![Robots is now entering the kitchens of India - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/21/robot.jpg.webp?itok=mG6OJo1M)
వంట చేయడం కొందరికి ఎంతో హాయి. కొందరికి మాత్రం అయ్ బాబోయ్! ఇలాంటి వారి కోసం వచ్చిందే వంటలు వండే రోబో! నటి, బ్లాగర్ షెహనాజ్ ట్రెజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఏఐ–పవర్డ్ నోష్ రోబోట్ వీడియో వైరల్ అయింది. రోబోట్‌కు షెహనాజ్ ఆర్డర్ ఇవ్వగానే చకచకమని పెస్టో పనీర్ చేసి పెట్టింది. ఈ రోబోట్‌లో ఇన్‌గ్రేడియెంట్స్ యాడ్ చేయడానికి స్లాట్స్ ఉంటాయి.
‘ఏఐ రోబోట్స్ ఇప్పుడు ఇండియన్ కిచెన్‌లలోకి వచ్చేశాయి’ అని ప్రకటించింది షెషనాజ్. ‘ఈ రోబోట్ చేసే వంట అమ్మ చేసే వంట కంటే బాగుంటుంది’ అనే మాటపై మాత్రం చాలామంది భగ్గుమన్నారు. ‘అవసరమే ఆవిష్కరణకు తల్లిలాంటిది’ అంటారు. ఒక యువకుడు తన ఊరికి దూరంగా వృత్తిరీత్యా బెంగళూరులో ఉన్నప్పుడు అమ్మ చేసే వంటకాలను బాగా మిస్ అయ్యాడు. ఆ లోటు నుంచే ఈ ఏఐ రోబోట్‌ను సృష్టించాడు!
Comments
Please login to add a commentAdd a comment