తారు. చిగురించే మోదుగులు. పూసే గురువిందలు. పరిమళించే మల్లెలు. మొగ్గలు తొడిగే మొల్లలు... రాలే పొగడ పుప్పొడి రేణువులు. చిందే గోగు తేనెలు. గుబాళించే గోరింట పూలు. ఎర్రని చివుళ్లతో మామిళ్లు... తెల్లని పూతాపుందెతో వేప చెట్లు... ఇందుకే కదా కవులు కీర్తించేది... వసంతాన్ని రుతువులకే రారాజని! మధుమాస వేళలో జరిగే వసంతోత్సవాన్ని భారతదేశమంతటా ఘనంగా జరుపుకుంటుంది. గతంలో రాజు, పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఈ రంగునీళ్లను ఒకరిపై ఒకరు చల్లుకొని సంతోషించేవారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని హోళీ జరుపుకుంటారు. ఫాల్గుణ మాసం పూర్ణిమనాడు జరుపుకునే పండుగ కనుక ఫాల్గుణోత్సవమని... వసంత రుతువును స్వాగతించే వేడుక కాబట్టి వసంతోత్సవమని పిలుచుకుంటాం. హోళీ పర్వదినం వెనుక చాలా పురాణ కథలు ఉన్నాయి. యోగనిష్ఠలో ఉన్న పరమేశ్వరుడికి తపోభంగం కలిగించమని దేవతలందరూ మన్మథుడిని కోరడంతో ఆయన శివుడి మీదకు తన పూలబాణాలను ప్రయోగిస్తాడు. ఆ బాణాల తాకిడికి ధ్యాన భంగం అయిన శివుడు ఆగ్రహంతో తన మూడో కంటిని తెరచి మన్మథుడిని మసి చేస్తాడు. మదనుడి భార్య రతీదేవి తనకు పతి భిక్ష పెట్టవలసిందిగా ప్రాధేయపడటంతో బోళా శంకరుడు కరిగిపోయి మన్మథుడు.. రతీదేవికి మాత్రమే శరీరంతో కనిపించేలా వరమిచ్చాడు. అలా మళ్లీ మన్మథుడు రతీదేవికి దక్కాడు. ఈ పండుగ జరుపుకోవడానికి ఈ కథ ఓ కారణమైందని విశ్వసిస్తారు. అన్నింటికీ మించి హోలీ పండుగ పుట్టుకకు మరో కథను చెబుతారు. శ్రీకృష్ణుడు నల్లనివాడు, రాధ మేలిమి బంగారం. ఓరోజున వారిద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వనవిహారం చేస్తుండగా రాధ చేతిపక్కన ఉన్న తన చేయి నల్లగా ఉండటం చూసి దిగులు పడ్డాడట కృష్ణుడు. కన్నయ్య విచారానికి కారణం తెలుసుకున్న యశోదమ్మ ‘నాయనా! రాధమ్మ అసలు రంగు తెలియకుండా నువ్వు ఆమె ఒంటినిండా రంగులు కలిపిన నీళ్లు పోయి’ అని సలహా ఇచ్చిందట. అమ్మ మాట మేరకు నల్లనయ్య రాధమీద రంగునీళ్లు పోశాడట. ఈ హఠాత్పరిణామానికి విస్తుపోయిన రాధ తను కూడా కృష్ణుని మీద రంగులు కలిపిన నీరు చిలకరిస్తూ కృష్ణునికి అందకుండా ఉద్యానవనం నుంచి బయటకు పరుగులు తీసిందట. రాధాకృష్ణులిద్దరూ ఇలా ఒకరి మీద ఒకరు రంగునీళ్లు పోసుకోవడం చూసిన పురజనులు... ఆనందోత్సాహాలతో రంగుల పండుగ చేసుకున్నారట. ఆనాడు ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ. నాటినుంచి ప్రతి ఫాల్గుణ పున్నమినాడు ప్రజలందరూ ఒకరినొకరు రంగులతో ముంచెత్తుకోవడం, పెద్దఎత్తున పండుగలా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. పైన చెప్పుకున్న కథల నుంచి మనం గ్రహిం^è వలసినది ఏమిటంటే... మనందరమూ మనుషులమే కాబట్టి ఏదో ఒక లోపం ఉండితీరుతుంది. అలాంటి లోపాలను తీసుకు వచ్చే దుర్గుణాలను దూరం చేసుకోవడం అవసరం. అన్ని రంగులు ఉంటేనే.. ప్రకృతికి అందం. అందరిని కలుపుకుంటేనే మనసుకి అందం. అన్ని ఆలోచనలను పరిగణించి, చక్కని దారిన కలిసి నడిస్తేనే మనిషికి అందం. హోళీ రోజున ఒకరిపై ఒకరు చల్లుకునేవి రంగులు కావు. అనురాగ ఆప్యాయతలు కలసిన పన్నీటి పరిమళ జల్లులు. హోలీ పండుగను వసంత రుతువు వస్తోందనడానికి సంకేతంగా భావిస్తారు. వసంతకాలం అంటే చెట్లు చిగిర్చి పూలు పూసే కాలం కదా! అంటే మనలో ఉన్న దుర్గుణాలనే ఎండుటాకులను రాల్చేసి, వాటి స్థానంలో ఉల్లాసం, ఉత్సాహం, ప్రేమ, అనే సుగుణాలతో కూడిన ఆకులను చిగురింప చేసుకోవాలి. మన్మథుడు అంటే మనస్సును మథించేవాడని అర్థం. మనిషిలో దాగి ఉన్న కామక్రోధలోభమోహమదమాత్సర్యాలనే ఆరు అంతః శత్రువులు మనస్సును మథిస్తాయి. వాటినే అరిషడ్వర్గాలు అంటారు. మనిషిని పతనం చేసే ఈ ఆరుగుణాలనూ అదుపులో ఉంచుకోవాలని చెప్పేందుకే పరమేశ్వరుడు కామదేవుడిని భస్మం చేశాడు. రూపం కోల్పోయిన మన్మథుడు ఆనాటి నుంచి మనుషుల మనస్సులలో దాగి ఉండి అసలు పని నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకునేందుకే, ఈశ్వరుడు కాముణ్ణి భస్మం చేసిన రోజైన ఫాల్గుణ శుద్ధపూర్ణిమకు ముందురోజు, గ్రామాలలో కామదేవుని ప్రతిమను తయారుచేసి, ఊరేగింపుగా తీసుకెళతారు. యువకులంతా కలిసి కామదహనం చేస్తారు. ఇది ఆనవాయితీగా వస్తోంది. మన జీవితాలలో అనేక విధాలైన అలకలు, కినుకలు, అసంతృప్తులు, కోపాలు, తాపాలు, ఆవేశకావేశాలు, అలజడులు, అపశ్రుతులు, తడబాట్లు, ఎడబాట్లు ఉండొచ్చు. అందువల్ల ఈ హోళీ రోజు మనకు దగ్గరగా ఉన్న వారితోనే మాట, ఆట కాకుండా.... మనసుకు దగ్గర అయిన బంధు మిత్రులతో, మనవల్లో, వారి వల్లో ఏర్పడిన మానసిక దూరాన్ని తగ్గించుకుని, మనమే ముందుగా ఒక అడుగు వేసి అందరినీ దగ్గర చేసుకుని జీవితాలను వర్ణమయం... రాగ రంజితం చేసుకుందాం. హోలీ పర్వదినాన్ని అందరూ ఆప్యాయతతో కలిసే రంగుల రోజుగా మార్చుకుందాం. – డి.వి.ఆర్. భాస్కర్ -
ప్రధాని మోదీ వాటర్ గన్లకు ఆదరణ!
రంగుల పండుగ హోలీకి దేశవ్యాప్తంగా సన్నాహాలు ఊపందుకున్నాయి. కొన్ని చోట్ల మార్కెట్లలో పండుగ కొనుగోళ్లు జరుగుతుండగా, మరోవైపు పూలతో ఇళ్లను అలంకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు మార్కెట్లలో కొనుగోలుదారుల రద్దీ పెరిగింది. ఈ హోలీ సందర్భంగా ప్రధాని మోదీ చిత్రాలతో కూడిన వాటర్ గన్లకు డిమాండ్ మరింతగా పెరిగింది. యూపీ, ఎంపీలతో సహా అనేక రాష్ట్రాల మార్కెట్లలో జనం మోదీ మాస్క్‌లను, వాటర్ గన్లను కొనుగోలు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల వాతావరణానికి ఈ హోలీ వేడుకలు తోడై ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి, ప్రధాని మోదీ చిత్రాలతో కూడిన వాటర్‌గన్‌ను జనం విరివిగా కొనుగోలు చేస్తున్నారు. దేశంలోని ఈశాన్య ప్రాంతం నుంచి దక్షిణాది వరకు అంతటా హోలీ సందడి కనిపిస్తోంది. అసోంలోని గౌహతిలో జనం ఉత్సాహంగా షాపింగ్ చేస్తున్నారు. కేరళలోని తిరువనంతపురంలో హోలీ సందర్భంగా పలువురు నృత్యాలు చేస్తూ కనిపిస్తున్నారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో వివిధ దేశాల రాయబారులు పూలతో హోలీ వేడుకలు చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో దివ్యాంగుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వారణాసిలోని ప్రసిద్ధ అస్సీ ఘాట్‌లో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
Holi 2024 Celebrations Photos: ఉత్తరాదిలో రంగుల హోలీ పండుగ సంబురాలు (ఫొటోలు)
-
ఆ గ్రామం.. హోలీకి దూరం!
ప్రస్తుతం దేశమంతా హోలీ సన్నాహాల్లో మునిగితేలుతోంది. అయితే మన దేశంలో హోలీ వేడుకలు చేసుకోని ఒక గ్రామం ఉంది. పైగా ఆ గ్రామంలో హోలీనాడు పిండివంటలు కూడా చేసుకోరు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? బీహార్‌లోని ఆ గ్రామంలో గత 250 ఏళ్లుగా హోలీ వేడుకలు చేసుకోరు. అదే ముంగేర్ జిల్లాలోని సజువా గ్రామం. హోలీ వేడుకలు చేసుకుంటే గ్రామంలో విపత్తులు సంభవిస్తాయని ఇక్కడి ప్రజలు నమ్ముతుంటారు. అందుకే ఇక్కడివారంతా రంగుల పండుగకు దూరంగా ఉంటారు. ఈ గ్రామంలో సుమారు రెండువేల మంది నివసిస్తున్నారు. వీరంతా హోలీ వేడుకలు చేసుకోరు. ఈ గ్రామంలో హోలీనాడు ఏదైనా పిండివంటకం చేసుకున్నట్లయితే ఆ కుటుంబానికి ఆపదలు ఎదురవుతాయని ఇక్కడి ప్రజలు చెబుతుంటారు. ఈ గ్రామాన్ని సతీ గ్రామం అని కూడా పిలుస్తారు. సుమారు 250 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో ఒక విషాద ఘటన చోటుచేసుకుందని స్థానికులు చెబుతుంటారు. అయితే ఈ గ్రామంలోని వారు ఏప్రిల్ 14న హోలికా దహనం జరుపుకుంటారు. తమ గ్రామంలో ఎవరూ హోలీ చేసుకోరని గ్రామానికి చెందిన చందన్ కుమార్ తెలిపారు. ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని గ్రామంలోని అందరూ పాటిస్తున్నారని ఆయన తెలిపారు. -
కేజ్రీవాల్ అరెస్టుకు నిరసన.. హోలీకి దూరం
అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసినందుకు నిరసనగా 'హోలీ' జరుపుకోమని పార్టీ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు ఢిల్లీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను కలవకుండా అడ్డుకున్నారని విలేకరుల సమావేశంలో రాయ్ పేర్కొన్నారు. శనివారం ఉదయం 10 గంటలకు.. ఆప్ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, ఆఫీస్ బేరర్లు, ఇండియా బ్లాక్ ప్రతినిధులందరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేస్తారు. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్దేవ్ల అమరవీరుల దినోత్సవమైన శనివారం షాహీదీ పార్క్‌లో సమావేశమవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా హాజరవుతారని ఆయన తెలిపారు. మార్చి 24న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలను దహనం చేస్తామని, మార్చి 25న హోలీ రోజున ఎలాంటి కార్యక్రమం నిర్వహించబోమని, మార్చి 26న ప్రధాని నివాసాన్ని చుట్టుముడతామని రాయ్ తెలిపారు. ఆప్ జాతీయ కన్వీనర్ అరెస్టుకు వ్యతిరేకంగా భారత కూటమి సభ్యుల మధ్య చర్చల అనంతరం త్వరలో ఉమ్మడి ఉద్యమం ప్రకటిస్తామని కూడా ఆయన చెప్పారు. -
వింత హోలీ వేడుకలు.. పురుషులు కనిపిస్తే ‘బాదుడే’!
దేశంలో పలు పండుగలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయ రీతిలో జరుగుతుంటాయి. హోలీ విషయంలోనూ ఇదేవిధంగా కనిపిస్తుంటుంది. సాధారణంగా మహిళల కన్నా పురుషులు హోలీ వేడుకల్లో అత్యంత ఉత్సాహాన్ని కనబరచడం చూస్తుంటాం. కానీ యూపీలోని ఒక ప్రాంతంలో దీనికి భిన్నంగా జరుగుతుంటుంది. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో హోలీ మర్నాడు స్త్రీలు తమ ప్రత్యేక హోలీని జరుపుకుంటారు. ఆరోజు అక్కడ మహిళలదే రాజ్యం. పురుషులెవరూ గ్రామంలో కనిపించరు. పిలిభిత్ నగరంలోని మధోతండా ప్రాంతంలో ఈ ప్రత్యేక సంప్రదాయం కనిపిస్తుంది. హోలీ మర్నాడు ఈ ప్రాంతంలోని మహిళలంతా గుంపులు గుంపులుగా తిరుగుతూ హోలీ వేడుకలు చేసుకుంటారు. ఆ రోజున స్థానిక మహిళలు హోలీ సంప్రదాయ పాటలు పాడుతూ రోడ్లపై తిరుగుతారు. పాదచారులు, వాహనదారుల నుంచి చందాలు సేకరిస్తారు. ఆ రోజున గ్రామంలోని పురుషులంతా తమ ఇళ్లలో దాక్కుంటారు. లేదా ఊరి బయట ఎక్కడైనా తలదాచుకుంటారు. పిలిభిత్ నగర చరిత్రపై పరిశోధనలు సాగిస్తున్న సీనియర్ జర్నలిస్టు డాక్టర్ అమితాబ్ అగ్నిహోత్రి మీడియాతో మాట్లాడుతూ మధోతండాలో మహిళలు జరుపుకునే హోలీకి శతాబ్దాల చరిత్ర ఉందన్నారు. మాధోతండా అనేది అడవి అంచున ఉన్న ప్రాంతం. పూర్వం రోజుల్లో హోలీ మరుసటి రోజున పురుషులు వేటకు వెళ్లేవారు. ఈ రోజున మహిళలు ఒకచోట చేరి హోలీ ఆడుకునేవారు. క్రమేణా ఈ హోలీ సంప్రదాయ రూపాన్ని సంతరించుకుంది. ఇప్పుడు వేటతో పాటు అడవిలోకి వెళ్లడాన్ని నిషేధించినందున స్థానికంగా ఉన్న మగవారు ఆ రోజున గ్రామాన్ని విడిచిపెట్టి బయటకు వెళతారు. తండాలో మహిళలు హోలీ ఆడే సమయంలో వారికి పురుషులెవరైనా ఎదురైతే వారి నుండి భారీగా చందా వసూలు చేస్తారు. -
హోలీ రాకుండానే యువకుల హంగామా!
రంగుల పండుగ హోలీ మరికొద్ది రోజుల్లో రానుంది. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే హోలీ రాకుండానే కొందరు యువకులు రోడ్డుపై వెళ్తున్న వారిపై వాటర్ బెలూన్లు విసురుతున్న ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యువకుల చేష్టలకు బలైనవారితో పాటు ఈ వీడియో చూసిన వారంతా ఆ కుర్రాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలాంటివారిపై పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు యువకులు నీరు నింపిన కొన్ని బెలూన్లను పట్టుకున్నట్లు కనిపిస్తుంది. కారులో వెళుతున్నవారు సన్‌రూఫ్ నుండి ఆ బెలూన్లను రోడ్డుపై వెళుతున్న వారిపైకి విసరడం వీడియోలో కనిపిస్తుంది. కాగా అదే రోడ్డుపై ఆ కారును వెంబడిస్తున్న మరో కారులోని వ్యక్తి ఈ ఉదంతాన్ని ఈ వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్)లో @gharkekalesh అనే పేజీలో షేర్ అయ్యింది. ఈ వీడియోను ఇప్పటి వరకూ 9 లక్షల 94 వేల మంది వీక్షించారు. ఈ వీడియోను చూసిన ఒక యూజర్ ‘ఇలా చేయడం తప్పు. వీరిపై చర్య తీసుకోవాలి’ అని రాశారు. మరొక యూజర్ ‘ఆ కారు నంబర్‌ను చూసి, పోలీసులకు ట్యాగ్ చేయాలి’ అని కోరాడు. Water-Balloon Kalesh (On 16.03.24 in vasant kunj New Delhi, these two boys throwing random water balloons on people and ladies too on the street) pic.twitter.com/2rU5jLe4f6 — Ghar Ke Kalesh (@gharkekalesh) March 19, 2024 -
యూపీ ఉద్యోగులకు యోగీ సర్కారు హోలీ కానుక!
ఈ నెల 25న దేశ వ్యాప్తంగా హోలీ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలోనే ఉత్తరప్రదేశ్ ఉద్యోగులకు యూపీ సర్కారు శుభవార్త వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏను నాలుగు శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఈ డీఏ పెంపుదల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు వర్తించనుంది. యూపీలో దాదాపు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. వీరందరికీ ఇప్పుడు ప్రయోజనం చేకూరనుంది. డీఏ పెంపునకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ కరువు భత్యం పెంపునకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. దీంతో ఉద్యోగుల టేక్ హోమ్ జీతం కూడా పెరగనుంది. ఈ డియర్నెస్ అలవెన్స్ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.314 కోట్ల అదనపు భారం పడనుంది. -
అక్కడి యూనివర్సిటీల్లో హోలీ వేడుకలు నిషేధం..
విశ్వవిద్యాలయాల్లో హోలీ వేడుకల్ని నిషేధిస్తూ పాకిస్థాన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ దేశ ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వేడుకల కారణంగా సామాజిక సంస్కృతిక విలువలు దెబ్బతింటున్నాయని పేర్కొంది. దేశానికి ఉన్న ఇస్లామిక్ గుర్తింపునకు భంగం వాటిల్లుతుందని స్పష్టం చేసింది. క్వాయిడ్-ఐ-అజామ్ విశ్వవిద్యాలయంలో జూన్ 12న హోలీ వేడుకలు జరిగిన వీడియోలు నెట్టింట వైరల్ కాగా విద్యా మండలి ఈ నిర్ణయం తీసుకుంది. 'వివిధ రకాల మత విశ్వాసాలు, ఆచారాలతో కూడిన వైవిధ్యత ఇతర మతాలను గౌరవించే సమాజాన్ని సృష్టిస్తుంది. ఈ రకమైన సమాజాన్ని అందరూ కోరుకుంటారు. ఈ వాస్తవాన్ని మేము గౌరవిస్తున్నాం. కానీ ఈ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నాం' అని విద్యామండలి ఉత్తర్వుల్లో పేర్కొంటూ హోలీ వేడుకలను నిషేధించింది. Holi celebrations in Quaid-I-Azam University Islamabad Pakistan 🍁 Biggest holi celebration in Pakistan 💓 pic.twitter.com/xdBXwYEglt — QAU News (@NewsQau) June 13, 2023 క్వాయిడ్-ఐ-అజామ్ విశ్వవిద్యాలయంలో హోలీ వేడుకలు ఈసారి ఘనంగా జరిగాయి. వీటిని యూనివర్సిటీకి చెందిన సంస్కృతిక సంస్థ నిర్వహించింది. ఇవి కాస్త వైరల్ కాగా విద్యా మండలి ఈ నిర్ణయం తీసుకుంది. పంజాబ్ యూనివర్సిటీ ప్రాంగణంలో మార్చి నెలలో హోలీ వేడుకలు జరుపుతున్న హందూ విద్యార్థులపై ఇస్లామిక్ స్టుడెంట్ ఆర్గనైజేషన్ దాడులు జరిపింది. ఇందులో 15 మంది హిందూ విద్యార్థులు గాయపడ్డారు. Holi celebrations Quaid-i-Azam University Islamabad 🖤 🥀#QAU_ISLAMABAD #holi #holi2023 pic.twitter.com/CHVkY5NL1m — QAU News (@NewsQau) June 19, 2023 ఇదీ చదవండి: ముంబై దాడుల ప్రధాన సూత్రధారికి అండగా నిలిచిన చైనా -
హవ్వా! రోడ్డు మీద ఇదేం పని.. హద్దులు మీరిన ప్రేమ జంట
సమాజంలో నివసిస్తున్నప్పుడు కొన్ని నియమాలు నిబంధనలు, కట్టుబాట్లు ఉంటాయి. వాటిని అనుసరిస్తూ ప్రజలు జీవితం సాగించాల్సి ఉంటుంది. అయితే కొందరు మాత్రం ఇవేమి తమకు పట్టవంటూ విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తూ నలుగురిలో నవ్వులు పాలవతుంటారు. తాజాగా ఓ ప్రేమికులు బైక్‌పై ప్రయాణిస్తూ రోడ్డు మీద హద్దులు మీరి ప్రవర్తించిన వింత ఘటన రాజస్థాన్‌లో జైపూర్‌లో చోటచేసుకుంది. ఆ వీడియోలో.. హోలీ జరుపుకున్న అనంతరం ఓ జంట బైక్‌పై రొమాన్స్ చేస్తూ కెమెరాకు చిక్కింది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చొన్న లవర్.. ప్రేమికుడిని హగ్ చేసుకోని కూర్చుని రోడ్డుపై ప్రయాణిస్తూ ఉంది. దీనంతటిని వెనుక కారులో ఉన్న ఓ వ్యక్తి రికార్డు చేస్తున్నాడు. ఇదంతా తెలిసినా ఆ జంట ఏ మాత్రం భయపడకుండా వారి పనిలో వారు ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ జంట ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు పోలీసులు గుర్తించారు. వాహనదారుడి నిర్లక్ష్యం, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు ట్రాఫిక్ పోలీసులు మార్చి 7న మోటారు వాహనాల చట్టం 1988, రాజస్థాన్ మోటారు వాహనాల చట్టం 1990 ప్రకారం మోటారుబైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆ జంటకు రూ. 5,000 జరిమానా కూడా విధించారు పోలీసులు. -
హోలీ వేడుకల్లో సందడి చేసిన యూఎస్ అత్యున్నత అధికారి
ఢిల్లీలోని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారిక నివాసంలో బుధవారం హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు జైశంకర్, కిరణ్ జిజు తోపాటు యూఎస్ అత్యున్నత అధికారి గినా రైమోండో పాల్గొన్నారు. ఆమె ముఖానికి రంగులు పులుముకుని, ఓ దండ ధరించి డ్రమ్ బీట్లకు లయబద్ధంగా స్టెప్లు వేసి సందడి చేశారు. ఆ వేడుకలో కృష్ణుడి వేషధారణలో ఒక కళాకారుడు అక్కడున్న ప్రేక్షకులను బాగా అలరించాడు. కాగా, ఇండో యూఎస్ సీఈవో ఫోరమ్‌లో పాల్గొనేందుకు యూఎస్ వాణిజ్య కార్యదర్శి రైమోండో న్యూఢిల్లీ వచ్చారు. ఆమె మార్చి 7 నుంచి 10 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. ఈమేరకు ఆమె భారత్ యూఎస్‌ల మధ్య కొత్త వాణిజ్య, పెట్టుబడి అవకాశాలకు మార్గం సుగమం చేసేలా వివిధ రంగాల సహకారంపై చర్చిస్తారు. గతేడాది యూఎస్ ఇండియా సీఈవో ఫోరమ్‌ను కేంద్ర మంత్రి పియూష్ గోయల్, ఎంఎస్ రైమోండో గత నవంబర్లోనే ప్రారంభించారని యూఎస్ వాణిజ్య విభాగం పేర్కొంది. (చదవండి: నేవీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్) -
గోగుపూల హోలీ.. ప్రతీ పండుగ ప్రకృతితో మమేకమే!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రతీ పండుగ ప్రకృతితో మమేకమే. కాలక్రమేణా ప్రకృతిని వీడి ఆధునికత వైపు పరుగులు తీస్తూ.. పండుగల్లోని సహజ వేడుకలకు కృత్రిమ రంగులను అద్దుతున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేటికీ కొన్ని సంప్రదాయ అలవాట్లు అలాగే సజీవంగా కొనసాగుతున్నాయి. అలాంటి వాటిలో హోలీ పండుగ కూడా ఒకటి. ఈ పండుగకు కొంతమంది నేటికీ రంగుల కోసం మోదుగు పూలనే వాడుతున్నారు. ఈ పూలు హోలీ పండుగకు ముందే అడవుల్లో చెట్ల నిండా పూలతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ పూలు తెచ్చుకునే రంగులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గోగుపూల రంగులు ఎక్కువమందికి చేరేలా నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి విజయలక్ష్మి ఓ యత్నం చేశారు. మోదుగు పూలను సేకరించి.. పదిహేను రోజుల క్రితం ఉపాధి కూలీలతో స్థానిక అడవిలో మోదుగు పూలను సేకరించారు. వాటి పూల కాడలను తీసి శుభ్రపరిచారు. తేమ పోయేలా ఎండలో ఆరబెట్టారు. ఆ తర్వాత గిర్నీలో మర పట్టించి, పొడిలా మార్చారు. ఆ పొడిలో కొద్దిగా పచ్చకర్పూరం కలిపి, ప్యాకెట్లలో నింపారు. ఇప్పటికి పదిహేను కిలోల మోతాదులో సేకరించారు. ఆ పొడిని కొద్దిగా నీటిలో వేసుకుని మరిగిస్తే ఆరెంజ్ కలర్ రంగు వస్తుంది. ఈ రంగును నీటిలో కావాల్సినంత మేర కలుపుకొని హోలీ వేడుకల్లో చల్లుకునేందుకు వాడుకోవచ్చు. జిల్లాలోని ప్రభుత్వశాఖల అధికారులకు ఉచితంగా అందజేశారు. రసాయనాలు లేని ఈ సహజ రంగులతో ఎలాంటి చర్మ, అనారోగ్య సమస్యలు తలెత్తవు. చిన్నా, పెద్దా అందరూ ఈ సహజ రంగులను వాడుకోవచ్చని చెబుతున్నారు. వచ్చే ఏడాది మార్కెట్లోకి.. గతంలో చాలామంది ఈ మోదుగు పూలను హోలీ రంగుల్లో వాడేవారు. ప్రస్తుతం తగ్గిపోయింది. మళ్లీ అందరికీ సహజ సిద్ధ రంగును వాడేలా చేసేందుకు ఈ పొడిని తయారు చేశాం. వచ్చే ఏడాదికి మార్కెట్లో అందుబాటులో ఉండేలా చేస్తాం. దీని ద్వారా మహిళా సంఘాలకు ఆదాయం కల్పించవచ్చు. – విజయలక్ష్మి, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారిణి. -
Hyderabad: తాగునీటి సరఫరా నిలిపివేతలో స్వల్ప మార్పులు
సాక్షి, హైదరాబాద్: నగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై (జీడీడబ్య్లూఎస్ఎస్) ఫేజ్ – 1 లో సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి వద్ద చేపట్టాల్సిన గోదావరి మెయిన్ 3000 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ పైపు లైన్ బ్రిడ్జ్ పాసింగ్ – బైపాసింగ్, ఇంటర్ కనెక్షన్ పనులను 24 గంటల పాటు వాయిదా వేస్తున్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్ వెల్లడించారు. హోలీ పండగ నేపథ్యంలో నగర ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఈ నెల 8వ తేదీకి బదులు 9వ తేదీ గురువారం ఉదయం 6 నుంచి 11వ తేదీ శనివారం ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. సోమవారం ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయం నుంచి ఆయన సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి సరఫరా అంతరాయానికి సంబంధించి జీఎంలు తమ పరిధిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. దానికి అనుగుణంగా 24 గంటలు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని సూచించారు. చదవండి: రంగుల పండుగ హోలీ విశిష్టత ఇదే.. ఈ ఏడాది ఎప్పుడు జరుపుకోవాలంటే..? -
‘ నా భార్య అలిగింది, సెలవులు కావాలి సార్’.. ఎస్పీకి మొరపెట్టుకున్న ఇన్స్పెక్టర్
లక్నో: హోలీ సందర్భంగా ఫరూఖాబాద్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా, చాలా మంది పోలీసు సిబ్బంది సెలవులు రద్దయ్యాయి. అయితే, పోలీసు శాఖకు చెందిన ఓ ఇన్స్పెక్టర్ తన సమస్య విన్నవిస్తూ హోలీ సందర్భంగా 10 రోజుల సెలవు కోరారు. అయితే అతని సమస్య విని అధికారులు, పోలీసులు నవ్వుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నా భార్య అలిగింది సార్.. వివరాల్లోకి వెళితే.. ఫరూఖాబాద్‌లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్న ఓ ఇన్స్పెక్టర్ హోలీ పండుగ నేపథ్యంలో సెలవు కోరుతూ జిల్లా ఎస్పీకు లేఖ రాశారు. అందులో..”హోలీ రోజున నా భార్య తన పుట్టింటికి వెళ్లాలనుకుంటోంది. గత 22 ఏళ్ల నుంచి హోలీ రోజున తన పుట్టింటికి తీసుకెళ్లమని నన్ను అడుగుతోంది. కానీ ప్రతి హోలీ పండుగకు డ్యూటీ కారణంగా తనని తీసుకెళ్లడం కుదరలేదు. ఈ సారి మాత్రం పండగకి తన ఇంటికి తీసుకువెళ్లాలంటూ పట్టుబట్టింది. దీంతో ఆమె నాపై అలిగింది.. కోపంతో రగిలిపోతుంది. ఈ కారణంగా.. నాకు సెలవులు అవసరం. సర్, నా సమస్యను అర్థం చేసుకుని పది రోజలు సెలవు ఇవ్వాలని ” రాసుంది. ఈ లేఖ పోలీసు సూపరింటెండెంట్ చేరడంతో, అతను లేఖను చదివి నవ్వాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ అభ్యర్థనను పరిశీలించి ఐదు రోజుల సెలవును ఆమోదించారు. ఆ తర్వాత ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: వీడియో: పరీక్షలో చిట్టీలు అందించేందుకు వెళ్లాడు, చివరికి పోలీసులకు చిక్కి.. -
ఇది కదా ఆఫర్లు .. ఫ్లిప్‌కార్ట్ బంపర్ సేల్.. వీటిపై 80 శాతం డిస్కౌంట్!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు దారులకు శుభవార్త చెప్పింది. హోలీ సందర్భంగా బిగ్ బచత్ ధమాల్ సేల్‌తో ముందుకు వచ్చింది. మార్చి 3 నుంచి మార్చి 5 వరకు జరిగే ఈ ప్రత్యేక సేల్‌లో 1000 కి పైగా కంపెనీలకు చెందిన లక్షప్రొడక్ట్‌లపై 80 శాతం డిస్కౌంట్‌కే అందిస్తున్నట్లు తెలిపింది. మొబైల్స్, ల్యాప్ ట్యాప్స్, ట్యాబ్లెట్స్, దుస్తులు, టీవీలుపై ఆకర్షణీమైన తగ్గింపుతో వినియోగదారులకు స్పెషల్ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను పరిచయం చేస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యం తెలిపింది. ఇక పలు రిపోర్ట్‌ల ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్ ఫర్నీచర్,మ్యాట్రెసెస్, షూర్యాక్స్,వార్డ్రోబ్, పోర్టబుల్ ల్యాప్‌ట్యాప్ స్టాండ్స్‌పై భారీ డిస్కౌంట్లు అందిస్తుంది. ఇక కస్టమర్లు బెడ్రూమ్, లివింగ్ రూమ్ పర్నిచర్పై 70 శాతం డిస్కౌంట్, ప్రీమియం ప్రొడక్ట్‌లపై 60 శాతం డిస్కౌంట్లు పొందవచ్చు. హోమ్ అప్లయెన్సెస్‌పై 75 శాతం, టీవీలపై 60 శాతం, సమ్మర్ సీజన్ సందర్భంగా ఎయిర్ కండీషనర్లపై 55 శాతం డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ప్లిప్‌కార్ట్ బిగ్ బచత్ సేల్‌లో ల్యాప్‌ట్యాప్స్‌పై 45 శాతం డిస్కౌంట్ అందిస్తుండగా..యాపిల్, శాంసంగ్, పోకో, రియల్ మీ వంటి ఫోన్లపై డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. వీటితో పాటు ఫుడ్, టాయిస్, బ్యూటీ ప్రొడక్ట్స్, స్పోర్ట్స్ ఐటమ్స్, హోమ్ డెకోర్, ఫర్నీషింగ్, కిచెన్ టూల్స్‌తో పాటు ఇతర హోం ప్రొడక్ట్స్‌పై ప్రమోషనల్ ఆఫర్స్, బ్యాంక్స్, ఫిన్ టెక్ కంపెనీలు ఇచ్చే ఆఫర్స్ అందుబాటులోకి ఉన్నాయి. -
వసంతాలు విరిసేవేళ
వసంతం విచ్చేసిందని ప్రకృతి మనకు పంపించే తొలి కబురు రంగుల వేడుకైన హోలి. రాబోయే వేసవిని తట్టుకోవడానికి మన మేనిని హాయిగొలిపేలాఉంచడానికి స్వచ్ఛమైన తెలుపును పరిచయం చేసేది హోలి.ఎందుకంటే రంగుల హంగులను అందంగా ఇముడ్చుకునేది తెలుపే!ఇంద్రధనుస్సు ఎలాగూవేసుకున్న దుస్తులను అందంగా పలకరిస్తుందిపువ్వుల నవ్వుల్ని, పచ్చదనాన్నీ అద్దుతుంది. ఆ హంగులను అద్దుకున్న తెలుపు మన జీవితాలను ఆనందమయం చేస్తుంది. అందుకే, వసంతాలు విరిసేవేళా నిన్ను నేను చూశాను...అంటూతెలుపు రంగు డ్రెస్‌ల ఎంపికకు మొదటి ఓటు వేయవచ్చు. తెలుపుతోపాటు క్రీమ్ కలర్ థీమ్ ఉన్న డ్రెస్సులు ఎంతో అందాన్నీ, హాయినీ ఇస్తాయి. వీటిలో కాటన్, లినెన్, చికన్ కారీ వర్క్, ఇతర ఎంబ్రాయిడరీ లేదా చిన్న చిన్న పెయింటింగ్స్ ఉన్న డ్రెస్సులను ఎంపిక చేసుకోవచ్చు. పూర్తి వైట్ ఇష్టపడని వారు క్రీమ్ కలర్, ఇతర కాంబినేషన్ కలర్స్‌తో ఉన్న డ్రెస్సులనూ ఎంపిక చేసుకోవచ్చు. ఇండో–వెస్ట్రన్ స్టైల్ డ్రెస్సులు అన్ని పార్టీలలోనూ ప్రత్యేకంగా ఉంటాయి. -
హోలీ వేడుకలు.. ఫ్రెండ్ భార్యపై రంగు చల్లిన దోస్త్.. ఇంతలో భర్త వచ్చి..
