కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) తన చిన్న కుమారుడి చెవిపోగు వేడుకను సొంత గ్రామంలో ఘనంగా జరిపించారు. శివకార్తికేయన్, ఆర్తి దంపతులకు కూతురు ఆరాధన, కుమారుడు గుగన్ ఉన్నారు. గతేడాదిలో మూడోసారి మళ్లీ అబ్బాయే పుట్టాడు. తనకు పవన్ అని నామకరణం చేసినట్లు కూడా శివకార్తికేయన్ తెలిపాడు. అయితే, తాజాగా తన చిన్న కుమారుడి చెవిపోగు వేడుకను గ్రామస్థులు, అందరి బంధువుల సమక్షంలో జరిపించడం విశేషం. తమ కులదైవ సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని ఆయన జరిపించారు.
శివకార్తికేయన్ సొంతూరు తమిళనాడులోని తిరువారూర్ జిల్లా గూడవాసల్ తాలూకాలో ఉన్న తిరువీజిమిలై.. అక్కడే ఈ వేడుకను నిర్వహించారు. అయితే, శివకార్తికేయన్‌కు వివాహం కాకముందే ఉద్యోగం ఎతుక్కుంటూ చెన్నైకి వచ్చాడు. అలా మొదటిసారి ఒక టీవీ ఛానల్‌లో యాంకర్‌గా చేరి ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. ఆపై తన దగ్గరి బంధువు అయిన ఆర్తిని ఆయన పెళ్లి చేసుకున్నారు. కెరీర్ పరంగా ఎంత స్థాయికి వెళ్లినప్పటికీ తన మూలాలను మరిచిపోలేదు. ఇప్పటికీ ఆయనకు అక్కడ సొంత ఇళ్లు ఉంది. తన స్వగ్రామంలోని వారి కుటుంబ ఆరాధ్య దైవం మహా మరియమ్మన్ ఆలయంలో తన బంధువులు, గ్రామస్తుల సమక్షంలో మూడో సంతానమైన మగబిడ్డ చెవిపోగు వేడుకను నిర్వహించారు.
ఆ తర్వాత తన గ్రామంలో ఉన్న అందరితో పాటు కలిసి భోజనం శివకార్తికేయన్ చేశారు. అమరన్ సినిమాతో తమ గ్రామానికి మరింత పేరు తీసుకొచ్చావాని శివకార్తికేయన్‌ను గ్రామస్తులు ప్రశంసించారు. ఆపై ఆయనతో ఫోటోలు దిగారు. ఎన్నో ఏళ్ల తర్వాత తన బంధువులను ఇలా కలవడంతో తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. అప్పుడప్పుడు తమ గ్రామానికి వస్తూ ఉండాలని ఆయనకు బంధువులు సూచించారు. ఇలా కుమారుడి కోసం అయినా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘పరాశక్తి’గా శివ కార్తికేయన్
శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘పరాశక్తి’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. శివ కార్తికేయన్ 25వ చిత్రంగా రానున్నడంతో అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రవి మోహన్, అధర్వ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌తో రానున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు. సంగీత దర్శకుడిగా ఆయనకు ఇది వందో చిత్రం కావడం విశేషం.
தன் பூர்வீக திருவாரூர் கிராமத்தில் சிம்பிளாக சிவகார்த்திகேயன்! - இன்ப அதிர்ச்சியில் ஊர் மக்கள்#tiruvarur | #sivakarthikeyan | #cinema | #ThanthiTV pic.twitter.com/smKTfOiCzq
— Thanthi TV (@ThanthiTV) February 4, 2025
Comments
Please login to add a commentAdd a comment