shenaz treasurywala
-
వారేవా... వంటల రోబో!
వంట చేయడం కొందరికి ఎంతో హాయి. కొందరికి మాత్రం అయ్ బాబోయ్! ఇలాంటి వారి కోసం వచ్చిందే వంటలు వండే రోబో! నటి, బ్లాగర్ షెహనాజ్ ట్రెజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఏఐ–పవర్డ్ నోష్ రోబోట్ వీడియో వైరల్ అయింది. రోబోట్‌కు షెహనాజ్ ఆర్డర్ ఇవ్వగానే చకచకమని పెస్టో పనీర్ చేసి పెట్టింది. ఈ రోబోట్‌లో ఇన్‌గ్రేడియెంట్స్ యాడ్ చేయడానికి స్లాట్స్ ఉంటాయి. ‘ఏఐ రోబోట్స్ ఇప్పుడు ఇండియన్ కిచెన్లలోకి వచ్చేశాయి’ అని ప్రకటించింది షెషనాజ్. ‘ఈ రోబోట్ చేసే వంట అమ్మ చేసే వంట కంటే బాగుంటుంది’ అనే మాటపై మాత్రం చాలామంది భగ్గుమన్నారు. ‘అవసరమే ఆవిష్కరణకు తల్లిలాంటిది’ అంటారు. ఒక యువకుడు తన ఊరికి దూరంగా వృత్తిరీత్యా బెంగళూరులో ఉన్నప్పుడు అమ్మ చేసే వంటకాలను బాగా మిస్ అయ్యాడు. ఆ లోటు నుంచే ఈ ఏఐ రోబోట్‌ను సృష్టించాడు! -
హోలీ పేరుతో అసభ్యంగా తాకుతారు: నటి
ముంబయి: హోలీ తనకు సురక్షితంగా అనిపించదని ప్రముఖ బాలీవుడ్ నటి షెనాజ్ ట్రెజరీవాలా చెప్పింది. ఇష్క్ విష్క్ అనే చిత్రంలో అలీషా అనే పాత్రతో సుపరిచితురాలైన ఆమె తనకు హోలీ పేరుతో చేదు అనుభవం ఎదురైనట్లు చెప్పారు. హోలీ పేరుతో అక్కడా ఇక్కడ చేతులు వేస్తుంటారని, తడిమి చూస్తుంటారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి పద్దతి తనకు నచ్చదని కుండబద్ధలు కొట్టేసింది. ‘ఇది హోలీ అంటూ ఎక్కడెక్కడో చేతులు వేస్తుంటారు. అందుకే హోలీనాడు నాకు భద్రతగా అనిపించదు. హోలీ పేరుతో నన్ను చాలా ఇబ్బందికరంగా గతంలో తడిమి చూశారు. అందుకే నేనెప్పుడూ హోలీ కోసం అంత ఉత్సాహంగా ఎదురుచూడను. ఈ విషయం చెప్పడానికి తానేమి సిగ్గుపడటం లేదని, తనపై అలా అనుచితంగా చేసిన వాళ్లే సిగ్గుపడాలంటూ ఆమె ట్విట్టర్లో రాసుకొచ్చింది.