కోల్కత్తా: రెండు రోజుల క్రితం దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలంతా రంగులు చల్లుకుని సంబురాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో కొన్ని చోట్ల ఘర్షణలు, అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. వేడుకల్లో కత్తితో పొడుచుకొని ఓ వ్యక్తి మరణించగా పశ్చిమ బెంగాల్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కోల్‌కత్తాలో సుజిత్ మల్లిక్, దిలీప్ అనే వ్యక్తులు మంచి స్నేహితులు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన దిలీప్ చౌహాన్ (45) కొన్ని సంవత్సరాల క్రితం కోల్కత్తా చేరుకుని నాటూన్పల్లిలోని తన బంధువులు నివాసం ఉంటున్న ఏరియాలోనే అద్దె ఇల్లు తీసుకుని వ్యాపారం చేస్తున్నాడు. సుజిత్ మల్లిక్ కూడా అక్కడే నివాసం ఉంటున్నారు. కాగా, హోలీ రోజున వీధిలో వీరంతా కలిసి సంబురాలు జరుపుకున్నారు. వేడుకల్లో దిలీప్ అతని స్నేహితుడు సుజిత్ మల్లిక్ భార్యపై రంగులు చల్లాడు. అది గమనించిన సుజిత్.. తన భార్యపై బలవంతంగా ఎందుకు రంగులు చల్లావని దిలీప్‌ను అడిగాడు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో తీవ్ర ఆవేశంతో సుజిత్ మల్లిక్.. దిలీప్‌ను తుపాకీతో కాల్చి చంపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం నిందితుడు పారిపోయి డైమండ్ హార్బర్ ప్రాంతంలో ఉన్నడాని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి మాలిక్‌ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్టు పేర్కొన్నారు. -
దేశంలో దుమ్మురేపిన హోలీ అమ్మకాలు, చైనాకు రూ.10వేల కోట్ల నష్టం!
దేశంలో హోలీ అమ్మకాలు సరికొత్త రికార్డుల నమోదు చేశాయి. కరోనా భయం తొలగి, ప్రజలు హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారని..తద్వారా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దేశంలో హోలీ అమ్మకాలు 30శాతం పెరిగాయని ట్రేడ్ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) వెల్లడించింది. అదే సమయంలో చైనాకు రూ.10వేలకోట్ల నష్టం వాటిల్లినిట్లు సీఏఐటీ తెలిపింది. మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న భారతదేశ రిటైల్ రంగానికి ఈ ఏడాది హోలీ అమ్మకాలు ఒక వరంలా మారాయని సీఏఐటీ తెలిపింది."హోలీ పండుగ విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే వ్యాపారంలో దాదాపు 30 శాతం వృద్ధిని నమోదు చేశాయి.అంచనా ప్రకారం..హోలీ సందర్భంగా దేశంలో సుమారు రూ.20వేల కోట్ల వ్యాపారం జరిగిందని" ట్రేడ్ బాడీ తెలిపింది. అంతేకాకుండా, ఏడాది దేశీయ మార్కెట్లో చైనా వస్తువుల అమ్మకాలు జరగలేదని స్పష్టం చేసింది. గతంలో దేశీయ మార్కెట్లో చైనా ఉత్పుత్తుల హవా ఉండేది.హోలీ వేడుకల సందర్భంగా రూ.10వేల కోట్లు జరిగేవి. కానీ ఈ ఏడాది భారత్ మార్కెట్లో చైనా ఉత్పుత్తులు అమ్మకాలు జరగలేదని సీఏఐటీ ప్రతినిధులు వెల్లడించారు. ఇక హోలీకి ప్రధానంగా రంగులు, బొమ్మలు, బెలూన్లు, హెర్బల్ కలర్స్,గులాల్, వాటర్ గన్, బెలూన్లు, చందన్, డ్రెస్ మెటీరియల్ వంటి దేశీయ వస్తువులు భారీ అమ్మకాలను నమోదు చేసుకున్నాయని చెప్పారు. మరోవైపు స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, గిఫ్ట్ ఐటమ్స్, టెక్స్టైల్స్, పువ్వులు, పండ్లు, బొమ్మలు, ఫర్నిషింగ్ ఫ్యాబ్రిక్, కిరాణా, ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు, కన్స్యూమర్ డ్యూరబుల్స్, పూజా సామాగ్రి మొదలైనవి కూడా విపరీతమైన అమ్మకాలు జరిపి భవిష్యత్తులో దేశీయ మార్కెట్‌కి మంచి రోజులొచ్చాయనే సంకేతాలిచ్చినట్లైందని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు. హోలీ రోజున మంచి అమ్మకాలను చూసిన తర్వాత దేశవ్యాప్తంగా వ్యాపారులు ఏప్రిల్-మేలో రాబోయే వివాహ సీజన్ కోసం సిద్ధమవుతున్నారు. ఇది భవిష్యత్ రోజుల్లో జరిగే వ్యాపారాలకు మరింత సహాయపడుతుందని ఆశిస్తున్నారు. దేశవ్యాప్తంగా 40వేల వాణిజ్య సంఘాలు,8 కోట్ల మంది వ్యాపారులకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు సీఏఐటీ పేర్కొంది. కరోనా నుంచి దేశం సురక్షితంగా ఉన్నందునే హోలీ వేడుకలు ఘనంగా జరిగాయని ఖండేల్వాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: ఐఫోన్ యూజర్లకు కొత్త సమస్య! యాపిల్‌పై ఆగ్రహం..! -
హోలీ వేడుకల్లో అపశృతి.. ఆడుకుందామని బయటికి పిలిచి..
సాక్షి,బంజారాహిల్స్(హైదరాబాద్): హోలీ ఆడుకుందామని స్నేహితుడిని బయటికి పిలిచిన ముగ్గురు బాలురు తమతో పాటు తెచ్చుకున్న బ్లేడ్‌తో వీపుపైన, తొడలపైన గాయపరిచి దాడి చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వెనుక ఉండే ఇందిరానగర్‌లో నివసించే శ్రీహరి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. (చదవండి: సంతానం కలగలేదు.. భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉన్నాడని.. ) శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో శ్రీహరి తన ఇంటి ముందు హోలీ ఆడుకుంటుండగా సమీపంలో నివసించే ముగ్గురు స్నేహితులు అభి, నాని, బబ్లూ ముగ్గురూ అక్కడికొచ్చి శ్రీహరికి రంగులు పూశారు. బలవంతంగా నెత్తి మీద కోడిగుడ్లు కొట్టారు. వారి నుంచి విడిపించుకునేందుకు ప్రయత్నిస్తుండగా ముగ్గురూ కలిసి తమతోపాటు తెచ్చుకున్న బ్లేడ్‌తో శ్రీహరి వీపు మీద గాట్లు పెట్టారు. తీవ్రంగా రక్తస్రావం జరుగుతుండగా శ్రీహరి అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా తొడలపై గాట్లు పెట్టారు. అదే సమయంలో బాధితుడి తల్లి లక్ష్మి అక్కడికొచ్చి తీవ్రంగా గాయపడిన కొడుకును ఆస్పత్రికి తీసుకెళ్లింది. దాడికి పాల్పడ్డ ముగ్గురు బాలలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు అభి, నాని, బబ్లూలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
దేశవ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు (ఫొటోలు)
-
Hanami In Japan: లీ హోలీ.. జపాన్‌లో హనామి, థాయ్‌లాండ్‌లో సోంక్రాన్, ఇంకా...
మనదేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్లలోను, భారతీయ సంతతివారు ఎక్కువగా నివసించే ఆఫ్రికా, అమెరికా, యూరోప్ దేశాల్లోనూ హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి. హోలీ మాదిరిగానే వసంతానికి స్వాగతం పలుకుతూ వివిధ దేశాల్లో జరిగే వేడుకల గురించి తెలుసుకుందాం. హనామి జపాన్ జపాన్‌లో జరుపుకొనే వసంతోత్సవాన్ని ‘హనామి’ అంటారు. ‘హనామి’ అంటే పుష్పసందర్శనం. ఈ కాలంలోనే జపాన్‌లో చెర్రీ చెట్లు నిండా పూలతో విరగబూసి కనువిందు చేస్తాయి. ప్లమ్ వృక్షాలు కూడా ఇలాగే విరగబూస్తాయి గాని, జపాన్‌లో చెర్రీ వృక్షాలే విరివిగా కనిపిస్తాయి. చెర్రీ పూలను జపానీస్ భాషలో ‘సకురా’ అంటారు. హనామి వేడుకలు ఏటా మార్చి నెలలో ఆఖరి వారం నుంచి మే తొలివారం వరకు జరుగుతాయి. ఏటా ఫిబ్రవరిలో జపాన్ వాతావరణ శాఖ ఆ ఏడాది చెర్రీవృక్షాలు ఏ సమయంలో పుష్పించడం ప్రారంభిస్తాయో అంచనా వేసి, తేదీని ప్రకటిస్తుంది. అప్పటి నుంచి వేడుకలు మొదలవుతాయి. తొలుతగా ఒకినావా దీవి నుంచి ఈ వేడుకలు మొదలవుతాయి. మన కార్తీక వనభోజనాలను ఉసిరిచెట్ల కింద చేసుకునే పద్ధతిలోనే జపాన్ ప్రజలు వసంతకాలంలో ఆరుబయట విరగబూసిన చెర్రీచెట్ల కింద, ప్లమ్ చెట్ల కింద ఉల్లాసంగా ఉత్సాహంగా విందు వినోదాలు చేసుకుంటారు. చాలాచోట్ల రాత్రివేళ కూడా చెట్లకు పేపర్లాంతర్లు వేలాడదీసి, ఆరుబయటే ఆటపాటలతో విందు వినోదాలతో గడుపుతారు. టోక్యోలోని ఉయెనో పార్కులో ‘హనామి’ వేడుకలు చాలా సందడిగా జరుగుతాయి. ‘హనామి’ వేడుకల సంప్రదాయం క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్దిలో గెన్మెయి మహారాణి కాలం నుంచి మొదలైనట్లు ఆధారాలు ఉన్నాయి. జపాన్‌లో మృతుల కళేబరాలను చెర్రీ చెట్ల కింద సమాధి చేసే ఆచారం కూడా ఉంది. ‘హనామి’ వేడుకల్లో పెద్దలను స్మరించుకుంటూ ప్రార్థనలు జరుపుతారు. వసంతానికి స్వాగతం పలుకుతూ ఆరుబయట ప్రకృతి ఒడిలో గడుపుతారు. హనామి తరహా వేడుకలు తైవాన్, కొరియా, ఫిలిప్పీన్స్, చైనాలలోనూ జరుగుతాయి. జపాన్ 1912లో అమెరికాకు మైత్రీచిహ్నంగా మూడువేల చెర్రీ మొక్కలను కానుకగా ఇచ్చింది. అప్పటి నుంచి అమెరికాలోనూ పలుచోట్ల ఈ వేడుకను ‘చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్’గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సోంక్రాన్– థాయ్‌లాండ్ నూతన సంవత్సరానికి స్వాగతం పలకడంతోనే థాయ్‌లాండ్‌లో వసంతోత్సవాలు మొదలవుతాయి. థాయ్‌లాండ్ వాసులు ఏటా ఏప్రిల్ 13న నూతన సంవత్సర వేడుకలు జరుపుకొంటారు. ఆ రోజు నుంచి మొదలయ్యే వసంత స్వాగతోత్సవాలు మాత్రం మూడు రోజుల పాటు– ఏప్రిల్ 15 వరకు చాలా సందడిగా కొనసాగుతాయి. ఈ వేడుకల కోసం అక్కడి ప్రభుత్వం ఏప్రిల్ 12 నుంచి 16 వరకు సెలవు దినాలను ప్రకటిస్తుంది. బంధుమిత్రులతో ఈ వేడుకలు జరుపుకోవడానికి ఉపాధి కోసం నగరాల్లో పనిచేసుకునే వారంతా స్వస్థలాలకు పయనమవుతారు. థాయ్‌లాండ్ ప్రజలు నూతన సంవత్సరాన్ని ‘సోంక్రాన్’ అంటారు. ‘సోంక్రాన్’కు మూలం సంస్కృతంలోని ‘సంక్రాంతి’ పదమే. సౌరమానం ప్రకారం తొలి సంక్రాంతి అయిన మేష సంక్రాంతినే థాయ్‌లాండ్ వాసులు నూతన సంవత్సరంగా పాటిస్తారు. భారత్‌లో కూడా సౌరమానం పాటించేవారు మేష సంక్రాంతినే నూతన సంవత్సరంగా పాటిస్తారు. థాయ్‌లాండ్ వాసులు మిగిలిన వారికి భిన్నంగా వరుసగా మూడురోజుల పాటు వసంతోత్సవాలను జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా థాయ్ ప్రజలు బౌద్ధారామాలను దర్శించుకుని ప్రార్థనలు చేస్తారు. నగరాలు, పట్టణాల్లోని కూడళ్లలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేసి, జనాలంతా కూడళ్లలోకి చేరుకుని ఒకరిపై ఒకరు నీళ్లు చిమ్ముకుంటూ సందడి చేస్తారు. నీళ్లు చిమ్ముకునే ఆచారం వల్ల ఈ వేడుకలను ‘వాటర్ ఫెస్టివల్’ అని కూడా అంటారు. ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన వేదికల వరకు సంప్రదాయ దుస్తులు ధరించి, చక్కగా అలంకరించుకున్న మహిళలు, యువతులు సంగీతవాద్యాలతో పాటలు పాడుతూ ఊరేగింపుగా వెళతారు. కొన్నిచోట్ల అందాల పోటీలు కూడా నిర్వహిస్తారు. ఊరేగింపులో పాల్గొన్న అందమైన మహిళలను, యువతులను ‘లేడీ సోంక్రాన్’, ‘మిస్ సోంక్రాన్’ బిరుదులిచ్చి, కిరీటాలతో వారిని ఘనంగా సత్కరిస్తారు. ఈ సందర్భంగా కొందరు ఆలయాల పునరుద్ధరణ కోసం ఇసుకను దానం చేస్తారు. పెద్దలను స్మరించుకుంటూ, బౌద్ధ భిక్షువులకు అన్నసంతర్పణలు చేస్తారు. మెక్సికోలో భారీ ఎత్తున కార్నివాల్ వసంతకాలం అడుగుపెట్టే తొలిరోజు మెక్సికోలో భారీ ఎత్తున కార్నివాల్ నిర్వహిస్తారు. మెక్సికోలోని తీరప్రాంత పట్టణాల్లో ఈ వేడుకలు మరింత అట్టహాసంగా జరుగుతాయి. ఏటా మార్చి నెలలో వసంతారంభంగా వాతావరణ నిపుణులు ప్రకటించిన రోజున ఈ సంబరాలను జరుపుకొంటారు. సాధారణంగా మార్చి 19–22 తేదీల మధ్య వసంత రుతువు మొదలవుతుంది. సంగీత వాద్యాలతో దారిపొడవునా పాటలు పాడుతూ, నవ్వుతూ తుళ్లుతూ, కేరింతలు కొడుతూ, నృత్యాలు చేస్తూ విచిత్ర వేషధారణలతో ఉత్సాహంగా ఊరేగింపులు జరుపుతారు. ఊరేగింపులో తినుబండారాలు, పానీయాలు విరివిగా దొరుకుతాయి. ఈ వేడుకలు కొన్నిచోట్ల వారంరోజుల వరకు, మరికొన్ని చోట్ల దాదాపు రెండు వారాల వరకు కూడా కొనసాగుతాయి. కార్నివాల్ వేడుకలను తిలకించేందుకు విదేశీ పర్యాటకులు పెద్దసంఖ్యలో మెక్సికోకు వస్తుంటారు. శాషిల్యూటెన్– స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్‌లో వసంతోత్సవాన్ని ఏప్రిల్‌లో జరుపుకుంటారు. చలిదేశం కావడం వల్ల అక్కడ వసంతకాలం కాస్త ఆలస్యంగా మొదలవుతుంది. మధ్యయుగాల నుంచే స్విట్జర్లాండ్‌లో ఈ వేడుకలు జరుపుకొనే ఆచారం ఉంది. అప్పట్లో వేసవిలోని మొదటి పనిదినాన ఈ వేడుకలను జరుపుకొనేవారు. గత శతాబ్దం నుంచి ఈ వేడుకలను ఏప్రిల్ మూడో సోమవారం రోజున జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. విద్యుత్తు లేని మధ్యయుగాల కాలంలో శీతాకాలంలో పగటి వెలుతురు ఉన్నంత సేపే పనిగంటలు నడిచేవి. వేసవిలోని తొలి పనిదినాన కాలానికి తగినట్లు పనివేళలను నిర్ణయించుకునే వారు. సాయంత్రం ఆరుగంటలకు చర్చిగంటలు మోగగానే పనివేళలను ముగించుకోవాలని అప్పట్లో శాసనం కూడా తెచ్చారు. శీతాకాలం వెళ్లిపోతూ వసంతం ప్రారంభమైదనడానికి సూచనగా స్విస్ ప్రజలు నగరాలు, పట్టణాల కూడళ్లలో పెద్దసంఖ్యలో గుమిగూడి, గోనెపట్టాలు, ఇతర వ్యర్థాలతో తయారుచేసే శీతాకాలం దిష్టిబొమ్మను తగులబెడతారు. దీని తలభాగంలో మందుగుండు కూడా దట్టిస్తారు. బొమ్మ కొంత కాలిన తర్వాత మంటలు తలవరకు వ్యాపించి, మందుగుండుకు నిప్పు తాకగానే పేలుడు సంభవిస్తుంది. ఈ ఆచారం మనదేశంలో జరిగే హోలికాదహనం, కామదహనం మాదిరిగానే కనిపిస్తుంది. శీతాకాలం దిష్టిబొమ్మను ‘బోగీ’ అంటారు. మనం భోగిమంటలు వేసుకుంటాం, వాళ్లు ‘బోగీ’కి మంట పెడతారు. గమ్మత్తుగా లేదూ! సెమానా శాంటా– గ్వాటెమాలా గ్వాటెమాలాలో ‘సెమానా శాంటా’ పేరిట వసంతోత్సవాలను జరుపుకొంటారు. ‘సెమానా శాంటా’ అంటే పవిత్ర వారం అని అర్థం. ఈ వారాన్ని ‘సెమానా మేయర్’ (ప్రధానవారం) అని కూడా అంటారు. ఈ వారం రోజులూ గ్వాటెమాలా నలుమూలలా చర్చ్‌లలో ప్రార్థనలు, వీథివీథినా ఊరేగింపులు జరుగుతాయి. ‘శాంటా హెర్మన్డాడ్’ అనే శాంతిపరిరక్షక దళాల నాయకత్వంలో పిల్లా పెద్దా అందరూ క్రీస్తు, మేరీమాతల చిత్రపటాలు ధరించి, పాటలు పాడుతూ ఊరేగింపుల్లో పాల్గొంటారు. ఈస్టర్ ఆదివారంతో ఈ వేడుకలు ముగుస్తాయి. ఈ పవిత్రవారానికి సన్నాహాలు ఫిబ్రవరి చివరివారంలో మొదలయ్యే లా క్యుయారెస్మా (లెంట్)తో ప్రారంభమవుతాయి. ‘లెంట్’ రోజుల్లో క్యాథలిక్‌లు ఉపవాసాలు, ప్రార్థనలతో కాలం గడుపుతారు. ప్రపంచవ్యాప్తంగా కేథలిక్‌లు ఈ ఆచారాలను పాటించినా, గ్వాటెమాలాలో మాత్రం మరింత విశేషంగా కార్యక్రమాలు జరుగుతాయి. పవిత్రవారంలో ఊరేగింపు జరిపే దారుల్లో ‘లాస్ ఆంఫ్రోబాస్’ అనే రంగురంగుల తివాచీలను పరుస్తారు. ఈ తివాచీల హస్తకళా నైపుణ్యం చూసి తీరాల్సిందే! గ్వాటెమాలా ప్రజలు ఈ వేడుకల కోసం స్వయంగా ఈ తివాచీలను తయారు చేస్తారు. వీటి తయారీలో సహజసిద్ధమైన రంగులనే వాడతారు. రంపపుపొట్టు, ఎండిపోయిన పూలు, ఆకులు, పండ్లు, చెట్ల బెరళ్ల నుంచి అత్యంత ఆకర్షణీయమైన రంగులను తయారు చేయడం ఇక్కడి విశేషం. ట్యూలిప్ టైమ్ ఫెస్టివల్: హాలండ్, మిషిగాన్ అమెరికాలో మిషిగాన్ రాష్ట్రంలోని హాలండ్ నగరంలో ఏటా ‘ట్యూలిప్ టైమ్ ఫెస్టివల్’ పేరిట వసంతోత్సవ సంబరాలు జరుగుతాయి. ఇక్కడ పెద్దసంఖ్యలో ఉండే డచ్ ప్రజలు ఈ వేడుకలను అత్యంత వైభవోపేతంగా జరుపుకొంటారు. ‘ట్యూలిప్ టైమ్ ఫెస్టివల్’ ఏటా మే నెల రెండోవారంలో వారం రోజుల పాటు జరుగుతాయి. ఈ రుతువులో ట్యూలిప్ మొక్కలు విరగబూస్తాయి. గత శతాబ్దకాలంగా మిషిగాన్‌లోని హాలండ్ నగరంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఇక్కడ స్థిరపడ్డ డచ్ ప్రజల కోరిక మేరకు 1928లో హాలండ్ నగరపాలక సంస్థ నెదర్లాండ్స్ నుంచి లక్ష ట్యూలిప్ మొక్కల దిగుమతికి అనుమతించింది. వాటిని స్థానిక పార్కులకు పంపిణీ చేసింది. మరుసటి సంవత్సరం ఆ మొక్కలు విరగబూయడంతో చిన్నస్థాయిలో వేడుక జరుపుకొన్నారు. హాలండ్ నగర శతవార్షిక సంవత్సరమైన 1947 నుంచి క్రమం తప్పకుండా ఈ వేడుకలను ప్రతియేటా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఈ వేడుకల సందర్భంగా ట్యూలిప్ పూలను ప్రదర్శిస్తూ ఊరేగింపులు, బాణసంచా ప్రదర్శనలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ట్యూలిప్ టైమ్ ఫెస్టివల్లో పాల్గొనడానికి విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడకు వస్తుంటారు. మార్జానా– పోలండ్ పోలండ్‌లో వసంతోత్సవాలను ‘మార్జానా’ పేరిట జరుపుకొంటారు. ‘మార్జానా’ అనేది పురాతన స్లావిక్ మతానికి చెందిన శీతాకాల మృత్యుదేవత. చెక్, స్లోవేనియా, క్రొయేషియా, బోస్నియా, సెర్బియా దేశాలలో ఈ దేవతను ‘మోరానా’ అని, రష్యాలో ‘మారెనా’ అని, ఉక్రేనియాలో ‘మారా’ అని, బల్గేరియాలో ‘మొరా’ అని పిలుస్తారు. పునర్జన్మల విశ్వాసంతో ముడిపడి ఉన్న వేడుక ఇది. శీతకాలం ముగిసే సమయంలో జనాలు పాటలు పాడుకుంటూ, వాయిద్యాలను మోగిస్తూ భారీ ఊరేగింపు జరిపి, ‘మార్జానా’ దేవత దిష్టిబొమ్మను దగ్గర్లోని నదుల్లోను, జలాశయాల్లోను నిమజ్జనం చేస్తారు. నిమజ్జనంతో మరణించిన ‘మార్జానా’ తిరిగి ‘కోస్త్రోమా’– అంటే వసంత దేవతగా జన్మిస్తుందని విశ్వసిస్తారు. నిమజ్జనానికి ముందు కొన్నిచోట్ల మార్జానా దిష్టిబొమ్మలకు నిప్పుపెట్టడం లేదా, దిష్టిబొమ్మకు చుట్టిన దుస్తులను చించేయడం వంటి పనులు చేస్తారు. ఏటా మార్చి 21న జరిగే ఈ వేడుకల్లో ఎక్కువగా పిల్లలు, యువతీ యువకులు పాల్గొంటారు. ‘మార్జానా’ను నిమజ్జనం చేసి, విందు వినోదాలతో వేడుకలు జరుపుకొంటే పంటలు బాగా పండుతాయని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. సింబురిజాదా – బోస్నియా బోస్నియాలో వసంతోత్సవమంటే ఆహారోత్సవమే! ‘సింబురిజాదా’ పేరిట ఏటా మార్చి 21న జరిగే ఈ వేడుకలు విలక్షణంగా ఉంటాయి. ఈ వేడుకలను జనాలు ఆరుబయట జరుపుకొంటారు. నదులు, తటాకాల ఒడ్డున, ఉద్యానవనాల్లోను గుంపులు గుంపులుగా చేరి, ఆటపాటలతో సంబరాలు చేసుకుంటారు. ఆరుబయట పొయ్యిలు ఏర్పాటు చేసుకుని, భారీస్థాయిలో గుడ్లను గిలకొట్టి వాటితో సామూహికంగా తయారుచేసే వంటకాలను అందరూ ఆరగిస్తారు. వేడుకలను తిలకించడానికి వచ్చే పర్యాటకులకు ఉచితంగా ఈ గుడ్ల వంటకాలను వడ్డిస్తారు. వసంత స్వాగతోత్సవ వేడుకల్లో గుడ్లు మాత్రమే ఎందుకు? వేరేవి ఏవైనా వండుకుంటే కుదరదా? అంటే, కుదరనే కుదరంటారు బోస్నియా వాసులు. జీవావిర్భవానికి మూలం గుడ్డు. ఎక్కడైనా గుడ్డు నుంచే పిల్ల పుడుతుంది. వసంతంతోనే కొత్త రుతువు మొదలవుతుంది. అందువల్ల కొత్త జీవానికి సంకేతంగా గుడ్లతోనే సంప్రదాయ వంటకాలు చేసుకుంటామని చెబుతారు. ఫాలెస్– స్పెయిన్ స్పెయిన్‌లో ‘ఫాలెస్’ పేరిట వసంతారంభంలో వేడుకలు జరుపుకొంటారు. ఈ వేడుకలను సెయింట్ జోసెఫ్ సంస్మరణార్థం ఘనంగా నిర్వహిస్తారు. ఏటా మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు భారీ ఎత్తున జరుపుకొనే సంబరాల్లో పెద్దసంఖ్యలో జనాలు పాల్గొంటారు. ‘ఫాలెస్’ అంటే కాగడా అని, నిప్పుపెట్టడం అని అర్థాలు ఉన్నాయి. ‘ఫాలెస్’ వేడుకల్లో ఊరేగింపులు, విందు వినోదాలు, గానాభజానాలు అట్టహాసంగా జరుగుతాయి. విందుల్లో గుమ్మడికాయ, చాక్లెట్‌తో తయారుచేసే ప్రత్యేక సాంప్రదాయక వంటకాలను వడ్డిస్తారు. ఈ వేడుకల్లో ప్రజలు కొత్తదనానికి స్వాగతం పలికే క్రమంలో పాతవాటన్నింటినీ వదులుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇందులో భాగంగానే పాత వస్తువులన్నిటినీ కూడళ్లలో గుట్టలుగా పోసి, వాటికి నిప్పంటిస్తారు. ఈ తతంగం మన భోగిమంటల మాదిరిగా ఉంటుంది. పెద్దసైజులో తయారు చేసే దిష్టిబొమ్మలను కూడా ఈ మంటల్లో వేసి తగులబెడతారు. స్పెయిన్‌లోని వాలెన్షియా నగరంలో ఈ వేడుకలు మరింత ఘనంగా జరుగుతాయి. చదవండి: Cricketers Holy Celebrations: రోహిత్‌ది తిండిగోల.. కోహ్లీ, ధోని ఎకో ఫ్రెండ్లీ బాటలో -
Holi 2022: కామదహనం కథ తెలుసా?
ఆమని అంటే ఆహ్లాదానికి మారుపేరు. శిశిరంలో ఆకులురాలి మోడువారిన కొమ్మలకు మారాకులు వేసే రుతువు వసంతం. వణికించే చలి తీవ్రత ఉండదు, ఉడుకెత్తించే ఎండల ధాటి ఉండదు, కుండపోత వర్షాల చిత్తడి చిరాకు ఉండదు. అత్యంత ఆహ్లాదభరితమైన రుతువు కాబట్టే వసంతానికి రుతురాజుగా గుర్తింపు వచ్చింది. అంతెందుకు, భగవద్గీతలోని విభూతియోగంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే ‘రుతూనాం కుసుమాకరః’– అంటే ‘రుతువుల్లో వసంతాన్ని నేనే’ అని స్వయంగా చెప్పుకున్నాడు. వసంతాగమనంతోనే ప్రకృతి రాగరంజితమవుతుంది. వసంతానికి స్వాగతం పలుకుతూ దేశమంతటా.. డోలాపూర్ణిమ, హోలీ వేడుకలు జరుపుకుంటారు. మనదేశంలోనే కాకుండా చాలా వరకు ప్రాక్ పాశ్చాత్య దేశాలలో వసంతానికి స్వాగతం పలికే సంప్రదాయ వేడుకలు ఉన్నాయి. ఫాల్గుణ పూర్ణిమ రోజున ఒకరిపై ఒకరు రంగులు చల్లుకునే హోలీ పండుగ పురాతనకాలం నుంచే ఉంది. ఈ పండుగ వసంత పౌర్ణమిగా, డోలా పూర్ణిమగా, డోలాయాత్రగా, కాముని పున్నమిగా, వసంతోత్సవంగా, రంగుల పండుగగా ప్రసిద్ధి పొందింది. ఫాల్గుణ పౌర్ణమికి సంబంధించి పలు పురాణగాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. రాధాకృష్ణుల అజరామర ప్రణయానికి నీరాజనాలు పడుతూ పలుచోట్ల వైష్ణవాలయాల్లో డోలా పూర్ణిమ వేడుకలను ఘనంగా జరుపుకొంటారు. హోలీ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో హోలికా దహనం, ఇంకొన్ని చోట్ల కామదహనం తతంగాలను కూడా నిర్వహిస్తారు. శ్రీకృష్ణుడు పెరిగిన మథుర, బృందావనం ప్రాంతాల్లో పదహారు రోజులపాటు వసంతోత్సవాలను అంగరంగ వైభవోపేతంగా జరుపుకొంటారు. హోలీ వెనుకనున్న పురాణగాథలు కొన్ని చెప్పుకుందాం. హిరణ్యకశిపుడు ఘోరతపస్సు చేసి రాక్షసరాజైన హిరణ్యకశిపుడు ఘోరతపస్సు చేసి, తనను చంపడం దాదాపు అసాధ్యమనే రీతిలో బ్రహ్మ నుంచి వరాలు పొందాడు. విష్ణుద్వేషి అయిన అతడు.. వరగర్వంతో దేవతలను ముప్పుతిప్పలు పెట్టేవాడు. హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు. ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిశిక్షలు విధించినా ప్రహ్లాదుడు తన విష్ణుభక్తిని మానుకోలేదు. తండ్రి విధించిన శిక్షల నుంచి విష్ణునామ జపంతోనే అతడు సురక్షితంగా బయటపడ్డాడు. హిరణ్యకశిపుడు ఒకసారి చితినిపేర్చి, తన సోదరి హోలిక ఒడిలో ప్రహ్లాదుడిని కూర్చోబెట్టి నిప్పంటించాడు. హోలిక కప్పుకున్న శాలువను అగ్ని కాల్చలేదు. అందువల్ల ఆమె సురక్షితంగా ఉంటుందని తలచాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు విష్ణువును ప్రార్థించడంతో హోలిక శాలువ ఎగిరిపోయి, ప్రహ్లాదుడిని చుట్టుకుంది. చితిమంటల్లో హోలిక హాహాకారాలు చేస్తూ దహనమైపోయింది. అదేరోజు అసుర సంధ్యవేళ శ్రీమహా విష్ణువు నరసింహావతారంలో స్తంభాన్ని చీల్చుకుని వచ్చి, ఆరుబయట హిరణ్యకశిపుడిని తన ఒడిలో పెట్టుకుని, గోళ్లతో అతడి గుండెచీల్చి సంహరించాడు. ఫాల్గుణ పౌర్ణమినాడు హోలికా దహనం జరగడం వల్ల, కొన్నిప్రాంతాల్లో హోలీ ముందురోజు రాత్రి హోలిక దిష్టిబొమ్మలను దహించడం ఆనవాయతీగా వస్తోంది. కామదహనం కథ ఇదిలా ఉంటే, కామదహనం కథ సుప్రసిద్ధమైనదే. దేవతల కోరికపై మన్మథుడు శివుడికి తపోభంగం కలిగించాడు. కోపోద్రిక్తుడైన శివుడు మూడోకన్ను తెరవడంతో అతడు కాలి బూడిదయ్యాడు. మన్మథుడు దహనమైన రోజు గనుక ఫాల్గుణ పౌర్ణమినాడు కొన్నిచోట్ల దిష్టిబొమ్మలతో కామదహనం తతంగాన్ని నిర్వహిస్తారు. హోలీపండుగ రోజున రంగలు చల్లుకునే ఆచారం గురించి ఒక చిన్న గాథ ఉంది. రాధ తెల్లగా, తాను నల్లగా ఉండటంతో చిన్నారి కృష్ణుణ్ణి తోటి గోపబాలకులందరూ ఆటపట్టించేవారు. వారి వేళాకోళాలకు కృష్ణుడు చిన్నబోవడం చూసి, యశోదమ్మ రాధ మీద చల్లమని రంగు నీళ్లిచ్చింది. రాధ మీద రంగు చల్లి, కిలకిలా నవ్వాడు కృష్ణుడు. వెంటనే రాధ తాను కూడా చేతికందినంత రంగు తీసుకుని, కృష్ణుడి ముఖానికి రంగు పూసింది. వీరిద్దరినీ చూసి, రేపల్లె జనాలంతా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని సందడి చేశారట. మనుషుల మధ్య రంగుల తేడాలను రూపుమాపడానికి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకునే ఆచారం ఏర్పడిందని చెబుతారు. హోలీ రోజున బంధుమిత్రులు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని, రంగులు చల్లుకుంటూ వసంతాగమనాన్ని ఆస్వాదిస్తారు. చదవండి: World Sleep Day: నిద్ర లేకపోతే ఎంత డేంజరో తెలుసా? మీకు తెలియని షాకింగ్ విషయాలు -
కరీంనగర్ జిల్లాలో అంబరాన్ని అంటిన సంబరాలు
-
బండిమెట్‌లో జరిగిన హోలీ సంబరాల్లో పాల్గొన్న మంత్రి తలసాని
-
హోలీ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న యూత్
-
సీఎం వైఎస్ జగన్ హోలీ శుభాకాంక్షలు
-
ఇందిరా పార్క్‌లో హోలీ సంబరాలు
-
విశాఖ ఆర్కే బీచ్‌లో హోలీ సంబరాలు
-
Holi Festival 2022: హోళీ సప్తవర్ణశోభితం
-
Holy 2022: హోలీ మరకలు త్వరగా పోవాలంటే..
ఎంత జోష్‌గా హోలీ ఆడతామో.. శరీరానికి, దుస్తులకు అంటిన రంగుల్ని వదిలించుకునేందుకు అంతే తంటాలు పడుతుంటాం. ఆర్గానిక్, కెమికల్ రంగులతో పాటు గుడ్లు, బురద, ఆయిల్.. ఇలా హోలీకేళీకి ఏదీ అతీతం కాదు. త్వరగా పోవాలంటే వెంటనే వాటిని కడిగేయాలి. ఎంత ఎక్కువ సమయం తీసుకుంటే శరీరానికి అంతలా అంటుకుపోతాయి. హోలీ ఆడిన తర్వాత రంగుల్ని పోగొట్టుకునేందుకు పాటించాల్సిన కొన్ని చిట్కాలు.. ► హోలీ రంగులు చల్లుకోవడానికి ముందుగా ఒంటికి కాస్త కొబ్బరి నూనె కాని గ్లిజరిన్ ఆయిల్ కాని రాసుకుంటే మంచిది. ► ఫ్లూయల్ ఆయిల్స్ లేదా కిరోసిన్ రాసి రంగులు పోగొట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు కొందరు. కానీ, అది శరీరానికి అంత మంచిది కాదని డెర్మటాలజిస్టులు చెప్తున్నారు. ► శరీరానికి అంటిన మరకలను గోరువెచ్చని నీటితో కడగడం వల్ల రంగులు త్వరగా పోతాయి. (మరీ వేడి నీళ్లు అస్సలు మంచిది కాదు) ► శెనగపిండిలో కొంచెం పాలు, పెరుగు, రోజ్ వాటర్‌కి బాదం నూనె కలిపి పేస్ట్‌లాగ కలిపి ఒళ్లంతా పట్టించాలి. అరగంట తరువాత గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే రంగులు వదిలిపోతాయి. ► ఒక పాత్రలో గ్లిజరిన్, సీ సాల్ట్ కలపాలి. అందులో అరోమా ఆయిల్ కొన్ని చుక్కలు వేయాలి. ఆ మిశ్రమాన్ని శరీరానికి రాసుకుని రుద్దితే రంగులు పోతాయి. ► రంగుల వల్ల దురద అనిపిస్తే గ్లిజరిన్, రోజ్ వాటర్ మిశ్రమాన్ని శరీరానికి రాసుకోవాలి. కాసేపయ్యాక గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ముఖానికి ముల్తాన్ మట్టి ప్యాక్ వేసుకుంటే దురద నుండి కొంచెం ఉపశమనం కలుగుతుంది. ► రంగులు వదిలించుకున్న వెంటనే శరీరానికి మాయిశ్చరైజ్ క్రీమ్స్ రాయడం మరిచిపోవద్దు. ► తలకు అంటిన రంగులు వదలాలంటే పెరుగులో గుడ్డు సొన కలిపి తలకు పట్టించి గంట తరువాత షాంపుతో తలస్నానం చేయాలి. ► ఒకవేళ హెయిర్‌ని షాంపూతో క్లీన్ చేసుకోవాలనుకుంటే కచ్చితంగా ‘మైల్డ్ షాంపూ’నే ఉపయోగించాలి. ఆ తర్వాత ఆలివ్ ఆయిల్, తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి ప్యాక్‌లా వేసుకుంటే మంచిది. మరకలు పొగొట్టుకోండిలా... హోలీలో చాలా మందికి ఎదురయ్యే సమస్య దుస్తులకు మరకలు అంటడం. ప్రీ ప్లాన్డ్గా పాత బట్టలేసుకుని ఆడేవాళ్లు కొందరైతే.. మరికొందరు స్పెషల్‌గా పండుగ కోసమే దుస్తులు కొనుక్కుంటారు. ఇంకొందరు మాత్రం రంగులంటిన దుస్తుల మరకలు వదిలించేందుకు కష్టపడుతుంటారు. ► డ్రెస్సులపై రంగు మరకలు పోవాలంటే నిమ్మరసం రుద్ది, వేడినీళ్ళలో నానబెట్టి ఉతకాలి. ► అరకప్పు వెనిగర్‌లో చెంచాడు లిక్విడ్ డిటర్జెంట్ వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని చల్లటి నీటి లో వేసి రంగు అంటిన బట్టలను నానబెట్టాలి. గంట తరువాత ఉతికితే రంగులు తేలికగా పోతాయి. ► తెలుపు రంగు దుస్తులకు రంగు మరకలు అంటితే క్లోరిన్‌లో వాటిని నానబెట్టాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో ఉతికితే మరకలు పోతాయి. ► నిమ్మకాయ, హైడ్రోజన్ పెరాక్సైడ్లు దుస్తులపై రంగు మరకలను తొలగించేందుకు బెస్ట్ చాయిస్. మూడు చెంచాల హైడ్రోజన్ పెరాక్సైడ్‌కి కొంచెం టూత్ పేస్ట్(జెల్ కాకుండా) కలిపి రంగు బట్టలను ఉతికితే ప్రయోజనం ఉంటుంది. ► వెనిగర్‌లో ముంచిన గుడ్డతో గోడకు అంటిన రంగు మరకల్ని తుడిస్తే పోతాయి. ఫ్లోర్ మరకల కోసం హైడ్రోజన్ పెరాక్సైడ్‌ని ఉపయోగించాలి. చెప్పులు, షూస్, కార్పెట్ల విషయంలోనూ వీలైనంత త్వరగా రంగుల్ని కడిగేయాలి. ఫోన్ల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. వాటిని ఒక కవర్లో ప్యాక్ చేసి ఉంచడం ఆడుకోవడం ఉత్తమం. అలాగే పిల్లలు హోలీ ఆడుతున్నప్పుడు వాళ్లను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఆడపిల్లల విషయంలో ఇంకా అప్రమత్తంగా ఉండాలి. హోలీలో ఆర్గానిక్ రంగుల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే కెమికల్స్ ఉన్న రంగులు వాడతామో అప్పుడే ఈ ఇబ్బంది. కాబట్టి.. వీలైనంత వరకూ సహజసిద్ధమైన రంగులతో హోలీని సెలబ్రేట్ చేస్కోండి. హ్యాపీ హోలీ.. -
హైదరాబాద్: హోలీ రంగుల్లో ఎంజాయ్ చేస్తున్న నగర వాసులు
-
హోళీ రంగోలీ! రంగు పడాల్సిందే! (ఫొటోలు)
-
హోలి: ఇక్కడ పురుషులకు నిషేధం!
రకరకాల రంగులను ఒకరి మీద ఒకరు చల్లుకునే హోలి పండుగను ఇష్టపడని వారంటూ ఉండరు. హోలి కోసం పిల్లల నుంచి పెద్దల వరకు అంతా ఎదురు చూస్తుంటారు. ఎంతో సరదా గా చేసుకునే పండగని ఉత్తర ప్రదేశ్‌లోని ఓ గ్రామంలో మాత్రం మహిళలే చేసుకుంటారు. వీరి హోలి సంబరాల్లోకి పురుషులు ఎవరైనా పొరపాటున వచ్చారంటే తన్నులు తినాల్సిందే. నిబంధన అతిక్రమించిన పురుషులకు శిక్షగా లంగా, జాకెట్‌ను ధరింపచేసి హోలీ రంగులు చల్లుతారు. వందల ఏళ్లుగా ఆ గ్రామంలో ఇదే తంతు జరుగుతోంది. యూపీలోని హరీమ్‌పూర్ జిల్లాలో కుందౌరా అనే కుగ్రామం ఉంది. ఊరి జనాభా ఐదువేలు మాత్రమే. ఇక్కడ హోలీ పండుగను కాస్త ప్రత్యేకంగా జరుపుకుంటారు. మూడురోజులపాటు హోలీ సంబరాలు జరుగుతాయి. హోలి మొదటి రోజు మాత్రం పురుషులు రంగులు చల్లుకుంటూ హోలి ఆడతారు. రెండో రోజు కన్నెపిల్లలు, మహిళలు మాత్రమే హోలి ఆడతారు. ఈరోజు మహిళలు, అమ్మాయిలు తమకు నచ్చిన దుస్తుల్లో ఆరు బయట హోలి ఆడవచ్చు. ఈ సంబరాల్లోకి మగవాళ్లకు అస్సలు అనుమతి లేదు. వాళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు. అత్తాకోడళ్లు సైతం ఒకరిమీద ఒకరు రంగులు చల్లుకుంటూ నాట్యం చేస్తారు. సంప్రదాయం ప్రకారం మామగారి ముందు కోడళ్లు కొన్ని పద్ధతులు పాటించాలి. అందువల్ల పురుషులను ఈ పండక్కి బయటకు రానివ్వరు. పురుషులు ఇంటికే పరిమితమవ్వాలి లేదా ఊర్లో ఉండకూడదు. సూర్యాస్తమయం అయ్యాకే ఊర్లోకి రావాలి. హోలీ రెండోరోజు పురుషులు ఆరుబయట కనిపించడం నిషేధం కనుక ఎవరైనా వచ్చారంటే శిక్షను అనుభవించాలి. ఆరుబయట కనిపించిన పురుషులకు లెహంగా చోళీ ధరింపచేసి రంగులు చల్లుతారు. కొన్ని సందర్భాల్లో మహిళలు వారిని కొడుతుంటారు అర్ధరాత్రిదాకా... మూడో రోజు హోలి పండుగను రామ్ జానకి గుడి ఆవరణలో నిర్వహిస్తారు. కుటుంబంలో ఉన్న చిన్నా పెద్ద మొత్తం దీనిలో పాల్గొంటారు. అర్ధరాత్రి వరకు జరిగే ఈ సంబరాల్లో మహిళలు డోలు, కంజిరాలు వాయిస్తూ నృత్యం చేస్తారు. కొంతమంది మహిళలంతా కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి ఆకర్షణీయంగా కనిపిస్తారు. సాయంత్రం కాగానే ప్రత్యేకమైన వంటకాలను తయారు చేసి ఇంట్లో పురుషులకు వడ్డిస్తారు. ఇక్కడ కూడా ఫోటోలు, వీడియోలు నిషేధం. -
అక్కడి అమ్మాయిని పెళ్లాడితే గాడిదమీద ఊరేగిస్తారు.. ఇదేం ఊరురా బాబోయ్!
ముంబై: భారతదేశంలో ఎన్నో ఆచారాలు సంప్రదాయాలకు నిలవు. అందులో కొన్ని వింతగా కూడా ఉంటాయి. అయితే ఆచార వ్యావహారాలు ఎలా ఉన్నా పాటించడం మాత్రం పక్కాగా పాటిస్తుంటాం. మహారాష్ట్రలోని ఓ గ్రామంలో హోలీ రోజున ఒక వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. వినడానికే కాదు ఆచరించడానికి కూడా కొంచెం వింతగా ఉంటుంది, కానీ తప్పదు మరి. ఆ గ్రామంలో కొత్త అల్లుడిని హోలీ రోజు గాడిద ఎక్కించి ఊరేగిస్తారట ! ఇదేం ఆచారం రా బాబు అనుకుంటున్నారా. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లి చూద్దాం.. (చదవండి: వలలో పడ్డ రంపం చేప.. వామ్మో చూడాలంటేనే భయమేస్తోంది! ) బరాబర్ గాడిద ఎక్కాలి.. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోగల విదా గ్రామంలో 90 ఏళ్ల క్రితం ఈ ఆచారం మొదలైంది. దీన్ని అదే గ్రామానికి చెందిన ఆనంద్‌రావు దేశ్‌ముఖ్ ప్రారంభించారు. అప్పట్లో ఆనంద్‌రావు తన అల్లుడిని గాడిద ఎక్కించి ఊరేగించి ఆపై చివర్లో కొత్తబట్టలు పెట్టారు. ఇక అప్పటి నుంచి ప్రతి ఏటా ఆ ఊరిలో హోలీ రోజు ఈ తంతు జరుగుతోంది. ముందుగా గ్రామంలో కొత్త అల్లుళ్లు ఎవరెన్నారో తెలుసుకుంటారు. ఆపై వారి ఈ ఆచారం నుంచి తప్పించుకోకుండా నిఘా కూడా పెడ్తారు. కొత్త అల్లుళ్ల సర్వేకి కనీసం మూడు నుంచి ఐదు రోజులు పడుతుందట. అందుకోసం ఆ గ్రామంలోని కొందరు ఏకంగా ఇంటింటా సర్వే కూడా చేస్తారు. ఆచారం ప్రకారం ఈ గాడిద సవారీ గ్రామం మధ్య నుంచి మొదలై 11 గంటలకు ఆ ఊరిలోని హనుమాన్ దేవాలయం వద్ద ముగుస్తుంది. ఊరేగింపు ముగింపులో అల్లుడికి నచ్చిన బట్టలు కూడా పెడతారు. -
అమెజాన్ బంపరాఫర్..! పలు ఉత్పత్తులపై 60 శాతం తగ్గింపు..!
హోలీ సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సరికొత్త 'హోలీ షాపింగ్ స్టోర్' సేల్‌ను కొనుగోలుదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ సేల్‌లో భాగంగా కెమెరా, హెడ్‌ఫోన్స్, స్పీకర్స్, వెయిరబుల్స్, ఇంకా మరెన్నో వాటర్‌ఫ్రూఫ్ గాడ్జెట్స్‌పై కొనుగోలుదారులకు 60 శాతం తగ్గింపును అమెజాన్ ప్రకటించింది. అంతేకాకుండా హెచ్డీఎఫ్సీ కార్డులపై అతి తక్కువ ధరలకు ఈఎంఐ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది అమెజాన్. ఈ ఆఫర్ కొన్ని రోజుల పాటు మాత్రమే అందుబాటులో ఉండనుంది. పలు ఉత్పత్తులపై అమెజాన్ అందిస్తోన్న బెస్ట్ ఆఫర్స్..! హెడ్‌ఫోన్స్ నాయిస్ బడ్స్ వీఎస్103 ఇయర్ బడ్స్‌ను కేవలం రూ. 1,499కు పొందవచ్చును. బోట్ ఎయిర్‌డోప్స్ 441 టీడబ్ల్యూఎస్ను రూ. 1,999కు లభించనుంది. స్పీకర్లు జేబీఎల్ గో2 వైర్లేస్ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ విత్ మైక్ రూ. 2,184 ధరకు రానుంది. బోట్ స్టోన్ గ్రెనేడ్ స్పీకర్ రూ. 1,499కు లభించనుంది. బోట్ స్టోన్ మార్వెల్ ఎడిషన్ స్పీకర్ రూ. 1,299కే కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. స్మార్ట్‌వాచ్ boAt Xtend స్మార్ట్‌వాచ్ ఈ సేల్‌లో రూ. 2,999కు రానుంది. Noise ColorFit Pulse Grand స్మార్ట్‌వాచ్ రూ. 2,699కు లభించనుంది. కెమెరా GoPro HERO10 బ్లాక్ కెమెరా కొనుగోలుదారులకు రూ. 50 వేలకే లభించనుంది. Insta360 ONE R ట్విన్ ఎడిషన్ కెమెరా 5.7K రిజల్యూషన్‌తో వీడియోల, చిత్రాలను షూట్ చేస్తుంది. H.265 ఎన్కోడింగ్, అధునాతన ఇమేజ్ ప్రాసెసింగ్ , AI-ఆధారిత అల్గారిథమ్‌తో రానుంది. ఇది రూ. 40,499కు అందుబాటులో ఉండనుంది. చదవండి: ఆపిల్ అదిరిపోయే ఫీచర్.. మాస్క్ పెట్టుకున్న ఫేస్ అన్‌లాక్! -
హోలీ కంటే ముందే యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం
-
సీఎం ట్వీట్‌పై విమర్శలు: ‘దీపావళికి, హోలీకి తేడా తెలియదా’
ఇస్లామాబాద్: దీపావళి పండుగ నాడు.. హోలీ శుభాకాంక్షలు తెలిపి.. విమర్శల పాలవుతున్నారు పాకిస్తాన్ సింధ్ ప్రాంత ముఖ్యమంత్రి. ఆ వివరాలు.. నవంబర్ 4న ప్రజలు దీపావళి పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు నాయకులు, రాజకీయవేత్తలు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వీరందరి మధ్యలో పాకిస్తాన్ సింధ్ ప్రాంత ముఖ్యమంత్రి తెలిపిన శుభాకాంక్షలు నెటిజనుల దృష్టిని ఆకర్షించాయి. దీపావళి సందర్భంగా సింధ్ ప్రాంత సీఎం మురద్ అలీ షా ట్విటర్లో తన ఫోటోని షేర్ చేశారు. దీని మీద హోలీ శుభాకాంక్షలు అని ప్రింట్ చేయించాడు. ఇది చూసిన నెటిజనులు.. మీకు దీపావళి పండగకి, హోలీకి తేడా తెలియదా అంటూ విమర్శించడం ప్రారంభించారు. పొరపాటు గుర్తించి వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. కానీ నెటిజనులు అప్పటికే ఆ ట్వీట్‌ను స్క్రీన్‌షాట్ తీసి.. వైరల్ చేశారు. (చదవండి: Diwali 2021: ఈ మీమ్స్ చూస్తే.. నవ్వాపుకోలేరు!!) పాకిస్తాన్‌కు చెందిన జర్నలిస్ట్ ముర్తాజా సోలంగి సీఎం ట్వీట్ స్క్రీన్ షాట్‌ని తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ‘‘సింధ్ ప్రాంత ప్రజల్లో ఎక్కువ మంది హిందువులు. ఇక్కడ విషాదకర అంశం ఏంటంటే.. సింధ్ సీఎం ఆఫీస్‌లో పని చేసే సిబ్బందికి దీపావళికి, హోలీకి తేడా తెలియదు. ఇది చాలా విచారకరం’’ అంటూ ట్వీట్ చేశారు. చదవండి: ఎంత మంచి వాడో.. ప్రతి డెలివరీ బాయ్‌కు గిఫ్ట్ ఇస్తాడట Sindh has the largest number of Hindu population in Pakistan with areas where Hindus are in overwhelming majority. One can only be sad at the state of affairs if the staff at the CM House Sindh doesn’t know the difference between Diwali and Holi. Sad indeed. pic.twitter.com/QdpDe6f3Pl — Murtaza Solangi (@murtazasolangi) November 4, 2021 -
ఉత్సవంతో వచ్చిన కరోనా: అటవీ గ్రామాల్లో కల్లోలం
ఆసిఫాబాద్: ఆరు ఊర్లను ఉప్పెనలా ముంచింది... గడపగడపకు రోగులు.. ప్రతి ఇల్లు ఒక క్వారంటైన్ మారింది.. కాటేసే రోగం దెబ్బకు నిద్రలేని రాత్రులు గడపుతున్నారు.. పల్లెలపై కరోనా పంజా విసిరింది. హోలీ సందర్భంగా నిర్వహించిన ఉత్సవం ఆ గ్రామాలను కరోనా కొంపముంచేసింది. ప్రస్తుతం ఆరు ఊర్లు కరోనాతో అల్లాడుతున్నాయి. ఒక్క ఉత్సవం ఆ అటవీ జిల్లాలో కరోనా ఉగ్రరూపం దాల్చేలా చేసింది. హోలీ సందర్భంగా గిరిజనులు లేంగి ఉత్సవాన్ని లింగపూర్ మండలంలోని మోతిపటార్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి దాదాపు ఐదు వేల మందికి పైగా గిరిజనులు హజరయ్యారు. మహారాష్ట్ర నుంచి కూడా వందల సంఖ్యలో గిరిజనులు తరలివచ్చారు. ఆ ఉత్సవాల్లో ఆడిపాడి సరదాగా గడిపారు. అయితే ఆ ఉత్సవంలోనే మహారాష్ట్ర నుంచి వచ్చిన వారి వలన కరోనా వ్యాపించింది. మహారాష్ట్ర వారితో సోకిన కరోనా ప్రస్తుతం ప్రతి ఊరికి పాకింది. కొత్తపల్లి గ్రామంలో 1,200 మంది ఉంటే వీరిలో 400 మంది కరోనా బారిన పడ్డారు. ఇంటికి ఒకరు కరోనాతో సతమతమవుతున్నారు. ఉత్సవంలో పాల్గొన్న మిగతా గ్రామాలు మోతిపటార్,లింగపూర్, మామిడిపల్లి, మరో రెండు గ్రామాల్లో ఇదే పరిస్థితి. పరీక్షలు నిర్వహిస్తున్నా కొద్ది కేసులు పెరుగుతున్నాయి. కరోనా విస్తరిస్తుండడంతో పల్లెవాసులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కరోనా ఉగ్రరూపంపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ గ్రామాల్లో ప్రత్యేకంగా క్యాంపులు వేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా పాజిటివ్ తెలిన వారికి హోంక్వారంటైన్ చేస్తూ వైద్యం అందిస్తున్నారు. ప్రతి ఇల్లు హోంక్వారంటైన్ మారింది. ఒక మహిళ కరోనాతో ప్రాణాలు కోల్పోయింది కూడా. కరోనా ప్రస్తుతం ఇతర గ్రామాలకు విస్తరించకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. వైద్యాధికారులు మకాం వేసి రోగులు కోలుకోవడానికి వైద్యం అందిస్తున్నారు. ఉత్సవం జరిగి 22 రోజులు దాటిన తర్వాత కేసులు పెరుగుతున్నాయి. ఈ గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ అమలు చేస్తున్నారు. గ్రామాల సరిహద్దులు మూసివేశారు. ఇతర ప్రాంతాల వాళ్లు ఈ గ్రామాలకు రాకుండా.. ఇక్కడి నుంచి ఇతర గ్రామాలకు వెళ్లకుండా రాకపోకలు నిషేధం విధించారు. నిత్యావసర వస్తువులు గ్రామస్తులకు అందేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఆ ఉత్సవమే కరోనా విజృంభణకు కారణంగా తెలుస్తోంది. చదవండి: సంపూర్ణ లాక్డౌన్.. రేపటి నుంచి 1వరకు -
హోలీ విషాదం: కల్తీ మద్యానికి ఆరుగురి మృతి
పాట్నా: కల్తీ మద్యం కాటుకు బిహార్‌లో ఆరుగురి ప్రాణాలు గాల్లో కలిశాయి. కల్తీ మద్యం తాగి కొందరు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వారిలో 24 గంటల్లో ఆరుగురి పరిస్థితి విషమించి మృతిచెందారు. హోలీ రోజు సరదాగా మద్యం తాగగా.. వారి ప్రాణం మీదకు వచ్చింది. ఈ ఘటనలు నవాడ జిల్లా ఖరిడి బిఘా, గుండాపూర్ప్రాంతంలో చోటుచేసుకున్నాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 29న హోలీ పండుగ సందర్భంగా వేర్వేరు ప్రాంతాలకు చెందిన రామ్‌దేవ్ యాదవ్, అజయ్ యాదవ్, దినేశ్, శైలేంద్ర యాదవ్, లోహ సింగ్, గోపాల్ కుమార్ వేర్వేరుగా మద్యం కొన్నారు. పండుగ ఆనందంలో వారు ఇతరులతో కలిసి మద్యం సేవించారు. అయితే సేవించిన అనంతరం వారి కళ్లు తిరిగాయి. స్పృహ కోల్పోయి అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఈ పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రులకు తరలించారు. ఈ విధంగా ఒకేరోజు ఆరు మందికి కావడంతో స్థానికంగా కలకలం రేపింది. ఆ దుకాణంలో మద్యం తీసుకున్న వారందరికీ ఆ విధంగా అయ్యిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతోపాటు బిగుసరాయి ప్రాంతంలో కూడా ఇద్దరు కల్తీ మద్యంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. మద్యపానం నిషేధం విధించిన రాష్ట్రంలో ఏవిధంగా మద్యం ఏరులై పారుతోందని ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ ప్రశ్నించింది. కల్తీ మద్యం తాగి ప్రజలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేసింది. వెంటనే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఘటనపై మంత్రి శ్రవణ్ కుమార్ స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాని తెలిపారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ పండుగ బంపర్ ఆఫర్!
