
ముద్దొచ్చే ఈ బుజ్జాయి ఎవరో తెలుసా?
ముద్దొచ్చే బొద్దు బుగ్గలతో.. ఫొటో పోజివ్వడం కన్నా చేతిలోనే లడ్డూపైనే మక్కువ చూపిస్తున్న ఈ బుజ్జాయి ఎవరో తెలుసా? బాలం పిచికారీ.. తునే ముజే మారీ.. అంటూ 'హే జవానీ హై దివానీ' సినిమాలో హోలీ పాటతో అలరించిన రణ్‌బీర్ కపూర్ తెలుసు కదా. అతనే ఈ బుజ్జాయి. హోలీ సందర్భంగా అతని చిన్నప్పుడు తీసిన ఫొటో ఇది.
మరోసారి దేశమంతా రంగుల్లో తడిసి ముద్దవుతున్న నేపథ్యంలో ఈ అరుదైన హోలీ ఫొటోను రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. రణ్‌బీర్ అభిమానులను ఈ ఫొటో ఆకట్టుకుంటూ ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది.