హోలీ పేరుతో అసభ్యంగా తాకుతారు: నటి
ముంబయి: హోలీ తనకు సురక్షితంగా అనిపించదని ప్రముఖ బాలీవుడ్ నటి షెనాజ్ ట్రెజరీవాలా చెప్పింది. ఇష్క్ విష్క్ అనే చిత్రంలో అలీషా అనే పాత్రతో సుపరిచితురాలైన ఆమె తనకు హోలీ పేరుతో చేదు అనుభవం ఎదురైనట్లు చెప్పారు. హోలీ పేరుతో అక్కడా ఇక్కడ చేతులు వేస్తుంటారని, తడిమి చూస్తుంటారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి పద్దతి తనకు నచ్చదని కుండబద్ధలు కొట్టేసింది.
‘ఇది హోలీ అంటూ ఎక్కడెక్కడో చేతులు వేస్తుంటారు. అందుకే హోలీనాడు నాకు భద్రతగా అనిపించదు. హోలీ పేరుతో నన్ను చాలా ఇబ్బందికరంగా గతంలో తడిమి చూశారు. అందుకే నేనెప్పుడూ హోలీ కోసం అంత ఉత్సాహంగా ఎదురుచూడను. ఈ విషయం చెప్పడానికి తానేమి సిగ్గుపడటం లేదని, తనపై అలా అనుచితంగా చేసిన వాళ్లే సిగ్గుపడాలంటూ ఆమె ట్విట్టర్‌లో రాసుకొచ్చింది.