హోలీ పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల అందరికి హోలీ బోనాంజా బహుమతిని ప్రకటించింది. స్పెషల్ ఫెస్టివెల్ అలవెన్స్ స్కిమ్ కింద రూ.10,000 అడ్వాన్స్‌ను ఇస్తున్నట్లు తెలిపింది. ఈ స్పెషల్ ఫెస్టివెల్ అలవెన్స్ స్కీం పొందేందుకు చివరి తేదీ మార్చి 31. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం హోలీకి ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. మూడో ఇన్స్టాల్మెంట్ ఎర్రీర్స్‌ను విడుదల చేస్తోంది. అయితే ఇందుకు సంబంధించి నిర్ణయం అధికారికంగా వెలువడాల్సి ఉంది. త్రిపుర ప్రభుత్వం హోలీ సందర్భంగా డియర్నెస్ అలవెన్స్ హైక్‌ను ప్రకటించింది. ఇదొక్కటే కాదు పెన్షనర్స్ 3 శాతం డీఏ హైక్ పొందనున్నారు. అలాగే, గత జూలై నుండి పెండింగ్‌లో ఉన్న డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ కు సంబంధించిన శుభవార్త చెప్పింది. చదవండి: హైదరాబాద్ రోడ్ల మీదకి డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేని ఎలక్ట్రిక్ బైక్ -
హోలీ మంటల్లో ‘సాగు’ ప్రతులు
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో హోలికా దహనం నిర్వహించారు. కొత్త చట్టాల ప్రతులను ఆదివారం హోలీ మంటల్లో వేసి దహనం చేశారు. ఈ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. అలాగే కనీస మద్దతు ధరపై మరో చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 5వ తేదీని భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) బచావో దివస్‌గా పాటిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ దేశవ్యాప్తంగా ఎఫ్‌సీఐ అధికారులను ఘెరావ్ చేస్తామని పేర్కొంది. కనీస మద్దతు ధర, ప్రజా పంపిణీ వ్యవస్థకు ముగింపు పలికేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఎఫ్‌సీఐకి నిధుల కేటాయింపులను ప్రతిఏటా భారీగా తగ్గిస్తోందని గుర్తుచేసింది. ఆందోళనలను అణచివేసేందుకు హరియాణా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై సంయుక్త కిసాన్ మోర్చా ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఈ బహుబలి కజ్జికాయ బరువెంతో తెలుసా?
లక్నో : భారత దేశ ప్రజలు అత్యంత సంబరంగా జరుపుకునే పండుగల్లో హోలీ ఒకటి. ఉత్తర భారత దేశ ప్రజలకు ఈ పండుగ ఎంతో ప్రత్యేకమైనది. రంగులతో, పిండి వంటలతో అద్భుతంగా జరుపుకుంటారు అక్కడి ప్రజలు. ముఖ్యంగా గుజియా(కజ్జికాయ) లేనిదే హోలీ పండుగ పూర్తికాదని అంటారు. అందుకే, పండుగ పూట తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా చేసుకోవటానికి ఉత్తరప్రదేశ్, లక్నోలోని ఓ స్వీట్ షాపు వెరైటీగా కజ్జికాయను తయారు చేసింది. దానికి ‘బాహుబలి కజ్జికాయ’ అని పేరు పెట్టింది. పేరుకు తగ్గట్టుగానే దాని బరువు 1.5 కేజీలు. ఇది 35.4 సెంటీమీటర్ల పొడవు ఉంది. ఈ కజ్జికాయ ఐడియా గురించి స్వీట్ షాపు మార్కెటింగ్ హెడ్ మాట్లాడుతూ.. ‘‘ కొత్తగా ఏదైనా చేయాలనే బాహుబలి కజ్జికాయను తయారు చేశాము. ఈ కజ్జికాయకు వినియోగదారులనుంచి మంచి స్పందన వస్తోంది. అయితే వీటి ధర తయారు చేయటానికి ఉపయోగించిన పదార్ధాలను బట్టి మారుతుంది’’ అని తెలిపాడు. ప్రస్తుతం ఈ బాహుబలి కజ్జికాయ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి, చదివించండి : 2 నెలల కొడుకు కోసం చంద్రుడిపై స్థలం.. -
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు...
-
తెలంగాణలో హోలీ సంబరాలు..
-
మందుబాబులకు షాక్.. ఆరోజు వైన్స్ బంద్
సాక్షి, హైదరాబాద్ : మరో నాలుగు రోజుల్లో హోలీ పండుగ రాబోతుంది. ఈ క్రమంలో హోలీ నాడు రంగులతో ఆటలే కాకుండా ఫుల్‌గా తాగి రోడ్లపై తాగుబోతులు వీరంగం సృష్టిస్తుంటారు. వీరి వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. వీటన్నింటికి చెక్ పెట్టడానికి హైదరాబాద్ పోలీసులు నడుం బిగించారు. రంగుల వేడుక హోలీ పండుగ సందర్భంగా జంట నగరాల్లో ఈ సారి కఠిన నిబంధనలు అమలు చెయ్యాలని పోలీసులు భావిస్తున్నారు. హోలీ పండుగ నేపథ్యంలో 36 గంటలపాటు మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ మందుబాబులకు షాక్ ఇచ్చారు. హోలీ పండుగ సందర్బంగా మార్చి 28 తేది సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 30 ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయాలని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేశారు. హోలీ వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా హోలీ వేడులను ప్రజలు జరుపుకోవాలని..పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాహనాలపై గుంపులు..గుంపులుగా ప్రయాణించవద్దని ఒకవేళ అలా ప్రయాణిస్తే అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రయాణీకులపైనా.. వాహనాలపై వెళ్లేవారిపైనా వారి అనుమతి లేకుండా బలవంతంగా రంగులు చల్లరాదనీ సీపీ హెచ్చరికలు జారీ చేశారు. చదవండి: కరోనా టెర్రర్.. హోలీ పండుగపై నిషేధం -
చితక్కొడుతున్న మహిళలు : లాత్మర్ హోలీ
-
చితక్కొడుతున్న మహిళలు : హోలీ ఇలా కూడా
సాక్షి,లక్నో : ఉత్తరప్రదేశ్‌లో రంగుల పండుగ హోలీ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఒకవైపు దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతున్న తరుణంలో యూపీ మథుర జిల్లాలో హోళీ సంబరాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో లడ్డూమార్ హోలీ సంబరాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. కరోనా మార్గనిర్దేశనాలను పాటించకుండా వేలాదిమంది ఈ సంబరాల్లో సందడి చేయడం వివాదం రేపింది. అయితే తాజాగా లాఠ్మార్ హోలీ సంబరాలు వార్తల్లో నిలిచాయి.. రంగులు జల్లుకుంటూ ఆడుకోవడంతోపాటు ఆడవారు మగవారిని కర్రలతో కొట్టడం ఈ లాఠీమార్ హోలీ ప్రత్యేకత. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లుకొడుతోంది. దేశవ్యాప్తంగా మార్చి 29న హోలీ వేడుక జరుపుకోనుండగా యూపీలో మధుర-బృందావన్-బర్సానాలో వారం ముందుగానే ఈ సంబరం ప్రారంభమవుతుంది. ప్రపంచ ప్రఖ్యాత లాఠీమార్ హోలీ మంగళవారం నిర్వహించారు. రెండు రోజులపాటు ఈ వేడుకను నిర్వహిస్తారు. మంగళవారం బర్సానాలో నిర్వహించగా, బుధవారం బర్సానా, నందగావ్‌లో హోలీ ఆడనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. శ్రీకృష్ణుడు గోపికలతో హోలీ ఆడుతుండగా, ప్రతిగా రాధ తదితరులు కృష్ణుడ్ని లాఠీలతోనూ, కర్రలతోనూ కొడతారట. ఈ లాఠీమార్ దాడినుంచి తప్పించుకునేందుకు పురుషులు కవచాలను కూడా ధరిస్తారట. మరోవైపు ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కమెంట్లతో సందడి చేస్తున్నారు. కరోనా విస్తరిస్తోంటే...కనీస జాగ్రత్తలు పాటించడంలేదుని, మాస్క్‌లు పెట్టుకోకుండా, భౌతిక దూరం పాటించడం లేదంటూ మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రాష్ట్రంలో హోలీ, డోలోత్సవం రద్దు
భువనేశ్వర్: దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సామూహికంగా నిర్వహించుకునే హోలీ, డోలోత్సవం వేడుకల్ని రద్దు చేసిననట్లు రాష్ట్ర ప్రత్యేక సహాయ కమిషనర్ (ఎస్సార్సీ) ప్రదీప్ కుమార్ జెనా తెలిపారు. హోలీ పండగను పురస్కరించుకుని ఈ నెల 28, 29 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆంక్షలు వర్తిస్తాయి. కోవిడ్ నిబంధనల కార్యాచరణతో ఆలయాల్లో సేవాదుల నిర్వహణ యథాతథంగా కొనసాగుతుంది. కుటుంబీకులతో కలిసి ఇంటిలో హోలీ పండగ జరుపుకునేందుకు అడ్డంకి లేదు. బహిరంగ ప్రదేశాలు, ప్రాంగణాల్లో సామూహిక హోలీ వేడుకల్లో పాలుపంచుకునే వారిపై విపత్తు నిర్వహణ చట్టం–2005 కింద చర్యలు చేపడతామని ఎస్సార్సీ శనివారం ఉత్తర్వులు జారీ చేసి హెచ్చరించారు. అక్కడక్కడ కనిపిస్తున్న సార్స్–కోవ్ 2 ఛాయలు రాష్ట్రంలో కలవరం రేపుతున్నాయి. సంక్రమణ నివారణ కోసం కోవిడ్ – 19 నిబంధనల ఆచరణతో జాగ్రత్తతో మసలుకోవాలని ఎస్సార్సీ సూచించారు. కలెక్టర్ ఉత్తర్వులతో భక్తుల అనుమతి స్థానిక పరిస్థితుల దృష్ట్యా కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆలయాలు, దేవస్థానాలు, ప్రార్థన మందిరాలు, ధార్మిక ప్రాంగణాల పరిసరాలకు సాధారణ ప్రజానీకం, భక్తుల్ని అనుమతిస్తారు. బ్రెజిల్. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ వంటి ప్రపంచ దేశాలతో పాటు మహరాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో మలి దశ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. హోలీ, డోలోత్సవం దగ్గర పడుతున్నాయి. ఈ పండగలను పురస్కరించుకుని ప్రజలు గుంపుగా చేరుతారు. ఉమ్మడిగా రంగులు చల్లుకుని వేడుక జరుపుకుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖానికి మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కోవిడ్ – 19 నిబంధనల కార్యాచరణ అసాధ్యం. కోవిడ్ సంక్రమణకు ఆస్కారం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఉత్సవాల సామూహిక నిర్వహణను నివారించినట్లు ఎస్సార్సీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డోలోత్సవంపై బీఎంసీ నిఘా హోలీ పండగ బహిరంగ వేడుకల నివారణ నేపథ్యంలో ప్రత్యేక సహాయ కమిషనర్ జారీ చేసిన మార్గదర్శకాల నేపథ్యంలో భువనేశ్వర్ నగర పాలక సంస్థ (బీఎంసీ) తాజా ఆదేశాలు జారీ చేసింది. హోలీ పండగ నేపథ్యంలో నిర్వహించే డోలోత్సవంపట్ల బీఎంసీ ప్రత్యేకంగా నిఘా వేస్తుందని పేర్కొంది. డోలోత్సవంలో భాగంగా పలు ఆలయాల నుంచి ఉత్సవ మూర్తుల్ని బహిరంగ ప్రదేశాల్లో ఆధ్యాత్మిక భేటీ ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా లెక్కకు మిక్కిలిగా ప్రజలు గుమి గూడి రంగులు చల్లుకుని వేడుకలు జరుపుకోవడం ఆచారం. ఈ ఏడాది కరోనా సంక్రమణ నేపథ్యంలో ఈ కార్యక్రమంపట్ల భువనేశ్వర్ నగర పాలక సంస్థ ఆంక్షలు జారీ చేసింది. ఉత్సవ మూర్తుల్ని పల్లకిలో తీసుకుని వచ్చే సందర్భంగా ఒక్కో పల్లకితో అత్యధికంగా 6గురు వ్యక్తుల్ని మాత్రమే అనుమతిస్తారని బీఎంసీ కమిషనర్ ప్రేమ చంద్ర చౌదరి తెలిపారు. డోలోత్సవం నిర్వహణకు బహిరంగ ప్రాంతంలో అత్యధికంగా 50 నుంచి 60 మంది వ్యక్తులకు మాత్రమే అనుమతిస్తారని ప్రకటించారు. ఈ మేరకు నిర్వాహకులు ముందస్తుగా దరఖాస్తు దాఖలు చేసి అనుమతి పొందడం అనివార్యంగా పేర్కొన్నారు. చదవండి: దారుణం: నిద్రలేపి నుదుటిపై తుపాకీతో... -
హైదరాబాద్ లో హోలీ సంబరాలు
-
అధికారులూ.. సిగ్గు సిగ్గు
పహాడీషరీఫ్: హోలీ పండుగ వచ్చిందంటే పార్దీ కులస్థుల్లో (నక్కల పిట్టలోల్లు) ఏ ఒక్కరిని కదిలించినా జల్పల్లి గ్రామం పేరే చెబుతారు. తమ పూర్వీకులు మొత్తం జల్పల్లిలోని పిట్టలగూడెంలో ఉండి తదనంతరం నగరంతో పాటు ఇతర జిల్లాలలో పార్దీవాడలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. హోలీ సమయంలో ఏ స్థాయిలో స్థిరపడిన వారైనా జల్పల్లిలోని పిట్టల గూడెంకు వచ్చి మూడు రోజుల పాటు వైభవంగా వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఇలా వచ్చిన ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించడంలో జల్పల్లి మున్సిపాలిటీ అధికారులు తీవ్రంగా విఫలమయ్యారు. విఫలమవ్వడం కాదు.. కావాలనే తమ పట్ల వివక్ష చూపారని పార్దీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం నీటిను కూడా సమకూర్చకపోవడంతో సొంత డబ్బులు వెచ్చించి కొనుగోలు చేశామని వాపోతున్నారు. ముఖ్యంగా మహిళలకు స్నానాలు చేసేందుకు నీరు లేకపోవడంతో మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలోని మూత్రశాలలో కొంత మంది స్నానాలు చేశారు. ఇది కూడా నచ్చని మున్సిపాలిటీ అధికారులు ఏకంగా వారు రాకుండా కార్యాలయ గేట్‌కు తాళం వేశారు. ఒకవైపు మున్సిపాలిటీ పరిధిలోని తమకు నచ్చిన వారి ఇళ్లల్లోకి ఏకంగా నీటి ట్యాంకర్లను పంపిస్తున్న అధికారులు ఏడాదికోసారి ఉత్సవం కోసం వచ్చిన వారికి నీరు ఇవ్వకపోవడం ఏమిటని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరు లేని కారణంగా యువతులు, మహిళలు జల్పల్లి, ఉందాసాగర్ చెరువుల వద్ద స్నానాలు చేయాల్సిన పరిస్థితి. కావాలనే మాపై వివక్ష చూపిస్తున్నారు.. పహాడీషరీఫ్‌లో వచ్చే నెలలో నిర్వహించనున్న ఇజ్తెమా (ఇస్లామిక్ సమ్మేళనం)కు దేశం నలుమూలల నుంచి ముస్లింలు రావడాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం సకల సదుపాయాలు కల్పిస్తోందనీ కానీ చిన్న పాటి ఉత్సవాన్ని జరుపుకునేందుకు వచ్చే తమకు మాత్రం నీరు, విద్యుత్ సదుపాయాలు కూడా ఎందుకు కల్పించడం లేదని నక్కల పిట్టల్లోల సంఘం నాయకులు విజయ్ కుమార్, చిట్టిబాబు, రవి, రమేశ్ ప్రశ్నిస్తున్నారు. కనీసం ఆడ పడుచులు స్నానం చేసేందుకు వస్తే మున్సిపాలిటీ గేట్‌కు తాళం వేయడం ఏమిటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మార్కెట్లకు సెలవు : హోలీ శుభాకాంక్షలు
సాక్షి, ముంబై : హోలీ పర్వదినం సందర్భంగా ఈ రోజు (21, మార్చి) మార్కెట్లకు సెలవు. ఈ నేపథ్యంలో నిన్నటి ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. రోజంతా కన్సాలిడేషన్ బాటలో సాగిన కీలక సూచీలు చివరికి మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 23 పాయింట్లు ఎగిసి 38,386 వద్ద, నిప్టీ 11 పాయింట్లు నీరసించినా 11,521కి పైన ముగియడం విశేషం. మరోవైపు కీలక వడ్డీరేట్లపై ఫెడ్ యథాతథంగా నిర్ణయం ఆసియా మార్కెట్లకు జోషినిస్తోంది. వాషింగ్టన్లో రెండు రోజులపాటు జరిగిన అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాజా పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ఫైనాన్షియల్ డెవలప్మెంట్, ద్రవ్యోల్బణం ఒత్తిడులతో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ తెలిపారు. దీంతో ప్రస్తుతం ఫెడ్ వడ్డీ రేట్లు 2.25-2.5 శాతం శ్రేణిలో ఉన్నాయి. -
అమెజాన్ హోలీ సేల్: స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం మరోసారి డిస్కౌంట్ అమ్మకాలకు తెరతీసింది. హోలీ పండుగ సందర్భంగా ది గ్రేట్ అమెజాన్ హోలీ సేల్ 2019 పేరుతో ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎం20, రియల్ మి యూ, హావావే వై 9, వివో 5ప్రొ స్మార్ట్ఫోన్లను తగ్గింపు ధరల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. దీంతోపాటు అమెజాన్ పే, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై రూ.3వేలు దాటిన కొనుగోళ్లపై నోకాస్ట్ ఈఇంఐ, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్,కార్డుపై 5 శాతం తక్షణ డిస్కౌంట్‌ను ఆపర్ చేస్తోంది. అలాగే డెబిట్ కార్డు కొనుగోళ్లపై నో ఈఎంఐ, 5,400 రూపాయల విలువైన తక్షణ క్యాష్ బ్యాకు, 3టీబీ జియో డాటా ను అందివ్వనుంది. దీంతోపాటు హోలి స్టోర్ పేరుతో ప్రకటించిన సేల్‌లో గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. గాడ్జెట్లను కూడా అత్యంత తక్కువ ధరలకే అందిస్తోంది. మార్చి 9న మొదలైన ఈ సేల్ 21వ తేదీ వరకు కొనసాగనుంది. -
పుత్ర శోకం
విశాఖ క్రైం: హోలీ వేడుకలు ఆ కుటుంబంలో విషాదం నింపాయి. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడిని రాకాసి అలలు అందని లోకానికి తీసుకుపోయాయి. కొడుకే సర్వస్వంగా బతుకుతున్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. హోలీ వేడుకల్లో భాగంగా స్నేహితులతో సరదాగా ఆర్కే బీచ్‌కు వెళ్లిన దొండపర్తికి చెందిన సాయికుమార్ అనే విద్యార్థి సముద్రంలో మునిగి మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం బెలగాం గ్రామానికి చెందిన పోలి అప్పలనాయుడు కుటుంబం నాలుగేళ్ల క్రితం కుమారుడి చదువు కోసం విశాఖ నగరానికి పొట్టచేత పట్టుకొని వచ్చింది. అప్పలనాయుడు కారు డ్రైవరుగా పనిచేస్తూ కుటుంబం పోషిస్తున్నాడు. ఈయనకు భార్య సత్యవతి, కుమారుడు సాయికుమార్(14) ఉన్నారు. దొండపర్తి కుమ్మరివీధిలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరి పక్కనే సమీప బంధువు కోలా నాగేశ్వరరావు, పొన్నాడ పుష్పవతి దంపతులు కూడా ఉంటున్నారు. సాయికుమార్ అక్కయ్యపాలెంలోని ఎన్టీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. హోలీ పండగకు పాఠశాల సెలవు కావడంతో శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకే సాయికుమార్ స్నేహితులు ఇంటికి వచ్చి తలుపు తట్టారు. తల్లి సత్యవతి ఎక్కడికి వెళుతున్నావురా.. అంటే రైల్వే గ్రౌండ్‌కి అని చెప్పి స్నేహితులతో కలిసి ఆర్కే బీచ్‌కు వెళ్లాడు. అక్కడ సరదాగా హోలీ సంబరాలు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు పూసుకున్నారు. అనంతరం స్నానాల కోసం అందరూ సముద్రంలోకి దిగారు. అంతే ఒక్కసారిగా పెద్ద కెరటం వచ్చి సాయికుమార్‌ను లోపలికి లాక్కెళ్లిపోయింది. గమనించిన స్నేహితులు కేకలు వేసినా ఫలితం లేకపోయింది. వెంటనే సందర్శకులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. విషయం తెలియడంతో సాయికుమార్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆర్కే బీచ్ వద్దకు చేరుకున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమారుడి మృతదేహం చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు కేజీహెచ్‌కు తరలించారు. సాయికుమార్‌తో వెళ్లిన నలుగురు విద్యార్థులను పోలీసులు విచారించారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హోలీ వేడుకల్లో టీనేజర్ హత్య.. కలకలం!
సాక్షి, జైపూర్: హోలీ వేడుకలు ఓ దళిత కుటుంబంలో పెను విషాదం నింపాయి. హోలీ అడుతుండగా ఆయుధాలతో దాడిచేయడంతో దళిత టీనేజర్ మృతిచెందడం కలకలం రేపింది. ఈ ఘటన రాజస్థాన్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... నీరజ్ జాటవ్(16) అనే టీనేజర్ అల్వార్ జిల్లా భివాడి పట్టణంలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో హోలీ సందర్భంగా బయటకు వెళ్లాడు నీరజ్. అయితే ఇతర సామాజిక వర్గానికి చెందిన మిత్రులు, స్థానికులతో హోలీ రంగులు రుద్దుకుంటూ హోలీ ఆడుతున్నాడు. అంతలోనే గొడవ మొదలైంది. దళిత బాలుడు నీరజ్‌పై కొందరు వ్యక్తులు పదునైన ఆయుధాలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. విషయం తెలుసుకున్న దళిత టీనేజర్ కుటుంబసభ్యులు నీరజ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. తీవ్ర గాయాలతో రక్తస్రావమైన నీరజ్ ఆస్పత్రికి తీసుకెళ్లగానే మృతిచెందాడని ఏఎస్పీ పుష్పేంద్ర సోలంకి తెలిపారు. హోలీ ఆడుతున్న నీరజ్‌ను ముగ్గురు వ్యక్తులు కలిసి హత్యచేశారని, ఆ టీనేజర్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకూ ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం గమనార్హం. -
హోలీలో అపశ్రుతి
పుల్కల్(అందోల్): రెండు కుటుంబాల్లో హోలీ పండగ విషాదాన్ని నింపింది. ఇద్దరు విద్యార్థులు నదిలో నీట మునిగి దుర్మరణం పాలైన సంఘటన పుల్కల్ మండలం కొర్పోల్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కొర్పోల్ గ్రామానికి చెందిన కిషన్, మంజుల దంపతుల కొడుకు సాయికిరణ్, యాదయ్య, వీరమణి దంపతుల కొడుకు సాయికుమార్లు మధ్యాహ్నం వరకు హోలీ ఆడారు. అనంతరం వారిద్దరూ మరో ఐదుగురితో కలిసి స్నానానికని మంజీర నదికి వెళ్లారు. ఇందులో ఈత రాని ఐదుగురు నది ఒడ్డున స్నానం చేస్తున్నారు. ఈ క్రమంలో సాయికిరణ్, సాయికుమార్‌లతోపాటు మరో ఇద్దరు నీట మునగడాన్ని ఇంటర్ విద్యార్థి మల్లేశం గమనించాడు. వెంటనే నీట మనుగుతున్న ఇద్దరిని కాపాడి బయటకు తీశాడు. కానీ సాయికిరణ్, సాయికుమార్‌లను కాపాడేంత శక్తి లేకపోవడంతో గ్రామానికి చెందిన పలువురికి సమాచారం ఇచ్చాడు. కానీ అంతలోపే సాయికుమార్, సాయికిరణ్‌లు నీటిలో మునిగి దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన వారిద్దరూ 10వ తరగతి విద్యార్థులే. వీరి మృతి విషయం తెలుసుకున్న స్థానికులు మంజీర నదికి వెళ్లి వారి మృతదేహాలను బయటకు తీశారు. వెంటనే పుల్కల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఏఎస్ఐ ప్రభాకర్ సంఘటన స్థలానికి చెరేకున్నారు. ఇద్దరూ ప్రాణ స్నేహితులే.. మంజీర నదిలో స్నానం చేయడం కోసం వెళ్లి మృతి చెందిన సాయికుమార్, సాయికిరణ్‌లు ఇద్దరూ ప్రాణస్నేహితులని తోటి విద్యార్థులు తెలిపారు. ఐదవ తరగతి నుంచి 10వ తరగతి వరకు కలిసి చదువుకుంటున్నారని, ఎప్పుడూ వారు కలిసే ఉండే వారన్నారు. ఇద్దరూ తల్లిదండ్రులకు ఒక్కగానొక్కరే.. సాయికుమార్, సాయికిరన్లు ఇద్దరు కూడా వారి తల్లిదండ్రులకు ఒక్కొక్కరే కావడంతో ఆ కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన సాయికుమార్ తండ్రి యాదయ్య ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. తల్లి వీరమణి కూలీ పని చేస్తూ తన కొడుకును చదివిస్తోంది. మరో విద్యార్థి సాయికిరణ్ సైతం వారి తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. గ్రామంలో విషాదం.. అందరూ ఆనందోత్సాహాల మధ్య హోలీ వేడుకలు జరుపుకుంటుంటే ఆ గ్రామంలోని రెండు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం గ్రామస్తులను కలచివేసింది. ఇదిలా ఉంటే ఇద్దరు విద్యార్థులు మంజీర నదిలోనే పడి మృతి చెందారని, వారికి పోస్టుమార్టం నిర్వహించవద్దని స్థానికులు పోలీసులకు మొరపెట్టుకున్నారు. కానీ స్థానికంగా నెలకొన్న పరిస్థితి దృష్ట్యా కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం కోసం మృతదేహాలను జోగిపేట ఆస్పత్రికి తరలించామని ఏఎస్ఐ ప్రభాకర్ తెలిపారు. -
ఏపీ సీఎం హోలీ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి : దుష్టశక్తులకు ఓటమి తప్పదని, చెడుపై అంతిమంగా మంచి గెలుస్తుందన్న సందేశాన్ని ఇచ్చే పండుగ హోలీ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల వారందరికీ ఆయన హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. -
తెలుగు వారి జీవితాలు రంగులమయం కావాలి
సాక్షి, అమరావతి : రంగుల పండుగైన హోలీ తెలుగు వారి జీవితాలను రంగులమయంగా, సంతోషకరంగా మార్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గురువారం ఆయన హోలీ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు అంతా మంచి జరగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. -
హోలీ అంటే చిరాకు
కరణ్ జోహార్ బాలీవుడ్ అగ్ర దర్శక– నిర్మాత. తన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ తెరనిండా నటీనటులతో కలర్ఫుల్గా ఉంటాయి. కానీ కర ణ్‌కు మాత్రం కలర్‌ఫుల్ ఫెస్టివల్ ‘హోలీ’ అంటే చిరాకట. ఇంకో విశేషం ఏంటంటే దానికి కారణం అభిషేక్ బచ్చన్ అట. ఎందుకలా? అని అడిగితే ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లారు కరణ్. ‘‘నా 7ఏళ్ల వయసప్పుడు అనుకుంటా.. ఓసారి హోలీకి మా వీధిలోని పిల్లలందరూ కలిసి నాకు రంగులు పూయటానికి వచ్చారు. ఆ రంగులు అంటకుండా ఉండటం కోసం వాళ్లకు దొరక్కుండా పరిగెత్తే ప్రయత్నంలో కిందపడిపోయాను. దెబ్బలు తగిలాయి. దాంతో వాళ్లతో గొడవ పడ్డాను. ఆ తర్వాత కొన్నేళ్లకు ఓ హోలీ రోజు అమితాబ్ బచ్చన్వాళ్ల ఇంటికి వెళ్లాను. నాకు హోలీ అంటే ఎందుకు భయమో అమిత్జీతో చెబుతున్నప్పుడు మా సంభాషణంతా వెనుక నుంచి అభిషేక్ బచ్చన్ విన్నాడు. మొత్తం విన్న తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను అమాంతం ఎత్తుకొని రంగులున్న వాటర్ పూల్‌లో పడేశాడు. అంతే... అక్కడితో నాకు హోలీ అంటే చిరాకు వచ్చేసింది. అప్పటి నుంచి ఎప్పూడు హోలీ ఆడలేదు’’ అని పేర్కొన్నారు కరణ్. -
సీఎం కేసీఆర్ హోలీ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: హోలీ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు పండుగను ఆనందంగా జరుపుకోవాలని, సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. -
గవర్నర్ హోలీ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్ : తెలుగు ప్రజలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ దేశ సమగ్రతకు చిహ్నమని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. -
ఒకటో తేదీనే హోలీ
సాక్షి, హైదరాబాద్ : హోలీ పండగ మార్చి ఒకటో తేదీనే జరుపుకోవాలని దేవాదాయ శాఖ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం రెండో తేదీన, రాష్ట్రం ఒకటో తేదీన హోలీ సెలవులుగా ఇప్పటికే ప్రకటించాయి. కానీ రెండు తేదీలు భిన్నంగా ఉండటంతో ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది. దీంతో సెలవు విషయంలో స్పష్టత ఇవ్వాలని సాధారణ పరిపాలన విభాగం దేవాదాయ శాఖను కోరింది. ఇప్పటికే పండితులతో చర్చించి ఒకటో తేదీనే ఖాయం చేసుకున్న దేవాదాయ శాఖ, అదే విషయాన్ని మరోసారి సాధారణ పరిపాలన విభాగానికి స్పష్టం చేసింది. పండితులతో కూడిన విద్వత్ సభతో చర్చించిన మీదటే ఒకటో తేదీని ఖరారు చేసినట్టు దేవాదాయ శాఖ తెలిపింది. -
హోలీ సెలవుపై గందరగోళం
సాక్షి, హైదరాబాద్ : హోలీ సెలవు దినం మార్చి ఒకటినా లేక రెండో తేదీనా అన్న దానిపై గందరగోళం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 1న హోలీ సెలవు ప్రకటించింది. కేంద్రం మాత్రం మార్చి 2న ప్రకటించింది. ఈ రెండు రోజుల్లో ఏ తేదీన సెలవు ప్రకటించాలో స్పష్టత ఇవ్వాలని సాధారణ పరిపాలన విభాగం పొలిటికల్ సెక్రటరీ అదర్‌సిన్హా దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శికి నోట్ రాశారు. రెండో తేదీకి సెలవు మార్చుకోవాలా? లేక ఒకటో తేదీనే సెలవు ప్రకటించాలా అన్న దానిపై అత్యవసరంగా తెలపాలని ఎండోమెంట్‌కు రాసిన నోట్లో స్పష్టంగా పేర్కొన్నారు. -
అగ్రకులస్తులపై హోలీ రంగులు చల్లాడని..
అగ్ర కులానికి చెందిన వారిపై హోలీ పండుగ సందర్భంగా రంగులు చల్లిన వ్యక్తిని పోలీసులు కొట్టి చంపారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని కొదెర్మ జిల్లాలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రదీప్ చౌదరి, మరికొంత మంది గ్రామస్తులు హోలీ సందర్భంగా రంగులు చల్లుకుంటున్నట్లు ఆమె భార్య తెలిపారు. ఈ సమయంలో అటువైపుగా వచ్చిన చౌకీదార్ రాజేంద్ర యాదవ్‌పై కూడా వీరందరూ రంగులు చల్లారని వెల్లడించారు. దీంతో కోపగించుకున్న రాజేంద్ర.. రంగులు చల్లిన దళితలపై పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీంతో గ్రామానికి వచ్చిన పోలీసులు ప్రదీప్‌ను అదుపులోకి తీసుకుని స్పృహతప్పి పడిపోయే వరకూ చితకబాదారని కన్నీరు పెట్టుకున్నారు. ఆ తర్వాత ప్రదీప్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని చెప్పారు. తన భర్తను కలుసుకునేందుకు ఆయన సోదరుడితో కలిసి స్టేషన్‌కు వెళ్లగా చూడటానికి అనుమతించలేదని తెలిపారు. అంతేకాకుండా కులం పేరిట తమను దూషించారని ఆరోపించారు. మరుసటి ప్రదీప్‌ను పోలీసులు ఇంటి వద్ద వదిలేశారని చెప్పారు. తీవ్రంగా గాయపడిన ప్రదీప్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించామని.. పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పడంతో అక్కడికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు వదిలారని తెలిపారు. -
ఇక్కడ హోలీ అంటే పిడిగుద్దులాటే
బోధన్ రూరల్(బోధన్): నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హున్సా గ్రామంలో సోమవారం హోలీ సందర్భంగా పిడిగుద్దులాట ప్రశాంతంగా సాగింది. గ్రామం సుభిక్షంగా ఉండాలన్న ఆకాంక్షతో హోలీ రోజు 130 ఏళ్ల నుంచి పిడిగుద్దులాట నిర్వహిస్తున్నారు. సోమవారం గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద గ్రామస్తులు 2 వర్గాలుగా విడిపోయి పిడిగుద్దులు కురిపిం చుకున్నారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పిడిగుద్దులాటలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
యువీ చిందేశాడు.. క్రికెటర్ల సంబరాలు
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్లు, మాజీలు హోలీ పండుగ సందర్భంగా సందడి చేశారు. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు. ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలసి రంగులు చల్లుకుని ఎంజాయ్ చేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానుల కోసం సోషల్ మీడియాలో ఓ వీడియోను అప్లోడ్ చేశాడు. హోలీ రోజున జంతువులపై రంగులు పూయవద్దని అభిమానులను కోరాడు. వెటరన్ హర్భజన్ సింగ్.. తన భార్య గీతా బస్రాతో కలసి హోలీ చేసుకున్న ఫొటోలను పోస్ట్ చేశాడు. ఇక యువరాజ్ సింగ్ హోలీ పాటకు డ్యాన్స్ చేసిన వీడియోను అప్లోడ్ చేశాడు. హోలీ రంగులు ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, సంపద, శాంతి కలిగించాలని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆకాంక్షించాడు. అజింక్యా రహానె ఇతర ఆటగాళ్లు అభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు. -
హోలీ పేరుతో అసభ్యంగా తాకుతారు: నటి
ముంబయి: హోలీ తనకు సురక్షితంగా అనిపించదని ప్రముఖ బాలీవుడ్ నటి షెనాజ్ ట్రెజరీవాలా చెప్పింది. ఇష్క్ విష్క్ అనే చిత్రంలో అలీషా అనే పాత్రతో సుపరిచితురాలైన ఆమె తనకు హోలీ పేరుతో చేదు అనుభవం ఎదురైనట్లు చెప్పారు. హోలీ పేరుతో అక్కడా ఇక్కడ చేతులు వేస్తుంటారని, తడిమి చూస్తుంటారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి పద్దతి తనకు నచ్చదని కుండబద్ధలు కొట్టేసింది. ‘ఇది హోలీ అంటూ ఎక్కడెక్కడో చేతులు వేస్తుంటారు. అందుకే హోలీనాడు నాకు భద్రతగా అనిపించదు. హోలీ పేరుతో నన్ను చాలా ఇబ్బందికరంగా గతంలో తడిమి చూశారు. అందుకే నేనెప్పుడూ హోలీ కోసం అంత ఉత్సాహంగా ఎదురుచూడను. ఈ విషయం చెప్పడానికి తానేమి సిగ్గుపడటం లేదని, తనపై అలా అనుచితంగా చేసిన వాళ్లే సిగ్గుపడాలంటూ ఆమె ట్విట్టర్లో రాసుకొచ్చింది. -
సంబరాలకు దూరంగా రాజ్‌నాథ్..!
న్యూఢిల్లీ/రాయ్‌పూర్: ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ నేతలంతా సంబరాల్లో మునిగిఉండగా కేంద్ర హోం శాఖ మంత్రి, ఆ పార్టీ నాయకుడు రాజ్‌నాథ్ సింగ్ మాత్రం అందుకు దూరంగా ఉన్నారు. ఇందుకు కారణం చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో 12 మంది సిఆర్పీఫ్ జావానులు మృతిచెందడమేనని ఆయన చెప్పారు. శనివారం ఉదయం గం 9.15 సమయంలో కొత్తచెరువు గ్రామంలోని బేజి పోలీసు స్టేషన్ పరిధిలో మావోయిస్టులు మెరుపుదాడి జరిపి సీఆర్పీఎఫ్, 219వ బెటాలియన్‌పై మెరుపుదాడి చేయడం తెలిసిందే. కు చెందిన 12 మందిని కాల్చిచంపి వారి దగ్గర ఉన్న ఆయుధాలను దొంగిలించిన సంగతి తెలిసిందే. దీనినిపిరికి చర్యఅని వర్ణిస్తూ.. జవానుల త్యాగాలు వృధా కాబోవన్నారు. మావోల దాడి వ్యూహాత్మకమే : పోలీసులు ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై పక్కా ప్రణాళికతోనే దాడి జరిగినట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. వ్యూహాత్మకంగా తమ టార్గెట్‌ను పరిధిలోకి రానిచ్చిన మావోలు మందుపాతరలు పేల్చారనీ, దేశీయంగా తయారైన మోర్టార్లను వినియోగించారని అధికారులు తెలిపారు. ఈ దాడిలో హాలీవుడ్ చిత్రం ‘రాంబో’ తరహాలో బాణాలకు చివర పేలుడు పదార్థాలు కట్టి దాడికి తెగబడ్డారని అన్నారు. బస్తర్ జిల్లాలోని నారాయణపూర్, కొండాగావ్ క్యాంపులపై మావోయిస్టులు ఇలాగే బాంబులున్న బాణాలతో విరుచుకుపడ్డారని అధికారులు తెలిపారు. సీఆర్పీఎఫ్ 219వ బెటాలియన్‌కు చెందిన 112 మంది జవాన్లు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు నిర్మాణంలో ఉన్న భెజ్జీ–ఇంజ్రమ్ రోడ్డు మార్గాన్ని పహారా కాసేందుకు బయల్దేరారు. పహారాతోపాటు భెజ్జీలో ప్రతి శనివారం జరిగే మార్కెట్ స్థలాన్ని జవాన్లే సిద్ధం చేయాలి. ఈ క్రమంలో వారి కదలికలను మావోయిస్టులు పసిగట్టారు. జవాన్లు ఉదయం 8.50 గంటలకు కొత్తచెరు ప్రాంతానికి చేరుకోగానే అక్కడే నక్కిఉన్న మావోలు మందుపాతరలు పేల్చడమే కాకుండా తూటాలవర్షం కురిపించారు. ఈ దాడిలో 12 మంది జవాన్లు చనిపోయారు. గత ఏడాదిన్నరలో మావోలు చేసిన అతి పెద్దదాడి ఇదేనని పోలీసులు తెలిపారు. మావోలు మార్చి, జూన్ మాసాల్లో వ్యూహాత్మక ఎదురుదాడి కార్యక్రమాన్ని(టీసీఓసీ) పాటిస్తారు. చెట్లన్నీ ఎండిపోయి భద్రతా బలగాల కదలికలు స్పష్టంగా కనిపించడం వల్లే వారు టీసీఓసీని పాటిస్తారని పోలీసు అధికారులు తెలిపారు. -
హోలీ వేడుకల్లో విషాదం
కాలువలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు ఒకరి మృతదేహం లభ్యం అనపర్తి : అప్పటి వరకు వారు రంగులు చల్లుకుంటూ ఆనందంలో మునిగి తేలారు. ఆ వేడుకే చివరి వేడుకగా మిగులుతుందని ఊహించలేదు. మిత్రులందరితో సంతోషంగా గడిపిన కొద్ది సేపటికే ఇద్దరు విద్యార్థులు కాలువలో పడి గల్లంతు కావడంతో తోటి స్నేహితులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. అనపర్తిలో ఆదివారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, అనపర్తి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనపర్తి మండలం దుప్పలపూడికి చెందిన నీలం పవన్, అనపర్తికి చెందిన కొవ్వూరి మధుసూధన్‌రెడ్డిలు అనపర్తిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. హోలీ పండుగను వీరు అనపర్తిలో మిగిలిన స్నేహితులతో కలిసి జరుపుకున్నారు. తమపై పడిన రంగులను కడిగేసుకునేందుకు వీరిద్దరూ మరో స్నేహితుడు మనస్స్తో కలిసి నల్ల కాలువ వద్దకు వచ్చారు. అక్కడ మధుసూదన్ చొక్కా విప్పుకుని కాలువలో శుభ్రం చేసుకుంటున్న సమయంలో కాలుజారి గల్లంతైనట్టు తెలుస్తోంది. మధుసూదన్‌రెడ్డిని రక్షించే క్రమంలో పవన్ కూడా గల్లంతయ్యాడు. ఒడ్డున మనస్స్ ఈ విషయాన్ని అక్కడే ఉన్న ఒక యువకుడికి తెలిపి బోరుమన్నాడు. విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు కూడా నల్ల కాలువ వద్దకు వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో పవన్ అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ సిరసపల్లి నాగేశ్వరరావు మనవడు. విషయం తెలుసుకున్న సిరసపల్లి ఘటనా స్థలానికి చేరుకుని విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. సమాచారం అందుకున్న ఎస్సై కిషోర్‌బాబు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు కర్రి ధర్మారెడ్డి, అనపర్తి డీసీ చైర్మన్ తాడి వెంకటరామారెడ్డి, తహసీల్దార్ ఆదినారాయణ తదితరులు ఘటనా స్థలికి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో పవన్ మృతదేహం లభ్యమైంది. పవన్ కాలికి చెప్పులు ఉండడంతో మధు సూదన్‌రెడ్డిని రక్షించే క్రమంలో మునిగిపోయి ఉంటాడని భావిస్తున్నారు. మధుసూదన్‌రెడ్డి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. రాత్రి సమయం కావడం.. గాలింపునకు అననుకూలంగా ఉండకపోవడంతో గాలింపు చర్యలను నిలుపుదల చేశారు. తల్లిదండ్రుల చెంతకే పవన్ కాలువలో స్నేహితుడిని రక్షించబోయి మృతి చెందిన పవన్ తల్లిదండ్రుల చెంతకే వెళ్లిపోవడాన్ని కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు జీర్ణించుకోలేక పోతున్నారు. పవన్ తల్లిదండ్రులు సంధ్య, వీరభద్రరావులు దుప్పలపూడిలో ఉండేవారు. రెండేళ్ల క్రితం వీరభద్రరావు గుండెపోటుతో చనిపోగా, భర్త చనిపోయిన మూడు నెలలకే సంధ్య కూడా మృతి చెందారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరి చిన్నారులు తాతయ్య సిరసపల్లి నాగేశ్వరరావు వద్ద ఉండి చదువుకుంటున్నారు. నాగేశ్వరరావు కుమార్తెను, అల్లుడిని మనవళ్లలో చూసుకుంటూ జీవిస్తున్న సమయంలో ఇప్పుడు చిన్న మనవడు పవన్ కాలువ ప్రమాదంలో మృతి చెందడంతో దిగ్భ్రాంతికి గురయ్యాడు. దేవుడా ఎంత కష్టం పెట్టావంటూ నాగేశ్వరరావు విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కదిలించింది. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, సహచర ప్రజాప్రతినిధులు నాగేశ్వరరావును ఓదార్చే ప్రయత్నం చేశారు. -
హోలీ.. రంగేళి
–నగరంలో ఘనంగా వేడుకలు కర్నూలు(హాస్పిటల్): హోళీరే రంగేళీ హోళీ అంటూ చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు రంగుల హోళీ ఆడుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కర్నూలు నగరంలోని ప్రధాన వీధుల్లో రంగులు చల్లుకున్నారు. రాజవిహార్, పెద్దమార్కెట్, నెహ్రూరోడ్, ఎన్ఆర్ పేట, కొత్తపేట, ప్రకాష్‌నగర్, బుధవారపేట, చాణిక్యపురికాలనీ, శంకరమఠం, ఎన్సీసీ అధికారుల క్వార్టర్స్, మాధవీనగర్, టెలికాంనగర్, నంద్యాల చెక్‌పోస్ట్, బృందావన్‌నగర్, బళ్లారిచౌరస్తా, అశోక్‌నగర్, వెంకటరమణకాలనీ తదితర ప్రాంతాల్లో జనం రంగుల్లో మునిగిపోయారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. ప్రధానంగా ఆదివారం పండుగ రావడంతో పండుగ వాతావరణం మరింత రంగుల మయంగా మారింది. హోళీ అనంతరం సాయంత్రం కామదహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలోనూ ఎంపీ బుట్టా రేణుక, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డితో పాటు పార్టీ కార్యకర్తలు రంగులు పూసుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. -
హోలి సంబరాల్లో పాల్గొన్న బైకర్స్ అరెస్ట్..
ఖాట్మాండు: నేపాల్‌లో 1,295 మంది ద్విచక్ర వాహనదారుల(బైకర్స్)ను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. హోలి సంబరాల్లో పాల్గొన్న యువకులు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడంతో అదుపులోకి తీసుకున్నామని ఖాట్మాండు పోలీసులు తెలిపారు. 694 మందిని కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసామని, 596 మందిని కస్టడీలోకి తీసుకున్నామని చెప్పారు.వీరంతా హెల్మెట్ లేకుండా, అతివేగంతో బైక్‌లు నడిపారని పోలీసులు పేర్కొన్నారు. కొంత మంది పబ్లిక్ ప్రాంతాల్లో మద్యం సేవించారని, మరికొంత మంది అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదులు రావడంతో అదుపులోకి తీసుకున్నామన్నారు. హోలి సందర్భంగా 61 చెక్ పాయింట్లు పెట్టామని, ఖట్మాండు, భాక్తపూర్, లలీత్పూర్ జిల్లాల్లో ఈ అరెస్టులు చేశామని ట్రాఫిక్ అధికారులు తెలిపారు. నేపాల్‌లో హోలిని రెండు రోజులు జరుపుకుంటారు. ముఖ్యంగా భారత్ సరిహద్దు టెరై లోయ ప్రాంతాల్లో జరుపుకోవడానికి యువతి,యువకులు ఉత్సాహం చూపిస్తారు. -
ముద్దొచ్చే ఈ బుజ్జాయి ఎవరో తెలుసా?
ముద్దొచ్చే బొద్దు బుగ్గలతో.. ఫొటో పోజివ్వడం కన్నా చేతిలోనే లడ్డూపైనే మక్కువ చూపిస్తున్న ఈ బుజ్జాయి ఎవరో తెలుసా? బాలం పిచికారీ.. తునే ముజే మారీ.. అంటూ 'హే జవానీ హై దివానీ' సినిమాలో హోలీ పాటతో అలరించిన రణ్‌బీర్ కపూర్ తెలుసు కదా. అతనే ఈ బుజ్జాయి. హోలీ సందర్భంగా అతని చిన్నప్పుడు తీసిన ఫొటో ఇది. మరోసారి దేశమంతా రంగుల్లో తడిసి ముద్దవుతున్న నేపథ్యంలో ఈ అరుదైన హోలీ ఫొటోను రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. రణ్‌బీర్ అభిమానులను ఈ ఫొటో ఆకట్టుకుంటూ ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. Happy n SAFE Holi !!! -
హోలీ వేడుకల్లో కలెక్టర్, కమిషనర్
కరీంనగర్: హోలీ వేడుకలు కరీంనగర్లో కన్నుల పండుగలా జరిగాయి. స్త్రీ పురుష వయోభేదం లేకుండా రంగుల్లో మునిగితేలారు. పరస్పరం రంగులు చల్లుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్లో సీపీ కమలాసన్ రెడ్డి పోలీస్ లతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన హోలీ వేడుకల్లో కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్ తోపాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంబేడ్కర్ స్టేడియంలో జరిగిన హోలీ వేడుకల్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్ సింగ్ పాల్గొని రంగుల్లో మునిగి తేలారు. -
శ్రీదేవిగా యాంకర్ శ్రీముఖి
హైదరాబాద్ : బుల్లితెరపై యాంకరింగ్‌లో దూసుకుపోతున్న యాంకర్ శ్రీముఖి, రవిలు తమ అభిమానులకు వినూత్న రీతిలో హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ హోలీ ఆడుతూ సెలబ్రేట్ చేసుకుంటుంటే ఈ జంట మాత్రం తమ అభిమానుల కోసం ఓ డబ్ స్మాష్‌లో నటించారు. చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన హిట్ చిత్రం జగదేకవీరుడు అతిలోక సుందరిలోని డైలాగులకు డబ్ స్మాష్ చెప్పారు. దీనికి సంబంధించి వీడియోను తన ఫేస్ బుక్ పేజీలో శ్రీముఖి పోస్ట్ చేసింది. మానవ నిన్నే మానవ..నా జనకుడు ఇంద్రుడు.. ఏంటమ్మ ఏంటమ్మ మళ్లీ ఆ కూత కుయ్.. నీజనకుడు ఇంద్రుడా.. అవును మానవ.. స్వర్గాధిపతి ఇంద్రుడు... అధరములు అదిరిపోయే అగ్నిపుట్టినది.. అమృతము లేదా ఇంట.. ఆ.. అమృతమా బయట దుకాణాల్లో దొరుకుతుంది..తెచ్చిపెట్టనా.. మ్యాడ్ అనగానేమి..మ్యాడ్ అంటే పిచ్చి.. పిచ్చి అనగా..నేను చెప్పలేనే తింగర బుచ్చి.. తింగర బుచ్చి అనగా నేమి..అంటూ శ్రీదేవి అమాయకమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో పలికిన డైలాగులను శ్రీముఖి కూడా దేవకన్యాలా దుస్తులు ధరించి అద్భుతంగా చెప్పి అభిమానులను అలరించింది. అంతేకాకుండా పనిలో పనిగా ఈ జంట అబ్బనీతీయనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో.. పాటకు స్టెప్పులు కూడా వేశారు. -
శ్రీదేవిగా యాంకర్ శ్రీముఖి
-
‘హోలీ కూడా జరుపుకోనివ్వరా.. బయటకు నో’
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీలో కొత్త వివాదం రాజుకుంది. యువత ఎంతో సంబురంగా జరుపుకునే హోలీలో తమను పాల్గొనకుండా అడ్డుకున్నారంటూ ఢిల్లీ వర్సిటీ యువతులు వర్సిటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిరంకుశత్వ చర్య అని, తమ స్వేచ్ఛను అడ్డుకోవడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీ పాలన వర్గానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఢిల్లీ యూనివర్సిటీ మహిళల అంతర్జాతీయ విద్యార్థుల వసతి గృహ(ఐఎస్‌హెచ్‌డబ్ల్యూ) అధికారులు మాత్రం విద్యార్థినుల మంచి కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. ‘వర్సిటీలో ఉంటున్నవారు బయటకు వెళ్లేందుకుగానీ, బయట నుంచి అతిథులుగా వచ్చే మహిళా స్నేహితులు లోపలికి వచ్చేందుకుగానీ మార్చి 12 రాత్రి 9గంటల నుంచి మార్చి 13 సాయంత్రం 6గంటల వరకు నిషేధం. మార్చి 12 రాత్రి ఆలస్యంగా వచ్చినవారికి లోపలికి అనుమతి ఉండదు. కేవలం హాస్టల్ గదుల ముందు ప్రాంగణంలో మాత్రమే హోలీ ఆడుకునేందుకు అనుమతిస్తున్నాం’ అని ఐఎస్‌హెచ్‌డబ్ల్యూ ఒక నోటీసులో తెలిపింది. దీనిపై వర్సిటీ విద్యార్థునులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఇండిగో హోలీ ఆఫర్ భళా!
న్యూడిల్లీ: హోలీ పండుగ సందర్భంగా దేశీయ విమాన యాన సంస్థలు తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పటికే విస్తారా డిస్కౌంట్ విమాన టికెట్ ధరలను ప్రకటించగా తాజాగా బడ్జెట్ ధరల ఎయిర్ లైన్స్ ఇండిగో హోలీ తగ్గింపు ధరలను వెల్లడించింది. దేశీయ మార్గాల్లో రూ. 899ల ప్రారంభమయ్యే ధరలను ఆపర్ చేస్తోంది. మార్చి 15వరకు బుక్ చేసుకున్న ఈ టికెట్ల ద్వారా సెప్టెంబర్ 19 , 2017 దాకా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపింది. This Holi, we have made everything lovelier with our 6E special fares. Book before 15th March and go fly. https://t.co/LyuuPWF6Pk pic.twitter.com/gDAMPlIf4v — IndiGo (@IndiGo6E) March 10, 2017 -
వైభవం.. కామదహనోత్సవం
శ్రీశైలం: హోలీ పౌర్ణమికి ముందు కాముని చిత్రపటాన్ని శాస్త్రోక్తంగా దహింపజేయడం శ్రీశైల మహాక్షేత్రంలో ఆనవాయితీ. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి 7.గంటలకు ఉత్సవమూర్తులను పల్లకిలో అధిష్టింపజేసి ప్రధాన మాడ వీధిలోని గంగాధర మండపం వద్దకు చేర్చారు. అక్కడ కాముని చిత్రపటాన్ని గడ్డితో ఏర్పాటు చేసిన దానిపై ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత వేదమంత్రోచ్చారణల మధ్య కాగాడాలతో కామ(మన్మథ రూపాన్ని) దహనం చేశారు. శివుని తపోభంగం చేసిన పాల్గున శుద్ధ చతుర్దశి రోజున మన్మథుడిని త్రినేత్రంతో దగ్ధం చేశారని, ఈ కామదహన క్రతువును దర్శించడం వల్ల శివకటాక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. -
నాలుగు రోజులు మిర్చి కొనుగోళ్లు బంద్
- హోలీ సందర్భంగా సెలవు ప్రకటించిన వ్యాపారులు కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): కర్నూలు మిర్చి యార్డులో నాలుగు రోజుల పాటు మిర్చి కొనుగోళ్లు బంద్ కానున్నాయి. ఈమేరకు యార్డు కార్యదర్శి నారాయణమూర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11, 12, 13, 14 తేదీల్లో కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మిర్చి వ్యాపారలందరూ రాజస్థాన్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడం, హోలీ వేడుకల నిర్వహణ కోసం సొంతూళ్లకు వెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నాలుగు రోజుల పాటు అనుమతినివ్వాలని వ్యాపారులు కూడా వినతి పత్రం అందించడంతో కొనుగోళ్లు నిలిపివేస్తన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు యార్డు పరిధిలోని పలు గ్రామాలకు ఈ సమాచారం చేరవేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
అతడు సంవత్సరంలో రెండుసార్లే స్నానం చేస్తాడు!
లక్నోః తన భర్త ప్రతిరోజూ స్నానం చేయడంలేదంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన వింత ఘటన లక్నోలో వెలుగు చూసింది. సంవత్సరంలో వచ్చే హోలీ, దీపావళి సందర్భాల్లో మాత్రమే అతడు స్నానం చేస్తాడని అతడిని భరించలేక పోతున్నానని కంప్లైంట్ చేసింది. మానసిక, శారీరక వేధింపులను తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేసే ఎన్నోరకాల గృహ హింస కేసులను చూసిన వారికి ఈ కేసు వింతగానే అనిపించొచ్చు. కానీ దీన్ని కూడ హింసగానే భావించిన ఆమె సదరు భర్తపై ఫిర్యాదు చేసింది. ఉత్తర ప్రదేశ్ లక్నో భాగ్‌పత్ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళ తనను భర్త వేధింపులనుంచి కాపాడమంటూ ఎస్పీ రవి శంకర్ కు ఫిర్యాదు చేసింది. తన భర్తవల్ల తన ప్రాణానికి ప్రమాదముందని తెలిపింది. ఇంతకూ భర్త ఆమెను ఎటువంటి వేధింపులకు గురి చేస్తున్నాడో ఆరా తీసిన పోలీసులు.. అసలు విషయం తెలియడంతో అవాక్కయ్యారు. తన భర్త సంవత్సరంలో రెండుసార్లు మాత్రమే స్నానం చేస్తాడని, అదీ హోలీ, దీపావళి పండుగ రోజుల్లో మాత్రమే స్నానం చేస్తాడని, మిగిలిన రోజుల్లో స్నానం చేయమని ఎంత చెప్పినా వినిపించుకోడని సదరు మహిళ పోలీసులతో వాపోయింది. స్నానం విషయంలో భర్త మొండితనాన్ని భరించలేని ఆమె... అతడిపైనా, అతడి కుటుంబ సభ్యులపైనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడే కాక, అతడి ఇంట్లోనివారంతా ఇలాగే ప్రవర్తిస్తారని, ఏమాత్రం శుభ్రత పాటించరని ఆందోళన వ్యక్తం చేసింది. కుటుంబ సభ్యులంతా గతేడాది దీపావళికి స్నానం చేశారని అప్పటినుంచీ తిరిగి స్నానం చేయమంటే చేయడం లేదని, పైగా శుభ్రత గురించి తమకు చెప్పాల్సిన పని లేదంటారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఆ బాధితురాలి బాధను విన్న పోలీసులు... కేసును మహిళా పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. త్వరలోనే సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉందని ఎప్పీ రవిశంకర్ తెలిపారు. -
గోమూత్రం, గోమయంతో నాగా సాధువుల హోలీ
హోలీని ఒక్కొక్కరు ఒక్కోలా జరుపుకొంటున్నారు. ఉజ్జయినిలోని అఖాడాలకు చెందిన నాగా సాధువులు గోమూత్రం, గోమయాలతో ఈ పండుగను జరుపుకొన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. శైవ, వైష్ణవ సాధువులు గో మూత్రాన్ని, గోమయాన్ని కలిపి వాటిని ఒకరిపై ఒకరు పోసుకున్నారు. ఆ సమయంలో ఆధ్యాత్మిక నినాదాలు చేసుకున్నట్లు ఆలిండియా అఖాడా పరిషత్ సభ్యులు తెలిపారు. ఏప్రిల్ 22 నుంచి సింహస్త ఉత్సవం ప్రారంభం కానుంది. దాంతో ఇప్పటికే భారీ సంఖ్యలో సాధువులు ఉజ్జయినికి చేరుకున్నారు. ఆవుపేడ అత్యంత పవిత్రమైనదని, అది కృష్ణుడికి కూడా ఇష్టమని అఖిల భారతీయ అఖాడా పరిషత్ (ఏబీఏపీ) అద్యక్షుడు మహంత్ నరేంద్రగిరి చెప్పారు. సాధువులు వివిధ కార్యక్రమాలలో గోమూత్రం, గోమయాలను ఉపయోగిస్తూనే ఉన్నారన్నారు. దేశంలోని 13 అఖాడాలతో కూడిన అఖాడా పరిషత్‌కు నిరంజనీ అఖాడాకు చెందిన మహంత్ నరేంద్రగిరి అధ్యక్షత వహిస్తున్నారు. కుంభమేళా సమయంలో కూడా సాధువులు గోమయాన్ని, మూత్రాన్ని ఉపయోగించి గణేశుడి ఆశీస్సులు తీసుకుంటారని జూనా అఖాడాకు చెందిన మహంత్ హరిగిరి చెప్పారు. అన్ని సందర్భాల్లోనూ దేవుడి విగ్రహాలను ఉపయోగించలేమని, అందువల్ల కొన్నిసార్లు గోమయాన్ని గణేశుడికి ప్రతిరూపంగా భావిస్తారని ఆయన తెలిపారు. ఇక గోమయంతో కలిసిన గోమూత్రం మంచి మందు అని, ఇది యాంటీసెప్టిక్‌గాను, ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి ఉపయోగపడుతుందని మహంత్ రాజేంద్ర దాస్ జీ అన్నారు. -
హోలీ రోజున.. చలానాల పంట
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హోలీ సంబరాలు అంబరాన్ని తాకగా.. కొందరి అత్యుత్సాహం వల్ల పోలీసులకు చలాన్ల రూపంలో భారీ మొత్తం వసూలైంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 5624 మంది నుంచి 5.51 లక్షల రూపాయలను వసూలు చేసినట్టు పోలీసులు చెప్పారు. 'హోలీ రోజున గురువారం ట్రాఫిక్ పోలీసులు 5624 మంది వాహనదారులకు చలానా వేశారు. మద్యం తాగి వాహనం నడపడం, బైకులపై ముగ్గురు వెళ్లడం, మితిమీరిన వేగంతో వాహనం నడపడం, హెల్మెట్లు ధరించకపోవడం, రాంగ్ రూట్లో వెళ్లడం వంటి కేసుల్లో చలానాలు వసూలు చేశాం. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య చలానాల రూపంలో 5.51 లక్షల రూపాయలు వసూలైంది' అని ఢిల్లీ ప్రత్యేక కమిషనర్ ముక్తేష్ చందర్ చెప్పారు. ఇక హోలీ రోజున ట్రాఫిక్ పోలీసులు 1085 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నగరంలో కనీసం 403 ట్రాఫిక్ పోలీసు బృందాలను మోహరించామని చెప్పారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో చలానాల రూపంలో 9.22 లక్షల రూపాయలు వసూలైనట్టు చెప్పారు. గతేడాది మొత్తం 64.53 కోట్ల రూపాయలను ట్రాఫిక్ పోలీసులు వసూలు చేసినట్టు ముక్తేష్ చందర్ తెలిపారు. -
కొడుకు హోలీ ఆడితే.. తండ్రి తన్నులు తిన్నాడు!
కల్యాణి: హోలీ పండుగ ఓ స్కూలు టీచర్ కు చిక్కులు తెచ్చిపెట్టింది. కుమారుడు చేసిన పనికి టీచర్ ఓ పోలీస్ చేతిలో తన్నులు తినాల్సి వచ్చింది. ఈ సంఘటన పశ్చిమబెంగాల్ లోని నదియా జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి... నదియా జిల్లా కల్యాణిలో ఓ ప్రభుత్వ పాఠశాలలో మనోరంజన్ సస్మాల్ టీచర్ గా పనిచేస్తున్నాడు. టీచర్ కుమారుడు హోలీ ఆడుతున్నాడు. ఈ క్రమంలో పోలీసు వాహనంపై పొరపాటుగా రంగు చల్లాడు. దీంతో ఆగ్రహించిన ఏఎస్సై సుమన్ ఘోష్ ఆ పిల్లవాడి తండ్రిని ఇందుకు బాధ్యుడిని చేశాడు. ఏడేళ్ల ఆ చిన్నారి రంగులు చల్లినందుకు టీచర్ ను ఆగ్రహానికి గురైన ఏఎస్స చితక్కొట్టాడు. పోలీస్ స్టేషన్ కు ఈడ్చుకెళ్లాడు. ఆ తర్వాత వదిలేయడంతో ఇంటికి వెళ్లిపోయాడు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి గాయాలకు చికిత్స తీసుకున్నాడు. తనపై ఏఎస్సై కావాలనే దురుసుగా ప్రవర్తించాడని, తనపై చెయ్యి చేసుకున్నాడని ఫిర్యాదుచేశాడు. విచారణ ప్రారంభించినట్టు ఓ పోలీస్ అధికారి తెలిపారు. అయితే తాను టీచర్ ను కొట్టలేదని తనకు దాడి ఘటనను ఎలాంటి సంబంధం లేదంటూ సుమన్ ఘోష్ చెప్పాడు. -
రాహుల్ ఏంటి అంత స్మార్ట్ అయ్యారు?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మునుపెన్నడూ లేనంత స్మార్ట్‌గా కనిపించాడు. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ సరిగా షేవ్ చేసుకోనట్లు వ్యక్తిగత అలంకరణ మీద పెద్దగా దృష్టి పెట్టనట్లు కనిపించిన ఆయన గురువారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఏఐసీసీ వద్ద చాలా హ్యాండ్ సమ్ గా కనిపించారు. ఒక్కమాటలో చెప్పాలంటే నానీ సినిమాలో మహేశ్ బాబు మాదిరిగా అన్నమాట.. తల్లి సోనియాగాంధీ, ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలతో కలిసి ఆయన హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. తెల్లని వస్త్రాల్లో వచ్చిన ఆయనకు పలువురు కాంగ్రెస్ నేతలు, అభిమానులు ఈ సందర్భంగా రంగులు చల్లుతుండగా ఉత్సాహంగా కనిపించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. -
రంగులు చల్లుకున్న హిందూ, ముస్లింలు
ఢాకా: బంగ్లాదేశ్‌లోనూ హిందువులు హోలి పండుగను ఘనంగా జరుపుకొన్నారు. హోలి రంగుల్లో తడిసిపోతూ.. నృత్యాలు చేస్తూ వీధుల్లో హోరెత్తించారు. హోలి ప్రధానంగా హిందువుల పండుగే అయినప్పటికీ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో హిందువులతోపాటు ముస్లింలు కూడా రంగులు చల్లుకుంటూ కనిపించారు. హిందు, ముస్లిం స్నేహితులు రంగుల్లో తడిసిపోతూ.. తమలోని సామరస్య భావనను చాటుకున్నారు. ఢాకాలోని ఓల్డ్ సిటీ ప్రాంతంలో చాలామంది హిందువులు ఉదయమే దేవాలయాలను సందర్శించి పూజలు నిర్వహించారు. ముఖ్యంగా బెంగాలీ హిందువులు దుర్గామాత పూజలు నిర్వహించారు. దుర్గమాతను ఆరాధించే పండుగల్లో హోలీ కూడా కీలకమైనదిగా బెంగాలీలు భావిస్తారు. ఇక ఢాకా యూనివర్సిటీ కూడా రంగుల్లో తడిసిపోయింది. నృత్యాలతో హోరెత్తింది. ఇక్కడ విద్యార్థులు కులమతాలకు అతీతంగా హోలీ పండుగ జరుపుకొన్నారు. హోలీ పండుగ స్నేహాన్ని ఐక్యతను చాటుతుందని, మతాల మధ్య ఉన్న అంతరాన్ని దూరం చేస్తుందని, అందుకే అందరితో కలిసి హోలీ ఆడుతున్నామని బంగ్లా హిందువులు తెలిపారు. -
హోలీతో టీం ఇండియా ఫుల్ జోష్
బంగ్లాదేశ్‌తో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో చివరి మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి గట్టెక్కిన టీం ఇండియా గురువారం ఫుల్ జోష్ మీదుంది. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకు పోరాడి ఒక్క పరుగుతో విజయం సాధించిన భారత ఆటగాళ్లు హోలీ పండుగను హుషారుగా జరుపుకున్నారు. విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, హర్బజన్ సింగ్, శిఖర్ ధవన్, రోహిత్ శర్మలు, మహేంద్రసింగ్ ధోనిలు టీం ఇండియా బస్సులో రంగులు పూసుకుంటూ హోలీ పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. బంగ్లాదేశ్ పై అనూహ్య రీతిలో గెలుపొందిన భారత్ సెమీస్ పై ఆశలు సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం గ్రూప్ బీలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే ఫైనల్ ఫోర్లో చోటు దక్కే అవకాశం ఉంది. #Ind's @imVkohli and @harbhajan_singh wishing everyone a Happy Holihttps://t.co/HLrphNxzfM — BCCI (@BCCI) March 24, 2016 Happy Holi #Ind - @msdhoni @YUVSTRONG12 @harbhajan_singh @SDhawan25 @ImRo45 pic.twitter.com/kxme0s0II2 — BCCI (@BCCI) March 24, 2016 -
తడిసిన బట్టల్లో వారిని చూసేందుకు హోలీ!
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం సోషల్ మీడియాలో హల్చల్ చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రంగుల పండుగ హోలీని కూడా వదల్లేదు. హిరణ్య కశ్యపుడి చెల్లెలు హోలిక నుంచి ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడినందుకు మీరంతా హోలీని సంతోషంగా జరుపుకొంటారని, తనకు మాత్రం ఈ పండుగ నాడు భంగ్ తినడం, శృంగారం ఒలికించే అమ్మాయిలను చూడటం, పాఠశాలను ఎగ్గొట్టడం వంటివే సంతోషం కలిగించేవని ట్వీట్ చేశాడు. హోలీ సందర్భంగా లభించే ఏకైక ఆనందం.. యువతులను తడిసిన దుస్తుల్లో ఒరకంట చూడటమేనని, దీనికి పెద్దల ఆమోదం కూడా ఉంటుందని, వారిని అలా చూస్తూ ఫీలైన చెంపదెబ్బ తినకుండా తప్పించుకోవచ్చునని తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. హోలీ రోజు ఎవరు ఎవరిని చంపారు? ఎందుకు చంపారు అన్న కారణాలు ఏమీ తెలియకుండానే చాలామంది పండుగను జరుపుకొంటున్నారని, కొందరు భంగ్ వంటివి ఆస్వాదించడం కోసం పండుగ జరుపుకుంటారని పేర్కొన్నాడు. -
హోలీరే హోలి..!
-
'శక్తిమాన్'తో పోలీసుల హోలీ
ఉత్తరాఖండ్ పోలీసులు హోలీని విభిన్నంగా నిర్వహించారు. ఒకరిపై ఒకరు రంగులు, నీళ్లు చల్లుకొని ఆనందాన్ని పంచుకునే సందర్భంలో ఆ పోలీసులు తమ ఆనందాన్ని తమతో పాటు విధులు నిర్వహించే మూగజీవంతో పంచుకున్నారు. అభిమానులు, మిత్రులు, బంధువులపై రంగులు చల్లడానికి బదులు ఇటీవల గాయపడిన పోలీసు గుర్రం 'శక్తిమాన్'కు రంగులద్ది తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. డెహ్రాడూన్‌లో ఇటీవల జరిగిన ప్రదర్శనలో గొడవ జరిగి.. పోలీసు గుర్రం కాలు విరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కాలు విరిగిపోయిన శక్తిమాన్‌కు వైద్యులు ఆపరేషన్ చేసి, కృత్రిమ కాలు అమర్చారు. దాంతో అది లేచి నిలబడింది కూడా. అలా కోలుకున్న గుర్రంతో డెహ్రాడూన్ పోలీసులు హోలీ ఆడుకున్నారు. -
హోలీ వేడుకల్లో సోనియా, రాహుల్
న్యూ ఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజలు గురువారం హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఢిల్లీలో పలువురు రాజకీయ ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల నడుమ ఉత్సాహంగా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సాదుగురు జగ్గీ వాసుదేవ్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. మరో కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఆయన నివాసంతో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
బురదతో మహిళల హోలీ!
హోలీ అంటే రంగుల పండుగ. పసుపు, గులాబి, ఎరుపు, ఆకుపచ్చ.. ఇలా సప్తవర్ణాలు ముఖాల మీద పులుముకొని ఆడుకోవడం మనకందరికీ తెలుసు. కానీ ఒకే ఒక్క రంగుతో హోలీ ఆడటం ఎప్పుడైనా చూశారా? అది కూడా బురదతో!! అవును.. రాజస్థానీ మహిళలు హోలీని చాలా విభిన్నంగా చేసుకున్నారు. కెమికల్ రంగులతో పాటు ఆర్గానిక్ రంగులు కూడా అక్కర్లేదని చెబుతూ.. ప్రకృతి వైద్య చికిత్సగా భావించే మడ్ బాత్‌ను తలపించేలా బురద మట్టితో స్నానాలు చేస్తూ హోలీ పండుగను నిర్వహించారు. అందరికీ భిన్నంగా మట్టిని స్విమ్మింగ్ పూల్ గా మార్చుకొని హోలీ సంబరాలు జరుపుకున్నారు. ప్రకృతి చికిత్సా విధానంలో చర్మవ్యాధులు, చుండ్రు వంటి వ్యాధులను తగ్గించేందుకు, శరీరంలోని మలినాలను తొలగించేందుకు బురదతో చికిత్స అందిస్తుంటారు. రేగడి మట్టిని మెత్తగా బురదలా చేసి తలనుంచి పాదాల వరకూ పట్టించి, ఆరిన తర్వాత స్నానం చేయిస్తారు. ఇలా చేయడం వల్ల ముఖ్యంగా వేసవిలో శరీరంలోని ఉష్ణతాపం వల్ల వచ్చే చెమట, మలినాలు బయటకు వచ్చి, చర్మవ్యాధులుంటే నశిస్తాయి. ప్రస్తుతం ఉదయపూర్ మహిళలు ఇదే పద్ధతిని హోలీతో రంగరించారు. చిన్నా పెద్దా కేరింతల మధ్య బురదలో మునిగితేలారు. -
హోలీ వేడుకలు చేసుకుంటున్నారా.. జాగ్రత్త!
న్యూఢిల్లీ: హోలీ వేడుకలు చేసుకునేటపుడు ప్రజలు, ముఖ్యంగా చిన్న పిల్లలు కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్లో అమ్మే రంగులకు బదులుగా, సొంతంగా తయారు చేసిన రంగులతో హోలీ సంబరాలు చేసుకుంటే మంచిదని తెలియజేశారు. పూలు, మూలికలతో కలిపి రంగులను తయారు చేసుకుంటే మంచిదని సూచించారు. మార్కెట్లో అమ్మే రంగులను ఎక్కువగా రసాయనాలతో తయారు చేస్తారని, వీటిని వాడటం వల్ల చర్మం, కళ్లకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరించారు. ప్రతి ఏటా హోలీ తర్వాత ఇలాంటి కేసులు వస్తున్నాయని తెలిపారు. మార్కెట్లో పేస్ట్, పౌడర్, ద్రవ రూపంలో లభ్యమయ్యే రంగులను రసాయనాలను ఉపయోగించి తయారు చేస్తున్నారని చెప్పారు. మరికొందరు క్రోమియం, మెర్కురీలతో రంగులను తయారు చేస్తున్నారని, ఇవి చాలా ప్రమాదమని హెచ్చరించారు. -
బృందావన్ వితంతువుకూ హోలీ
బృందావన్: జీవితంలో ఎలాంటి సుఖాలు ఎరుగకుండా నిత్యం శ్రీకృష్ణ భగవానుడు ధ్యానంలో బతుకుబండి లాగించే బృందావన్ పట్టణ వితంతువుల్లో ఈ సారి నిజంగా వసంతం విరిసింది. హోలి పండుగ వారికి కొత్త రంగులు పులిమింది. వారి తెల్లచీరలు రంగుల హరివిల్లుగా మారాయి. వారి వితంతు జీవితాల్లో మొట్టమొదటి సారిగా హోలి పండుగ సందడి చేసింది. పట్టణంలో దాదాపు ఆరువేల మంది వితంతువులు ఉండగా, వెయ్యిమందికి పైగా హోలి వేడుకల్లో పాల్గొన్నారు. వారి సౌఖ్యం కోసం కృషి చేస్తున్న ‘సులభ్ ఇంటర్నేషనల్’ ఎన్జీవో సంస్థ వారికీ అవకాశం కల్పించింది. నిత్యం శ్రీకృష్ణ నామస్మరణం మారుమ్రోగే బృందావనంలో జరిగే ఏ వేడుకల్లో కూడా వితంతువులు పాల్గొనరాదు. వారిని అనుమతించరు. అనాదిగా వస్తున్న ఆచారమది. సమాజంలో కూడా ఈ అనాచారం ఇప్పటికీ కొనసాగుతోంది. రాఖీ పండగ వేడుకల్లో వితంతువులు చురుగ్గా పాల్గొనేలా చేసిన సులభ్ ఇంటర్నేషనల్ సంస్థనే ఈసారి హోలి వేడుకల్లో వితంతువులు పాల్గొనేందుకు చొరవ తీసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వితంతువుల యోగక్షేమాలను చూసుకుంటున్న సులభ్ ఇంటర్నేషనల్ ఈ హోలీలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు వితంతువులు కృతజ్ఞతలు తెలిపారు. అందరిలో తమను కలిపేసినందుకు వారానందం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో 22 ఏళ్ల వయస్సు నుంచి వందేళ్ల వయస్సున్న వారి వరకు వితంతువులు ఉన్నారు. వారిలో అన్ని రాష్ట్రాలకు చెందిన వారున్నారు. ఇంట్లోవాళ్లు ఎల్లగొడితే వచ్చి ఇక్కడ చేరిన వారే ఎక్కువ. వారిలో నా అన్న వాళ్లు లేనివారు కూడా ఉన్నారు. పట్టణంలో వారికి నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి. వాటిలో తలదాచుకునే అవకాశం దొరకని వారు బిచ్చం ఎత్తుకుంటూ రోడ్లపైన జీవిస్తున్న వారే ఎక్కువ. హోలి పండుగ వారి జీవితాల్లో కొత్త వసంతాలు పూయిస్తాయోమో చూడాలి! -
పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులు
ట్రేడింగ్ మూడు రోజులే ♦ హోలీ, గుడ్‌ఫ్రైడే సందర్భంగా ♦ గురు, శుక్రవారాలు సెలవు ♦ అంతర్జాతీయ సంకేతాలే కీలకం ♦ ఆర్బీఐ రేట్ల కోత అంచనాల ప్రభావమూ ఉండొచ్చు ♦ ఈ వారం స్టాక్ మార్కెట్‌పై నిపుణుల విశ్లేషణ న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ ఈ వారం ఒకింత ఒడిదుడుకులమయంగా సాగుతుందని విశ్లేషకులంటున్నారు. దేశీయంగా ఎలాంటి ప్రధాన సంఘటనలు లేనందున అంతర్జాతీయ సంకేతాలు, డాలర్‌తో రూపాయి కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులపైననే ఈ వారం స్టాక్ మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుందని వారు భావిస్తున్నారు. ఈ నెల 24(గురువారం -హోలీ), 25 (శుక్రవారం- గుడ్‌ఫ్రైడే) సెలవుల కారణంగా ఈ వారంలో ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితం కానున్నది. రెండు రోజుల సెలవుల కారణంగా ట్రేడింగ్ నిస్తేజంగా ఉండొచ్చని, మూడు రోజుల పాటే ట్రేడింగ్ జరుగుతుంది కాబట్టి స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులు ఉండొచ్చని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. వచ్చేవారమే మార్చి నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నందున ట్రేడర్లు తమ పొజిషన్లను రోల్ఓవర్ చేసుకోవడం ప్రారంభిస్తారని, దాంతో హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్ల పోకడలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, ముడి చమురు ధరల కదలికలు తదితర అంశాలపై ఈ వారం మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుందని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా పేర్కొన్నారు. ఆర్బీఐ రేట్ల కోత అంచనాలు మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయని జియోజిత్ బీఎన్పీ పారిబా హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. ఇక అంతర్జాతీయ అంశాల విషయానికొస్తే, అమెరికా, ప్రస్తుత ఇళ్ల అమ్మకాల గణాంకాలను సోమవారం నాడు, కొత్త ఇళ్ల అమ్మకాల గణాంకాలను బుధవారం నాడు వెల్లడించనున్నది. శుక్రవారం నాడు క్యూ4 జీడీపీ గణాంకాలను విడుదల చేస్తుంది. యూరోజోన్ మార్కిట్ పీఎంఐ కాంపొజిట్ ఇండెక్స్ గణాంకాలు గురువారం వస్తాయి. కాగా గత వారం బీఎస్ఈ సెన్సెక్స్ 235 పాయింట్లు లాభపడి 24,953 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 7,604 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్ మార్కెట్ వరుసగా మూడో వారమూ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ రెండు నెలల గరిష్ట స్థాయికి చేరింది. సెన్సెక్స్ 25 వేల పాయింట్లకు చేరువ కాగా, నిఫ్టీ కీలకమైన 7,600 పాయింట్ల పైన ముగిసింది. క్యూ4 ఫలితాలు కీలకం..: సమీప భవిష్యత్తులో కంపెనీల క్యూ4 ఫలితాలే మార్కెట్‌కు కీలకం కానున్నాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. వచ్చే నెల రెండో వారం నుంచి కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు వెల్లడించడం ప్రారంభిస్తాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో స్టాక్మార్కెట్లో జోరుగా పెట్టుబడులు పెడుతున్నారు. ఆర్బీఐ పాలసీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు, అంతర్జాతీయ మార్కెట్లు రికవరీ కావడం వంటి కారణాల వల్ల ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు రూ.11,000 కోట్లు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెల 18 వరకూ రూ.11,166 కోట్లు పెట్టుబడులు పెట్టారు. డెట్ మార్కెట్ నుంచి రూ.1,027 కోట్లు పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. వెరశి నికర పెట్టుబడులు రూ.10,140 కోట్లు. ఎఫ్‌పీఐలు ఈక్విటీ మార్కెట్ల నుంచి జనవరిలో రూ.11,126 కోట్లు, ఫిబ్రవరిలో రూ.5,521 కోట్ల చొప్పున ఉపసంహరించుకున్నారు. -
పాకిస్థాన్ లో హిందువులకు తీపికబురు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో మైనారిటీలైన హిందువులు, క్రైస్తవులకు తీపి కబురు అందింది. హోలి, దీపావళి, ఈస్టర్ పండులకు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ మంగళవారం ఒక తీర్మానం ఆమోదించింది. 'మైనారిటీల కోసం హోలి, దీపావళి, ఈస్టర్ పర్వదినాలకు సెలవు ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఈ సభ కోరుతోంది' అని తీర్మానం చేసింది. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ నేత రమేశ్ కుమార్ వంక్వానీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ముస్లింమేతర పండుగలకు మైనారిటీలకు సెలవులు మంజూరు చేసేందుకు సమాఖ్య వ్యవస్థలు, వివిధ విభాగాలు, సంస్థల ప్రధానాధికారులకు ఆంతరంగిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే అనుమతి ఇచ్చిందని మతవ్యవహారాల శాఖ మంత్రి పిర్ అమినుల్ హస్నాత్ షా తెలిపారు. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానానికి ప్రభుత్వం కట్టుబడితే హోలి, దీపావళి, ఈస్టర్ పండులకు సెలవు ప్రకటిస్తూ ఆంతరంగిక మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేయనుంది. -
సీన్ మారిందా!
ఫిల్మీ దునియాలో హాట్ కపుల్ ఎవరంటే ఠక్కున చెప్పే పేర్లు రణబీర్‌కపూర్, కత్రినాకైఫ్. ఎక్కడా ఆ విషయాన్ని బయట పెట్టలేదు గానీ... చాలాకాలంగా ఇద్దరూ డేటింగ్లో మునిగి తేలుతున్నారు. ఇక వీరి లవ్ రేస్‌లో మిగిలింది పెళ్లి బాజానే అనుకుంటున్న సమయంలో హోలీ సాక్షిగా అందరికీ షాకిచ్చింది రణబీర్ తల్లి నీతూకపూర్. మాజీ ప్రియురాలు దీపికాపడుకొనేతో హోలీ ఆడుతున్న రణబీర్ పిక్చర్‌ను సామాజిక సైట్లో పోస్ట్ చేసి జనాల మదిలోకి ఓ సరికొత్త ఆలోచనల్ని పరిగెత్తించింది. ప్రస్తుతం ఓ సినిమాలో చేస్తున్న దీపిక, రణబీర్‌లు వాలంటైన్స్ డేను కలసి ఎంజాయ్ చేశారని సమాచారం. దీంతో కత్రినా, రణబీర్‌ల మధ్య ఏదో జరిగిపోతోందని గుసగుసలు మొదలయ్యాయి. నీతూ లేటెస్ట్ పోస్ట్‌తో ఆ గుసగుసలకు మరింత బలం వచ్చినట్టయిందనేది ఇండస్ట్రీ టాక్! -
హోలీ అంటే.. ఆ చిన్నారికి ఇక భయమే !
లక్నో: పిల్లల్ని, పెద్దల్ని ఒక్కటి చేసి ఆడుకునే పండగ హోలీ. ఆ హోలీ పండగ అనగానే ఐదేళ్ల వయస్సు ప్రభాత్ చౌహన్‌కు గతంలో ఉన్న ఊపు ఉత్సాహం ఇకపై ఉండదేమో. ఎందుకంటే శుక్రవారం హోలీ వేడుకల సందర్బంగా అతడి జీవితంలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. హోలీ పండగ నేపథ్యంలో చిన్నారి చేతి నిండా రంగులు తీసుకుని తల్లిదండ్రులపై చల్లేందుకు వేగంగా పరిగెత్తాడు. ఆ క్రమంలో అక్కడే ఉన్న ఐరన్ రాడ్ ప్రభాత్ కుడివైపు ఛాతీ భాగంలోకి దూసుకువెళ్లింది. దాంతో హాతాశులైన అతడి తల్లిదండ్రులు వెంటనే ఫజియాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ జిల్లా కుడీబర్లో చోటు చేసుకుంది. ఆసుపత్రి వైద్యులు అనేక గంటలు కష్టపడి అతడి ఛాతీ భాగంలోని ఐరన్ రాడ్‌ను తొలిగించారు. అనంతరం ప్రభాత్ కు శస్త్ర చికిత్స నిర్వహించారు. బాలుడు ప్రస్తుతం కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారు. ప్రభాత్ ఉపిరితిత్తులకు ఐరన్ రాడ్ గుచ్చుకోలేదని... దీంతో అతడికి పెద్ద ప్రమాదం తప్పిందని వైద్యులు వెల్లడించారు. -
ఘనంగా హోలీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా హోలీ వేడుకలను శుక్రవారం ఆనందోత్సాహతో ఘనంగా జరుపుకున్నారు. ఆబాలగోపాలం రంగులు చల్లుకుంటూ, ఆటపాటలతో సందడి చేశారు. ఢిల్లీలో వీధులన్నీ రంగులతో నిండిపోయాయి. పలు హోటళ్లు, క్లబ్బులు వేడుకలను నిర్వహించాయి. పాక్‌లో సంఘీభావం. కరాచీ: పాకిస్తాన్లో హోలీ సంబరాలు జరుపుకుంటున్న హిందువులకు స్థానిక విద్యార్థులు రక్షణగా నిలిచారు. కరాచిలోని స్వామి నారాయణ్ ఆలయంలో వేడుకలకు నేషనల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ సభ్యులు మానవ కవచంగా ఏర్పడి సంఘీభావం తెలిపారు. పరమత సహనం, సామ రస్యం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. -
హోలి సంబరాల్లో పాటించాల్సిన జాగ్రత్తలు
-
హోలీ వేడుకలకు మానవ కవచంగా ఎన్ఎస్ఎఫ్
పాకిస్థాన్‌లో హోలీ వేడుకలకు ఎలాంటి అవరోధం ఏర్పడకుండా అక్కడి విద్యార్థి ఫెడరేషన్ సంఘాలు మానవ కవచంగా నిలిచాయి. కరాచీలోని స్వామి నారాయణ్ ఆలయంలో హోలీ వేడుకలకు భారీ సంఖ్యలో హిందువులతోపాటు చాలామంది హాజరు కానుండటంతో వారికి రక్షణగా ది నేషనల్ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎన్ఎస్ఎఫ్) మానవ కవచంగా ఏర్పడి ఆలయ ప్రాంగణాన్ని రక్షిస్తూ వేడుకలకు వచ్చేందుకు స్వాగతం పలుకుతోంది. ఈ సంస్థ గతంలో షియాలకు మద్దతుదారులుగా ఉండగా ప్రస్తుతం హిందువులకు కూడా సానుభూతి సంస్థగా మారి వారికి అవసరమైన సేవలను అందిస్తోంది. సామాజిక సంబంధాల వెబ్సైట్ల ద్వారా హోలీ వేడుకలకు ఆహ్వానం పలుకుతోంది. -
ఉపరాష్ట్రపతి, ప్రధాని హోళీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీలు దేశ ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంగుల పండుగ భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నమని అన్సారీ తన సందేశంలో పేర్కొన్నారు. వసంత రుతువు రాకకు సూచిక అయిన హోళీని జాతి, మత, ప్రాంతాలకు అతీతంగా దేశ ప్రజలందరూ వేడుకగా జరుపుకోవాలని కోరారు. 'ఈ రంగుల పండుగ మీజీవితాల్లో ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నాను' అని ప్రధాని ట్వీట్ చేశారు. -
అడిగినంత ఇవ్వలేదని హిజ్రాల దాడి
కేసు నమోదు చేసిన పోలీసులు అడ్డగుట్ట: అడిగినంత చందా ఇవ్వలేదని మొబైల్ షాపు యజమానిపై ిహ జ్రాలు దాడి చేసి, రూ. 30 వేలు విలువ చేసే బంగారు గొలుసు లాక్కొన్నారు. బాధితుడు వారి బారి నుంచి తప్పించుకొని పారిపోగా.. హిజ్రాలు షాపులోని కుర్చీలను విరగ్గొట్టడంతో పాటు వస్తువులను ధ్వంసం చేశారు. తుకారాంగేట్ పోలీస్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం... అడ్డగుట్ట డివిజన్‌కు చెందిన శ్రీనివాస్ తుకారాంగేట్ మీనా హాస్పటల్ ఎదురుగా తిరుమల కమ్యునికేషన్స్ అండ్ మొబైల్ దుకాణం నడుపుతున్నాడు. అయితే, బుధవారం రాత్రి కొందరు హిజ్రాలు దుకాణానికి వచ్చారు. హోళీ సందర్భంగా తమకు చందా ఇవ్వాలని యజమాని శ్రీనివాస్‌ను అడిగారు. అతను రూ. 50 ఇవ్వగా.. తమకు రూ. 500 కావాలని పట్టబట్టారు. అంత ఇవ్వలేనని శ్రీనివాస్ అనడంతో హిజ్రాలందరూ కలిసి అతని పై దాడి చేసి మెడలోని గొలుసు లాక్కున్నారు. బాధితుడు వారి బారి నుంచి తప్పించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం హిజ్రాలు దుకాణంలోని వస్తువులన్నీ ధ్వంసం చేసి, కుర్చీలు విరగ్గొట్టి, స్టిక్కర్లను చింపేశారు. కౌంటర్లో ఉన్న డబ్బును కూడా హిజ్రాలు ఎత్తుకెళ్లారని బాధితుడు తెలిపారు. గురువారం ఉదయాన్నే బాధితుడు తుకారాంగేట్ పోలీస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముఝె అస్లీ రంగ్ దే..
ఒక చెంపకు బంతి.. మరోవైపు చామంతి. ఇదిగో మోదుగ.. అదిగో ఇండిగో ! పూవులో పూవునై.. రంగులో రంగునై ఈ హోలీ ఆడుకోనా..! ఆడుకున్నా. హోలీ ఆయారే !! ఎటు చూసినా రంగుల మయం. అసలు ప్రక ృతే హోలీలో ఆడినట్టు ఎటు చూసినా రంగు రంగుల్లో విరబూసిన పువ్వులే. ఏ పండుగైనా ప్రకృతే ప్రేరణ. అందుకే కాబోలు వసంత ఆగమనానికి స్వాగతం పలికేందుకు ప్రకృతిలోని రంగులతో మమేకమై రంగులనే పండుగగా మార్చేశాం. పురాణాలు ఎన్ని కథలు చెప్పినా, వాటన్నిటికీ అతీతంగా హోలీని చేసుకుంటున్నాం. నిజానికి ఈ రంగుల పండుగలో రంగులు తప్ప మరో అంశానికి ప్రాధాన్యమే ఇవ్వం. హోలీ ఎందుకు చేసుకుంటున్నారు అనే ప్రశ్నకు చాలా మందికి సమాధానం తెలియదు. అయినా కూడా రంగులాటలో ఉత్సాహంగా పాల్గొంటారు. హోలిక వధ, కాముని దహనం కథ, కృష్ణ రాసలీల గాథ.. కారణం ఏదైనా కానీ మనం మాత్రం ఇప్పుడు రంగుల కోసమే హోలీ ఆడుకుంటున్నాం. రంగు పడుద్ది.. బృందావనంలో పసుపు నీళ్లాటలు, మోదుగ పూల రంగుతో వసంతాలు.. వినడానికి ఎంత బావున్నాయో. ఇవన్నీ తాతల జమానాలోనే అంతరించాయి. నెల రోజులు రుద్దినా పోని గులాల్, నాలుగు రోజులు మెరిసే సునేర్.. ఇవీ ఇప్పటి హోలీ ట్రెండ్స్. వీటితో పాటు మరెన్నో కొత్త రంగులు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఈ రంగులు వేటితో తయారు చేస్తున్నారు..?, అందులో పదార్థాలేమిటి..? అని మనం అడగం, వారు ప్రకటించరు. గుడ్డి నమ్మకంతో కొనేస్తాం, ఆడేస్తాం. పైగా ఎంత ఎక్కువ రోజులు నిలిచే రంగైతే అంత మంచిదని కొనుక్కునే వారూ ఉన్నారు. ఆ రంగులను మరింత చిక్కగా మార్చడానికి ఏవేవో ప్రయోగాలు చేసేస్తారు. ప్రజారోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన విభాగాలు వీటిపై ఓ కన్ను వేయాల్సిన అవసరం ఉంది. క్యాన్సర్లు, అలర్జీల వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయన్న రీసెర్చిల హెచ్చరికలు వినిపిస్తూనే ఉన్నాయి. మరీ చేజారకముందే ప్రభుత్వ పరమైన పర్యవేక్షణ పెరగాలి. ప్రజల్లో కూడా అవగాహన, విచక్షణ కలగాలి. రంగుల గురించి అవగాహన మాట అటుంచితే, హోలీ విచక్షణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ రంగులాటలో ఆనందహేల ఎంతుంటుందో.. అపశ్రుతుల కేళి కూడా జరుగుతుంటుంది. గుడ్డు పగులుద్ది.. రంగుల్లో ముంచెత్తే పర్మిషన్ ఇవ్వకనే ఇచ్చే పండుగ హోలీ. ఆ ముసుగులో మర్యాదల గీత దాటే సంప్రదాయమూ కనిపిస్తుంది. వద్దన్న వారికీ రంగులు పూయటం ఓ సరదా కానీ తెలియని వారిపై కూడా రంగుల దాడి చేయడం ఎంత వరకు సమంజసం. కానీ హోలీలో అవేమీ చెల్లవనే ధీమాతో మర్యాదాతిక్రమణ జరిగిపోతూ ఉంటుంది. ఇక రంగులు కాకుండా కోడి గుడ్లు, టమాటాలు, గ్రీజు వంటివి కూడా హోలీలో చోటు సంపాదించాయంటే ఈ రంగులాటకి అవమానం కాదూ. ఇక డబ్బున్న వర్గాల్లో హోలీ పార్టీల పేరుతో రెయిన్ డ్యాన్స్‌లు సాధారణంగా కనిపిస్తాయి. డబ్బున్నవారు నీళ్లు కొనుక్కోగలరు, ఆ నీళ్లు వేస్ట్ చేయగలరు. ఆ రెయిన్ హోలీ వెనుక వేస్జేజ్ వారికి పట్టదు. ఇక హోలీలో భంగు సంప్రదాయం ఇప్పుడు కొత్తగా డ్రగ్స్ రూపంలోకి తర్జుమా కావడం సంపన్న వర్గాలని కలవరపరచాల్సిన అంశం. పండుగ పండుద్ది.. కొత్తదనం పేరుతో హోలీ రూపాంతరం చెందుతోంది. అసలు ఆనందం మాయమవక ముందే మేల్కొందాం. క్రోమియం, లెడ్, సిలికా వంటి కెమికల్స్‌ని రంగుల తయారీలో ఉపయోగిస్తున్నారన్న అవగాహన ఎప్పట్నుంచో మీడియా కల్పిస్తూనే ఉంది. మరి సహజమైన హోలీ వైపు మన అడుగులు ఎందుకు పడట్లేదు. కొన్నేళ్ల కిందటి వరకూ సహజ రంగులు మార్కెట్లో అందుబాటులో ఉండేవి కావు. కానీ, మూడునాలుగేళ్లుగా ఆర్గానిక్ రంగులపై రీసెర్చి బాగా జరిగింది. ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరిగింది. ఇక వాడకం పెంచాల్సిన బాధ్యత మనదే. మోదుగ నీరు, పసుపు నీరు వంటి ఇంటి చిట్కాలే కాదు, మార్కెట్లో వివిధ మొక్కల నుంచి తయారు చేసిన రంగులూ అందుబాటులో ఉన్నాయి. బంతి పువ్వులు, ఇండిగో దానిమ్మ వంటివి మనకు హాని చేయని పదార్థాలు. వాటితో తయారు చేసిన రంగులను ఉపయోగిద్దాం. హెచ్‌వైడీ గో గ్రీన్, డీడీఎస్ వంటి సంస్థలు సహజ రంగులను మార్కెట్లో అందుబాటులో ఉంచారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. సహజ రంగుల వైపు మీరూ ఒక అడుగు వేసి చూడండి. హోలీ మరింత హ్యాపీ హోలీ అవుతుంది. -
హావ్ ఏ సేఫ్ ఫెస్ట్
రంగుల కేళీ హోలీ రానే వచ్చింది. పండుగ పూట రంగురంగుల హరివిల్లులవ్వడం అందరికీ ఇష్టమే. కానీ ఆ ఇష్టం కష్టంగా మారకూడదంటే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. అందుకు ఫేస్ యోగా ఎక్స్పర్ట్ మాన్సీ గులాటీ కొన్ని టిప్స్ చెబుతున్నారు. వాటిని పాటించి జోష్‌ఫుల్ హోలీని సక్సెస్ఫుల్ చేసుకోండి... హోలీ ఆడడానికి గంట ముందు ముఖం, చేతులకు కొబ్బరి నూనెను రాసుకోవాలి. నేచురల్, ఆర్గానిక్ కలర్స్‌ను మాత్రమే సెలక్ట్ చేసుకోవాలి. వీటివల్ల చర్మానికి ఎలాంటి హాని ఉండదు. పిల్లలకు పసుపు, కుంకుమ, గంధం, విభూది లాంటివి మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే వాళ్ల చర్మం చాలా సున్నితమైంది. మార్కెట్లో దొరికే కలర్స్ వాడితే ప్రమాదం. పసుపులో యాంటీయాక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీసెప్టిక్ కూడా. ఆడాక ముఖం, ఒంటిపై రంగులు పోకపోతే సహజంగా ముఖంపై గోర్లతో గీరడం, కిరోసిన్‌తో కడగ డం వంటి ప్రయోగాలు చేస్తుంటారు. అది ప్రమాదకరం. బొప్పాయి గుజ్జు తీసుకుని మర్దన చేస్తే... ఎంతటి ముదురు రంగైనా సునాయాసంగా వదిలిపోతుంది. ముఖంపై రంగులు తొలగించడానికి చల్లని నీటిని మాత్రమే ఉపయోగించాలి. వేడి నీటితో కడిగితే రంగులు చర్మానికి ఇంకా అతుక్కుపోతాయి. ఆట తరువాత మాయిశ్చరైజర్ లేదంటే బేబీ ఆయిల్‌ని లైట్‌గా ముఖానికి అప్లై చేస్తే చర్మం పొడిబారకుండా, దద్దుర్లు రాకుండా ఉంటుంది. ఆడేటప్పుడు తలపై రంగులు, గుడ్డు కొట్టినప్పుడు జుట్టు మొదళ్లలోకి చేరి స్కాల్ప్ పొడిబారే ప్రమాదం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే తలకు బేబీ ఆయిల్ కానీ, కొబ్బరి నూనె కానీ రాయాలి. చేతిగోళ్లలో రంగులు పోకుండా వారాల తరబడి ఉంటాయి. వాటిని వదిలించేందుకు పెడిక్యూర్, మానిక్యూర్లాంటివి పదేపదే చేయించకూడదు. ముందుగానే పెట్రోలియం జెల్లీని చేతివేళ్లకు అప్లై చేస్తే గోళ్లలోకి రంగులు పోవు. సిరి -
హోలీపై ఆంక్షలు
సాక్షి, ముంబై: హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకొనేలా నగరంలో పోలీసులు కొన్ని ఆంక్షలు విధించనున్నారు. నీటితో నింపిన బెలూన్లు, ప్లాస్టిక్ సంచులు ఎక్కడ పడితే అక్కడ విసిరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర, రైల్వే పోలీసు శాఖ నిర్ణయించాయి. ఆకతాయిలపై నిఘా వేసేందుకు కూడా పత్యేక పోలీసు బలగాలను నియమించారు. గతంలో ఆకతాయిలు రాళ్లు విసరడంతో అనేక మంది గాయాలపాలవడం, ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. హోలీ వచ్చిందంటే చాలు రైలు పట్టాల దగ్గర్లోని మురికివాడల నుంచి పిల్లలు, ఆకతాయిలు రంగు నీటి సంచులను రైళ్లలోకి విసురుతుంటారు. దీంతో లోకల్ రైల్వే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్కారు. పండుగ కాబట్టి సరదాగా విసిరినప్పటికీ రంగుల్లో ఉండే రసాయనాల వల్ల కంటి చూపు దెబ్బతినడం, ఫుట్‌బోర్డుపై ఉన్న వారు అదుపు తప్పి కిందపడుతున్నారు. వీటన్నంటిని దృష్టిలో పెట్టుకుని రైల్వే పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రైలు పట్టాలకు ఆనుకుని ఉన్న సైన్, ఘాట్కోపర్, ములుండ్, కల్యాణ్, ముంబ్రా, వడాల, చెంబూర్, గోవండీ, మాన్‌ఖుర్ద్, ఖార్, బాంద్రా, మలాడ్, బోరివలి తదితర మురికివాడల్లో పండుగకు రెండు రోజుల ముందు నుంచి రైల్వే పోలీసులు గస్తీ నిర్వహించనున్నారు. లోకల్ రైళ్లపై బెలూన్లు, ప్లాస్టిక్ సంచులు విసరొద్దని, వాటివల్ల జరిగే అనర్థాలపై అక్కడి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రైల్వే పోలీసు కమిషనర్ డాక్టర్ సింఘల్ చెప్పారు. అదేవిధంగా రోడ్లపై వెళ్లే మహిళలపై రంగునీళ్ల బెలూన్లు విసిరే ఆకతాయిలపై ముంబై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. కొన్ని సమస్యత్మాక ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులను మోహరించనున్నట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ ధనంజయ్ కులకర్ణి వెల్లడించారు. రోడ్లపై తాగిన మత్తులో అశ్లీల నృత్యాలు చేయడం, మహిళల పట్ట అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. హోలీ సంబరాలు ముగిసిన తర్వాత యువకులు సముద్ర తీరాలకు వెళ్తుంటారు. అక్కడ ఎటుంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గజ ఈతగాళ్లను, లైఫ్ గార్డులను అందుబాటులో ఉంచాలని బీఎంసీకి సూచించారు. -
చెరువులో స్నానానికి వెళ్లి ఐదుగురు విద్యార్థుల మృతి
-
హోలీడే...జాలీడే..!
హోలీ..రంగుల వాన. కోప,తాపాలను కాసేపు గట్టుమీద పెట్టి అంతా చిందులేసుకుంటూ చేసుకునే ‘వర్ణ’ సంబరం. కాముని పున్నమి సందర్భంగా జిల్లా అంతటా ఆనందం చిందింది. పట్టణ రోడ్లు మొదలుకొని...పల్లె లోగిళ్ల వరకూ పరస్పరం అభినందనలు చెప్పుకుంటూ..వయో బేధం లేకుండా ఆడారు. పెద్దలు చిన్నపిల్లలై గంతులేస్తే..చిన్నారులు అవధుల్లేని...సందడి చేశారు. డప్పులు మోగించి..నాట్యం చేశారు. కేరింతలతో..కొత్త అందం తెచ్చారు. తీన్మార్ దరువు, ఉత్సాహ పరిచే పాటలకు చిన్నాపెద్ద స్టెప్పులే శారు. కేరింతలు కొడుతూ.. ఈలలు వేస్తూ హోలీరోజు చిందులేశారు. ఉత్సాహంగా ఒకరిపై మరొకరు రంగులు చల్లుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఎన్నికలు సమయం కావడంతో వివిధ పార్టీల నాయకులు వేడుకల్లో ప్రేత్యేక ఆకర్షణగా కనిపించారు. రంగునీళ్లతో రోడ్లన్నీ తడిసి ముద్దయ్యాయి. జిల్లాస్థాయి అధికారులు, మహిళలు రోడ్లమీదకు వచ్చి సంబరాలు జరుపుకున్నారు. -
తొలి రోజు నామినేషన్ల జోరు
ఇందూరు, న్యూస్‌లైన్: జిల్లాలో సోమవారం ఓవైపు హోలీ సంబురాలు.. మరో వైపు నామినేషన్ల జోరు కొనసాగింది. హోలీ రోజు నామినేషన్ వేస్తే కలిసి వస్తుందనే సెంటిమెంట్‌తో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వేశా రు. దీంతో తొలిరోజు జడ్పీటీసీకి 3, ఎంపీటీసీకి 57 నామినేషన్లు దాఖలయ్యాయి. జడ్పీటీసీ స్థానానికి టీఆర్ఎస్ తరపున వర్ని మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన సింగంపల్లి గంగారాం మొదటి నామినేషన్ వేశారు. తర్వాత కాంగ్రెస్ తరపున వేల్పూర్ మండలం పచ్చల నడ్కుడ గ్రామానికి చెందిన సాతెల్లి కవిత, కామారెడ్డి మండలం దేవన్‌పల్లి గ్రామానికి చెందిన నరేశ్ నామినేషన్లను వేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి వీరు తమ ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాల్లో జిల్లా కేంద్రానికి తరలి వచ్చారు. జిల్లా పరిషత్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో నామినేషన్లు వేశారు. ఎంపీటీసీ స్థానాలకు ఆయా మండల కార్యాలయాల్లో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎంపీటీసీ స్థానాలకు టీఆర్ఎస్ నుంచి 10, కాంగ్రెస్ నుంచి 17, టీడీపీ నుంచి 5, బీజేపీ నుంచి 5, స్వాతంత్రు 20 మంది నామినేషన్ వేశారు. అదేవిధంగా పలువురు అభ్యర్థులు జిల్లా కేంద్రానికి వచ్చి నామినేషన్ ఫారాలను తీసుకెళ్లారు. ఈ దృశ్యాలన్నీ అధికారులు వీడియో తీయిస్తున్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయం రెండు గేట్లను మూసివేసి, బారికేడ్లను అడ్డంగా పెట్టారు. జడ్పీ ఉద్యోగులను సైతం గుర్తింపు కార్డులు లేనిదే లోపలికి అనుమతించలేదు. జిల్లా పరిషత్ వైపు ద్విచక్ర వాహనాలు తప్ప ఇతర వాహనాలను అనుమతించలేదు. -
మన రాష్ట్రంలో హోలీ సంబరాలు
-
మన దేశ హోలీ సంబరాలు
-
శిల్పారామంలో హోలీ సంబరాలు
-
వర్ణ రంజితమైన మధుర
మధుర : శ్రీకృష్ణలీలకు ప్రసిద్ధి చెందిన మధుర వర్ణరంజితం అయ్యింది. ఇక్కడ హోలీ పండుగను వినూత్న రీతిలో జరుపుకుంటున్నారు. హోలీ రోజున భంగ్ సేవించడం ఇక్కడి సంప్రదాయం. ఆ పద్ధతిని కొనసాగిస్తూ భంగ్ తయారు చేసిన స్థానికులు తోటివారితో కలిసి ఆ భంగ్ సేవిస్తూ ఆనంద పరవశులవుతున్నారు. రంగులు చల్లుకుంటూ, పడవలపై డోలక్లు వాయిస్తూ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇక శ్రీకృష్ణుడి లీలామృతాలకు పెట్టింది పేరైన బృందావనం ఆనంద పరవశంలో మునిగితేలుతోంది. రంగుల లోకంలో విహరిస్తూ తన్మయత్వం పొందుతోంది. రంగుల పండుగ హోలీ సంబరాలు బృందావనంలో అంబరాన్నంటుతున్నాయి. వేలమంది ఒకే చోట చేరి రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు. పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సందడి చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో హోలీ సంబరాలు వినూత్నంగా సాగుతున్నాయి. చారిత్రక మహంకాళీ దేవాలయంలో హోలీ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సాధారణంగా ఆలయ గర్భ గుడిలో రంగులు చల్లడం ఎక్కడా చూసి ఉండరు. కానీ మహంకాళీ ఆలయం మాత్రం ఇందుకు విభిన్నం. ఇక్కడి ఆలయంలో రంగుల పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. గర్భగుడిలో శివలింగానికి అభిషేకాలు నిర్వహిస్తూనే రంగులు చల్లుతూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఆనందంతో చిందులేస్తూ గంతులేస్తున్నారు. రంగుల లోకం ఆవిష్కృతమవుతోంది. సమస్త భారతవాని సప్త వర్ణ శోభితమవుతోంది. చిన్నా, పెద్దా, కుల, మత, ప్రాంతీయ భేదం లేకుండా అందరూ రంగుల్లో మునిగి తేలుతున్నారు. రాజస్థాన్ రంగుల్లో మునిగిపోతోంది. చారిత్రక ఉదయ్‌పూర్‌లో వర్ణాలు విరగబూస్తున్నాయి. స్థానికులతో చేరిన విదేశీయులు రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నారు. వివిధ దేశాల నుంచి వచ్చిన పర్యాటకులు రంగుల లోకంలో విహరిస్తూ తన్మయత్మం పొందుతున్నారు. ఒకే చోట చేరి వందలమంది రంగులు చల్లుకుంటూ.... పాటలు పాడుతూ... నృత్యాలు చేస్తూ సంతోషం పంచుకుంటున్నారు. బాణాసంచా పేలుళ్లు పండుగ సంరంభానికి కొత్త ఆకర్షణ తీసుకొస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ అంతటా రంగులు విరబూస్తున్నాయి. సిలిగురిలో హోలీ వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. చిన్నా, పెద్దా రంగులు చల్లుకుంటూ డ్యాన్సులు చేస్తూ హోరెత్తిస్తున్నారు. విదేశీయులు కూడా ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేస్తున్నారు. వాణిజ్య రాజధాని వర్ణాల్లో మునిగిపోతోంది. యువత రంగల లోకంలో విహరిస్తోంది. బాలబాలికలు, స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంగులు చల్లుకుంటూ గంతులేస్తున్నారు. ఇక నిత్యం సరిహద్దుల్లో కాపలా కాస్తూ శత్రుమూకల దాడిని పసిగట్టడంలో గస్తీ తిరుగుతూ ఉండే సైనికులకు కొన్ని సందర్బాల్లోనే ఆటవిడుపు దొరుకుతుంది. రంగుల పండుగ వస్తే వారి ఆనందానికి అడ్డే ఉండదు. ఈ పండుగ వేళ జవాన్లు కూడా రంగులు చల్లుకుంటూ సంబరాల్లో మునిగి తేలారు. పరస్పరం రంగులు పులుముకొని పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటూ సంతోషం పంచుకున్నారు. కాగా హోలీ సంబరాలను వివిధ ప్రాంతాల్లో కొందరు ఆదివారం జరుపుకోగా, మరికొందరు సోమవారం నిర్వహించారు. -
వెండి తెరపై వన్నె తరగని రంగేళీ
రంగులు పండుగ హోలీ అంటే ఇష్టపడని వారుండరు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆటపాటలతో సాగే రంగుల కేళీ ఆడేందుకు అందరూ ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా పిల్లలు, యువతీ యువకులు రంగుల్లో తడిచిముద్దవుతారు. వెండి తెరపై కూడా హోలీకి సముచిత స్థానం కల్పించారు. రంగుల లోకంలో రంగుల పండుగకు పెద్దపీటే వేశారు. సినిమాల్లో హుషారుగా సాగిపోయే హోలీ పాటలు ప్రేక్షకులు ఆదరించి పట్టం కట్టారు. సమకాలిన సినిమా పాటల్లో హోలీ ప్రస్తావన పరిపాటిగా మారిందంటే ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'రాఖీ' సినిమాలో ముందుగా వస్తుంది హోలీ రంగుల పాట. ‘రంగు రపరప అంటోంది రంగుబర్సే’ అంటూ హుషారైన స్టెప్పులతో రంగులు జల్లుకుంటూ సాగిపోతుందీ పాట. ‘కొట్టు కొట్టు కొట్టు...రంగు తీసి కొట్టు.. రంగులోనే లైఫ్ ఉందిరా’ అంటూ 'మాస్' చిత్రంలో నాగార్జున ఆడిపాడారు. తనకెంతో పేరు తెచ్చిన 'ఖుషీ' సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా 'హోలీ... హులీల రంగ హెలీ' అంటూ స్టెప్పులేశారు. 'మురారి'లో మహేష్ బాబు ఇంట్రడక్షన్ పాటలో రంగుల్లో మునిగి తేలాడు. మెగాస్టార్ చిరంజీవి 'ఇంద్ర'లో తన కుటుంబ సభ్యులతో హోలీ ఆడే సీన్ కన్నులపండువ ఉంటుంది. ఉదయ్‌కిరణ్-రిచా చావ్లా జంటగా ‘హోలీ’ పేరుతో ఓ ప్రేమకధా చిత్రమే వచ్చింది. ఉత్తరాది వారు ఘనంగా జరుపుకునే హోలీకి బాలీవుడ్ కూడా పెద్దపీట వేసింది. నాటి షోలే నుంచి నేటి రామ్ లీలా వరకు రంగుళ కేళీని ఏదో ఒక సందర్భంలో తెరపై ఆవిష్కరిస్తూనే ఉంది. ఆన్,కోహినూర్, గోదా, కటీ పతంగ్, సిల్సిలా సినిమాల్లో హోలీ పాటలు ప్రజాదరణ పొందాయి. మదర్ ఇండియా, షోలే సినిమాల్లో కీలక సన్నివేశాల్లో వచ్చే హోలీ పాటలు కథను ముందుకు నడిపించడంలో దోహదపడ్డాయి. నాటి నుంచి నేటి వరకు వెండితెరపై రంగుల పాటల వన్నె తరగలేదు. కొత్త సినిమాల్లోనూ హోలీ పాటలు వస్తూనే ఉన్నాయి. ఇకముందు కూడా వస్తుంటాయి. ఎందుకంటే పండుగ మాత్రమే కాదు ఆనందాల కేళీ! -
ఎంపీ తనయుడిపై కేసు నమోదు
హైదరాబాద్ : సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అరవింద్ యాదవ్‌పై కేసు నమోదు అయ్యింది. కానిస్టేబుల్‌పై దాడి చేసిన కేసులో అతనిపై హుస్సేన్ ఆలం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే రోడ్డుపై హోలీ ఆడవద్దని చెప్పినందుకు ఓ కానిస్టేబుల్‌పై దాడి చేసి చితక్కొట్టాడు. అరవింద్ యాదవ్- కామదహన్ కార్యక్రమంలో పాల్గొని ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయడంతో బందోబస్తులో ఉన్న కానిస్టేబుల్ వంశీ ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నించాడు. అంతలో ఆగ్రహించిన ఎంపీ తనయుడు...కానిస్టేబుల్ వంశీపై దాడి చేశాడు. గాయాలపాలైన వంశీ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుని.. హుస్సేన్ ఆలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అరవింద్ యాదవ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అంజన్‌కుమార్‌యాదవ్ తన కుమారుడుని కేసులో నుంచి తప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అరవింద్ యాదవ్ స్నేహితులను, ఇతర అనుచరులనైనా కేసులో ఇరికించి, ప్రధాన నిందితుడైన అరవింద్‌ను కేసు నుంచి బయటపడేసేందుకు తన పలుకుబడిని ఉపయోగిస్తున్నట్లు సమాచారం. -
హొలీ నాడు ఎంపీ కుమారుని వీరంగం
-
రంగ్ దే బసంతి
-
కృష్ణుడే తిరుగాడినట్లు..
ప్రపంచంలోనే అతి ఎత్తై ఆలయంగా ‘బృందావన్’ శంకుస్థాపన చేసిన యూపీ సీఎం 70వ అంతస్తులో టెలిస్కోప్ నుంచి తాజ్మహల్నూ చూడొచ్చు బృందావనం: ప్రపంచంలోనే ఎత్తయిన ఆలయంగా నిర్మించనున్న ‘బృందావన్ చంద్రోదయ మందిర్’కు ఆదివారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో ఉన్న బృందావనంలో దాదాపు రూ. 300 కోట్ల వ్యయంతో ఇస్కాన్ సంస్థ ఈ ఆలయాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే. హిందువుల పర్వదినం హోలీ సందర్భంగా దీనికి శంకుస్థాపన చేశారు. ఐదేళ్లలో ఈ ఆలయాన్ని పూర్తి చేయనున్నారు. దాదాపు 62 ఎకరాల్లో 213 మీటర్ల ఎత్తుతో 70 అంతస్తులుగా దీనిని నిర్మిస్తున్నారు. ఇక్కడ ఆలయం నిర్మించడం మాత్రమే తమ లక్ష్యం కాదని.. కృష్ణుడు తిరుగాడినప్పటి అనుభూతిని కల్పించడమని ఇస్కాన్ ప్రతినిధి చాంచలపతి దాస్ చెప్పారు. అప్పటి బృందావనంతో పాటు అడవిని కూడా ఆలయం చుట్టూ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వేదాల్లో పేర్కొన్నట్లుగా విశ్వం, అంతరిక్షం వంటివన్నింటినీ తలపించేలా ప్రత్యేకమైన ధ్వని, వెలుగు, ఎఫెక్టులతో ఎలివేటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 70వ అంతస్తులో ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతాలను చూడడానికి టెలిస్కోపులు చేర్పాటు చేస్తామని.. వాటి ద్వారా కృష్ణ జన్మభూమిని, ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను కూడా వీక్షించవచ్చని తెలిపారు. నెమలి పింఛాన్ని తలపించేలా ఆలయానికి ఆకుపచ్చ, నీలం రంగులను వేయనున్నట్లు చెప్పారు. కాగా, శంకుస్థాపన చేసిన అనంతరం అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ... ఇదొక చరిత్రాత్మక సమయమని, దేశ సంస్కృతికి, ఘన వారసత్వానికి ప్రతీకగా ఈ ఆలయం నిలుస్తుందని పేర్కొన్నారు. -
ఖీర్, బిర్యానీతో సెక్స్ వర్కర్ల హోలీ
న్యూఢిల్లీ: నగరంలోని జీబీ రోడ్డులో ఉంటున్న సెక్స్‌వర్కర్లు జరుపుకునే హోలీ మిగతావారు జరుపుకునే హోలీకి భిన్నంగా ఉంటుంది. అందరిలా వీరు వీధుల్లోకి వచ్చి రంగులు చల్లుకుంటూ హోలీ జరుపుకోవడం ఇక్కడ కనిపించదు. ఏ వేడుక చేసుకున్నా వారుంటున్న భవనం పరిసరాల్లోనే జరుపుకోవాలి. హోలీ కూడా అంతే. ఈ వేడుక గురించి పదిహేను సంవత్సరాలుగా జీబీ రోడ్‌లోని రెడ్‌లైట్ ప్రాంతంలో ఉంటున్న కిరణ్ (పేరు మార్చాం) మాట్లాడుతూ... ‘మేం ఏ పండగైనా ఇక్కడే జరుపుకుంటాం. అది దీపావళి కానీయండి హోలీ కానీయండి.. అన్నీ ఈ భవనం పరిసరాల్లోనే. హోలీ మా జీవితాల్లో మిగతా రోజులకు భిన్నంగా ఏమీ ఉండదు. కాకపోతే మా స్నేహితులంతా ఒకచోటకు చేరి రంగులు చల్లుకుంటాం. ఆ తర్వాత పసందైన ఖీర్ రుచిని ఆస్వాధిస్తాం. ఘుమఘుమలాడే బిర్యానీని లాగించేస్తాం. మరిన్ని మిఠాయిలు కూడా ఆ రోజు మా మెనూలో ఉంటాయి. మిఠాయి, గులాల్‌తో మా హోలీ వేడుక మొదలవుతుంద’ని పేర్కొంది. ఆల్ ఇండియా నెట్వర్క్ ఆఫ్ సెక్స్ వర్కర్స్, నేషనల్ కో-ఆర్డినేటర్ అమిత్ కుమార్ మాట్లాడుతూ... ‘నగరంలోని కొన్ని వేశ్యావాటికలు హోలీ రోజు సాయంత్రం 5 గంటలకే మూతపడతాయి. ఆకతాయిల నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే అభిప్రాయంతోనే ఈ విధంగా చేస్తారు. తమకు నమ్మకమైన కొంతమందితోనే వీరు హోలీ జరుపుకుంటారు. అదీ తాము ఉంటున్న భవనం పరిసరాల్లోనే. తమ స్నేహితులను ఆహ్వానిస్తారు. బయట పరిస్థితి ప్రశాంతంగా ఉందని భావిస్తే స్నేహితులతో కలిసి బయటకు వెళ్తారు. అయితే ఈ సమయంలో వారు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఆకతాయిలు వెంటపడడం, బలవంతంగా రంగులు చల్లడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటివి చేస్తుంటారు. అందుకే సాధ్యమైనంతగా హోలీని బయటకు వెళ్లకుండానే జరుపుకుంటార’న్నారు. దివ్య అనే యువతి మాట్లాడుతూ... ‘అందరిలాగే మాకు కూడా హోలీ వీధుల్లోకి వెళ్లి జరుపుకోవాలని ఉంటుంది. కానీ ఆకతాయిలు మాపట్ల ప్రవర్తించే తీరు మాకు ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే మావద్దకు తరచూ వచ్చే కొందరితోనే హోలీ జరుపుకుంటాం. వారే మా వద్దకు వచ్చి రంగులు చల్లి, స్వీట్లు, బహుమతులు ఇచ్చి వెళ్తుంటార’ని చెప్పింది. -
హోలీ రోజు ఏం చేస్తున్నారు ?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అంతా సోమవారం హోలీ ఆడుతున్నారు. మరి బాలీవుడ్ తారల పరిస్థితి ఏంటి ? షబానా ఆజ్మీ, మనోజ్ బాజ్‌పేయి, రాజ్‌కుమార్ రావు వంటి తారలు పండుగ జరుపుకుంటున్నట్టు ప్రకటించారు. కొత్తతరం బ్యూటీలు పరిణీతి చోప్రా, ఆలియా భట్, నర్గిస్ ఫక్రీ వంటి వాళ్లు మాత్రం షూటింగుల వల్ల ఈ రంగుల ఉత్సవానికి దూరమవుతున్నారు. హోలీ గురించి వీళ్లంతా చెప్పే కబుర్లు ఇవిగో.. ఫర్హాన్ అఖ్తర్: కుటుంబ సభ్యులతో గడపడానికి చక్కని పండుగ ఇది! పరిణీతి చోప్రా: ఢిల్లీలో షూటింగ్ జరుగుతోంది. కాబట్టి సోమవారం కూడా పని చేయాల్సిందే. ఆయుష్మాన్ ఖురానా: హోలీ అంటే పెద్దగా ఇష్టపడను. మా ప్రాంతంలో ‘రౌడీ హోలీ’ జరుగుతుంటుంది. పండుగ నాడు కేవలం కుటుంబ సభ్యులతోనే గడుపుతాను. ఆలియా భట్: నాకు హోలీ పండుగ లేదు. హంప్టీ శర్మ కీ దుల్హానియా షూటింగ్‌తో బిజీగా ఉన్నాను రాజ్‌కుమార్ రావు: కుటుంబం, స్నేహితులతో కలిసి హోలీ జరుపుకుంటున్నాను. రంగులు గుమ్మరించుకోవడం ఏమీ ఉండదు. గులాల్ చల్లుకోవడం వరకే.. షబానా ఆజ్మీ: నా పుట్టిళ్లు జానకీ కుటీర్‌లో సంప్రదాయబద్ధంగా హోలీ జరుపుకుంటాం. సినిమా, నాటక రంగాలకు చెందిన మా స్నేహితులు వస్తారు. రిషీ కపూర్: షూటింగ్ కోసం చండీగఢ్‌లో ఉన్నాను. రెండు రోజుల సెలవు వచ్చింది. 18 రోజుల తరువాత ముంబైకి వెళ్తున్నాను. అయితే హోలీ ఆడను. నర్గిస్ ఫక్రి: మై తేరా హీరో సినిమా ప్రచార కార్యక్రమాలతో తీరిక లేదు. కాబట్టి హోలీ ఆడే అవకాశాలు తక్కువే. వచ్చే సంవత్సరం ప్రయత్నిస్తా. మనోజ్ బాజ్‌పేయి: హోలీ ఆడడం ఇష్టముండదు. ఈసారి నా కూతురు బలవంతం చేస్తోంది. తప్పేలా లేదు. రోణిత్ రాయ్: చాలా ఏళ్లుగా హోలీ జరుపుకోవడం లేదు. మనీశ్ పాల్: వ్యవసాయ క్షేత్రంలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో హోలీ ఆడుతున్నాను. -
సమ్మర్ గ్రీన్ రిసార్ట్స్ లో హోలీ వేడుకలు
-
దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు
-
హోళీ.. యువతకు రంగేళీ!
భారత దేశాన్ని పండగల దేశం అంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎప్పుడు ఎదో ఒక పండగ కార్యక్రమంతో సందడి సందడిగా ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రజల్ని ఏకం చేసే పండుగల్లో హోళీ ఒకటి. హోళీ పండుగ మతాలు, కులాలు, ప్రాంతాల కతీతంగా, చిన్న పెద్ద అనే తేడాలేకుండా అందరూ కలిసి హోళీ జరుపుకోవడం ఎన్నో ఏళ్లుగా వస్తోంది. వసంత రుతువు వచ్చిన సందర్భంగా ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ రోజున జరుపుకునే పండగను దేశంలోని వివిధ ప్రాంతాల్లో మహా పాల్గుణి, హోలికా, హోలికా దహన్, హోళీ అనే పేర్లతో పిలుస్తుంటారు. వివిధ ప్రాంతాల్లో ఏ పేరుతో హోళీని జరుపుకున్న రంగులు పండగగానే ప్రతి ఒక్కరి మనసులో ముద్ర వేసుకుంది. పసిపిల్లు, పెద్దలు, ఆడ, మగ అనే బేధం లేకుండా..స్నేహితులు, బంధువులు ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండగ హోళీ. వసంత కాలంలో వచ్చే రంగుల పండుగను, హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవముగా జరుపుకుంటారు. భారత్ లోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ వంటి తదితర దేశాల్లో ప్రజలు ఆనందంగా ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. గుజరాత్ రాష్ట్రంలో 'గోవిందా ఆలా రే.. జరా మట్కి సంభాల్ బ్రిజ్ బాలా' అంటూ జానపద గీతాలతో కృష్ణుడిని ఆరాధిస్తూ యువతీ, యువకులు రంగుల్లో మునిగి తేలుతారు. హోళీ రోజున పాలు, పెరుగు ఉన్న కుండను తాడు కట్టి 'ఉట్టి కొట్టడం' అనే ఆటను ఆడుకుంటారు. ఉట్టి కొట్టడానికి యువకులు పిరమిడ్ రూపంలో ఏర్పడి పాలు, పెరుగు ఉన్న ఉట్టిని కొట్టడం హోళీ సందర్బంగా ఎన్నో శతాబ్దాలుగా గుజరాత్ సంస్కృతిలో ఓ భాగమైంది. ఎన్నో సంస్కృతులు, ఆచారాలున్న భారత దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా హోళీని జరుపుకుంటారు. పాల్గుణ శుద్ద పూర్ణిమ రోజున కృష్ణ భగవానుడిని ఊయలలో వేసిన వేడుకకు గుర్తుగా బెంగాల్ లో డోలికోత్సవాన్ని జరుపుకుంటారు. రాక్షస జాతికి చెందిన హిరణ్యకశ్యపుడిని విష్ణువు రూపంలో ఉన్న నరసింహస్వామి సంహరించడానికి గుర్తుగా కూడా హోళీని జరుపుకుంటారని చరిత్ర వెల్లడిస్తోంది. హిరణ్య కశ్యపుడి సోదరి హోళికా దహనాని గుర్తుగా ప్రతి ఏటా హోళికా దహనం చేస్తారని చెప్పుకుంటారు. హోళీకి సంబంధించి ఏన్నో విషయాలను, కథలను పురాణాలు వెల్లడిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా అందరూ ఆడుకునే హోళీ పండగను బాలీవుడ్, టాలీవుడ్ లో నిర్మించిన పలు చిత్రాల్లో పెద్ద పీట వేశారు. 'హోళీ కే దిన్' అంటూ షోలే చిత్రంలో హేమామాలిని, ధర్మేంద్రలపై చిత్రీకరించిన పాట అత్యంత ప్రాచుర్యం పొందింది. అలాగే 'సిల్ సిలా' చిత్రలో 'రంగ్ బర్సే' అంటూ అమితాబ్ వేసిన స్టెప్పులు భారతీయ హోళీ సంస్కతిలో ఓ భాగమైంది. హోళీ రోజున రంగ్ బరసే అంటూ యువతీ యువకులు చిందేడం చూస్తూనే ఉంటాం. ఇంకా లమ్హే చిత్రంలో 'మోహే చేడో నా', భాగ్ భన్ చిత్రంలో 'హోరి ఖేలే రాఘువీరా' మంగళ్ పాండే చిత్రంలో దేఖో ఆయీ హోళీ అనే పాటలు ఇప్పటికి మనలో ఉత్సాహాన్ని నింపుతాయి. ఇవియే కాకుండా డర్ చిత్రంలో అంగ్ సే ఆంగ్ లగానా సాజన్, కామ్ చోర్ చిత్రంలో 'మాల్ దే గులాల్ మోహే, ఆయే హోలీ ఆయే రే', జక్మీ చిత్రంలో ఆయీ రే ఆయీ రే హోలీ, నవరంగ్ చిత్రంలో 'అరే జా రే హట్ నత్కత్', కటీ పతంగ్ చిత్రంలో 'ఆజ్ నా చోడంగే బస్ హమ్ జోలీ ఖేలేంగే హమ్ హోళీ', కోహినూర్ చిత్రంలో 'తన్ రంగ్ లో జి ఆజ్ మన్ రంగ్ లో' ముంబై సే ఆయే మేరే దోస్త్.. 'కోయి భీఘా హై రంగ్ సే' మదర్ ఇండియాలో 'హోళీ ఆయీ రే కన్హాయీ' పాటలే కాకుండా ఇటీవల వచ్చిన ఇత్నా మాజా క్యో ఆరా రహాహై.. అంటూ యే జవానీ హై దీవాని, రామ్ లీలా, గూండే చిత్రాల్లో పాటలు కూడా ప్రేక్షకులను ఆలరించడమే కాకుండా సంస్కృతిలో భాగమయ్యాయి. బాలీవుడ్ కు తామేమి తగ్గమనే రీతిలో టాలీవుడ్ లో కూడా హోళీ పండగకు పెద్ద ప్రాధాన్యత ఇచ్చారు. కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు.. రంగులోనే లైఫ్ ఉందిరా.. కొట్టు కొట్టు డోల్ దెబ్బ కొట్టూ ఒంటి నిండా సత్తువుందిరా.. హోళీ హోళీ అంటూ నాగార్జున 'మాస్' చిత్రంలో దర్శకుడు లారెన్స్.. రంగు రబ్బా రబ్బా అంటుంది రంగు బరిసే.. గుండే షబ్బా షబ్బా అంటూ.. జూనియర్ ఎన్టీఆర్ 'రాఖీ' లో చిత్రంలో, రంగేళి హోళీ..రంగా కే మా కేళి.. ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి అంటూ ప్రభాస్ తో కృష్ణ వంశీ యువతీ, యువకుల్లో జోష్ ను పెంచారు. ప్రతి ఏటా వచ్చే హోళీ పండగ జాతి సమైక్యతను పెంపొదించడమే కాకుండా కుల, మతాలకతీతంగా దేశ ప్రజలందర్ని ఒక్కటి చేస్తుందని ఆశిద్దాం! -
హోలి హేళీ
-
బృందావన్‌లో వితంతువుల వసంత కేళీ
బృందావన్(యూపీ): వారంతా పసుపు-కుంకుమలకు దూరమైన వితంతువులు. వసంతాలు వెలిసిపోయిన వారి జీవితాల్లో హోలీ మళ్లీ రంగులు పూయించింది. మోడు వారిన వింతువుల జీవితాల్లో వసంత కేళి ఆనందోత్సాహాలు నింపింది. దాదాపు వెయ్యి మంది వితంతువులు హోలీ ఆడుతూ మళ్లీ రంగుల లోకంలో విహరించారు. ఈ అపూర్వ ఘట్టం ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో జరిగింది. మీరా సహభాగిని ఆశ్రమం వేదికగా నిలిచింది. కృష్ణుడి భక్తులు, పర్యాటకుల సమక్షంలో ఒకరిపై ఒకరు రకరకాల రంగులు చల్లుకుంటూ వసంత కేళి ఆడారు. నృత్యాలు చేస్తూ పాటలు పాడారు. బృందావన్ చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో వితంతువులు హోలీ వేడుకల్లో ఇది మొదటిసారి. హోలీ వేడుకల కోసం 500 కిలోలకు పైగా రంగులు, గ్యాలన్లకొద్దీ నీరు వినియోగించారు. మహిళల సాధికారత కృషి చేస్తున్న సులభ్ ఇంటర్నేషనల్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. బృందావన్‌లో ఉన్న ఆశ్రమాల్లో వేలాది మంది వితంతువులు ఉంటున్నారు. వీరందరి కోసం సాంప్రదాయ రాసలీల న్యత్యం, ఇతర కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. గతేడాది పూలు చల్లుకుని వితంతువులు ఇక్కడ హోలీ వేడుకలు జరుపుకున్నారు. -
హోలీకి ఎన్నికల రంగు..
అభ్యర్థుల నుంచి నేరుగా ఇనామ్‌లు చిక్కడు, దొరకడు విధంగా వ్యవహరిస్తున్న అభ్యర్థులు ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ‘రం గోళీ’ అభ్యర్థులకు ఆనందాన్ని తెచ్చిపెట్టింది. హోలీకి ఎన్నికల రంగు పులుముకుంటోంది. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు వా ర్డుల్లో ప్రధానంగా హోలీ ఇనామ్‌ల పేరిట అ భ్యర్థులు వేలు ఎగజిమ్ముతున్నారు. ఇందులో ప్రధానంలో డ్వాక్రా మహిళలు, యువత...ఇతరాత్ర సంఘాల నాయకులకే ఎక్కువగా ఇ నామ్‌లు అందుతున్నాయి. హోలీ వస్తుదంటే చాలు పల్లె ప్రాంతాల్లో మహిళలు..యువకులు..కాస్తకారులకు ఇనామ్‌ల పేరిట డబ్బులు..ధాన్యాలు పంచుతుండేవారు. అయితే ము న్సిపల్ ఎన్నికల్లోనూ అభ్యర్థులు ఇదే అదును గా భావించి హోలీకి ఎన్నికల రంగు పులుముతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు, సంఘాల నాయకులకు ముందస్తుగా స మాచారం అందించి డబ్బులు పంచుతున్నా రు. ఇనామ్‌ల కోసం పట్టణంలోని పలు పార్టీ ల నాయకుల ఇళ్ల వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు పెద్దసంఖ్యలో కార్యకర్తలు,యువకులు పడిగాపులు కాస్తున్నారు. సంప్రదాయానికి ఎన్నికల రంగు అనాదిగా జరుపుకుంటు వస్తున్న హోలీ పర్వదినానికి ఎన్నికల రంగు అంటుకుంటుంది. ఇనామ్‌ల పేరిట అభ్యర్థుల ఇళ్లలో పెద్దసంఖ్య లో డబ్బులు పంచుతున్నట్లు సమాచారం. ఇ టీవల ఒక వ్యక్తి ఇంట్లో పలువురు మహిళలు హోలీ ఇనామ్ కోసం వెళ్లి డబ్బులు తీసుకున్న ట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే సంప్రదా యం ముసుగులో కాలనీల్లో తిరుగుతూ యు వతకు కావాల్సిన వస్తువులు.. డబ్బులు అంది స్తూ..ఓటు వేయించాలని ప్రచారం చేస్తున్నా రు. ఈ తతంగం రాత్రి వేళల్లో ఎక్కువ జరుగుతోంది. ఈ విధానంతో ఎన్నికల కోడ్‌తోపాటు తమ లక్షలోపు ఖర్చు పెట్టాలనే నిబంధన నుంచి సులువుగా అభ్యర్థులు తప్పించుకునే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి అభ్యర్థులను అధికారులు పట్టుకోవాలంటే ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైన ఉంది. -
హైదరాబాద్‌లో హోలీ సంబరాలు
-
రుచుల పిచికారీ...
రంగులు పూసుకుని పండగ చేసుకునేది మనుషులేనా...? పాపం... మానవులు ఒక రోజే రంగేసుకుంటారు గానీ... స్వీట్లకు నిత్యం హోలీయే! రంగులతో మోళీయే!! జీవితం ఎప్పుడూ పచ్చగా వెలిగిపోవాలనే పర్వాల్ స్వీట్. బ్రౌన్‌తో షైనవుతూ లవ్ చేయాలనిపించేలా లవంగ్ లతిక. రుచికి హి‘మలాయ్’లాంటిదే తెల్లటి మలాయ్ శాండ్విచ్. క్రీమ్ కలర్‌తో రుచుల డ్రీమ్‌లో తేలియాడేలా చేసే మలాయ్ ఖీర్. గుల్కండ్ స్టఫ్డ్ మలాయ్ పేడా... శ్వేతసౌధం లాంటి తెల్లటి మేడ. ఇలా రంగులన్నీ స్వీట్ల సొంతం... స్వీట్లకే సొంతం... టింగురంగా అంటూ మీ టంగుకు రుచి నేర్పడానికి... ఈ రంగుల పండగనాడు మీ కిచెన్‌లో హంగు చేయడానికి... వస్తున్న, మేం అందిస్తున్న హోలీ స్వీట్లకు స్వాగతం పలకండి. మీ మేనితో పాటు మీ నాలుకకూ రుచిరంగులద్దండి. మలాయ్ ఖీర్ కావలసినవి: సేమ్యా - ముప్పావు కప్పు; పాలు - 2 లీటర్లు; కండెన్స్డ్ మిల్క్ - టిన్; పచ్చికోవా - 50 గ్రా.; మీగడ - అర కప్పు (100 గ్రా.); పంచదార - కప్పు (200 గ్రా.) ఏలకులపొడి - టీ స్పూను; కుంకుమపువ్వు - టీ స్పూను; బాదం పలుకులు - 50 గ్రా. పిస్తా పప్పులు - 50 గ్రా. తయారి: ఒకపాత్రలో నీరు మరిగించి, సేమ్యా వేసి ఉడికించాలి పాత్రలో పాలు మరిగాక, మంట తగ్గించి, ఉడికించి ఉంచుకున్న సేమ్యాను ఇందులో వేయాలి బాగా ఉడికాక, కండెన్స్డ్ మిల్క్, పచ్చి కోవా వేసి పది నిమిషాలు ఉంచాలి మీగడ, పంచదార, ఏలకులపొడి, కుంకుమపువ్వు, బాదం పలుకులు, పిస్తా పప్పులు వేసి కలిపి దించేయాలి. వేడివేడిగా వడ్డించుకోవాలి. పర్వాల్ స్వీట్ కావలసినవి: పర్వాల్ (చిన్నగా ఉండే కీర దోస) - అర కిలో; పంచదార - 300 గ్రా.; స్టఫింగ్ కోసం; పచ్చి కోవా - 250 గ్రా.; పంచదార - 50 గ్రా.; బాదం పప్పులు - 50 గ్రా.; పిస్తా పప్పులు - టేబుల్‌స్పూను; ఏలకుల పొడి - టీ స్పూను తయారి: పర్వాల్‌లను శుభ్రంగా కడిగి పైన చెక్కు తీసి, మధ్యకి నిలువుగా గాటు పెట్టి, గింజలు తీసేయాలి. (విరిగిపోకుండా జాగ్రత్తపడాలి. లేదంటే స్టఫింగ్ చేయడం కుదరదు) ఒక పాత్రలో నీరు పోసి మరిగించాలి మరుగుతున్న నీటిలో పర్వాల్ వేసి మూడు నిమిషాలయ్యాక, స్టౌ ఆర్పేసి, గిన్నె మీద మూత ఉంచి, అరగంటసేపు పక్కన ఉంచాలి నీళ్లు పూర్తిగా వడపోసేయాలి ఒక పాత్రలో నీళ్లు, పంచదార, ఏలకులపొడి వేసి స్టౌ మీద ఉంచి, తీగపాకం వచ్చేవరకు మరిగించాలి పర్వాల్‌ను పాకంలో వేసి, రంగు మారేవరకు ఉంచి కిందకు దించి, మూత పెట్టి, సుమారు గంటసేపు అలాగే ఉంచాలి స్టౌ మీద పాన్ ఉంచి, అందులో పచ్చికోవా వేసి లేత గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి, దించి చల్లార్చాలి బాదంపప్పులను, పిస్తా పప్పు లనుమిక్సీలో వేసి పొడి చేసి, పంచదారం పాకంలో వేసి బాగా కలపాలి పాకంలో ఉన్న పర్వాల్‌లను బయటకు తీసి, మధ్యకు జాగ్రత్తగా కట్ చేసి తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని అందులో స్టఫ్ చేసి, దగ్గరగా నొక్కాలి వీటిని ఫ్రిజ్‌లో ఉంచితే, సుమారు వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. మలాయ్ పూరీ కావలసినవి: మీగడ - కప్పు; మైదాపిండి - కప్పు; పాలు - కొద్దిగా; నూనె - డీప్ ఫ్రైకి సరిపడేంత; నీళ్లు - 3 కప్పులు; పంచదార - 3 కప్పులు; కుంకుమపువ్వు - చిటికెడు; ఏలకుల పొడి - టీ స్పూను; పిస్తా పప్పులు - టీ స్పూను; నెయ్యి - టీ స్పూను తయారి: ఒక పెద్ద పాత్రలో మీగడ, మైదా, పాలు వేసి బాగా మెత్తగా అయ్యేవరకు కలిపి 20 నిముషాలు పక్కన ఉంచాలి ఒక పాత్రలో పంచదార, నీళ్లు, ఏలకుల పొడి వేసి స్టౌ మీద ఉంచి పాకం తయారుచేయాలి స్టౌ మీద బాణలిలో టీ స్పూను నెయ్యి వేసి కాగాక, తయారుచేసి ఉంచుకున్న మీగడ + మైదా + పాలు మిశ్రమం టీ స్పూనుడు వేసి వేయించి, తీసి పంచదార పాకంలో వేయాలి ఇలా అన్నీ తయారుచేసుకుని, ఐదు నిమిషాల తర్వాత సర్వింగ్ డిష్‌లోకి తీసుకోవాలి మిగిలి ఉన్న పాకాన్ని వీటి మీద పోసి, పిస్తాలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. గుల్కండ్స్టఫ్డ్ మలాయ్ పేడా కావలసినవి: పాలపొడి - కప్పు; మీగడ - అర కప్పు; పంచదార - 3 టేబుల్ స్పూన్లు; గుల్కండ్ - 3 టేబుల్ స్పూన్లు (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది); ఏలకుల పొడి - కొద్దిగా; నెయ్యి లేదా వెన్న - పావు టీ స్పూను; గులాబీ రేకలు - కొద్దిగా తయారి: పాన్‌లో నెయ్యి వేసి కరిగించాలి పొలపొడి, మీగడ, గుల్కండ్ వేసి బాగా కలిపి మంట తగ్గించి, ఆపకుండా కలుపుతుండాలి ఈ మిశ్రమం నెమ్మదిగా పాత్రను విడిచిపెట్టి, గట్టిపడుతుండగా దింపి, ఒక పళ్లెంలో పోయాలి. (మరీ ఎక్కువ గట్టిపడితే బాగుండదు) బాగా చల్లారాక పంచదార, ఏలకుల పొడి వేసి కలపాలి ఫ్రిజ్‌లో ఉంచి 10 నిమిషాల తర్వాత బయటకు తీసేయాలి ఈ మిశ్రమాన్ని పది సమాన భాగాలుగా చేసి, అచ్చులలో ఉంచాలి ఒక్కో పేడాలోకి, పావు టీ స్పూను గుల్కండ్ మిశ్రమం ఉంచి, అచ్చును మూసేసి, జాగ్రత్తగా తీయాలి గులాబి రేకలతో గార్నిష్ చేయాలి. లవంగ్ లతిక కావలసినవి: మైదా - కప్పు; నూనె - 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు - పావు టీ స్పూను; నీరు - తగినంత స్టఫింగ్ కోసం: పచ్చికోవా తురుము - కప్పు; పంచదారపొడి - అర కప్పు; కొబ్బరితురుము - 2 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు పలుకులు - 2 టేబుల్ స్పూన్లు; బాదంపప్పు పలుకులు - 2 టేబుల్ స్పూన్లు; పిస్తా తరుగు - 2 టేబుల్ స్పూన్లు; ఏలకులపొడి - పావు టీ స్పూను; నూనె - డీప్‌ఫ్రైకి తగినంత పంచదారపాకం కోసం: పంచదార - ఒకటిన్నర కప్పులు; నీరు - కప్పు; కుంకుమపువ్వు - చిటికెడు; లవంగాలు - 3; తయారి: ఒక పాత్రలో మైదాపిండి, నూనె, ఉప్పు వేసి కలపాలి నీళ్లు జత చేస్తూ చపాతీపిండిలా కలుపుకుని, పైన తడి వస్త్రం వేసి అరగంటసేపు పక్కన ఉంచాలి ఒక పాత్రలో పచ్చి కోవా తురుము, పంచదారపొడి, కొబ్బరి తురుము, జీడిపప్పు పలుకులు, బాదం పలుకులు, పిస్తా తరుగు, ఏలకులపొడి వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచాలి ఒక పెద్ద గిన్నెలో పంచదార, నీళ్లు, కుంకుమపువ్వు, లవంగాలు వేసి స్టౌ మీద ఉంచి పంచదార కరిగాక మంట తగ్గించాలి మైదాపిండిని చపాతీలా పల్చగా ఒత్తి, అందులో టేబుల్ స్పూన్ కోవా మిశ్రమం ఉంచి, రోల్ చేసి, రెండుపక్కల మడతలు వేసి (బొమ్మలో చూపిన విధంగా), లవంగాలు గుచ్చాలి బాణలిలో నూనె కాగాక, తయారుచేసి ఉంచుకున్న లవంగ్ లతికలను వేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి పంచదార పాకంలో వేసి సుమారు 20 నిమిషాల తరవాత తీసి, సర్వ్ చేయాలి. సేకరణ: డా. వైజయంతి